Jump to content

కురాన్ భావామృతం/హా మీమ్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

41. హామీమ్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 54)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
హామీమ్‌. ఇది కరుణామయుడు, కృపాసాగరుడైన దేవుని నుండి అవతరించిన దివ్యావిష్కృతి. విషయాలను స్పష్టంగా విడమరచి చెప్పే సూక్తులుగల గ్రంథం. (ఇంగిత) జ్ఞానం కలవారి కోసం వచ్చింది. ఇది అరబీభాషలో ప్రోక్తమయిన ఖుర్‌ఆన్‌ (పాఠ్యగ్రంథం). (స్వర్గ) శుభవార్త అందజేసే, (దుష్పర్యవసానం గురించి) హెచ్చరించే మహోన్నత గ్రంథం ఇది.
కాని వారిలో చాలామంది దీనికి విముఖులయి పోతున్నారు. వినడానికి (కూడా) ముందుకు రావడం లేదు. పైగా “నీవు మమ్మల్ని ఏ విషయం వైపు పిలుస్తున్నావో దాని కోసం (మేము సిద్ధంగా లేము.) మా హృదయకవాటాలు మూసుకుపోయాయి; మా చెవులకు చెవుడొచ్చింది. మాకూ నీకూ మధ్య ఒక తెర అడ్డుపడింది. (అంచేత) నీవు నీ పనేదో చేసుకుపో, మేము మా పని చేసుకుపోతాం” అని అంటున్నారు. (1-5)
ప్రవక్తా! చెప్పు: “నేను మీలాంటి మానవుణ్ణే. కాకపోతే నాకు దివ్యావిష్కృతి ద్వారా మీ దేవుడు ఒక్కడేనని తెలియజేయబడుతోంది. కనుక మీరు ఆయన వైపుకే ఏకోన్ము ఖులై ఉండండి. ఆయన్నే క్షమాపణ కోరుకోండి. పరలోకాన్ని తిరస్కరించి జకాత్‌ నెర వేర్చని బహుదైవారాధకులకు వినాశంఉంది. దీనికిభిన్నంగా సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులైనవారికి ఎన్నటికీ తరగని గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.” (6-8)
ప్రవక్తా! వారికీ సంగతి కూడా చెప్పు: “కేవలం రెండు రోజుల్లో భూమిని సృష్టించిన దేవుడ్ని మీరు తిరస్కరిస్తున్నారా? ఆయనకు ఇతరులను సాటి కల్పిస్తున్నారా? సకల లోకాలకు ఆయనే కదా ప్రభువు! ఆయనే భూమి (దొర్లిపోకుండా దాని) మీద పర్వతాలు పాతిపెట్టాడు. అందులో అనేక శుభాలు ఉంచాడు. అంతేకాదు, ఆహారం అర్థించే సమస్త ప్రాణికోటికి అవసరమైన మేరకు లెక్క ప్రకారం దానిపై ఆహారసామగ్రి కూడా ఏర్పాటు చేశాడు. ఈ పనులన్నీ నాలుగు రోజుల్లో పూర్తయ్యాయి. (9-10)
తిరిగి దేవుడు ఆకాశం వైపు దృష్టి సారించాడు. అప్పుడు ఆకాశం పూర్తిగా పొగ రూపంలో ఉండేది. ఆయన భూమ్యాకాశాల్ని ఉద్దేశించి “మీకు ఇష్టమున్నా లేకపోయినా ఉనికిలోకి రండి” అన్నాడు. దానికి అవి “మేము వినమ్రులై వచ్చేశాం” అన్నాయి. (11)
అప్పుడు ఆయన రెండురోజుల్లో ఏడు ఆకాశాలు నిర్మించాడు. ప్రతి ఆకాశానికి తత్సంబంధిత నియమావళి నిర్దేశించాడు. భూలోక సమీపంలోని ఆకాశాన్ని మేము (నక్షత్ర) దీపాలతో అలంకరించాం. దాన్ని అన్నివిధాలా సురక్షితంగా ఉంచాం. ఇదంతా మహా శక్తిమంతుడు, అపార వివేకవంతుడైన దేవుడు రూపొందించిన పథకం. (12)
