పుట:Chali Jvaramu.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
40
చ లి జ్వ ర ము


లగు కొన్ని రంగులు దానికి పట్టించి ఆరనిచ్చి 12 వందల రెట్లు వృద్ధిగ కనుపింపజేయు సూక్ష్మదర్శినితొ పరీక్షింపగా 10-వ పటములో చూపబడిన ప్రకారము కనిపించును.

నెత్తురులోని తెల్ల కణములు..

అందు 1,2,3,4, అను అంకెలుగలవి తెల్ల కణములు. వీనిలో రంగుల భాగము జీవస్థానము. ఇది పలువిధములైన తెల్లకణములతొ పలువిధములగ నుండును. ఈ జీవ్సస్థానముచుట్టు నుండునది మూల పదార్ధము. దీనికి తేలికైన ఎర్రరంగు పట్టియున్నది. ఈ తెల్లకణములు మన పేగులలొ జీర్ణమైన ఆహారమును మనరక్తములోనికి జేర్చును. మన శత్రువులగు సూక్ష్మ జీవులు మొదలగునవి మనరక్తములోనికి ప్రవేశించినప్పుడీ వానితో కలహమాడి వాని నాశింపజేయుట కెల్లపుడు సిధ్దముగానుండును.

నెత్తురులోని ఎర్ర కణములు

ఈ అంకెలుగల కణములుగాక మిగిలినవి ఎర్ర కనములు. ఈఎర్రకణములలో జీవస్థానములేదు. ఈ ఎర్రకణములే మన జీవమునకు ముఖ్యాధారమైన ప్రాణవాయువును (Oxygen-ఆమ్లజని) మన ఊపిరి తిత్తులనుండి మననెత్తురులోనికి జేరవేయును.