కురాన్ భావామృతం/అత్-తౌబా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

9. తౌబా (పశ్చాత్తాపం)
(అవతరణ: మదీనా; సూక్తులు: 129)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
మీరు ఒడంబడిక చేసుకున్న బహుదైవారాధకులకు దేవుని తరఫున, ఆయనప్రవక్త తరఫున ఒప్పందం నుండి (ఇలా) విముక్తి ప్రకటన (విన్పించు): “మీరిక దేశంలో నాలుగు నెలలు మాత్రమే (మీ ఇష్టానుసారం) సంచరించగలరు. గుర్తుంచు కోండి, మీరు దేవుని పట్టు నుండి ఏమాత్రం తప్పించుకోలేరు. సత్యతిరస్కారుల్ని దేవుడు తప్పనిసరిగా పరాభవం పాల్జేస్తాడు.” (1-2)
దేవుని వైపున, ఆయనప్రవక్త వైపున మహాహజ్‌ దినాన ప్రజలందరికీ ఓ బహిరంగ ప్రకటన (ఇది): “దేవుడు, ఆయనప్రవక్త (స) బహుదైవారాధకుల పట్ల విసుగెత్తిపోయారు. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపపడి క్షమాపణ కోరితే మీకే మంచిది. ఒకవేళ ముఖం తిప్పు కుంటే గుర్తుంచుకోండి, మీరు దేవుని పట్టునుండి ఏమాత్రం తప్పించుకోలేరు.”
ప్రవక్తా! సత్యతిరస్కారులకు అత్యంత కఠినశిక్ష పడుతుందని శుభవార్త విన్పించు! అయితే మీతో ఒడంబడిక చేసుకొని దాన్ని పాటించడంలో ఎలాంటి కొరత చేయక పోవడమే గాకుండా, మీకు వ్యతిరేకంగా మరెవరికీ ఎలాంటి సహాయం చేయని బహు దైవారాధకులకు ఈ హెచ్చరిక వర్తించదు. అలాంటివారి పట్ల మీరు కూడా ఒప్పందం గడువు ముగిసేదాకా నిజాయితీగా వ్యవహరించండి. దేవుడు (నిజాయితీతో మసలు కునే) దైవభీతి పరాయణులనే ప్రేమిస్తాడు. (3-4)
పవిత్ర మాసాలు (ప్రకటనలోని నాలుగు నెలల గడువుకాలం) ముగిసిపోగానే బహుదైవారాధకులను (యుద్ధంలో) ఎక్కడ ఎదురైతే అక్కడ వధించండి. వారిని పట్టు కోండి. చుట్టుముట్టండి. వారికోసం అనువైన ప్రతిచోటా మాటువేసి కూర్చోండి. ఒకవేళ వారు క్షమాపణ చెప్పుకొని నమాజ్‌, జకాత్‌ విధులు పాటించడం ప్రారంభిస్తే వారిని వదలిపెట్టండి. దేవుడు గొప్పక్షమాశీలి, అపార దయామయుడు. బహుదైవారాధకుల్లో ఎవరైనా (దైవవాణి వినేందుకు) మీదగ్గరికి రాదలచుకుంటే దైవవాణి వినేవరకు అతనికి ఆశ్రయం ఇవ్వండి. ఆతర్వాత అతడ్ని అతని భద్రతాస్థలానికి సురక్షితంగా చేర్చండి. వారు (సత్యం ఎరగని) జ్ఞానశూన్యులు. అంచేత మీరిలా చేయవలసిఉంటుంది. (5-6)
ఈ బహుదైవారాధకుల ఒడంబడిక దేవుని దగ్గర, ఆయనప్రవక్త దగ్గర ఎలా నిలు స్తుంది? కాని మీరు ప్రతిష్ఠాలయం వద్ద ఒప్పందం చేసుకున్న బహుదైవారాధకుల సంగతి వేరు. వారు మీపట్ల సవ్యంగా ఉన్నంతవరకు మీరూ వారిపట్ల సవ్యంగానే ఉండండి. దేవుడు భయభక్తులు కలవారినే ప్రేమిస్తాడు. వారు తప్ప ఇతర బహుదైవారా ధకులతో ఒప్పందం ఎలా సాధ్యమౌతుంది? మీమీద వారు పైచేయిగా ఉంటే మీ విష యంలో ఎలాంటి బంధుత్వాన్నీ ఖాతరుచేయరు. ఒప్పందాన్ని కూడా ఖాతరు చేయరు. వారు కేవలం మాటలతో మిమ్మల్ని తృప్తిపరచడానికి ప్రయత్నిస్తారు. వారి హృదయాలు మాత్రం వాటిని నిరాకరిస్తాయి. వారిలో చాలామంది దుర్జనులే ఉన్నారు. (7-8)
వారు దేవుని సూక్తులు స్వల్పమూల్యానికి అమ్ముకొని, ప్రజలను దైవమార్గంలోకి రాకుండా నిరోదిస్తూ చాలా చెడ్డపని చేస్తున్నారు. వారు విశ్వాసుల విషయంలో ఎలాంటి బంధుత్వంగాని, ఒప్పందం షరతులుగాని ఖాతరుచేయరు. అన్యాయం, అతిక్రమణలు ఎల్లప్పుడూ వారి వైపు నుండే మొదలవుతాయి. ఇప్పటికైనా వారు పశ్చాత్తాపం చెంది నమాజ్‌, జకాత్‌ విధులు పాటించడం ప్రారంభిస్తే వారు మీ ధార్మిక సోదరులవుతారు. వాస్తవికతను అర్థం చేసుకునేవారి కోసం మేము మాఆజ్ఞల్ని వివరిస్తున్నాం. (9-11)
ఒకవేళ వారు (దైవాజ్ఞల పాటింపు విషయంలో) ప్రమాణం చేసిన తరువాత, తమ ప్రమాణాలు భంగపరచి మీ ధర్మంపై దాడిచేయడానికి పూనుకుంటే, అలాంటి అధర్మ ధ్వజవాహకులతో యుద్ధం చేయండి. వారి ప్రమాణాలు ఇక ఎంతమాత్రం నమ్మదగినవి కావు. వారు బహుశా (ఖడ్గశక్తి ద్వారానే) దారికి వస్తారు. (12)
మరి మీరు ప్రమాణాలు భంగపరిచే వారితో పోరాడరా? వారు దైవప్రవక్తను దేశం నుండి తరిమివేశారే! అన్యాయం, అతిక్రమణలు కూడా వారే మొదట ప్రారంభించారు కదా! అలాంటి వారికి మీరు భయపడుతున్నారా? మీరు నిజమైన విశ్వాసులైతే దేవునికి మాత్రమే భయపడాలి. అందుకు ఆయనే అందరికన్నా ఎక్కువ అర్హుడు. కనుక వారితో పోరాడండి. దేవుడు మీ చేతులతో వారిని శిక్షించి అవమానం, అప్రతిష్ఠల పాల్జేస్తాడు. వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేస్తాడు. అంతేకాదు, విశ్వాసుల గుండెలలో మండుతున్న (ప్రతీకార) జ్వాలల్ని చల్లబరచి వారి హృదయాలకు శాంతీ సంతృప్తులు చేకూర్చుతాడు. ఇంకా తాను తలచినవారికి పశ్చాత్తాపం చెందే సద్బుద్ధి కూడా ప్రసా దిస్తాడు. దేవుడు సర్వజ్ఞాన సంపన్నుడు, మహా వివేకవంతుడు. (13-15)
ఏమిటీ, మిమ్మల్ని (పరీక్షించకుండా) ఇట్టే వదిలెయ్యడం జరుగుతుందని భావిస్తు న్నారా మీరు? మీలో (సత్యంకోసం) ప్రాణాలొడ్డి పోరాడే వారెవరో; దేవుడ్ని, దైవప్రవక్తను, విశ్వాసుల్ని తప్ప మరెవరినీ ప్రాణమిత్రులుగా చేసుకోని వారెవరో దేవుడు ఇంకా పరీక్షించనే లేదు. మీరు చేసేదంతా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (16)
