పుట:Chali Jvaramu.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చ లి జ్వ ర ము


చక్కెర పాకములో పొదిసి పంచిపెట్టిన యెడల నీజ్వరములు త్వరలో నశించిపోవును.

దొరతనము వారును ప్రజలును ఒండొరుల సాయము నపేక్షిచుచు దేశక్షేమమునకు తొడ్పడవలెను.

ఈపనులను దొరతనమువారు ప్రజలసాహాయ్య మపేక్షింపక చేయదలచినయెడల వారికిని స్వాధీన మగునవికావు. సర్కారు ఉద్యోగస్థులు ఈ పనులను చేయు ప్రయత్నించునప్పుడు అవి ప్రజల కాపనులు హితవుగా నుండవు. ఒకఇంటివారి ఆరోగ్యము కొరకే వారి దొడ్దిలోని పాడునూతిని పరీక్షించు నిమిత్తము సర్కారు ఉద్యోగస్థుడు పొవలెననిన, ఆయింటి యజమానుడు తనకిష్టము లేనియెడల మాయింటిలో ఘోషాస్త్రీ లున్నారని గాని, మాదేవుని గది మయిలబడి పొవుననిగాని చెప్పి, వానిని ఆటంకపరచును. ప్రజలకు ఇట్లే ఏదోవిధమైన అడ్దమును వారు పెట్టుచుందురు. ప్రత్యేకము ప్రజలే తామీ పనులను చేయవలననిన ప్రయత్నించిన యెడల వారికిని ఇవి స్వాధీనమగునవి కావు. కావున సర్కారువారును ప్రజలును ఆన్యోన్యముగా పనిజేయుచు ఇరువురును దేశక్షేమమునకుతోడ్పడ వలయును.

             ==0==