పుట:Chali Jvaramu.pdf/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

109

తొమ్మిదవ ప్రకరణము


యబడి యుండిన మంచముల మీదనే పరుండ వలెను. ఆమంచము విశాలముగ నుండవలెను. దోమతెరకు ఎక్కడను తమశరీరము తాకకుండ మంచ మునకు మయముననే పరుండవలెను. లేని యెడల దోమలు తెరయొక్క వెలుపలి ప్రక్కనే కూర్చుండి తమ సన్నని ముట్టెలను తెరల్లోని రంధ్రము గుండ దూర్చి పొడుచును. దోమతెరలోనే మూలకొంచమురంద్రము పడినను అది ప్రయోజనములేదు. తాము దోమతెరలో పరుండుటకు ప్రవేశించు నప్పుడు తమతో పాటు దోమలుకూడ దూరకుండునట్లు జాగ్రత్త చూచుకొనవలెను. అదివరకే తెరలో దోమలెట్లయిన ప్రవేశించియున్నయెడల వ్చానినిముందుగాపట్టి చంపి వేయవలెను.

ఇతరులను చలిజ్వరపురోగులను విడదీసి ప్రత్యేకముగ నివసింపచేయవలెను.

  1.చలిజ్వరముగల రోగులను రాత్రియందెప్పుడు దొమతెరలలో పరుండబెట్టుట, ఇందుచే వెలుపల దోమలు తిరుగుచుండి ఇతరులను కుట్టుచుండినను ఆదోమలకు మలేరియా పురుగులు దొరకకపోవుట చే నచి చలిజ్వరమును కలిగింపలేవు. ఈ పద్దతి వైద్యశాలలో నవలంబించెదరు. అనేక వ్యాధుల వైద్యము నిమిత్తము చేరియున్న పెక్కు రోగులను ఒకరిద్దరు చలిజ్వరపు రొగులును, ఒక