అవిశ్వాసులు (తమ చేష్టల ద్వారా) అవిశ్వాసానికి అనుకూలంగా తమకుతామే సాక్ష్యమిచ్చుకున్నారు. వారు చేసుకున్న సత్కార్యాలన్నీ వ్యర్థమైపోయాయి. వారిక నరకం లోనే శాశ్వతంగా పడిఉంటారు. అలాంటివారు దైవగృహాలకు ధర్మకర్తలై కూర్చోవడం ఏమాత్రం తగదు. దేవుడ్ని, పరలోకాన్ని విశ్వసించినవారే దైవగృహాలకు సేవ చేయడానికి అర్హులవుతారు. వారు నమాజ్‌ స్థాపిస్తారు; జకాత్‌ చెల్లిస్తారు; దేవునికి తప్ప మరెవరికీ భయపడరు. అలాంటివారే సన్మార్గంలో నడుస్తారని ఆశ ఉంటుంది. (17-18)
హజ్‌ యాత్రికులకు నీళ్ళు సరఫరా చేసి, ప్రతిష్ఠాలయానికి సేవచేసే వ్యక్తీ; దేవుడ్ని, పరలోకాన్ని విశ్వసించి దైవమార్గంలో ప్రాణాలొడ్డి పోరాడే వ్యక్తీ- వీళ్ళిద్దరు ఒకటేనని మీరు భావిస్తున్నారా? దేవుని దృష్టిలో వారుభయులు సమానులు కారు. దేవుడు దుర్మార్గులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (19)
సత్యాన్ని విశ్వసించి దైవమార్గంలో ఇల్లూవాకిలి వదలి, (సత్యం కోసం) ధనప్రాణా లొడ్డి పోరాడేవారి స్థాయి మాత్రమే దేవుని దృష్టిలో విలువయినది. అలాంటివారి జీవితమే సార్థకమవుతుంది. వారి ప్రభువు వారికి తన కారుణ్యం, ప్రసన్నతా భాగ్యాలతో పాటు శాశ్వత సౌఖ్యాలతో కూడిన స్వర్గవనాలు ప్రసాదిస్తాడని శుభవార్త విన్పిస్తున్నాడు. ఆ స్వర్గవనాల్లోనే వారు కలకాలం (హాయిగా) ఉంటారు. (సన్మార్గగాములకు) ప్రతిఫలం ఇవ్వడానికి దేవుని దగ్గర అపార నిక్షేపాలు ఉన్నాయి. (20-22)
విశ్వాసులారా! మీ తండ్రులు, సోదరులు విశ్వాసానికి బదులు అవిశ్వాసానికే ప్రాధాన్యమిస్తే అలాంటివారిని కూడా స్నేహితులుగా (సన్నిహితులుగా) చేసుకోకండి. అలాంటివారిని స్నేహితులుగా చేసుకున్నవారే దుర్మార్గులు. (23)
ప్రవక్తా! వారికి చెప్పు: “మీ తండ్రులు, కొడుకులు, సోదరులు, భార్యలు, బంధు మిత్రులే గాక మీరు కూడబెట్టుకున్న ఆస్తులు, (సత్యాన్ని విశ్వసిస్తే) మందగించి పోతా యేమోనని మీరు భయపడుతున్న మీవ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీఇండ్లు- ఇవన్నీ మీకు దేవుని కంటే, ఆయన ప్రవక్త కంటే, ఆయన మార్గంలో జరిపే పోరాటం కంటే ఎక్కువ ప్రియమైనవయితే మీ గురించి దేవుని నిర్ణయం వచ్చేదాకా ఎదురుచూడండి. దుర్జనులకు దేవుడు ఎన్నటికీ సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదించడు.”
ఇంతకుపూర్వం దేవుడు మీకు అనేక సందర్భాల్లో సహాయం చేసివున్నాడు. ఈ మధ్యనే జరిగిన హునైన్‌ యుద్ధంలో కూడా చేశాడు. ఆరోజు మీరు మీ సంఖ్యాబలం చూసుకొని విర్రవీగారు. కాని మీ సంఖ్యాబలం మీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేక పోయింది. ఎంతో విశాలమైన భూమి మీకు ఇరుకయిపోయింది. మీరు వెన్నుజూపి పారిపోసాగారు. (24-25)
అప్పుడు దేవుడు తన ప్రవక్తకు, విశ్వాసులకు మనోనిబ్బరం ప్రసాదించాడు. మరో వైపు మీకు కన్పించని (దైవదూతల) సైన్యాన్ని కూడా దించి సత్యతిరస్కారుల్ని శిక్షించాడు. సత్యాన్ని తిరస్కరించేవారికి తగిన శాస్తి అదే. ఈ విధంగా సత్యతిరస్కారుల్ని శిక్షించిన తరువాత దేవుడు తాను తలచినవారికి పశ్చాత్తాంచెందే సద్బుద్ధి కూడా ప్రసా దించాడు. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (26-27)
విశ్వాసులారా! బహుదైవారాధకులు అపవిత్రులు గనక ఈ సంవత్సరం తర్వాత వారిని ప్రతిష్ఠాలయం దరిదాపులకు రానివ్వకండి. ఒకవేళ మీరు లేమికి గురవుతారని భయపడితే (అలా భయపడనవసరం లేదు.) దేవుడు తలిస్తే తన ప్రత్యేక అనుగ్రహంతో మిమ్మల్ని ధనికులుగా చేస్తాడు. దేవుడు సర్వజ్ఞాని, మహా వివేకవంతుడు. (28)
గ్రంథప్రజల్లో దేవుడ్ని, అంతిమదినాన్ని విశ్వసించనివారితో యుద్ధం చేయండి. దేవుడు, ఆయనప్రవక్త నిషేధించినవాటిని వారు నిషేధితాలుగా పరిగణించడంలేదు. సత్యధర్మాన్ని తమ జీవనధర్మంగా చేసుకోవడంలేదు. కనుక వారు మీకు పూర్తిగా లొంగి పోయి తమ చేతులారా జిజ్యా చెల్లించనంతవరకూ వారితో పోరాడండి. (29)
యూదులు ఉజైర్‌ని దేవుని కుమారుడంటారు. అలాగే క్రైస్తవులు కూడా మసీహ్‌ని దేవుని కుమారుడంటారు. ఇవన్నీ వారు తమ నోటికొచ్చినట్లు పలుకుతున్న నిరాధార మైన మాటలు మాత్రమే. గతంలో సత్యాన్ని తిరస్కరించినవారు ఎలాంటి పలుకులు పలికేవారో, వీరు కూడా వారిని అనుకరిస్తూ అలాంటి నిరాధారమైన పలుకులే పలుకు తున్నారు. దేవుడు వారిని నాశనం చెయ్య, ఎలా మోసపోతున్నారు వారు! (30)
వారు నిజదేవుడ్ని వదలి తమ ధర్మవేత్తలు, సాధువులను దేవుళ్ళుగా, ప్రభువులుగా చేసుకున్నారు. అలాగే మర్యం కుమారుడు మసీహ్‌ని కూడా. కాని ఏకైక దేవుడ్ని తప్ప మరెవరినీ ఆరాధించకూడదని వారికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయన తప్ప మరెవరూ ఆరాధనకు, దాస్యానికి అర్హులు కారు. వారు కల్పించుకున్న బహుదైవారాధనా భావా లకు, పలుకులకు ఆయన ఎంతో అతీతుడు, పవిత్రుడు. (31)
