పుట:Chali Jvaramu.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
78
చలిజ్వరము

హెచ్చుగ మలేరియాపురుగు లున్నప్పుడు జ్వరము వచ్చునని కొందరువైద్యులు ఊహించియున్నారు. కాని కొందఱకు వంశపారంపర్యముగా నలవాటు అగుటచేత మలేరియాపురుగులు రక్తములో ప్రవేశించినను వారికి జ్వరమురాదు. ఇందు చేతనె కోయవాండ్రు మొదలగు అడవిజాతులవారు చలిజ్వరము యొక్క వ్యాపకముగల ప్రదేశముల్లో నున్నను వారల నీజ్వరము సామాన్యముగ బాధింపదు. అదేప్రదేశమునకు క్రొత్తవార లెవరైన వచ్చినయెడల వారలకు తప్పక ఆజ్వర మంటుకొనును. ఇందుచేతనే చలిజ్వరముయొక్క వ్యాపకముచే ప్రసిద్ధిజెందిన కొన్నిచోట్ల కడుపులలో పెద్దపెద్ద జ్వరపు బిళ్ళలు పెరిగిన వారలున్నను వారిలో కొందరకు జ్వరమురాదు. ఇది అలవాటుచేనని యెరుంగునది.