అయినా వీరు (ఆయన శక్తిసామర్థ్యాలను ఖాతరు చేయకుండా) ముఖం తిప్పు కుంటే వారికిలా చెప్పు: “(పూర్వం) ఆద్‌, సమూద్‌ జాతులపై హఠాత్తుగా (దైవ)శిక్ష వచ్చి పడింది. అలాంటి హఠాత్‌ శిక్ష గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వారి దగ్గరకు దైవప్రవక్తలు ముందూ వెనుకా నలువైపుల నుంచి వచ్చి ‘దేవుడ్ని తప్ప మరెవరినీ ఆరాధించకండి’ అని (పరిపరివిధాల) బోధించారు. కాని వారు (తిరస్కార భావంతో) ‘మా ప్రభువు పంపాలనుకుంటే (ఈ పనికోసం) దైవదూతల్ని పంపేవాడు. కనుక నీవు తెచ్చిన విషయాన్ని మేము నమ్మము’ అని అన్నారు.” (13-14)
ఆద్‌ (నాయకులు) న్యాయం, ధర్మం ఏదీలేకుండా దేశంలో పెద్ద మొనగాళ్ళయి పోయారు. పైగా (అహంకారంతో) “మాకంటే బలవంతులెవరున్నార?”ని పలకసాగారు. వారిని సృష్టించిన దేవుడు వారికంటే బలాఢ్యుడన్న సంగతి వారికి కాస్తయినా తట్టలేదా? వారు మా సూక్తులు, సూచనలు తిరస్కరిస్తూనే పోయారు. చివరికి మేము ఓ దుర్దినాన వారి పైకి భయంకరమైన తుఫాన్‌ పంపాము. ఇహలోక జీవితంలో వారికి అవమాన కరమైన శిక్ష చవిచూపించడానికే ఇలా చేశాం. పరలోక శిక్ష ఇంతకంటే ఎంతో అవమా నకరంగా ఉంటుంది. వారికక్కడ ఎవరూ సహాయం చేయరు. (15-16)
ఇక సమూద్‌జాతి- మేము వారిముందు సన్మార్గం ఉంచాం. కాని వారు సన్మార్గం చూడటానికి బదులు అంధులయి ఉండటానికే ఇష్టపడ్డారు. చివరికి వారి దుష్కర్మల కారణంగా వారిపై అవమానకరమైన శిక్ష వచ్చిపడింది. అయితే సత్యాన్ని విశ్వసించి భయభక్తుల వైఖరి అవలంబించినవారిని మాత్రం మేము రక్షించాం. (17-18)
దైవవిరోధుల్ని నరకానికి తీసికెళ్లేందుకు వారిని చుట్టుముట్టి తీసుకొచ్చే రోజు గురించి ఊహించు. అప్పుడు ముందొచ్చినవారిని వెనుక వచ్చినవారు దగ్గరికొచ్చేదాకా ఆపడం జరుగుతుంది. అలా అందరూ అక్కడికి చేరుకున్న తర్వాత వారి కళ్ళు, చెవులు, చర్మాలు వారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమేమి చేసేవారో సాక్ష్యమిస్తాయి. (19-20)
అప్పుడు వారు తమ చర్మాలను ఉద్దేశించి “మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యమిస్తున్నారు?” అని అడుగుతారు. దానికవి ఇలా సమాధానమిస్తాయి: “ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తినిచ్చిన దేవుడే మాకూ మాట్లాడే శక్తినిచ్చాడు. ఆయనే మిమ్మల్ని మొదటిసారి పుట్టించాడు. ఇప్పుడు ఆయన దగ్గరికే మీరు తీసుకురాబడ్డారు. మీరు రహస్యంగా నేరాలు చేస్తున్నప్పుడు, ఎప్పుడో ఓసారి మీ కళ్ళు, చెవులు, చర్మాలు కూడా మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచనే మీకు కలగలేదు. పైపెచ్చు మీరు చేసే దుష్కార్యాలు అనేకం దేవునికి కూడా తెలియదని మీరు భావిస్తుండేవారు. దేవుడ్ని గురించి మీలో ఏర్పడిన ఈ దుష్టభావనే మిమ్మల్ని (నట్టేట) ముంచింది. అందుకే మీరిప్పుడు నష్టపోయారు.” (21-23)