వారు తమ నోటితో దేవుని జ్యోతి (సత్యధర్మం) ఆర్పివేయ గోరుతున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత వెగటు కలిగినా దేవుడు మాత్రం తన జ్యోతిని నేల నాలుగు చెరగులా ప్రసరింపజేయనిదే వదలిపెట్టడు. సత్యధర్మం బహుదైవారాధకులకు ఏమాత్రం నచ్చక పోయినాసరే ఇది యావత్తు జీవనవ్యవస్థలపై ఆధిక్యత పొందడానికి ఆ దేవుడే తన (అంతిమ) ప్రవక్తకు సత్యాన్ని, హితబోధను ఇచ్చి పంపాడు. (32-33)
విశ్వాసులారా! గ్రంథప్రజలకు చెందిన ధర్మవేత్తలు, సాధువులలో అనేకమంది అక్రమ పద్ధతుల ద్వారా ప్రజల ధనాన్ని కాజేస్తున్నారు. పైగా వారిని దైవమార్గంలోకి రాకుండా నిరోధిస్తున్నారు. వెండిబంగారాలు కూడబెట్టి వాటిని దైవమార్గంలో విని యోగించని పిసినారులకు దుర్భరయాతన కాచుకొని ఉందని శుభవార్త విన్పించు! ఆ వెండిబంగారాలనే నరకాగ్నిలో బాగా కాల్చి వారి నుదుళ్ళపై, పక్కలపై, వీపులపై వాతలు పెట్టే రోజు (త్వరలోనే) వస్తుంది. “ఇవే మీరు కూడ బెట్టుకున్న సిరిసంపదలు, ఇక వీటిని చవిచూడండి” (అని అప్పుడు వారికి చెప్పబడుతుంది). (34-35)
దేవుడు భూమ్యాకాశాలను సృష్టించిన నాటినుండి నెలల సంఖ్య ఆయన నిర్దేశించిన నియామకం (అదృష్టం) ప్రకారం పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు పవిత్ర మాసాలు. ఇదే సరైన పద్ధతి. కనుక ఈ నాలుగు నెలలు మీరు ఆత్మవంచనకు పాల్పడకుండా అందరూ కలసి బహుదైవారాధకులతో పోరాడండి. వారు కలసికట్టుగా మీతో ఎలా పోరాడుతున్నారో మీరూ సమైక్యమయి సంఘటిత శక్తితో వారిని ఎదు ర్కోండి. గుర్తుంచుకోండి, భయభక్తులు కలవారినే దేవుడు ప్రేమిస్తాడు. (36)
మాసమార్పిడి పద్ధతి అవిశ్వాసానికి అదనంగా మరొక అవిశ్వాస చేష్టవుతుంది. దానిద్వారా బహుదైవారాధకులు (మరింత) మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నారు. దేవుడు నిషేధించిన నెలల సంఖ్య పూర్తవడానికి, ఆ నెలలు ధర్మసమ్మతం కావడానికి వారు ఒకయేడు ఒక నెలను ధర్మసమ్మతం చేసుకొని మరొక యేడు దాన్ని నిషేధించు కుంటారు. (ఇలా)వారి దుష్కృత్యాలు వారికి పుణ్యకార్యాలుగా తోచేటట్లు చేయబడ్డాయి. దేవుడు (అలాంటి) సత్యతిరస్కారులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (37)
విశ్వాసులారా! ఏమైంది మీకు, దైవమార్గంలో (పోరాడేందుకు) బయలుదేరమంటే నేలకు అతుక్కుపోతున్నారు? మీరు పరలోకానికి బదులు ప్రాపంచిక జీవితాన్నే ఎక్కు వగా ప్రేమిస్తున్నారా? కాని పరలోక (సుఖ)జీవనం ముందు ప్రాపంచిక జీవితసౌఖ్యం మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. ఏమైనప్పటికీ ఈపనికి మీరు ఉపక్రమించకపోతే దేవుడు మీకు వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు. ఆ తరువాత మీ స్థానంలో మరోజాతిని (ఈపని కోసం) ఆవిర్భజేస్తాడు. మీరు దేవునికి ఎలాంటి నష్టం కలగజేయలేరు. ఆయన ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (38-39)
మీరు దైవప్రవక్తకు తోడ్పడనంత మాత్రాన ముంచుకొచ్చే ప్రమాదమేదీ లేదు. సత్య తిరస్కారులు అతడ్ని (మక్కానుండి) వెళ్ళగొట్టిన కిష్టపరిస్థితిలో సైతం దేవుడు అతడ్ని ఆదుకున్నాడు. అప్పుడతను కేవలం ఇద్దరిలో ఒకడిగా ఉన్నాడు. వారిద్దరు కొండగుహలో దాక్కున్నప్పుడు అతను తన సహచరునితో “విచారపడకు, దేవుడు మనకు తోడున్నాడ”ని అన్నాడు. అప్పుడు దేవుడు అతనికి మనోనిబ్బరం ప్రసాదించాడు. అంతేకాదు, మీకు కన్పించని సైన్యాలద్వారా కూడా అతనికి సహాయంచేసి అవిశ్వాసుల వాణిని (ప్రయత్నా లను) వమ్ముచేశాడు. దేవుని వాణి మాత్రం సర్వదా సర్వోన్నతమైనదే. దేవుడు మహా శక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడు. (40)
కనుక (ఇకనైనా) బయలుదేరండి తేలికగానైనా, భారంగానైనా దైవమార్గంలో ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు విషయం గ్రహిస్తే అందులోనే మీ శ్రేయస్సు ఉంది. (41)
ముహమ్మద్‌ (స)! ప్రయోజనం సులభసాధ్యమై, ప్రయాణం తేలిగ్గా ఉంటే కపట విశ్వాసులు తప్పక నీవెంట రావడానికి అంగీకరించి ఉండేవారు. కాని వారికా మార్గం చాలా కఠినమైపోయింది. వారిప్పుడు దేవునిపై ప్రమాణంచేస్తూ, తాము రాగల స్థితిలో ఉంటే తప్పక మీవెంట వచ్చేవాళ్ళమని చెబుతారు. (ఈవిధంగా) వారు ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. వారు పచ్చి అబద్ధాలకోరులని దేవునికి బాగా తెలుసు. (42)
ప్రవక్తా! దేవుడు నిన్ను క్షమించుగాక. నీవు వారికి ఎందుకు అనుమతి నిచ్చావు? (ఇవ్వకుంటే) ఎవరు సత్యవంతులో, ఎవరు అబద్ధాలకోరులో నీకూ తెలిసిఉండేది. దేవుడ్ని, అంతిమదినాన్ని విశ్వసించేవారు తమ ధనప్రాణాలతో పోరాడకుండా (ఇంట్లో కూర్చోనీయవలసిందిగా) ఎన్నడూ నిన్ను సెలవు అడగరు. దైవభీతి పరాయణులు ఎలాంటి వారో దేవునికి బాగా తెలుసు. దేవుడ్ని, అంతిమదినాన్ని మనస్ఫూర్తిగా నమ్మని వారే ఇలాంటి విజ్ఞప్తులు చేసుకుంటారు. వారి హృదయాల్లో అనుమాన రోగం ఉంది. ఆ అనుమానంతోనే వారు సతమతమయి పోతున్నారు. (43-45)
వారికి నిజంగా (యుద్ధానికి) బయలుదేరాలన్న ఉద్దేశ్యముంటే దానికోసం వారు సన్నాహాలు చేసుకునేవారు. కాని వారు బయలుదేరడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన వారిని బద్ధకస్తులుగా చేశాడు. “(ఇంట్లో) కూర్చుండి పోయేవారితో పాటు మీరూ కూర్చోండ”ని వారికి చెప్పడం జరిగింది.
