పుట:Chali Jvaramu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

చ లి జ్వ ర ము


(Arsenic) లోహమును (Iron) వైద్యులు తగిన మొతాదులను తెలిసికొని ఉపయోగింపవచ్చును.

దినమునకు 20 గ్రెయినుల చొప్పున మొదటి నిండియు తీసికొనినరోగికి సామాన్యమునగా తిరిగి జ్వరమురాదు. ఒక్కొక మొతాదుకు 10 గ్రెయినులు చొప్పున రెండు మూతాదులలో గాని, 5 గ్రెయినుల చొప్పున నాలుగు మోతాదులలో గాని ఈఇరువది గ్రెయినులను తీసుకొనవచ్చును.

పదిసంవత్సరముల పిల్లలకు మోతాదు.

10 లేక 12 సంవత్సరముల బిడ్దలకు దినమునకు 15 గ్రెయినులతొ ప్రారంభించి 5 దినములయిన తరువాత దినమునకు దినమునకు 10 గ్రెయినులు చొప్పున ఇచ్చి, 10 దినములైన తరువాత ఒకమాసము వరకు దినమునకు 5 గ్రెయినుల చొప్పున నీయవచ్చును.

5 మొదలు 10 సం॥వత్సరముల పిల్లలకు మొతాదు.

5 సంవత్సరములు మొదలు 10 సంత్సరముల వరకు వయస్సుగలబిడ్డలకు మోతాదుకు 5 గ్రెయినులు చొప్పున దినమునకు రెండు మొతాదులు ఈయవలెను.

5 సం॥రముల లొపలి పిల్లలకు మొతాదు.

5 సంవత్సరముల లోపలి వయస్సుగల బిడ్దలకు వయస్సును బట్టి ఒక్కొక సంవత్సరము వయస్సు నకు ఒక్కొక గ్రెయిను మొతాదు చొప్పున దినమునకు రెండుమొతాదులు ఇచ్చుటయుక్తము. సామాన్యముగా జ్వరము హెచ్చుగ నున్నప్పుడు,