వారిప్పుడు సహనం వహించినా వహించకపోయినా నరకాగ్నే వారి నివాసస్థలం. వారు పశ్చాత్తాపంతో (సత్యంవైపు) మరలదలచినా వారికా అవకాశం ఇవ్వబడదు. మేము వారికి వెనకాముందూ ప్రతి విషయాన్నీ ఆకర్షవంతంగా చేసి చూపే (పైశాచిక) నేస్తాలను వారిపై రుద్దాము. గత మానవులకు, జిన్నులకు ఎలాంటి (శిక్ష)నిర్ణయం వర్తించిందో వీరికీ అలాంటి నిర్ణయమే వర్తిస్తుంది. కనుక వారు తప్పకుండా నష్టపోతారు. (24-25)
అవిశ్వాలు (మరింత పెట్రేగిపోతూ)“ఈ ఖుర్‌ఆన్‌ వినకండి. (దాన్ని పఠిస్తున్నప్పుడు) అల్లరిచేయండి. ఇలాగైనా మీరు విజయం సాధిస్తారేమో చూడండి” అనంటారు. (26)
ఈ తిరస్కారుల్ని మేము కఠినంగా శిక్షిస్తాం. వారి కర్మలదుష్ఫలం వారికి తప్పక చూపిస్తాం. దైవవిరోధులకు విధించే శిక్ష నరకం! అక్కడే వారికి శాశ్వతనివాసముంటుంది. మా సూక్తులు నిరాకరించినవారికి అదే శిక్ష. వారక్కడ (అక్కసు వెళ్ళబుచ్చుకుంటూ) “ప్రభూ! మమ్మల్ని పెడదారి పట్టించిన మానవుల్ని, జిన్నుల్ని మాకు చూపించు. వారిని మేము కాళ్ళక్రింద పడేసి (కసితీరా) తొక్కి అవమానపరుస్తాం” అనంటారు. (27-29)
ఎవరు తమ ప్రభువు దేవుడేనని పలికి, ఆమాట మీదనే స్థిరంగా ఉంటారో వారి (సహాయం) కోసం దైవదూతలు తప్పకుండా అవతరిస్తారు. అప్పుడు వారికి ఇలా ధైర్యం చెబుతారు: “భయపడకండి. విచారపడకండి. స్వర్గప్రవేశం గురించి మీకు చేసిన వాగ్దానం గుర్తుచేసుకొని ఆనందించండి. మేము ఇహలోకంలోనూ మీకు తోడుగా ఉన్నాం, ఇప్పుడు పరలోకంలోనూ మీకు తోడుగా ఉంటాం. ఇక్కడ మీరు కోరుకున్న వస్తువు లభిస్తుంది. మీరు కోరిందల్లా మీదే అవుతుంది. గొప్ప క్షమాశీలి, అమిత దయా మయుడయిన దేవుని వైపున లభించనున్న ఆతిథ్యమిది.” (30-32)
దేవుని (సందేశం) వైపు (ప్రజలను) పిలిచి, సత్కార్యాలు చేసి, తాను దైవవిధే యుణ్ణని పలికినవాని మాటకంటే శ్రేష్ఠమైన మాట మరెవరిది అవుతుంది? (33)
ప్రవక్తా! మంచీ చెడూ ఒకటి కాజాలవు. కనుక నీవు అత్యంత శ్రేష్ఠమైన ‘మంచి’ ద్వారా చెడును నిర్మూలించు. అప్పుడు నీ గర్భశత్రువు కూడా నీకు ప్రాణమిత్రుడయి పోవడం నీవు చూస్తావు. ఈ సద్గుణం సహనశీలురకు తప్ప మరెవరికీ అబ్బదు. ఈ భాగ్యం అదృష్టవంతులకు తప్ప మరెవరికీ ప్రాప్తం కాదు. ఒకవేళ షైతాన్‌ నుండి నీకేదైనా దుష్టప్రేరణ కలిగినట్లఅన్పిస్తే నీవు దేవుని శరణువేడుకో. దేవుడు సమస్తం వింటున్నాడు. ఆయన సర్వం ఎరిగినవాడు. (34-36)
రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు (వగైరా ప్రకృతి శక్తులన్నీ) దేవుని (ఏకత్వా నికి, ఆయన శక్తిసామర్థ్యాలకు) నిదర్శనాలే. (కనుక ప్రజలారా!) సూర్యచంద్రులకు సాష్టాంగపడకండి. మీరు నిజంగా దేవుడ్ని ఆరాధించేవారయితే, వాటిని సృష్టించిన దేవునికే సాష్టాంగపడండి. ప్రవక్తా! వీరు గనక తలబిరుసుతో మొండిగా వ్యవహరిస్తే వ్యవహరించనీ. నీ ప్రభువు సన్నిధిలో ఉన్న దైవదూతలు రేయింబవళ్ళు ఆయన్ని స్మరిస్తూనే ఉన్నారు. వారా స్మరణలో ఎన్నటికీ అలసిపోరు. (37-38)
భూమి నిర్జీవంగా పడివుండటం నీకు కన్పిస్తుంది. అయితే మేము ఆ తర్వాత వర్షం కురిపించగానే అది ఒక్కసారిగా (వృక్షజాతిని తీసుకొని) పైకి ఉబికి వస్తుంది. ఇది కూడా దేవుని సూచనే. మృతభూమికి జీవంపోసి లేపేవాడు మృత మానవుల్ని కూడా బ్రతికించి లేపగలడు. ఆయనకు అణువణువుపై అధికారం ఉంది. (39)
మా సూక్తులకు పెడర్థాలు తీసేవారు మాకు కనపడకుండా ఎక్కడా దాక్కొని ఉండలేరు. (సమయం వచ్చినప్పుడు వారికి తప్పక తగిన శాస్తి జరుగుతుంది.) నరకా గ్నిలో విసరబడేవాడు శ్రేష్ఠుడా లేక ప్రళయదినాన ప్రశాంత స్థితిలో ఉండేవాడు శ్రేష్ఠుడా? మీరే ఆలోచించండి. సరే మీరు చేయదలచుకున్నదేదో చేస్తూవుండండి. (కాని గుర్తుంచు కోండి,) మీ చేష్టలన్నిటినీ దేవుడు ఓకంట గమనిస్తూనే ఉన్నాడు. (40)
వీరే తమ దగ్గరికి హితబోధ వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించినవారు. కాని ఇదొక శక్తిమంతమైన గ్రంథం. దుష్టశక్తులు దానిపై ముందునుంచీ దాడి చేయలేవు; వెనుక నుంచీ దాడి చేయలేవు. ఇది మహా వివేకవంతుడు, స్వతహాగా ప్రశంసనీయుడయిన దేవుని నుండి అవతరించిన (అద్భుత)వాణి. ప్రవక్తా! నీగురించి అనబడుతున్న మాటలు ఈనాడు కొత్తేమీ కాదు. నీకు పూర్వం ప్రభవించిన ప్రవక్తలకు కూడా ఈ మాటలు అన్నారు. (అయినా) నీ ప్రభువు గొప్ప క్షమాశీలి. (అయితే దాంతోపాటు) ఆయన కఠినంగా దండించేవాడు కూడా. (41-43)
ఒకవేళ మేమీ గ్రంథాన్ని అరబ్బేతర ఖుర్‌ఆన్‌గా చేసివుంటే, వారు (విమర్శిస్తూ) “దాని సూక్తుల్ని (మా భాషలో) ఎందుకు విడమరచి చెప్పలేదు? ఇదేమి చోద్యమో! సంబోధితులు అరబ్బులైతే, ఈగ్రంథం అరబ్బేతర భాషలోనా!?” అంటారు. వారికిలా చెప్పు: ఈ ఖుర్‌ఆన్‌ విశ్వసించేవారి కోసం మార్గదర్శిని, స్వస్థత ప్రదాయిని. అయితే విశ్వ సించడానికి ముందుకురానివారి కోసం ఇది చెవుల్లో దూర్చిన దూది, కళ్ళకు కట్టిన గంత లాంటిది. వారి పరిస్థితి వారిని చాలా దూరం నుంచి పిలుస్తున్నట్లుంది. (44)