ఒకవేళ వారు మీతోపాటు బయలుదేరి ఉంటే మీకు లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెట్టేవారు. పైగా వారు మీమధ్య కలహాలు సృష్టించడానిక్కూడా తీవ్రంగా ప్రయత్నించే వారు. మీలో ఇప్పటికీ కొందరు వారి మాటలు చెవియొగ్గి వినేవారున్నారు. దేవునికి దుర్మార్గుల సంగతి బాగా తెలుసు. (46-47)
ఇంతకు పూర్వం కూడా వారు కలహాలు సృష్టించాడానికి ప్రయత్నించారు. నీ పని విఫలం చేయడానికి వారు రకరకాల పన్నాగాలు పన్ని చూసుకున్నారు. చివరికి వారి అభిమతానికి వ్యతిరేకంగా సత్యం వచ్చి దేవుని పనే నెరవేరింది. (48)
వారిలో ఒకడు “నాకు (ఇంట్లో ఉండిపోవడానికి) అనుమతివ్వండి. (అనవ సరంగా) నన్ను మనోవికారానికి గురిచేయకండి” అంటాడు. విను, వారు మనోవికారం లోనే పడిఉన్నారు. ఇలాంటి అవిశ్వాసులకు నరకం చుట్టిముట్టి ఉంది. (49)
మీకు మేలు జరిగితే అది వారికి బాధగా పరిణమిస్తుంది. మీకేదయినా ఆపద వచ్చిపడితే వారు తెగ సంబరపడిపోతూ “మనం ముందే జాగ్రత్త పడటం చాలా మంచిదయి పోయింది” అంటూ వెళ్ళిపోతారు. (ప్రవక్తా!) వారికి చెప్పు: “దేవుడు మా అదృష్టంలో రాసింది తప్ప (కీడుగాని, మేలుగాని) మాకేదీ జరగదు. ఆయనే మా సంరక్షకుడు, సహాయకుడు. విశ్వాసులు ఆయన్నే నమ్ముకుంటారు.” (50-51)
వారిని ఇలా అడుగు: “రెండు మేళ్ళలో ఒక మేలును గురించే కదా మీరు మా విషయంలో ఎదురుచూస్తున్నది? కాని మీ విషయంలో మేము ఎదురుచూస్తున్న సంగతి (వేరు). మిమ్మల్ని స్వయంగా దేవుడయినా శిక్షించాలి లేదా మా చేతనయినా శిక్షింపజేయాలి. దీన్ని గురించే మేము ఎదురుచూస్తున్నాము. కనుక (ఆ సమయం కోసం) మీరూ ఎదురుచూడండి, మీతోపాటు మేమూ ఎదురుచూస్తాము.” (52)
చెప్పు: “మీరు మీ ధనాన్ని (దైవమార్గంలో) సంతోషంగా ఇచ్చినా, లేక అయిష్టంగా ఇచ్చినా ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని స్వీకరించడం జరగదు. మీరు పరమదుర్మార్గులు.”
వారిచ్చే ధనం స్వీకరించకపోవడానికి కారణం- వారు దేవునిపట్ల, ప్రవక్తపట్ల తిర స్కారవైఖరి అవలంబించారు. ప్రార్థన చేయడానికి లేస్తే వళ్ళు విరుచుకుంటూ చాలా బద్ధకంతో లేస్తారు. దైవమార్గంలో డబ్బు ఖర్చుపెట్ట వలసివస్తే ఏడ్పుగొట్టు ముఖంతో చాలా అయిష్టంగా ఖర్చుపెడతారు. కనుక (విశ్వాసులారా!) వారి సంతానం, సిరిసంప దలు చూసి ఆశ్చర్యపోకండి. వాటి ద్వారా దేవుడు వారిని ఇహలోక జీవితంలోనే శిక్షించ గోరుతున్నాడు. వారు ప్రాణాలు వదలినా అవిశ్వాస స్థితిలోనే వదలుతారు. (53-55)
వారు దేవునిపేరుతో ప్రమాణాలు చేస్తూ తాము మీలోని వాళ్ళమేనంటారు. కాని వారు మీలోనివాళ్లు కానేకారు. వారసలు పిరికిపందలు, భయస్తులు. (బాధ్యతల నుండి తప్పించుకోడానికి) వారికేదైనా ఆశ్రయంగాని, కొండగుహగాని లేదా దూరికూర్చునే ఓ చిన్న బిలంగాని దొరికితే చాలు, వెంటనే వారు పరుగెత్తికెళ్ళి అందులో దాక్కుంటారు#
ముహమ్మద్‌ (స)! వారిలో కొందరు (జకాత్‌) దానధర్మాల విషయంలో నీమీద లేనిపోని నిందారోపణలు మోపుతున్నారు. అందులో కొంత ధనం ఇస్తే సంతోషిస్తారు. ఇవ్వకపోతే ముఖం మాడ్చుకుంటారు. దేవుడు, దైవప్రవక్త ఇచ్చిన దాంతో వారు తృప్తి చెంది “మాకు దేవుడే చాలు, ఆయన తన అనుగ్రహంతో మాకు మరింత భాగ్యం ప్రసాదిస్తాడు. ఆయన ప్రవక్త కూడా మాకు ప్రసాదిస్తాడు. మేము దేవుని మీదే మాదృష్టి కేంద్రీకరించి ఉన్నాము” అని అంటే ఎంత బాగుంటుంది! (56-59)
అసలీ దానధర్మాలు (జకాత్‌) అగత్యపరులకు-1, ఆత్మాభిమానులైన నిరుపేద లకు-2, వాటిని వసూలుచేసే ఉద్యోగుల కోసం-3, హృదయాలు చూరగొనడానికి-4, బానిసల విముక్తికి-5, రుణగ్రస్తుల రుణభారం తగ్గించడానికి-6, దైవమార్గంలో వినియోగించడానికి-7, (నిర్ధనులైన) బాటసారులకు-8 మాత్రమే కేటాయించబడ్డాయి. ఇది దేవుడు నిర్ణయించిన విధి. దేవుడు సర్వంఎరిగినవాడు, మహా వివేకవంతుడు. (60)
వారిలో కొందరు దైవప్రవక్త మనస్సు నొప్పించేవారు కూడా ఉన్నారు. వారు (దైవ ప్రవక్త గురించి) “ఈ మనిషి ప్రతి ఒక్కడూ చెప్పే మాటలు వింటాడు” అనంటారు. అతను మీ శ్రేయస్సు కోసం ఇలా చేస్తున్నాడు. ఇంకా దేవుడ్ని విశ్వసిస్తున్నాడు. విశ్వ సించినవారి పట్ల నమ్మకం ఉంచుతున్నాడు. మీలో విశ్వసించినవారి పాలిట అతను కారుణ్యమూర్తి. (అలాంటి) దైవప్రవక్తను బాధించేవారికి దుర్భరశిక్ష తప్పదు. (61)
