పుట:Chali Jvaramu.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
111
తొమ్మిదవ ప్రకరణము


డదు. ఈ యుపాయములచే వారు దోమల బాధనుండి తప్పించుకొనగలరు.

పైన చెవ్పబడిన పద్దతులలో కొన్ని భాగ్యవంతుల కుపయోగించునవి. కొన్నిమాత్రము బీదల కుప యోగ కరములైనవి. ఒక్కచొ ననుకూలిచు పద్దతులు మరి యొక చోట పనికిరావు. కావున ఏ పధ్దతులు ఏ ప్రదేశమునకు ఏసమయమునందు మిక్కిలి యుప యుక్తములో ఆయాపద్ధతులను యోచించి అవలంభింపవలెను. బుద్దికుశలత గలవారు దోమల యొక్క నివాసస్ధానముల గూర్చియు, కాలమాన స్థితినిబట్టి యవిచెందు మార్పులను గూర్చియు ఇంకను క్రొత్తయంశములను కనిపెట్టుటకు ప్రయత్నించు చుండవలెను.

ఉపసంహారము

మనకిప్పుడు రెండువిషయములు చక్కగ దెలిసి యున్నవి. వానిని మనము శ్రద్ధగ గమనించిన యెడల మన మేప్రదేశమునందైనను చలిజ్వరము లేకుండ చేయవచ్చును.

1.దోమలనశింపుచేయుట:-- దోమలను, గాని గ్రుడ్లను, పిల్లలను, చేతనైనట్లెల్లను, మనముచంపు చుండినయెడల నీజ్వరములు త్వరలో నశింంచిపోవును.

2. చలిజ్వరపు పురుగులను నశింపచేయుట:- సందేహాస్పదులగు ప్రజలకెల్లను, క్వయినా మాత్రలను