కురాన్ భావామృతం/యూనుస్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

10. యూనుస్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 109)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-రా. ఈ సూక్తులు విజ్ఞతావివేచనాలతో నిండిన (అద్భుత) గ్రంథానికి సంబంధించినవి. (ఏమరుపాటుకు గురైన) ప్రజలను జాగృతపరచమని, విశ్వసించిన వారికి వారిప్రభువు దగ్గర నిజమైన గౌరవప్రతిష్ఠలు ఉన్నాయన్న శుభవార్త విన్పించమని మేము మానవుల్లోనే ఒక మనిషికి సూచించాం. ఈవిషయం వారికి విచిత్రంగా ఉందా? పైగా అవిశ్వాసులు “ఇతను పచ్చిమాంత్రికుడ”ని చెబుతున్నారు. (1-2)
మీ ప్రభువు అల్లాహ్‌ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాల్ని ఆరు రోజుల్లో సృష్టిం చాడు. తర్వాత ఆయన అధికార సింహాసనం అధిష్ఠించి యావత్తు విశ్వవ్యవస్థను నిర్వ హిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఎవరూ ఎలాంటి సిఫారసు చేయలేరు. ఆ దేవుడే మీ ప్రభువు. కనుక మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. మరి ఇప్పటికైనా స్పృహలోకి వస్తారా? (3)
మీరంతా (కర్మవిచారణకోసం) ఆయన దగ్గరికే పోవలసిఉంది. ఇది దేవుడు చేస్తున్న తిరుగులేని వాగ్దానం. సృష్టి ప్రక్రియను ప్రారంభించేవాడు, ఆ తర్వాత ప్రళయ దినాన (ప్రాణికోటిని) తిరిగిబ్రతికించి లేపేవాడు కూడా ఆయనే. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఆయన న్యాయంగా తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అవిశ్వాస వైఖరి అవలం బించినవారికి త్రాగేందుకు సలసల మరిగే నీటిని ఇస్తాడు. పైగా వారు తమ దుష్కర్మ లకు దుర్భరయాతనలు కూడా అనుభవించవలసి వస్తుంది. (4)
ఆయనే సూర్యుడ్ని తేజోవంతంగా, చంద్రుడ్ని కాంతిమంతంగా చేసినవాడు. మీరు తేదీలు, సంవత్సరాల లెక్క తెలుసుకోవడానికి చంద్రకళల్ని నిర్దేశించినవాడు కూడా ఆయనే. ఇదంతా దేవుడు ఒక మహోన్నత లక్ష్యంకోసం సృష్టించాడు. ఆయన గ్రహించే వారికోసం తన నిదర్శనాలు విడమరచి తెలియజేస్త్తున్నాడు. దేవునికి భయపడే వారి కోసం రేయింబవళ్ళ చక్రభ్రమణంలో అనేక నిదర్శనాలున్నాయి. అసలు భూమ్యాకాశాల్లో ఆయన సృష్టించిన ప్రతి వస్తువులోనూ (ఆయన ఉనికిని, ఏకత్వాన్ని చాటే అనేక) నిదర్శనాలున్నాయి. మా దర్శనభాగ్యం ఆశించకుండా ప్రాపంచిక జీవితంతోనే తృప్తిచెంది మా సూక్తుల పట్ల ఏమరుపాటు వహించినవారికి నరకమే అంతిమ నివాసమవుతుంది, వారి దుష్కర్మలకు పర్యవసానంగా (తగిన శాస్తి అదే). (5-8)
ఇక సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేస్తున్నవారిని వారి ప్రభువు వారి విశ్వాసం కారణంగా సన్మార్గాన నడిపిస్తాడు. వారికోసం సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయి. వారక్కడ “దేవా! నీవు పరిశుద్ధుడవు” అని స్తుతిస్తూఉంటారు. అదీగాక వారు శాంతి చేకూరుగాక! అని ప్రార్థిస్తారు. వారు మాట్లాడే ప్రతిమాట చివర్లో “సకల స్తోత్రాలు సర్వలోక ప్రభువుకే శోభిస్తాయి” అని కూడా ఉంటుంది. (9-10)
ప్రజలు ప్రాపంచిక ప్రయోజనాలు అర్థించడంలో ఎంత తొందరపడుతున్నారో, దేవుడు వారికి కీడుచేసే విషయంలోనూ అంత తొందరపడితే వారి జీవితకాలం ఎప్పుడో సమాప్తమై ఉండేది. (కాని అలా చేయడం మా అభిమతం కాదు.) అందువల్ల మేము మా దర్శనభాగ్యం ఆశించనివారిని వారి తిరస్కారం, తలబిరుసుతనాల్లోనే పడివుండేలా వదిలేస్తున్నాము. కష్టకాలం వచ్చినప్పుడు మానవుడు నిలబడి, కూర్చొని, పడుకొని (అనుక్షణం) మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. కాని ఆ కష్టాన్ని కాస్తా మేము తొలగించ గానే అతను (మమ్మల్ని పూర్తిగా మరచిపోయి) ఎలాంటి కష్టంలో కూడా మమ్మల్ని మొర పెట్టుకో లేదన్నట్లు ముఖం చాటేస్తాడు. ఇలా హద్దులు మీరేవారికి మేము వారి (అ)కృత్యాలను ఆకర్షవంతంగా చేస్తాము. (11-12)
మానవులారా! మీకు పూర్వం (హద్దు మీరిపోయి) దౌర్జన్యవైఖరి అవలంబించిన జాతుల్ని మేము నాశనం చేశాం. వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తెచ్చినా వారు విశ్వసించలేదు. ఈ విధంగా మేము నేరస్థులకు వారి నేరాల పర్యవ సానం చవిచూపిస్తున్నాము. వారి తరువాత ఇప్పుడు మీరెలా ప్రవర్తిస్తారో చూసేందుకు మేము మిమ్మల్ని ధరణిలో (మా) ప్రతినిధులుగా నియమించాము. (13-14)
మా దర్శనభాగ్యం ఆశించనివారికి స్పష్టమైన మాసూక్తులు విన్పిస్తున్నప్పుడు “దీనికి బదులు మరో ఖుర్‌ఆన్‌ తీసుకురా, లేదా ఇందులో మార్పుచెయ్యి” అంటారు. ప్రవక్తా! వారికిలా చెప్పు: “ఇందులో మార్పుచేయడానికి నాకెలాంటి అధికారం లేదు. నేను నా దగ్గరకు పంపబడుతున్న దివ్యావిష్కృతిని అనుసరించేవాడ్ని మాత్రమే. నేను గనక నా ప్రభువుకు అవిధేయత చూపితే ఓ భయంకరదినాన పడే శిక్షకు భయపడుతున్నాను.”
