పుట:Chali Jvaramu.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


104

చ లి జ్వ ర ము

{{left|దోమలుప్రవేశింపరాని ఇండ్లు: దోమతెరలు. చేయబడిన తలుపులను సరిగా నమర్చుకొనవలెను. ప్రెఒద్దుగ్రుంకకముందే యింటిలో నివసించు చారందరును ఇంటికి చేరిన వెంటనే తలుపులన్నిటిని మూసి దోమలింటిలో ప్రవేశింపకుండ చేసికొనవలెను. రాత్రులయం దెంతమాత్రము వెలుపలకు పొకూడదు. వసారాలో కూర్చొనకూడదు. ఇట్టివారిని దోమలు కుట్టలేవు. మిక్కుటముగ చలిజ్వరములుగల ప్రదేశ ములలో సహితము అక్కడకు శోధనలనిమిత్తమై పోయిన వైద్యులు నెలలకొలది నివసించియు చలిజ్వరపు పాలబడకుండ తప్పించుకొని యున్నారు.

 తమయింటినంతను దోమలుచేరకుంద కాపాడుకొన లేనివారు తమశరీరమునుమాత్రము దోమకాటునుండి మరియొకవిధమున తప్పించుకొనవచ్చును. దోమలు సాధారణముగా కాళ్లుచేతులు మొదలగు కప్పబడి యుండని భారములయందే కరచును. కావున ప్రొద్ధుగ్రుంకిన తోడనే ప్రతివారును, చేతులకునుకాళ్ళకును మేజోళ్ళవంటి గుడ్డ తొడుగులను పూర్ణముగా తొడుగుకొనవలెను. మనం మేలుకొనియున్నప్పుడు  సమాన్యముగా దోమలుముఖమీద కుట్టవు. ఒకవేళ ముఖముమీద కవిచేరినను, మనము వెంటనే వానిని తోలివేయుదుము. వీరు రాత్రులయందు దోమతెరతో చక్కగమూ