పుట:Chali Jvaramu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

57


నా నూతిలోనికి విడిచి, కొంచెము దూరమువరకు నీటిలో దీనినిఈడ్చి, పిమ్మట పైకిలాగవలెను. అంతట నీరంతయు గుడ్డలోనుండి క్రిందికిపోయి దోమ పిల్లలు మాత్రమందులో చిక్కుకొనును. వీనికొక సీసలో వేసి పెంచి వాని జాతిభేదములను గుణములను తెలిసికొననగును.

అనాఫలీసు దోమలయుపజాతులు, వాని నివాసస్థానములు.

1.దోమలు అమితముగనున్నచోట్ల ఎక్కడేవిధ మైన నిలువ నీరున్నను ఆనీటిలోనిట్ల దోమపిల్లలను పెట్టక యేస్థలమునందు పిల్లలను పెట్టిన మిక్కిలి అనుకూలమో అనువిషయము బాగుగ నాలోచించు ననియు, ఒక్కొక ఉజాతి అనాఫలీసు దోమలు ఒక్కొక మాదిరి స్థలములను తమపిల్లను పెట్టుటకు ఏర్పాటు చేసికొనుననియు తోచుచున్నది. ఇందు ముఖ్యముగ మూడు ఉపజాతులను మనము గమనించవలసి యున్నది. అందొక ఉపజాతి అనాఫలీసు దోమలు ఊరికి దూరముగనుండి నాచు మొదలగు ఆకలమును పెరుగుచుందు నీటియందు మాత్రము తన పిల్లలను పెట్టును. ఈ జాతిదోమలు సాధారణముగా ఇండ్లలోనికిరావు.