పుట:Chali Jvaramu.pdf/85

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


73

ఆరవ ప్రకరణము

వేడిగా మారును. ముఖముకందును. కండ్లు ఎర్రనగును. నోరు ఎండిపోవును. నాలుక గిదసబారును. శరీరము వేడిగాను పొడిగాను ఉండును. రోగి విసుగుకొనుచు పొర్లుచుండును. దాహము హెచ్చును. కప్పినదుప్పట్లను ప్రక్కదుప్పట్లను తీసివేయుదమనును. బలమయిన జ్వరములొ మతి భ్రమించును,. పిచ్చిమటలాడున్. ఒక్కొక్కప్పుడు స్సృహతెలియకపొవును. ఆకుపచ్చని పసరు వాంతి అగును. విరేచనములుకూడ ఉండవచ్చును. నీడిస్ఫుటముగ నుండును. పరుగెత్తుచుండును. కడుపులోని జ్వరగడ్డ పెద్దది అగును. ఎడమడొక్కలో నొక్కిన కొంచెము నొప్పి ఎత్తును. ఇప్పుడు జ్వరము 107 వరకు హెచ్చిన హెచ్చవచ్చును. ఈ ఉష్ణదశ 4 లేక 5 గంటలుండును.

స్వేదదశ

స్వేదదశ పిమ్మట చెమట ప్రారంభించును. సామాన్యముగా తలమీద ప్రారంభించి వేగము ఒడలంతయు ప్రాకి మిక్కిలి అధికమై ప్రక్కబట్టలను తడిపివేయును. పిమ్మట త్వరలో జ్వరము తగ్గి జ్వరలక్షణములన్నియు పోవును. నాడి మృదువై మందమై నోరుచెమ్మగిలి జ్వరమురాక పూర్వము ఉన్నప్పటికంటె సుఖముగా నున్నదని రోగిచెప్పును.