ఇంకా ఇలా చెప్పు: “దేవుడిలా నిర్ణయించివుంటే నేనీ ఖుర్‌ఆన్‌ని మీకు ఎన్నటికీ విన్పించేవాడ్ని కాదు. దేవుడు కూడా మీకు దీన్ని గురించి ఏమాత్రం తెలియజేసేవాడు కాదు. దీని (అవతరణ)కు పూర్వం నేను మీమధ్య ఓ సుదీర్ఘకాలం గడిపాను. (నా నీతి, నిజాయితీలను గురించి మీకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి దేవుని విషయంలో అబద్ధాలు ఎలా చెప్పగలడు?) మీరీ మాత్రం గ్రహించలేరా? అసత్యం స్వయంగా కల్పించి దాన్ని దేవునిమీద నెట్టివేసే వాడికంటే పరమ దుర్మార్గుడు ఎవడైనా ఉంటాడా? లేక దేవుని సూక్తుల్ని అసత్య విషయాలుగా పరిగణించే వాడికంటే పరమ దుర్మార్గు డెవరు? నేరస్థులు ఎట్టి పరిస్థితిలోనూ సాఫల్యం పొందలేరు. (15-17)
వారు దేవుడ్ని వదలి తమకు ఎలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించని మిధ్యా దైవాలను పూజిస్తూ అవి తమను గురించి దేవుని దగ్గర సిఫారసు చేస్తాయని అంటారు. “ఏమిటి, మీరు భూమ్యాకాశాల్లో దేవుడు ఎరగని విషయం గురించి ఆయనకు కొత్తగా తెలుపుతున్నారా?” అని అడుగు వారిని. దేవుడు పరిశుద్ధుడు. వారు చేసే బహుదైవా రాధనకు ఆయన ఎంతో అతీతుడు. (18)
ప్రారంభంలో మానవులంతా ఒకే సముదాయంగా (ఒకే జాతిగా) ఉండేవారు. తరువాత వారు విభిన్న విశ్వాసాలు, ఆచారాలు కల్పించుకొని చీలిపోయారు. నీ ప్రభువు వైపున ముందే ఒకమాట నిర్ణయించబడి ఉండకపోతే, వారు పరస్పరం విభేదించు కుంటున్న విషయాలు ఎప్పుడో పరిష్కరించబడి ఉండేవి. (19)
వారింకా “ఈ ప్రవక్తపై అతని ప్రభువు దగ్గర్నుండి ఏదైనా మహిమ ఎందుకు అవతరించదు?” అంటారు. వారికిలా చెప్పు: “అగోచరజ్ఞానం, అతీంద్రియశక్తులు దేవుని అధీనంలో ఉన్నాయి. (ఆయన ఆజ్ఞలేనిదే ఏదీ అవతరించదు.) మీరు (దాని కోసమే) ఎదురుచూస్తుండండి. నేనూ (మీ మూర్ఖపుకోరిక ఎలా నెరవేరుతుందో) ఎదురుచూస్తూ ఉంటాను.” ప్రజలు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేము వారికి (మా) కారుణ్యాన్ని చవిచూపితే ఆ తరువాత వెంటనే వారు మా సూక్తులకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నడం ప్రారంభిస్తారు. “పన్నాగాలు పన్నడంలో దేవుడు మీకంటే మిన్న. ఆయన దూతలు మీ పన్నాగాలన్నిటిని నమోదుచేస్తూనే ఉన్నారు” అని చెప్పు. (20-21)
మిమ్మల్ని నేలమీద, నీటిమీద నడిపించేవాడు దేవుడే. మీరు ఓడలలో ఎక్కి నప్పుడు చల్లటి వాతావరణం మధ్య ఆ ఓడలు గాలివాటుకు చక్కగా ముందుకు సాగి పోతుంటే మీరు హాయిగా ప్రయాణం చేస్తారు. (అయితే ఒక్కోసారి) కొంతదూరం పోయిన తర్వాత హఠాత్తుగా వాతావరణం మారిపోతుంది. గాలి ఉధృతంగా వీస్తుంది. ఓడ నలువైపుల నుండి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ బీభత్సం సృష్టిస్తాయి. దాంతో ప్రయాణీకులు తాము తుఫానులో చిక్కుకున్నామని తెలిసి భయపడిపోతారు. అప్పుడు వారంతా (తమ తమ మిధ్యాదైవాలు మరచిపోయి) ఒక్క దేవుని మీదే విశ్వాసం ఉంచుతూ “దేవా! నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి గట్టెక్కిస్తే మేము నీపట్ల కృతజ్ఞులై ఉంటాం” అని మొరపెట్టుకుంటారు. (22)
అయితే దేవుడు వారిని ఆపదనుండి గట్టెక్కించగానే వారు మళ్ళీ సత్యవిముఖులై ధరణిలో తిరుగుబాటుకు ఒడిగడ్తారు. మానవులారా! (తెలుసుకోండి) “ఈ తిరుగుబాటు వైఖరి వికటించి మీకే వ్యతిరేకంగా పరిణమిస్తుంది. ప్రాపంచిక సుఖాలు కొన్నాళ్ల ముచ్చట మాత్రమే. చివరికి మీరు మా దగ్గరికే రావలసి ఉంటుంది. అప్పుడు మేము మీరు ప్రపంచంలో ఉండగా ఏమేమి చేసుండ్తేవారో మీకు తెలియజేస్తాము. (23)
