పుట:Chali Jvaramu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

చ లి జ్వ ర ము


క్షీణించి మలేరియా పురుగులు నెత్తురులో నున్న యెడ్ల చెప్పుదురు. లేదా యితరవ్యాధి ఏదియైన నున్నట్లు తకమకు తోచినయెడల తమసలహాను పంపుదురు. కాని, చలిజ్వరమైన దానికిని, కాని దానికిని క్వయినానుఇచ్చి కుదురలేదని తొందరపడుట ఎంత మాత్రమున సరికాదు. వ్యాధిని నిశ్చయముగ తెలిసికొనముందే క్వయినాను పుచ్చుకొనిన రోగియొక్క నెత్తురును పరీక్షించి నప్పుడు ఆనెత్తురు వలన నిజమైన వ్యాధి తెలియదు. జ్వరతీవ్రమునుబట్టి నిదానమును తెలిసికొనవలసి వచ్చినప్పుడు క్వయినాను మధ్యమధ్య ఇచ్చుచుండిన యెడల జ్వర నిదానము సరిగా తెలియదు. చలిజ్వరమునకే క్వయినా ఉపయోగ కరమైనది కాని యితర జ్వరము లలో దానిప్రయోజన మంతగాలేదు. కావున చలిజ్వరము అవునా కాదా యని సందేహముగా నున్నప్పుడు మనము ముఖ్యముగా గమనింప వలసిన అంశము లేవియన:-

సందేహముగా నున్నప్పుడు చేయవలసిన చికిత్స.

1.రోగికి అన్నముపెట్టుటమాని పాలుగాని, గోధుమ జావనుగని, పాలవలె పలుచగ నుండునటుల నూక జావగాని కాచి ఇయ్యవలెను.

2. నాలుగుగంటల కొకసారి శరీరపువేడిమిని జ్వరపు పుల్లతో కొలవ వలెను.