వారు మిమ్మల్ని తృప్తి పరచడానికి ఏవేవో ప్రమాణాలు చేస్తారు. కాని వారు (చిత్త శుద్ధిగల) విశ్వాసులైతే తృప్తి పరచడానికి దేవుడు, దైవప్రవక్తలే ఎక్కువ అర్హులు. దేవుడ్ని, ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారికి నరకాగ్నే గతి అని వారికి తెలియదా? అందులోనే వారు శాశ్వతంగా పడివుంటారు. ఇది అత్యంత అవమానకరమైన శిక్ష. (62-63)
ఈ కపటులు తమ మనసులో దాగిన రహస్యాల్ని బట్టబయలుచేసే అధ్యాయం ఏదైనా అవతరిస్తుందేమోనని భయపడుతున్నారు. ప్రవక్తా! వారికిలా చెప్పు: “మీరు అలాగే అపహాస్యం చేస్తూ ఉండండి. మీరు భయపడుతున్న విషయాలను దేవుడు త్వరలోనే బట్టబయలు చేస్తాడు.” (64)
మీరు మాట్లాడుతున్నదేమిటని అడిగితే “మేమేదో పరిహాసంగా అంటున్నాము” అంటారు వారు. వారికి చెప్పు: “మీరు దేవునితో, ఆయన సూక్తులతో, ఆయన ప్రవక్త తోనా పరిహాసమాడేది? ఇకనైనా సాకులు చెప్పడం మానుకోండి. మీరు సత్యాన్ని విశ్వ సించిన తర్వాత తిరస్కార వైఖరి అవలంబించారు. మేము మీలో కొందరిని క్షమించినా మిగిలినవారిని మాత్రం తప్పకుండా శిక్షిస్తాం. వారు పరమ దుర్మార్గులు. (65-66)
కపటపురుషులు, కపటస్త్రీలు అంతా ఒకే కోవకు చెందిన తోడుదొంగలు. వారు (ప్రజలకు) చెడువిషయాల్ని గురించి ఆదేశిస్తారు. మంచివిషయాల నుంచి నిరోధిస్తారు. వారు సత్కార్యాలు చేయకుండా తమ చేతులు కట్టివేసుకున్నారు. వారసలు దేవుడ్నే విస్మరించారు. అంచేత దేవుడు కూడా వారిని విస్మరించాడు. కపటులు పరమ దుర్మా ర్గులు. కపట స్త్రీపురుషులకు, అవిశ్వాసులకు నరకాగ్ని సిద్ధపరచి ఉంచానని, అందు లోనే వారు ఎల్లకాలం పడిఉంటారని దేవుడు వారికి వాగ్దానంచేశాడు. అదే వారికి తగిన శిక్ష. దేవుడు వారిని నాశనం చెయ్య! వారికి శాశ్వతయాతన తప్పదు. (67-68)
(కపటులారా!) మీ తీరుతెన్నులన్నీ అచ్చం మీకు పూర్వముండిన కపటవిశ్వాసుల తీరుతెన్నుల్లాగే ఉన్నాయి. వారు మీకంటే ఎక్కువ బలవంతులు, ఎక్కువ సంతానం సిరిసంపదలు కలవారు. కాని వారు (మా ఉపదేశాలు పెడచెవిన పెట్టి) తమవంతు సౌఖ్యాలు బాగా జుర్రుకున్నారు. వారిలాగే ఇప్పుడు మీరూ మీవంతు సౌఖ్యాలు జుర్రు కోండి. గతంలో వారు ఎలా పనికిమాలిన వాదనల్లో పడిపోయారో మీరూ అలాగే పనికి మాలిన వాదనల్లో పడిపోయారు. చివరికి వారు చేసుకున్న కర్మలన్నీ ఇటు ఇహలోకం లోనూ, అటు పరలోకంలోనూ వ్యర్థమైపోయాయి. అలాంటివారే నష్టపోయేవారు. (69)
ఈ కపటులకు వారి పూర్వీకుల చరిత్ర తెలియదా? నూహ్‌, ఆద్‌, సమూద్‌, ఇబ్రా హీం జాతులు, మద్‌యన్‌ ప్రజలు, తలక్రిందులుగా కుదిపేసి ధ్వంసం చేయబడిన పట్టణవాసులు? వారి ప్రవక్తలు వారిదగ్గరకు స్పష్టమైన సూచనలు తీసుకొచ్చారు. (కాని వారు పెడమార్గమే పట్టిపోయారు.) దేవుడు వారికి అన్యాయం చేయలేదు. ఆయన అలాంటివాడు కాదు. వారే తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నారు. (70)
విశ్వసించిన స్త్రీ పురుషులంతా ఒకరికొకరు స్నేహితులు, శ్రేయోభిలాషులు. వారు (ప్రజలకు) మంచివిషయాలు బోధిస్తారు. చెడువిషయాల నుండి వారిస్తారు. నమాజ్‌ (వ్యవస్థ) స్థాపిస్తారు. (పేదల ఆర్థికహక్కు) జకాత్‌ నెరవేరుస్తారు. దేవుని పట్ల, ఆయన ప్రవక్త పట్ల వినయవిధేయతలతో మసలుకుంటారు. వీరిపైన్నే దైవకారుణ్యం వర్షిస్తుంది. దేవుడు సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. (71)
విశ్వాసులైన ఈ స్త్రీపురుషుల కోసం సెలయేరులు పారే స్వర్గవనాలున్నాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అక్కడే వారు కలకాలం (హాయిగా) ఉంటారు. నిత్యం కళకళలాడే ఆ స్వర్గవనాలలో వారికోసం అందమైన గృహాలుంటాయి. అన్నిటికీ మించి దైవప్రసన్నతా భాగ్యం లభిస్తుంది. అదే గొప్పవిజయం, పరమమోక్షం. (72)
ప్రవక్తా(స)! అవిశ్వాసులతో, కపటులతో పోరాడండి. వారిపట్ల కఠినంగా వ్యవహ రించండి. వారి నివాసం నరకం. అది పరమ చెడ్డస్థలం. వారు దేవుని మీద ప్రమాణం చేస్తూ తామా మాట అనలేదని అంటున్నారు. కాని వారా అవిశ్వాసపు మాటన్నారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత (ఇలాంటి వికృతచేష్టలతో) తిరిగి అవిశ్వాసానికి పాల్పడ్డారు. వారు (ప్రవక్తకు వ్యతిరేకంగా) ఏదో చేయాలనుకున్నారు. కాని చేయలేకపోయారు.