ప్రాపంచిక జీవితాన్ని ఈవిధంగా పోల్చవచ్చు: ఆకాశం నుండి మేము వర్షం కురి పించినప్పుడు నేల సస్యశ్యామలమై మానవులు, పశువులు తినే పంటలు, పచ్చికలతో కనులపండువుగా తయారవుతుంది. చివరికి పుష్కలమైన పంటలతో పొలాలు శోభిల్లు తుంటాయి. ఆ పొలాలు కోతకు వచ్చినప్పుడు వాటి యజమానులు చూసి “ఇక మనకివి ఎంతో లాభం చేకూర్చుతాయి” అని భావిస్తారు. కాని అంతలో ఓరోజు రాత్రి వేళో, పగటివేళో అకస్మాత్తుగా మా ఆజ్ఞ వస్తుంది. మేమా పొలాలను నాశనంచేసి, నిన్న అక్కడ అసలు ఏమీ లేదన్నట్లు పూర్తిగా తుడిచిపెడ్తాము. ఇలా మేము యోచించేవారి కోసం మా నిదర్శనాలు విడమరచి తెలియజేస్తున్నాము. (24)
(కనుక క్షణభంగురం లాంటి ఈ ప్రాపంచిక జీవితంలోని పైపై మెరుగులకు మీరు మోసపోకండి.) దేవుడు మిమ్మల్ని (స్వర్గమనే) శాంతినిలయం వైపు ఆహ్వానిస్తున్నాడు. ఆయన తాను కోరినవారికి సన్మార్గం చూపుతాడు. సత్కార్యాలు చేసేవారికి సత్ఫలం ఉంది, అంతకు మించి కూడా ఉంది. వారి ముఖాలు దుమ్ము కొట్టుకొని నల్లగా మారడం గాని, అవమానభారంతో ముడుచుకు పోవడం గాని జరగదు. వారు స్వర్గానికి అర్హులవుతారు. స్వర్గంలోనే వారు కలకాలం ఉంటారు. (25-26)
దుష్కార్యాలు చేసేవారికి వారి దుష్కార్యాలకు తగినట్లే దుష్ఫలం ఉంది. వారిని అవమానం, అప్రతిష్ఠలు చుట్టుముడ్తాయి. దేవుని పట్టు నుండి వారిని కాపాడే నాథుడే ఉండడు. వారి ముఖాలు (నిరాశా నిస్పృహలతో) కారుచీకటిలా నల్లగా మాడిపోయి ఉంటాయి. వారే నరకానికి పోయేవారు. నరకంలోనే ఎల్లకాలం పడిఉంటారు. (27)
వారందర్నీ మేము ఒకేసారి సమావేశపరచినప్పుడు, దేవునికి సాటికల్పించినవారితో “ఆగండి మీరూ, మీరు దేవునికి సాటికల్పించిన మీ మిధ్యాదైవాలు” అంటూ వారిని మేము నిలదీస్తాము. తర్వాత వారుభయుల మధ్య ఉన్న అపరిచిత తెరని తొలగిస్తాం. అప్పుడు వారు కల్పించుకున్న మిధ్యాదైవాలు వారితో “మీరు మమ్మల్ని ఎన్నడూ ఆరా ధించలేదు. ఈవిషయంలో మనకు దేవుడే సాక్షి. (మీరు మమ్మల్ని ఆరాధించి ఉంటే) మీ ఆరాధన గురించి మాకసలు తెలియనే తెలియదు” అని అంటాయి. (28-29)
అప్పుడు ప్రతివాడూ తాను చేజేతులా చేసుకున్న కర్మల పర్యవసానం చవి చూస్తాడు. వారందరినీ వారి అసలు యజమాని దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ వారి అబద్ధాలు, అభూతకల్పనలన్నీ పటాపంచలై పోతాయి. (30)
ముహమ్మద్‌ (స)! వారిని ఇలా అడుగు: “మీకు భూమ్యాకాశాల నుండి ఉపాధి నిస్తున్నదెవరు? మీరు వినే, చూసే శక్తులు మీకసలు ఎవరు ప్రసాదించారు? నిర్జీవ పదార్థం నుండి జీవిని, జీవినుండి నిర్జీవ పదార్థాన్ని వెలికి తీస్తున్నదెవరు? బ్రహ్మాండమైన ఈ విశ్వవ్వవస్థను (నియమబద్ధంగా) నిర్వహిస్తున్న శక్తిస్వరూపుడు ఎవరు?” వారు తప్పకుండా దేవుడే అంటారు. ఇలా అడుగు: “మరి ఆ దేవుడే మీ నిజప్రభువు అయి నప్పుడు మీరు (వాస్తవికతకు విరుద్ధంగా నడవడాన్ని) ఎందుకు మానుకోరు?” (31)
సత్యాన్ని త్రోసిపుచ్చిన తరువాత మార్గభ్రష్టత్వం తప్ప ఇక మిగిలేదేముంటుంది? అసలు మీరు ఎలా మోసపోతున్నారు? (ప్రవక్తా!) ఈవిధంగా అవిధేయుల విషయంలో, వారు సత్యాన్ని విశ్వసించరన్న దైవవాక్కు నిజమని తేలిపోయింది. (32-33)
వారినిలా అడుగు: “మీరు కల్పించుకున్న మిధ్యాదైవాలలో ప్రారంభసృష్టిని, ఆ తర్వాత పునఃసృష్టిని చేసేవారు ఉన్నారా?” ఇలా చెప్పు: “దేవుడే ప్రారంభ సృష్టిని, ఆ తర్వాత పునఃసృష్టిని కూడా చేస్తున్నాడు. అలాంటప్పుడు మీరెలా మోసపోతున్నారు?”
