పుట:Chali Jvaramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

చ లి జ్వ ర ము


అనాఫలీను క్యూలెక్సు దోమలను వేర్వేరుగ గుర్తించువిధము

కొంచెముశ్రద్దతో పరీక్షించువానికి అనాఫలీక్యూలెక్సు దోమలను తక్కిన దోమలండి విడదీయుటకుగాని, అనా ఫలీసు దోమలను క్యూలెక్సు దోమలను వేర్వేరుగ గుర్తించుటకు గాని కష్టముకాదు. అట్లు గుర్తించుటకు తోడ్పడుటకు గాను దానినిగూర్చి కొన్ని అంశములను క్రింద వివవించుచున్నాను.

క్యూలెక్సుదోమ గొడమీదవ్రాలియున్నప్పుడు గూనివానివలె కొంచెము వంగియుండును (14-వ పటము) . అనాఫలీసుదోమ సిపాయివలె నిటారుగా శరీరమును నిగిడించి యుండును. (15-వ పటము) క్యూలెక్సుదోమ గోడమీద పరుపుగా (సమాంతరముగా- Parallel) వ్రాలును. అనాఫలీసు దోమ ఏటవాలుగా వ్రాలును. అనగా దాని తల గోడకు సమానముగను వెనుకభాగము గోడకు దూరముగను ఉండును.

అనాఫలీసు దోమలను క్యూలెక్సుదోమలనుండి విడదీసిన తరువాత అనాఫలీసు దోమలలో ఆడవెవ్వి యో మగవెవ్వియో కనిపెట్టవలెను. ఈ యాడదోమలే మన నెత్తురుత్రాగి మనకపకారము చేయునవి.