అసలు వారి కసి-కోపం దేవుడు, ఆయన ప్రవక్త తమ అనుగ్రహంతో వారిని ఐశ్వర్యవంతులుగా చేశారనేనా? ఇప్పటికైనా వారు తమవైఖరి మార్చుకుంటే (మంచిది). అందులోనే వారి శ్రేయస్సుంది. వారు తమ వైఖరి మార్చుకోకపోతే మాత్రం దేవుడు వారికి అతి బాధాకరమైన శిక్ష విధిస్తాడు- ఇహంలోనూ, పరంలోనూ. యావత్ప్రపంచంలో వారికి మద్దతిచ్చేవారు, సహాయం చేసేవారు ఎవరూ ఉండరు. (73-74)
వారిలో కొందరు “దేవుడు తన అనుగ్రహంతో తమకు సిరిసంపదలు ప్రసాదిస్తే తాము (ఉదారంగా) దానధర్మాలు చేస్తామని, సజ్జనులైఉంటామ”ని ప్రమాణం చేశారు. కాని దేవుడు తన అనుగ్రహంతో వారిని ధనికులుగా చేయగానే వారు పిసినారితనం వహించారు. వారు తమ ప్రమాణాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా భంగపరిచారు. ఈవిధంగా వారు దేవుని విషయంలో వాగ్దానభంగానికి పాల్పడటం వల్ల, వారు పలుకు తున్న అబద్ధాల వల్ల దేవుడు వారి హృదయాల్లో కాపట్యం జనింపజేశాడు. వారు దేవుని సన్నిధిలో ప్రవేశపెట్టబడేవరకు ఈ కాపట్యజాడ్యం వారిని వదలదు. (75-77)
వారి గుసగుసలు, రహస్య సమాలోచనలు, వారి హృదయాల్లో మెదిలే ఊహలు సైతం దేవునికి తెలియవని వారు భావిస్తున్నారా? ఆయనకు అగోచర విషయాలు తెలియవని అనుకుంటున్నారా? (ఈ పిసినారులు) మనస్ఫూర్తిగా విశ్వాసులు చేస్తున్న ధనత్యాగాల్ని గురించి ఎత్తి పొడుస్తూ మాట్లాడుతున్నారు. కష్టపడి చెమటోడ్చి ఎంతోకొంత దైవమార్గంలో దానమిస్తున్న (పేద) విశ్వాసుల్ని ఎగతాళిచేస్తున్నారు. (అలా ఎకసక్కెం, ఎగతాళిచేస్తున్న ఈ పిసినారుల సంగతి దేవునికి బాగా తెలుసు.) అసలు దేవుడే వారిని ఎగతాళి చేస్తున్నాడు. వారికోసం దుర్భరమైన యాతన కాచుకొని ఉంది. (78-79)
ప్రవక్తా! ఇలాంటివారిని క్షమించమని నీవు విజ్ఞప్తి చేసినా, చేయకపోయినా ఒకటే. పైగా నీవు వారిని క్షమించమని డెబ్భైసార్లు మొరపెట్టుకున్నా దేవుడు వారిని ఎన్నటికీ క్షమించడు. వారు దేవుడ్ని, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. అలాంటి దుర్మార్గులకు దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (80)
(యుద్ధానికి పోకుండా) వెనకుండిపోయినవారు దైవప్రవక్తకు సహకరించకుండా ఇంట్లో ఉండి పోయామనుకుంటూ సంబరపడ్డారు. దైవమార్గంలో ధనప్రాణాలొడ్డి పోరాడటం వారికి ఇష్టం లేదు. పైగా వారు ప్రజలతో “ఇంత తీవ్రమైన వేసవివేడిలో బయలుదేరకండి” అన్నారు. “నరకాగ్ని వేడి ఇంతకంటే తీవ్రంగా ఉంటుంద”ని చెప్పు. వారీ విషయం గ్రహిస్తే ఎంత బాగుంటుంది! ఇప్పుడు వారు (తమ నిర్వాకం పట్ల) నవ్వు కుంటే నవ్వుకోని. చివరకు వారు తమ దుష్కార్యాల ఫలితంగా పరలోకంలో హృదయ విదారకంగా రోదిస్తారు. (81-82)
దేవుడు నిన్ను (యుద్ధరంగం నుండి) తిరిగి వారి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, వారు నిన్ను యుద్ధానికి బయలుదేరేందుకు అనుమతి అడిగితే వారికిలా చెప్పు: “మీరు నావెంట బయలుదేరడానికి వీల్లేదు. నాతో కలసి శత్రువులతో పోరాడటానికి కూడా వీల్లేదు. మీరు ఇంతకుముందు కూర్చుండి పోవడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడూ మీరు ఇంట్లో కూర్చుండిపోయే (ఆడ)వారితో కలసి కూర్చొనే ఉండండి.” (83)
ఇకముందు వారిలో ఎవరైనా చనిపోతే, నీవు వారికోసం శవప్రార్థన చేయకు; వారి సమాధుల వద్ద కూడా నిల్చోవద్దు. వారు దేవుడ్ని, ఆయన ప్రవక్తను తిరస్కరించారు. వారు చనిపోయినా దుర్మార్గస్థితిలోనే చనిపోతారు. వారి సంతానం-సిరిసంపదలు నిన్ను మోసగించకూడదు సుమా! సంతానం, సిరిసంపదల ద్వారా దేవుడు వారిని ఇహలోకం లో శిక్షించాలని, అవిశ్వాస స్థితిలోనే వారి ప్రాణాలు పోవాలని నిర్ణయించాడు. (84-85)
దేవుడ్ని విశ్వసించి ఆయనప్రవక్తతో కలసి దైవమార్గంలో పోరాడండని ఆదేశించే అధ్యాయం ఏదైనా అవతరిస్తే, ఇకచూడు వారి పరిస్థితి! వారిలో శక్తిసామర్థ్యాలున్న వారు కూడా నీ దగ్గరకొచ్చి యుద్ధంలో పాల్గొనకుండా ఉండేందుకు తమకు అనుమతి వ్వమని మనవి చేసుకుంటారు. వారు (సిగ్గువిడిచి) “మమ్మల్ని వదలి పెట్టండి, మేము ఇంట్లోఉండిపోయేవారితో పాటుంటాం” అనంటారు. ఇలా వారు (గాజులు తొడుక్కొని) ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళతో పాటు ఉండటానికే ఇష్టపడ్డారు. వారి హృదయకవాటాలు మూసివేయబడ్డాయి. అంచేత ఇక వారికి ఏదిచెప్పినా తల కెక్కదు. (86-87)
దీనికి భిన్నంగా దైవప్రవక్త, అతనితోపాటు విశ్వాసులు తమ ధనప్రాణాలు ధార పోసి దైవమార్గంలో పోరాడారు. కనుక సమస్త శ్రేయాలు ఇప్పుడు వారికే లభిస్తాయి. వారే ముక్తీ మోక్షాలు పొందేవారు. దేవుడు వారికోసం (చల్లటి) సెలయేరులు ప్రవ హించే స్వర్గవనాలు సిద్ధపరచి ఉంచాడు. ఆ స్వర్గవనాల్లో వారు కలకాలం (హాయిగా) ఉంటారు. ఇదే అద్భుతమైన సాఫల్యం, సంసిద్ధి అంటే. (88-89)
పల్లెవాసుల్లో కూడా చాలామంది తమను ఇంట్లో ఉండిపోవడానికి ఆనుమతించ మని సాకులు చెప్పడానికి వచ్చారు. ఈవిధంగా దేవుడ్ని, ఆయన ప్రవక్తను విశ్వసించా మని అసత్య ప్రమాణం చేసినవారంతా ఇంట్లో కూర్చుండిపోయారు. ఈ పల్లెవాసుల్లో సత్యాన్ని తిరస్కరించినవారు త్వరలోనే దుర్భర శిక్షకు గురవుతారు. (90)
వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, యుద్ధంలో పాల్గొనేందుకు తగిన సాధనసంపత్తి లేని వారు ఇండ్లలో ఉండిపోతే తప్పులేదు. అయితే వారు చిత్తశుద్ధితో పాటు దేవునిపట్ల, ఆయనప్రవక్త పట్ల నిజాయితి, నమ్మకం కలిగినవారైఉండాలి. అలాంటి సజ్జనుల విష యంలో ఎలాంటి అభ్యంతరం లేదు. దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు. (91)