వారిని అడుగు: “సరే, మీరు కల్పించుకున్న మిధ్యాదైవాలలో ఏవైనా మీకు సత్యం వైపు మార్గదర్శనం చేస్తున్నాయా?” వారికి స్పష్టంగా చెప్పెయ్యి: “దేవుడు మాత్రమే సత్యం వైపు మార్గదర్శనం చేసేవాడు. మరి మీరు అనుసరించడానికి అర్హుడైనవాడు సత్యం వైపు మార్గదర్శనం చేసేవాడా లేక మరొకరు మార్గదర్శనం చేస్తే తప్ప మార్గం పొందనివాడా? అసలు మీకేమైంది, ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? (34-35)
వారిలో చాలామంది ఊహాగానాలు చేస్తూ వాటినే అనుసరిస్తున్నారు. కాని ఊహా గానాలు సత్యానికి ప్రత్యామ్నాయం కాలేవు. వారు చేస్తున్నదంతా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఈ ఖుర్‌ఆన్‌ దేవుని దగ్గర్నుండి దివ్యావిష్కృతి లేకుండా మానవులు తమం తటతాము రచించుకోగల గ్రంథంకాదు. ఇది పూర్వం అవతరించిన దైవగ్రంథాల్ని ధృవీ కరిస్తున్న దివ్యగ్రంథం, (వాటన్నిటి మౌలిక బోధనలను) విపులీకరించే సమగ్ర గ్రంథం. నిస్సందేహంగా ఇది సర్వలోక ప్రభువు నుండి అవతరించిన గ్రంథం. (36-37)
దీన్ని దైవప్రవక్త రచించుకున్నాడని అంటున్నారా వారు? వారికిలా చెప్పు: “మీ ఆరోపణ నిజమైతే ఇలాంటి ఒక అధ్యాయం రచించి తీసుకురండి. (కావాలంటే) ఈ పని కోసం ఒక్క దేవుడ్ని వదలి మీరు ఎవరెవరిని పిలుచుకోగలరో వారందర్నీ పిలుచు కోండి.” వారసలు తమకు తెలియని విషయాన్ని (మూర్ఖంగా) తిరస్కరిస్తున్నారు. దాని వాస్తవికత ఏమిటో వారికింకా తెలియదు. వారికి పూర్వముండిన ప్రజలు కూడా ఇలాగే నిరాకరించారు. ఇక చూడు, ఆ దుర్మార్గులకు ఎలాంటి గతి పట్టిందో! (38-39)
వారిలో కొందరు (సత్యాన్ని) విశ్వసిస్తారు; కొందరు విశ్వసించరు. ఆ దుర్మార్గుల సంగతి దేవునికి బాగా తెలుసు. వారు నిన్ను నిరాకరిస్తే ఇలా చెప్పు: “నాకర్మలు నా వెంట వస్తాయి. మీకర్మలు మీవెంట వస్తాయి. నేను చేసే పనులకు మీరు బాధ్యులు కాలేరు. మీరు చేసే పనులకు నేను బాధ్యుడ్ని కాను.”వారిలో కొందరు నీమాటలు చెవి యొగ్గివింటారు. కాని ఏమాత్రం తలకెక్కించుకోని ఈ తలబిరుసు మనుషులకు నీవు విన్పించగలవా? వారిలో చాలామంది (ఎంతోఆసక్తి ఉన్నట్లు) నీవైపు చూస్తారు. మరి నీవు (సత్యం)కానలేని అంధులకు (రుజు)మార్గం చూపగలవా? దేవుడు మానవులకు ఎన్నటికీ అన్యాయం చేయడు. వారే ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. (40-44)
దేవుడు వారందర్నీ సమావేశపరచే రోజు (భూలోకంలో) తాము కొన్ని క్షణాలకంటే ఎక్కువ కాలం గడపలేదని వారు భావిస్తారు. ఒకర్నొకరు గుర్తుపట్టడం జరుగుతుంది. అయితే దేవుడ్ని కలుసుకునే విషయాన్ని నిరాకరించినవారు (ఆరోజు) ఘోరంగా నష్ట పోతారు. వారసలు ఏమాత్రం సన్మార్గంలో నడవలేదు. ఏ దుష్పరిణామాలను గురించి మేము వారిని హెచ్చరిస్తున్నామో వాటిలో కొన్నిటిని నీజీవిత కాలంలో వారికి చూపినా, లేదా దానికిపూర్వమే మేము నిన్ను మా దగ్గరకు పిలిపించుకున్నా మొత్తంమీద వారు మా దగ్గరికే రావలసి ఉంటుంది. వారు చేస్తున్న పనులకు దేవుడే సాక్షి. (45-46)
ప్రతి జాతికీ ఒక ప్రవక్త ఉన్నాడు. ఒక జాతి దగ్గరకు దానిప్రవక్త వచ్చినప్పుడు ఆ జాతి గురించి న్యాయంగా తగిన నిర్ణయం తీసుకోబడుతుంది. దానికి అణుమ్రాతం కూడా అన్యాయం జరగదు. “నీ బెదిరింపు నిజమైతే అదసలు ఎప్పుడు నెరవేరుతుంది?” అంటారు వారు. వారికి చెప్పు: “నా చేతిలో ఏమీలేదు. లాభంగాని, నష్టంగాని అంతా దేవుని నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది. ప్రతి జాతికీ ఒక నిర్ణీత గడువుకాలం ఉంది. ఆ గడువు ముగిసిపోగానే ఇక ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయడంగాని, నిర్ణీత గడువుకు ముందు ఒక్క క్షణం తొందర చేయడంగాని జరగదు.” (47-49)
