పుట:Chali Jvaramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐదవ ప్రకరణము


చలిజ్వర భేదములు

చలిజ్వర భేదములు నాలుగు:- చలిజ్వరములందు ముఖ్యమైన భేదములు నాలుగు గలవు.

ద్వితీయకజ్వరములు:-

1. రెండవపటములో చూపబడిన ప్రకారము24 గంటల కొకసారి యనగా దిన దినము వచ్చు నదియొక జాతి జ్వరము. దీనికి ద్వితీయక జ్వరమని పేరు.

సామాన్యతృతీయక జ్వరములు:-

2. మూడవపటములో చూపబడిన ప్రకారము 48 గంటల కొకసారి జ్వరము వచ్చిన దినము మొదలు మూడవనాడు వచ్చునవి కొన్ని జ్వరములుగలవు. వీనికి తృతీయక జ్వరములని పేరు. ఈతృతీయక జ్వరములలో కొన్ని చికిత్సకు లొంగును వీనికి సామాన్య తృతీయక జ్వరములని పేరు.

విషతృతీయక జ్వరములు:-

3. తృతీయక జ్వరములలో మరికొన్ని చికిత్సకు సాధారణముగా లొంగవు. వీనికి విషతృతీయక జ్వరములని పేరు.