పుట:Chali Jvaramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండువిధములగు మార్పులు కలుగును 8 లోచూపబదినది మొగపురుగుగను 9 లో చూపబడినది ఆడదిగను పరిణమించును.

మొగ మలేరియా పురుగు

మొగరానియొక్క జీవస్థానము 10 లోచూప బడిన ప్రకారము ముక్కలుముక్కలై 12 లో చూపబడిన ప్రకారము ఒక్కొక్క జీవస్థానముచుట్టు కొంత మూలపదార్దముచేరి తోకలుగానేర్పడును. ఈ తోకలు పరిపక్వమైన తరువాత ఊడిపోవును. ఈతోకలే పురుషబీజములు. అనగా ఒక్కొకటి ఒక్కొక ఆడు మలేరియాపురుగుతో చేరి 14 లో చూపబడిన ప్రకారం సంయోగము నొంది దానిని గర్భవతిగా జేయును.

ఆడ మలేరియా పురుగు

9 లో చూపబదిన ఆడుమలేరియా పురుగు మగమలేరియా పురుగు వలె విభాగమునొందక11, 13 లోచూపినప్రకారము గుండ్రనై పెద్దదియగును. 14 లో నొక ఆడుపురుగు పురుషబీజముతో సంయోగమునొంది గర్భవతి యగుచున్నది. ఇట్లు గర్భవతి అయినతోడనే దానిగుండ్రని ఆకారం మరి కోను గా నగును. పిమ్మట దానిజీవ స్థానముమనేక ముక్కలుగా చీలి ఒక్కొక ముక్క చుట్టు కొలత మూలపదార్దమేర్పడి దానినుండి లెక్కలే