వారినిలా అడుగు: “దేవుని శిక్ష ఓరోజు రాత్రివేళో పగటివేళో అకస్మాత్తుగా వచ్చి పడితే (మీరేం చేయగలరు?) దాన్ని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? నేరస్థులు దానికోసం అంత తొందరపడతారేమిటీ? అలా చేయడం ఏమంత గొప్ప పనని? అది వచ్చి మీమీద పడినప్పుడే మీరు (సత్యాన్ని) విశ్వసిస్తారా?” “ఇప్పుడా మీరు బయటపడా లనుకుంటున్నది? దాని కోసం మీరే కదా తొందరపడింది! అప్పుడా దుర్మార్గులకు “ఇక శాశ్వత (నరక) యాతనలు చవిచూడండి, మీరు సంపాదించుకున్నవాటికి ఫలితంగా. అంతకంటే వేరే శిక్ష ఏముంటుంది మీకు?” అని చెప్పడం జరుగుతుంది. (50-52)
వారు నిన్ను “ఇది నిజంగా సంభవిస్తుందా?” అని అడుగుతున్నారు. వారికి చెప్పు: “నాప్రభువు సాక్షి! తప్పక సంభవిస్తుంది. మీరు ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని అడ్టుకోలేరు.” దుర్మార్గం, దౌర్జన్యాలకు పాల్పడినవాడు ఆ యాతన నుండి విముక్తి పొందడానికి భూ మండలమంత సిరిసంపదలున్నా అదంతా పరిహారం క్రింద ఇవ్వడానికి సిద్ధమౌతాడు. ఆ యాతనలు చూసి వారు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. కాని వారి విషయంలో న్యాయంగానే తీర్పు చేయబడుతుంది. ఎలాంటి అన్యాయం జరగదు. (53-54)
వినండి! భూమ్యాకాశాల్లో ఉన్నదంతా దేవునిదే. వినండి! దేవుని వాగ్దానం నిజమై నది. కాని చాలామంది (ఈ సత్యం) గ్రహించడం లేదు. దేవుడే (మీ) జీవన్మరణాలకు మూలకారకుడు. చివరికి మీరంతా ఆయన దగ్గరికే చేరుకోవలసి ఉంటుంది. (55-56)
మానవులారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. ఇది మీ హృదయరుగ్మతలకు నివారిణి. దీన్ని స్వీకరించేవారికి ఇది మార్గదర్శిని, కారుణ్యప్రదా యిని. ప్రవక్తా! వారికిలా తెలియజెయ్యి: “ఈ మహాభాగ్యాన్ని దేవుడు మీకోసం పంపా డంటే ఇది ఆయన అనుగ్రహం, దాతృత్వాలే. దానిపై వారు ఆనందోత్సవాలు జరుపు కోవాలి. ఇది ప్రజలు కూడబెడ్తున్న దానికంటే ఎంతో శ్రేష్ఠమైనది. (57-58)
వారినిలా అడుగు: “మీకు దేవుడు ప్రసాదించిన సంపదలలో మీరు కొన్నిటిని నిషేధించుకొని, మరికొన్నిటిని ధర్మసమ్మతం చేసుకున్నారే! దాన్ని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?” ఇంకా అడుగు: “అలా చేయడానికి దేవుడు మీకు అనుమతించాడా? లేక మీరంతట మీరే కల్పించుకొని ఆ అబద్ధాన్ని దేవునికి ఆపాదిస్తున్నారా?” దేవుని మీద అసత్యారోపణలు మోపుతున్నవారు ప్రళయదినాన తమపట్ల ఆయన ఎలా వ్యవహరి స్తాడని భావిస్తున్నారు? దేవుడు మానవుల్ని ఎల్లప్పుడూ కటాక్ష వీక్షణలతోనే చూస్తాడు. కాని మానవులే చాలామంది ఆయనకు కృతజ్ఞత చూపడంలేదు. (59-60)
ప్రవక్తా! నీవు ఏఏ కార్యకలాపాలలో నిమగ్నమయి ఉన్నావో, ఖుర్‌ఆన్‌లో నీవు ఏఏ విషయాలు (ప్రజలకు) విన్పిస్తున్నావో అవన్నీ మా దృష్టిపథంలో ఉన్నాయి. అలాగే ప్రజలారా! మీరు ఎలాంటి పనులు చేస్తున్నారో వాటిని కూడా మేము గమనిస్తున్నాం. భూమ్యాకాశాల్లో ఏ వస్తువూ చిన్నదైనా, పెద్దదైనా నీ ప్రభువుకు కనబడకుండా మరుగున లేదు. అలాగే అది ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. (61)
వినండి! సత్యాన్ని విశ్వసించి భయభక్తులు కలిగివున్న దేవుని ప్రియభక్తులకు ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు. వారిటు ప్రపంచంలో, అటు పరలోకం లోనూ సంతోషంగా ఉంటారు. దేవుని మాటలు ఎన్నటికీ మారవు. ఇదే గొప్పవిజయం. ముహమ్మద్‌ (స)! వారి మాటలకు నీవు బాధపడకు. గౌరవప్రతిష్ఠలన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన అన్నీ వింటున్నాడు, సమస్తం ఎరిగినవాడు. (62-65)
