పుట:Chali Jvaramu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

చలిజ్వరము


గొట్టముకలదు. ఆ గొట్టములో మొదటి భాగము లావుగనుండి పాదరసముతో నింపబడి యుండును. ఈ పాదరసము వేడితగిలినప్పుడు హెచ్చి గొట్టము పొడువునను ప్రాకును. చలి తగిలినప్పుడు ముడుచుకొని గొట్టము అడుగునకు దిగును. ఎంతెంత వేడికి గొట్టములోని పాదరసము ఎంతెంత హెచ్చునో కనిపెట్టి ఈ మార్పులను సరిగా కొలచు నిమిత్తమై జ్వరపు పుల్లయొక్క ప్రబాగమును 95 మొదలు 110 వరకు 15 మెట్లుగా విభజించి యున్నారు. ఈ మెట్లనే డిగ్రీలు లేక అంశములు అందురు.

ఒక రోగియొక్క జ్వరతీవ్రమును కొలవవలెననిన జ్వరపు పుల్లయొక్క మొదటిభాగమును సాధారణముగా నారోగియొక్క నోటిలో నాలుక క్రిందపెట్టి ఒక నిముషమువరకు ఉంచవలెను. లేదా రోగియొక్క చంకలో చెమట లేకుండునట్లు తుడిచి జ్వరపు పుల్ల యొక్క మొదటిభాగము చక్కగ నన్నిప్రక్కలను తాకునట్లుగ చంకలోపెట్టి భుజమునుప్రక్కకు అంటి యుండునట్లుగా నదిమి పెట్టవలెను. రోగికి స్మృతితప్పి యున్నప్పుడును చంటిబిడ్డల జ్వరమును తెలిసికొన వలసి యున్నప్పుడు జ్వరపు పుల్లను ఆసనములోపెట్టి జ్వరమును కొలుచుట మంచిది.

జ్వరపు పుల్లలలో ననేక భేదములు కలవు. కొన్ని అరనిమిషములోనే జ్వరమును సరిగా తెలుపు