పుట:Chali Jvaramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరవ ప్రకరణము

                         చలిజ్వర లక్షణములు

చలిజ్వర లక్షణములనేకములన్ని జాతుల జ్వరములకు సామాన్యములు:-

చలిజ్వరపు పురుగులలో నాలుగు ముఖ్య భేదములుగలవని 5-వ ప్రకరణములో చెప్పియున్నాము. వాని వలన గలుగు జ్వరలక్షణములనేకములు. అన్ని చలిజ్వరములకు సామాన్యముగనే యున్నవి. కొన్ని లక్షణములు మాత్రము విషజాతి జ్వరములకు ప్రత్యేకముగ నున్నవి. కావున సామాన్య జ్వరములకు గల లక్షణములను ముందుగా వివరించి విషజ్వరములకు ప్రత్యేకముగనుండు లక్షణములను కొన్నింటిని తరువాత పేర్కౌచున్నాము.

చలిజ్వరలక్షణములనుజ్ శోధింపగా నా లక్షణములలో (1) జ్వరమునకు చూచనలు. (2) నిజమైన జ్వరము. (3) విరామకాలము అను మూడువిభాగములు కనబడుచున్నవి.

జ్వరమునకు సూచనలు:-

జ్వరము రాకపూర్వము కొన్నిదినములు ఏదో బద్ధకముగా నున్న దనిగాని, పనితోచుటలెదనిగాని, విచారకరముగా నున్నదని గాని రోగిచెప్పును