పుట:Chali Jvaramu.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి ప్రకరణము

9


ను. మరికొన్ని అయిదునిమిషములకుగాని తెలుపజాలవు. ఒకసారి జ్వరమును కొలిచిన తరువాత తిరిగి జ్వరమును కొలవకముందు జ్వరపు పుల్లను క్రిందివైపునకు ఝాడించి దానిలోని పాదరసమును క్రిందికి దింపవలెను.

సామాన్య రేఖ

సామాన్యముగా మన శరీరముయొక్క వేడిమి 98½ తొంబది ఎనిమిదిన్నర డిగ్రీలు ఉండును. అది క్రింది 2-వ పటములలో 98, 99 అంకెల మధ్యనుండు దళమైన నల్ల గీటువలన చూపబడినది. ఈ గీటునకు సామాన్యరేఖ (Normal) అని పేరు.

పేరు-వెంకయ్య. వయస్సు 24 సంవత్సరములు.

2-వ పటము.