పుట:Chali Jvaramu.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


రెండవ ప్రకరణము

చలిజ్వరము యొక్క పూర్వచరిత్ర

చలిజ్వరమునకు (1) మన్యపు జ్వరము (2) వరుస జ్వరము (3) శీతకాల (శీతకట్టు) జ్వరము అని మారుపేర్లు. ఈ జ్వరమునకు ఇంగ్లీషున మలేరియా (Malaria) అని పేరు.

మన్యపుజ్వరము:- మన్యములనగా అడవిప్రదేశాములు. అచ్చట ఈజ్వరము హెచ్చుగ వ్యాపించి యుండును. కనుక ఈ జ్వరమును మన్యపు జ్వరమందురు. కాని ఇప్పుడీజ్వరము నిజమయిన అడవులనుండి చెన్నపట్టణము బొంబాయి మొదలగు మహా పట్టణములను నివాసస్థానముగా నేర్పరచుకొనుటచేత దీనికి ఈ పేరు నిరర్ధమ మగుచున్నది.

వరుసజ్వరము:- దినమువిడిచి దినముగాని, దినము దినముగాని, క్రమముతప్పక వచ్చుచుండుటచే నీ జ్వరమునకు చెన్నపట్టణపు ప్రాంతములందు వరుస జ్వరమని పేరు.