పుట:Chali Jvaramu.pdf/101

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
89
ఎనిమిదవ ప్రకరణము


జ్వరము నిలిచిపొవచ్చును. వారీ రక్తములోని చలి జ్వరపు పురుగులు చాలభాగము అప్పటృఇకి చచ్చి పోవును. అట్టివారిని వెంటనే తమమనిలోనికి పోనిచ్చి నను, మందు మాత్రము 5 దినములవరకు, దినమునకు 20 గ్రెయినులు చొప్పునను, అటుపిమ్మట ఈ క్రింది వివరించిన ప్రకారమును మిక్కిలి శ్రద్ధగానిచ్చుచుండవలెను.

అయిదవ దినము మొదలు పూటకు 5 గ్రెయినుల చొప్పున 3 పూటలను మూడు మోతాదులు ఇయ్యవలెను. ఇట్లు 5 దినములవరకు తీసికొనగా తిరిగి జ్వరము రానియెడల ఆదినము మొదలు ఒకనెలవరకు దినమునకు 5 గ్రెయినులు చొప్పున ప్రతిదినమును ఒకమొతాదు ఈయవలెను. ఈమధ్యలో ఏదినమున జ్వరము వచ్చినను ఆదినముననే జ్వరము ప్రారంభించినట్లు ఎంచి తిరిగి మొదట ఇచ్చినట్లె దినమునకు 20 గ్రెయినుల్స్ చొప్పున ఇచ్చుచు చికిత్సనంతను తిరిగి చేయవలెను.

ఒకప్పుడు రెండుమూడు సంవత్సరముల వరకు క్వయినా ఇయ్యవలెను.

తిరిగి తిరిగి వచ్చు చలిజ్వరముల్కు రెండుమూడు సంవత్సరముల వరకు ఒక్కొక్కప్పుడు క్వయినాను ఇయ్యవలసివచ్చును. జ్వరపుగడ్డపెరిగి యున్నదను సందేహము తీరువరకును రోగిక క్వయినాను పుచ్చుకొనుచుండ వలసినదే. ఇట్టి రోగులకు క్వయినా తొ పాటుకొంచెము ఉల్లిపాషాణమును,