ఇంతకుపూర్వం మేము మూసాకు (తౌరాత్‌)గ్రంథం ఇచ్చాము. దాని విషయంలో కూడా ఇలాంటి విభేదమే వచ్చింది. నీ ప్రభువు గనక ముందే ఒకమాట నిర్ణయించి ఉండకపోతే ఇలా విభేదించేవారి గురించి (ఎప్పుడో) తీర్పు జరిగివుండేది. వీరసలు దీన్ని గురించి తీవ్రమయిన సందిగ్ధం, సందేహాలలో పడిపోయారు. ఎవరు సత్కార్యం చేస్తే అతను తన శ్రేయస్సు కోసమే చేసుకుంటాడు. అలాగే ఎవరు దుష్కార్యానికి పాల్పడితే దాని కీడు అతని పైన్నే వచ్చి పడుతుంది. నీ ప్రభువు మాత్రం తన దాసులకు ఎలాంటి అన్యాయం చేయడు. (45-46)
ప్రళయఘడియ గురించి దేవునికి మాత్రమే తెలుసు. తొడిమల నుండి పైకొచ్చే పండ్లను గురించి, గర్భందాల్చే తల్లి, ఆమె కనేపిల్లల్ని గురించి కూడా ఆయనకే తెలుసు. ఆయన వారిని (ప్రళయ దినాన) ఎలుగెత్తి పిలిచి “(మీరు పూజించిన) నా భాగస్వా ములు ఏమయ్యార”ని ప్రశ్నిస్తాడు. దానికి వారు “మాలో ఎవరికీ వారి ఉనికిని గురించే తెలియదని విన్నవించుకుంటున్నాం” అనంటారు. వారు గతంలో పూజించిన మిధ్యా దైవాలన్నీ ఆరోజు వారినుండి కనుమరుగై పోతాయి. దాంతో వారు (నిరాశతో) తమకిక ఎక్కడా రక్షణ లభించదని భావిస్తారు. (47-48)
మానవుడు తన శ్రేయస్సు కోసం ఎంత వేడుకున్నా అలసిపోడు. కాని ఎప్పుడైనా కాస్తంత కష్టం వస్తేచాలు, నిరాశతో క్రుంగిపోతాడు. అయితే మేమతడ్ని ఆ కష్టం నుండి గట్టెక్కించి మాకారుణ్యాన్ని చవిచూపించగానే (మేము చేసిన మేలు మరచి) “నేనిందుకు అర్హుడ్ని. (నా శక్తిసామర్థ్యాలవల్లనే నాకిది లభించింది) ప్రళయదినం ఒకటుందని, అది తప్పక వస్తుందని నేను భావించడంలేదు. ఒకవేళ నన్ను నిజంగానే నాప్రభువు దగ్గరకు తీసికెళ్ళడం జరిగితే అక్కడా నాకు సుఖాలే లభిస్తాయి” అని అంటాడు. కాని మేము సత్యాన్ని తిరస్కరించినవారికి (గతంలో) వారు ఏమేమి చేసివచ్చారో తెలిపి, ఆతర్వాత పరమ జుగుప్సాకరమైన (నరక)యాతనలు చవిచూపిస్తాం. (49-50)
మానవునికి మేమేదైనా అనుగ్రహిస్తే అతను మాకు విముఖుడయి పోతాడు. పైగా అహంకారంతో విర్రవీగుతాడు. కాని అదే కష్టమొచ్చినప్పుడు సుదీర్ఘప్రార్థనలు చేస్తాడు.
ప్రవక్తా! వారికిలా చెప్పు: “ఈఖుర్‌ఆన్‌ నిజంగా దైవవాణే అయితే, దీన్ని మీరు (ఇలాగే) నిరాకరిస్తుంటే, కాస్త మీరే ఆలోచించండి.. దీన్ని (మొండిగా) నిరాకరించడంలో బహుదూరం పోయినవాడికంటే పరమదుర్మార్గుడు మరెవరుంటారు? (51-52)
త్వరలోనే వారికి మా నిదర్శనాలు దిజ్ఞ్మండలాల్లోనూ చూపిస్తాం; వారి (దేహ నిర్మా ణం)లోనూ చూపిస్తాం. చివరికి ఈ ఖుర్‌ఆన్‌ సత్యవాణి అనే విషయం వారి ముందు బట్టబయలవుతుంది. నీప్రభువు ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడన్న సంగతి చాలదా (వారికి)? చూడు, వీరు తమ ప్రభువును కలుసుకోవలసి ఉంటుందన్న విషయాన్ని ఎలా నమ్మ లేకపోతున్నారో! వినండి, ఆయన ప్రతివస్తువునీ పరివేష్ఠించి ఉన్నాడు. (53-54)