పుట:Chali Jvaramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవ ప్రకరణము


ఒకానొకప్పుడు ద్విఖండన విధానముచే పెరుగు పురుగులు రక్తములోనున్నను, అవిమిక్కిలి తక్కువ గా నున్నయెడల జ్వరము రాకపోవచ్చును. ఇట్లు కొన్ని దినములుగాని, నెలలుగాని, సంవత్సరములు గాని మలేరియా పురుగులు నెత్తురులో కొద్దిగా నున్నను జ్వరమురాక రోగికి వృద్ధత్వముచేతగాని, అధికాయాసముచేతగాని, శరీరదుర్భలత్వము గలిగి నప్పుడు తిరిగి మలేరియా జ్వరము రావచ్చును. కొందర ఐరోపియనులకు హిందూ దేసమునుండి వారి స్వదేశమునకు పోయిన తరువాత రెండుమూడు సంవత్సరముల వరకు ఏవిధమైన మలేరియా జ్వరమును లేకపొయినను అకస్మాత్తుగ నట్టివారి కొకప్పుడు చలిజ్వరమువచ్చి వారి నెత్తురులో మలేరియా పురుగులు కన్పట్టుచున్నవి. అట్టివారి నెత్తురులో ఈ రెండుమూడు సంవత్సరముల లోపల మలేరియా పురుగులు ప్రవేశింఛుటకు అవకాశము లేదు. కావున వారి రక్తమునందలి మలేరియాపురుగులు హిందూదేశములో వారునివసించి యున్నప్పుడు ప్రవేశించి యుండవలెను. దీనినిబట్టి కొన్ని మలేరియా పురుగులు నెత్తురులో నున్నను జ్వరము రాకపొవచ్చునని రుజువు పడుచున్నది. కొంతమందికి లక్ష యెర్రకణముల కొక్కొటికంటె