అలాగే నీ దగ్గరకు వచ్చి వాహన సౌకర్యం కల్పించమని మనవి చేసుకున్నవారి విషయంలో కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు. వారి విజ్ఞప్తికి సమాధానంగా “మీకు నేను వాహన సౌకర్యాలు కల్పించలేను” అన్నావు నీవు. అప్పుడు వారు గత్యంతరంలేక అశ్రుపూరిత నయనాలతో వెళ్ళిపోయారు. సొంత ఒనరులతో ధర్మపోరాటంలో పాల్గొనే భాగ్యం తమకు లేకపోయిందే అని వారు ఎంతగానో బాధపడ్డారు. (92)
కాని ధనికులైఉండి కూడా తాము యుద్ధంలో పాల్గోలేమని, తమను క్షమించి విడిచిపెట్టమని నిన్ను మనవి చేసుకున్నవారి విషయంలోనే ఆక్షేపణ ఉంది. వారు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళతో పాటు ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. వారి హృదయ కవాటాలు మూసివేయబడ్డాయి. అందువల్ల వారికిక ఏది చెప్పినా తలకెక్కదు. (93)
మీరు (యుద్ధం నుండి) తిరిగొచ్చిన తర్వాత వారు రకరకాల సాకులు చెబుతారు. వారికిలా చెప్పు: “సాకులు చెప్పకండి. మేమిప్పుడు మీరు చెప్పే ఏమాటా నమ్మలేము. మీసంగతి మాకు దేవుడు తెలియజేశాడు. (మీ అసలురంగు బయట పడింది) దేవుడు, ఆయనప్రవక్త మీ తీరుతెన్నుల్ని (మరికొంత కాలం) గమనిస్తారు. ఆ తర్వాత మీరు అంతర్బాహ్యాలన్నీ ఎరిగిన దేవుని వైపు మరలించబడతారు. అప్పుడాయన మీరు (ఇహలోకంలో) ఏమేమి చేస్తుండేవారో మీకు తెలియజేస్తాడు.” (94)
మీరు (యుద్ధం నుండి) తిరిగొచ్చిన తర్వాత వారు నీ దగ్గరికి వచ్చి, నీవు దయ దలచి క్షమిస్తావని దేవుని మీద ప్రమాణం చేసి మరీ రకరకాల సాకులు చెబుతారు. అయితే నీవు వారివైపు కన్నెత్తి కూడా చూడకు. వారు అపవిత్రులు. వారి అసలు స్థానం నరకం. వారి దుష్టసంపాదనకు ప్రతిఫలంగా అదే వారికి లభించే మహాభాగ్యం! నీవు వారి పట్ల తృప్తిపడతావని వారు నీ దగ్గరకొచ్చి ప్రమాణాలు చేస్తారు. కాని నీవు వారిపట్ల తృప్తిచెందినా దేవుడు మాత్రం ఆ దుర్మార్గులపట్ల ఎన్నటికీ తృప్తిచెందడు. (95-96)
గ్రామీణులు అవిశ్వాసం, కాపట్యాలలో చాలా కఠినులు. దేవుడు తన ప్రవక్తపై అవతరింపజేసిన ధర్మం గురించి, దాని పరిధుల్ని గురించి వారికి బొత్తిగా తెలియదనే చెప్పాలి. దేవుడు సర్వజ్ఞాని, మహా వివేకవంతుడు. (97)
ఆ గ్రామీణులలో కొందరు దైవమార్గంలో ఖర్చుపెట్టేవారు ఉన్నప్పటికీ, దాన్ని వారు తమపై బలవంతంగా రుద్దే (సుంకం) వ్యవహారంగా భావిస్తున్నారు. అదీగాక నీ విషయంలో వారు పరిస్థితుల మార్పుకోసం నిరీక్షిస్తున్నారు. (నీవేదైనా ఆపదలో చిక్కు కుంటే సత్యాన్ని వదలి ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని వారు సమయం కోసం కాచు కొనిఉన్నారు.) కాని వారు పాపపంకిలమనే ఘోరమైన ఆపదలో చిక్కుకొని ఉన్నారు. దేవుడు సమస్త విషయాలు వింటున్నాడు, ఆయన సర్వం ఎరిగినవాడు. (98)
ఆ గ్రామీణులలోనే మరికొందరు దేవుడ్ని, అంతిమదినాన్ని మనస్ఫూర్తిగా విశ్వసి స్తున్నారు. తాము ఖర్చుపెట్టే ధనంవల్ల దైవసాన్నిధ్యం లభిస్తుందని, తమ శ్రేయస్సు కోసం దైవప్రవక్త ప్రార్థన చేస్తాడని భావిస్తున్నారు. నిజమే, అది వారికోసం తప్పకుండా (దైవ)సాన్నిధ్యానికి కారణమవుతుంది. దేవుడు తప్పకుండా వారిని తన కారుణ్యఛాయ లోకి తీసుకుంటాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అనంత కరుణామయుడు. (99)
అందరికంటే ముందు (ఇస్లాంస్వీకారంలో) ముందంజవేసిన ముహాజిర్లు, అన్సార్ల పట్ల, ఆతర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన ఇతరుల పట్ల దేవుడు ప్రసన్నుడ య్యాడు. వారు దేవుని పట్ల సంతసించారు. వారికోసం దేవుడు సెలయేరులు పారే తోటలు సిద్ధపరచాడు. వారక్కడ కలకాలం ఉంటారు. ఇదే ఘనవిజయం. (100)
నీ చుట్టుపక్కల ఉండే పల్లెవాసుల్లో చాలామంది కపటులే ఉన్నారు. అలాగే మదీనావాసుల్లో కూడా కపటులు ఉన్నారు. వారు కాపట్యపు ఊబిలో పూర్తిగా కూరుకు పోయారు. వారి సంగతి నీకు తెలియదు. మాకు తెలుసు వారెలాంటివారో. త్వరలోనే దేవుడు వారికి రెట్టింపు శిక్ష విధిస్తాడు. ఆ తరువాత వారు భయంకరమైన (నరక) శిక్షను చవిచూసేందుకు (మా సన్నిధికి) తీసుకురాబడతారు. (101)
ఇంకా కొందరున్నారు. వారు తమతప్పు ఒప్పుకున్నారు. వారిది మిశ్రమఆచరణ. కొన్ని పుణ్యకార్యాలు, కొన్ని పాపకార్యాలు చేశారు. త్వరలోనే దేవుడు వారిపై తన కటాక్ష వీక్షణలు ప్రసరింపజేస్తాడు. దేవుడు గొప్ప క్షమాశీలి, అపార దయానిధి. కనుక ప్రవక్తా! వారి సంపద నుండి దానం స్వీకరించి తద్వారా వారిని పరిశుద్ధపరచు. పుణ్యమార్గంలో వారిని పురోగమింపజేయి. వారికోసం ప్రార్థనచేయి. నీప్రార్థన వారి మనస్సుకు తృప్తి నిస్తుంది. దేవుడు సమస్త విషయాలు వింటున్నాడు. ఆయన సర్వం ఎరిగినవాడు#
దేవుడే తన దాసుల పశ్చాత్తాపాన్ని, దానాలను స్వీకరిస్తాడని వారికి తెలియదా? ఆయన గొప్ప క్షమాశీలి, దయామయుడని ఎరగరా? చెప్పు: “మీరు (కర్మలు) ఆచరిం చండి. మీ ఆచరణవైఖరి ఇప్పుడెలా ఉంటుందో దేవుడు, ఆయన ప్రవక్త, విశ్వాసులు చూస్తారు. ఆతర్వాత మీరు అంతర్‌బాహ్యాలు ఎరిగిన దేవుని వైపు మరలించబడతారు. అప్పుడాయన మీరు ప్రపంచంలో ఏమేమి చేస్తుండేవారో తెలియజేస్తాడు. (102-105)
మరికొందరున్నారు. వారి వ్యవహారం (ఇంకా పరిష్కారం కాలేదు.) దేవుని ఆజ్ఞ కోసం ఆపి ఉంచబడింది. దేవుడు తలచుకుంటే వారిని శిక్షించవచ్చు లేదా క్షమించ వచ్చు. దేవుడు సర్వం తెలిసినవాడు, మహా వివేకవంతుడు. (106)
ఇంకా కొందరున్నారు. వారు(ఇస్లాంకు) విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఒక మసీదు నిర్మించారు. వారక్కడ సత్యవ్యతిరేక కార్యకలాపాలు సాగించడానికి, విశ్వాసుల ఐక్యతను చెడగొట్టి వారిలో చీలికలు సృష్టించడానికి నిర్ణయించుకున్నారు. పైగా ఇంతకు ముందు దేవునితో, ఆయనప్రవక్తతో యుద్ధంచేసి (పరాజయంపాలై) ఉన్నవారికి ఆశ్ర యంగా (రహస్యస్థావరంగా) ఉంటుందన్న ఉద్దేశ్యంతో కూడా ఈ మసీదు నిర్మించారు.