వినండి! భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త సృష్టిరాసులూ దేవుని సొత్తే. (అలాంటి) దేవుడ్ని కాదని మిధ్యాదైవాలను ప్రార్థిస్తున్నవారు కేవలం ఊహాగానాలుచేస్తూ, వాటినే అనుసరిస్తున్నారు. మీరు విశ్రాంతి తీసుకోవడానికి దేవుడే రాత్రిని సృష్టించాడు. (పనులు చేసుకోవడానికి వీలుగా) పగటిని ప్రకాశవంతంగా చేసినవాడు కూడా ఆయనే. (దైవ ప్రవక్త సందేశం) వినేవారికి అందులో (అనేక) సూచనలు ఉన్నాయి. (66-67)
కొందరు “దేవుడు ఒకడ్ని కుమారుడిగా చేసుకున్నాడ”ని అంటున్నారు. దేవుడు పరిశుద్ధుడు, నిరపేక్షాపరుడు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం ఆయన సొత్తే. ఆ మాటకు మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? దేవుడ్ని గురించి మీకేమాత్రం తెలియని విషయాలు మాట్లాడుతున్నారా! “దేవుని మీద అసత్యారోపణలు చేసేవారు ఎన్నటికీ సఫలీకృతులు కాలేర”ని చెప్పు. క్షణభంగురంలాంటి ఐహికజీవితంలో కొన్నాళ్ళపాటు వారిని తనివితీరా సుఖాలు జుర్రుకోనీ. ఆతర్వాత వారు మాదగ్గరికే రావలసి ఉంటుంది. అప్పుడు మేము వారికి సత్యతిరస్కారానికి ప్రతిఫలంగా తీవ్ర యాతనలు చవిచూపిస్తాం. (68-70)
వారికి నూహ్‌ గాధ విన్పించు. అప్పుడతను తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “సోదరులారా! నేను మీమధ్య ఉండి దేవుని సూక్తులు విన్పిస్తూ మిమ్మల్ని ఏమరు పాటు నుండి జాగృతపరచడం మీరు సహించకపోతే (పోనివ్వండి) నేను మాత్రం దేవుడ్నే నమ్ముకొని ఆయన మీద ఆధారపడ్డాను. మీరు మీకల్పితదైవాలు తీసుకొని ఓ నిర్ణయా నికి రండి. మీరు పన్నే వ్యూహంలో ఏ అంశమూ తప్పిపోకుండా ఉండేలా ఓసారి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఆతర్వాత దాన్ని నాకు వ్యతిరేకంగా అమలుపరచండి. నా కెలాంటి అవకాశం ఇవ్వకండి. మీరు నా హితబోధ వినకుండా ముఖం తిప్పుకున్నారు. (దానివల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు.) నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలం కోరలేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత దేవునిపై ఉంది. నేను ముస్లింనై ఉండాలని నాకు ఆదేశం ఇవ్వబడింది.” వారు (దీన్ని కూడా ఖాతరుచేయకుండా) అతడ్ని నిరాకరించారు. అప్పుడు మేము అతడ్ని, అతనితోపాటు ఓడలో ఎక్కినవారిని రక్షించాం. వారిని మాత్రమే ప్రపం చంలో జీవించివుండేలా చేశాం. మా సూక్తులు నిరాకరించినవారందర్నీ ముంచివేశాం. చూడండి, హెచ్చరించబడినవారికి ఎలాంటి దుర్గతి పట్టిందో. (71-73)
నూహ్‌ తర్వాత మేము వివిధ ప్రవక్తలను వారివారి జాతుల దగ్గరకు పంపాము. ఆ ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొనివెళ్ళారు. కాని వారు (సత్యాన్ని నిరాకరించారు.) ఒకసారి నిరాకరించినదాన్ని మళ్ళీ అంగీకరించే మనుషులు కాదు. ఈ విధంగా హద్దుమీరేవారి హృదయ కవాటాలను మేము మూసివేస్తున్నాం. (74)
ఆతర్వాత మేము మూసా, హారూన్‌లకు మా నిదర్శనాలిచ్చి ఫిరౌన్‌, అతని అధికా రుల వద్దకు పంపాం. కాని వారు (అధికార)గర్వంతో విర్రవీగిపోయారు. వారసలు పరమ దుర్మార్గులు. మా వద్దనుండి వారి ముందుకు సత్యం వచ్చినప్పుడు, ‘అది వట్టి మంత్ర జాలం మాత్రమే’ అన్నారు. అప్పుడు మూసా “సత్యం మీ ముందుకు వస్తే దాన్ని మంత్ర జాలం అంటారా? మాంత్రికులు ఎన్నటికీ సఫలం కాలేరు” అన్నాడు. (75-77)
