పుట:Chali Jvaramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

97


యుముగను పని చేయును. దీని వెల కొంచ మధికముగ నుండుటచేత క్వయినా సల్పేటును సామాన్యముగా నుపయోగింపవచ్చును. ఈ సల్ఫేటు నీళ్లలో సరిగా కలియదు. నీళ్లవంటి చింతపండు రసము (చారు), నిమ్మకాయ రసము, మొదలుగాగల పుల్లని ద్రావకములలో నిది మిక్కిలి శేఘ్రముగ లీనమగును. (కలిసిపోవును). కావున క్వయినాను పొడుముగాతీసికొను వారలందరకును ఈరీతిని పుల్లని ద్రావకములలోకలిపి తీసికొనుట యుక్తము.

విషజాతుల చలిజ్వరములలో క్వయినాను నెత్తురులోనికి పిచికారిచేయుట యుక్తము.వాలు పాఠ్యం

కొన్ని ఇషజాతుల చలిజ్వరములలోను, ఒకసారి కుదిరి తిరిగి వచ్చి బాధించు చలిజ్వరముల లోను, క్వయినాను నోటిమార్గమున పుచ్చుకొనుటకంటే దానిని నేర్చిన వైద్యుడు తగిన గాజు పిచికారితో మోతారుకు పది గ్రెయినులు చొప్పున "క్వయినా హైడ్రోక్లోరైడు" ను మందును 20 చుక్కలు కాచిన నీళ్ళలోకలిపి నెత్తురులోనికి పోవునట్లు, పిఱ్ఱమీద కాని భుజముమీదగాని యుండు కండలోనికి పిచికారి చేసిన యుక్తము. దీనివలన శరీరమున కేవిధమయిన బాధగాని అపాయముగాని లేదు. ఇందువలన చిరకలము నుండి శల్యగతమై జీర్ణించిన జ్వరములుకూడా అతి శీఘ్రముగ కుదురును.