దానికి వారు “నీవు మా తాతముత్తాతల మార్గం నుండి మమ్మల్ని మరలించ డానికి వచ్చావా? ఇలా మీరిద్దరు (మా) దేశంలో పెత్తనం చెలాయింపజూస్తున్నారా? నీ మాటల్ని మేము ఎన్నటికీ అంగీకరించం” అన్నారు. ఆతర్వాత ఫిరౌన్‌ (తన అధికారు లతో) “ఆరితేరిన మాంత్రికులందర్నీ మాముందు ప్రవేశపెట్టండి” అన్నాడు. (78-79)
మాంత్రికులు వచ్చిన తరువాత మూసా వారినుద్దేశించి “మీరు పడేయదలచుకున్న దేమిటో పడేయండి” అన్నాడు. వారు తమ మంత్రసాధనాలను (నేలమీద) పడవేశారు. అప్పుడు మూసా ఇలా అన్నాడు: “మీరు పడవేసింది మంత్రజాలం మాత్రమే. చూడండి ఇప్పుడు దేవుడు దాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తాడో. ఆయన దుర్మార్గుల పనిని నెరవేర నీయడు. దురాత్ములకు ఎంత వెగటుకలిగినా దేవుడు తన నిదర్శనాలతో సత్యాన్ని సత్యంగా నిరూపించి తీరుతాడు.” (80-82)
ఫిరౌన్‌, అతని అధికారులు ఏ కష్టాలు తెచ్చిపెడ్తారోనని భయపడి, ఆ జాతిలో కొందరు యువకులు తప్ప మరెవరూ మూసాను విశ్వసించ లేదు. ఫిరౌన్‌ దేశంలో అతి క్రూరుడైన నియంతలా తయారై (అధికారగర్వంతో) హద్దుమీరి పోయాడు. (83)
మూసా తన జాతిప్రజల్ని ఉద్దేశించి “ప్రజలారా! మీరు నిజంగా దేవుడ్ని విశ్వసిస్తే ఆయన మీదే భారం వేయండి. మీరు (చిత్తశుద్ధి కలిగిన) ముస్లింలు అయితే (నా హితవులు పాటించండి)” అని అన్నాడు. దానికి వారు సమాధానమిస్తూ “మేము దేవుని మీదే భారంవేశాం. దేవా! మమ్మల్ని దుర్మార్గుల కోసం పరీక్షగా చేయకు. నీ కారుణ్య కటాక్షాలతో మమ్మల్ని అవిశ్వాసుల బారి నుండి రక్షించు” అని అన్నారు. (84-86)
మేము మూసాని, అతని సోదరుడ్ని ప్రేరేపిస్తూ “మీ జాతిప్రజల కోసం ఈజిప్టులో కొన్ని ఇండ్లు సిద్ధం చేసుకోండి. వాటిని ఆరాధనా దిశగా చేసుకొని (సామూహిక) ప్రార్థనా వ్యవస్థ నెలకొల్పండి. విశ్వాసులకు శుభవార్త విన్పించండి” అని అన్నాము. (87)
మూసా ఇలా ప్రార్థించాడు: “ప్రభూ! నీవు ఫిరౌన్‌కు, అతని అధికారులకు ఐహిక జీవితంలో ఐశ్వర్యం, సకలసాధనసంపత్తులు ఇచ్చావు. ప్రభూ! ప్రజల్ని నీమార్గంలోకి రాకుండా నిరోధించడానికా ఇచ్చింది? ప్రభూ! వారి సిరిసంపదలు నాశనం చెయ్యి. దుర్భర శిక్ష చూడనంతవరకు (సత్యాన్ని) విశ్వసించనీయకుండా వారి హృదయ కవా టాలు మూసెయ్యి.” దానికి దేవుడు జవాబిస్తూ “మీఇద్దరి వేడుకోలు స్వీకరించబడింది. (ధర్మంలో)స్థిరంగా ఉండండి. మూఢుల మార్గం అనుసరించకండి” అన్నాడు. (88-89)
మేము ఇస్రాయీల్‌ సంతతిని సముద్రం దాటించి ఒడ్డుకు చేర్చాము. ఫిరౌన్‌, అతని సైనికులు హింసాప్రతీకారేచ్ఛలతో వారి వెంటపడ్డారు. చివరికి ఫిరౌన్‌ సముద్రంలో మునిగిపోతూ “నేను ఇస్రాయీలీలు విశ్వసించిన దేవుడ్ని విశ్వసించాను. ఆయన తప్ప మరోదేవుడు లేడు. నేనిప్పుడు దైవవిధేయుల్లో చేరిపోయాను” అని అన్నాడు. (90)
“ఇప్పుడా నీవు విశ్వసించేది? ఇంతకు పూర్వం నీవు అవిధేయుడవయి దుర్మార్గపు పనులు చేస్తుండేవాడివి. ఇప్పుడు నీవు భావితరాలకు గుణపాఠంగా మిగిలిపోవడానికి నీ శవాన్ని మాత్రమే మేము కాపాడుతాం’ (అని సమాధానమివ్వబడింది). చాలామంది మా నిదర్శనాల విషయంలో అజాగ్రత్త, ఏమరుపాటులకు లోనైవున్నారు. (91-92)
మేము ఇస్రాయీల్‌ సంతతివారికి ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో పునరావాసం, అత్యంత శ్రేష్టమైన జీవనోపాధి కల్పించాము. వారు తమ దగ్గరకు (ధర్మ) జ్ఞానం వచ్చిన తరువాతే పరస్పరం విభేదాలలో పడిపోయారు. నీ ప్రభువు ప్రళయదినాన వారిముందు వారు విభేదించుకున్న విషయాలను గురించి తప్పకుండా తీర్పుచేస్తాడు. (93)
మేము నీపై దించినదాని విషయంలో నీకేమయినా అనుమానముంటే పూర్వం నుంచీ (దివ్య)గ్రంథం పఠిస్తున్నవారిని అడిగి తెలుసుకో. నిస్సందేహంగా ఇది నీ ప్రభువు దగ్గర్నుండి వచ్చిన పరమసత్యం. కనుక నీవు శంకించేవారిలో చేరిపోకు. మా సూక్తులు నిరాకరించినవారిలో కూడా చేరిపోకు. అలాచేస్తే నీవు నష్టపోతావు. (94-95)
ఎవరి విషయంలో నీప్రభువు మాట స్థిరపడిపోయిందో వారిముందు నీవు ఏ నిదర్శనం ప్రదర్శించినా, దుర్భరశిక్ష కళ్ళారా చూడనంతవరకూ వారు (సత్యాన్ని) విశ్వ సించరు. ఏదైనా పట్నంలోని ప్రజలు (దైవ)శిక్ష రావడం చూసి విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసం వారికి ప్రయోజనం చేకూర్చినట్లు ఒక్క ఉదంతమైనా సంభవించిందా యూనుస్‌ జాతి తప్ప? (వారి సంగతి వేరు) ఆప్రజలు (సత్యాన్ని) విశ్వసించగానే మేము ప్రపంచ జీవితంలో వారిపై పడనున్న అవమానకరమైన శిక్ష తొలగించాం. ఆతర్వాత ఆ జాతికి కొంతకాలం జీవితసుఖాలు అనుభవించే అవకాశమిచ్చాం. (96-98)
నీ ప్రభువు తలిస్తే భూవాసులంతా (సత్యాన్ని) విశ్వసించేవారు. కాని నీవు ప్రజల్ని బలవంతంగా విశ్వాసులుగా మార్చదలిచావా? దైవాజ్ఞ లేనిదే ఏఒక్కడూ విశ్వసించలేడు. బుద్ధిహీనులపై దేవుడు (అవిశ్వాస)మలినాన్ని పడవేస్తాడు. భూమ్యాకాశాల్లో ఉన్న వాటిని ఓసారి కళ్ళుతెరచి చూడండని చెప్పు వారికి. సత్యాన్ని విశ్వసించాలన్న ఉద్దేశ్యం లేని వారికి ఎన్ని నిదర్శనాలు చూపినా, ఎన్ని హెచ్చరికలు చేసినా లాభం లేదు. (99-101)
పూర్వం ప్రజలు ఏ దుర్దినాలు చూశారో ఆ దుర్దినాల కోసం ఎదురుచూస్తున్నారా వీరు? “అయితే ఎదురుచూడండి, నేనూ మీతోపాటు ఎదురుచూస్తాను” అని చెప్పు వారికి. (అలాంటి కష్టకాలం వస్తే) మేము మా ప్రవక్తలను, విశ్వసించినవారిని కాపాడు కుంటాం. విశ్వాసుల్ని కాపాడుకోవడం మా బాధ్యత. (102-103)
ముహమ్మద్‌ (సల్లం)! వారితో ఇలా చెప్పెయ్యి: “ప్రజలారా! నా ధర్మం గురించి మీకేదయినా అనుమానం ఉంటే ఒక విషయం తెలుసుకోండి. మీరు దేవుడ్ని వదలి ఎవరిని ఆరాధిస్తున్నారో వారిని నేను ఎన్నటికీ ఆరాధించను. ఎవరి అధీనంలో మీ ప్రాణాలున్నాయో ఆ దేవుడ్ని మాత్రమే నేను ఆరాధిస్తాను. నేను దృఢమయిన విశ్వాసిగా ఉండాలని నాకు ఆజ్ఞయింది. (104)
నాకీ ఆదేశం కూడా ఇవ్వబడింది: “నీవు ఏకాగ్ర చిత్తుడవయి ఈ ధర్మంలోనే స్థిరంగా ఉండు. బహుదైవారాధకుల్లో చేరిపోకు. దేవుడ్ని వదలి నీకు ఎలాంటి లాభంగాని, నష్టంగాని కలిగించలేని మిధ్యాదైవాలను ఎన్నటికీ ప్రార్థించకు. అలా చేస్తే నీవు దుర్మార్గుడవై పోతావు. దేవుడు నిన్ను ఏదైనా కష్టానికి గురిచేయదలిస్తే ఆయన తప్ప ఆ కష్టం నుండి నిన్ను గట్టెక్కించేవారు మరెవరూ ఉండరు. అలాగే దేవుడు నీకేదైనా మేలు చేయగోరితే ఆయన అనుగ్రహాన్ని అడ్డుకోగలవారు కూడా ఎవరూ ఉండరు. ఆయన తన దాసులలో తాను తలచుకున్న వారికి తన అనుగ్రహభాగ్యం ప్రసాదిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు.” (105-107)
ప్రవక్తా! వారికిలా చెప్పు: “ప్రజాలారా! మీ ప్రభువు నుండి మీ దగ్గరకు సత్యం వచ్చింది. ఇకఎవరు సన్మార్గం అవలంబిస్తారో ఆ సన్మార్గం వారికే మేలు చేకూర్చుతుంది. మరెవరు మార్గభ్రష్టత్వంలోనే పడివుంటారో ఆ మార్గభ్రష్టత్వం వారికే చేటు తెస్తుంది. నేను మీపై పర్యవేక్షకునిగా లేను.” ప్రవక్తా! దివ్యావిష్కృతి ద్వారా నీదగ్గరకు పంపబడిన హితోపదేశం అనుసరిస్తూ ఉండు. దేవుడు (తుది)నిర్ణయం చేసేవరకు సహనం వహించు. ఆయనే అందరికన్నా మంచి నిర్ణయం చేసేవాడు. (108,109)