వారు, మంచి తప్ప తమకు మరో ఉద్దేశ్యం లేదని ప్రమాణంచేసి చెబుతారు. కాని వారు పచ్చిఅబద్ధాలకోరులని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. కనుక నీవు ఎన్నటికీ ఆ మసీదులో అడుగుపెట్టకు. మొదటి నుండీ దైవభీతి పునాదిపై నిర్మించిన మసీదు మాత్రమే ప్రార్థన చేయడానికి నీకు యోగ్యమైనది. అక్కడ పరిశుద్ధంగా ఉండగోరేవారు కూడా ఉన్నారు. దేవుడు పరిశుద్ధత పాటించేవారినే ప్రేమిస్తాడు. (107-108)
ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకడు తన కట్టడాన్ని దైవభీతి, దైవప్రసన్నత లనే పునాదులపై నిర్మించాడు. రెండోవాడు తన కట్టడాన్ని నీటి ప్రవాహానికి లోతట్టు భాగం మట్టి కొట్టుకుపోయి డొల్లగామారిన నదీతీరంపై నిర్మించాడు. ఆ తరువాత అది కాస్త అతడ్ని తీసుకొని నేరుగా నరకాగ్నిలో పడిపోయింది. మరి ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠులు? మీరే ఆలోచించండి. అలాంటి దుర్మార్గులకు దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. వారు నిర్మించిన ఈ (పునాదులులేని) కట్టడం వారి హృదయాల్లో ఎల్లప్పుడూ అపనమ్మకాన్నే పెంచిపోషిస్తుంది; వారి హృదయాలు ముక్కలు ముక్కలుగా పగిలిపోతే తప్ప (ఈ అపనమ్మకపు జాడ్యం వారిని ఓపట్టాన వదలిపెట్టదు). దేవుడు సర్వం తెలిసినవాడు, మహావివేకవంతుడు. (109-110)
దేవుడు విశ్వాసుల నుండి వారి ధనప్రాణాలు కొనుగోలుచేశాడు. వాటికి బదులు గా వారికోసం స్వర్గం సిద్ధపరచిఉంచాడు. వారు దైవమార్గంలో పోరాడుతూ హతమార్చు తారు లేదా హతమార్చబడతారు. (వారికి స్వర్గం లభిస్తుందని) తౌరాత్‌లో, ఇన్జీల్‌లో, ఖుర్‌ఆన్‌లో వాగ్దానంఉంది. దాన్ని నెరవేర్చేబాధ్యత దేవునిపై ఉంది. వాగ్దానం నెరవేర్చ డంలో దేవుడ్ని మించిన వారెవరుంటారు? కనుక దేవునితో మీరు చేసుకున్న ఈ వ్యాపార ఒప్పందం పట్ల ఆనందోత్సవాలు జరుపుకోండి. ఇదే ఘనవిజయం. (111)
వారు పాపక్షమాపణ కోసం మాటిమాటికి దేవుని వైపు మరలుతారు. ఆయన్నే ఆరాధిస్తారు. ఆయన స్తుతిగానాలు చేస్తారు. దేవుని (ప్రసన్నత) కోసం లోకంలో సంచ రిస్తారు. ఆయన ముందు తలవంచుతారు, సాష్టాంగపడతారు. మంచిని బోధిస్తారు. చెడులను నివారిస్తారు. దైవనిర్ణీత హద్దులు కాపాడుతారు. కనుక ప్రవక్తా! (దేవునితో పరలోక ఒప్పందం చేసుకున్న) ఇలాంటి విశ్వాసులకు (స్వర్గ)శుభవార్త విన్పించు. (112)
బహుదైవారాధకులు నరకానికి అర్హులయ్యారని స్పష్టంగా తెలిసిన తరువాత వారు తమ దగ్గరి బంధువులైనా సరే, వారి పాపమన్నింపు కోసం దేవుడ్ని ప్రార్థించడం దైవ ప్రవక్తకు, విశ్వాసులకు ఏమాత్రం శోభించదు. ఇబ్రాహీం తనతండ్రి కోసం పాపమన్నింపు ప్రార్థన చేశాడంటే ఆవిషయంలో అతను తనతండ్రికి వాగ్దానం చేసిఉండటమే. అయితే అతను దైవవిరోధి అని తెలిసిపోయిన తర్వాత ఇబ్రాహీం అతడ్ని అసహ్యించుకున్నాడు. ఇబ్రాహీం ఎంతో దయార్ధ్ర హృదయుడు, సహనశీలి, సాధుస్వభావి. (113-114)
ప్రజలకు సన్మార్గం చూపి, వారు ఏవిషయాలు మానుకోవాలో వాటన్నిటినీ స్పష్టం గా తెలియజేసిన తర్వాత, తిరిగి వారిని మార్గభ్రష్టత్వానికి గురిచేయడం దేవుని అభి మతం కాదు. దేవుడు సమస్తవిషయాలు తెలిసినవాడు. భూమ్యాకాశాల సామ్రాజ్యమంతా దేవుని అధీనంలోనేఉంది. జీవన్మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన (పట్టు) నుండి మిమ్మల్ని కాపాడగల ఏ సహాయకుడూ, సంరక్షకుడూ లేడు. (115-116)
దేవుడు (తన) ప్రవక్తను కరుణించాడు. కష్టకాలంలో ఆదుకొని అతనికి తోడుగా నిల్చిన ముహాజిర్‌లు, అన్సారులను కూడా కరుణించాడు. వారిలోకొందరి హృదయాలు అపమార్గం వైపు మొగ్గినప్పటికీ వారిని దేవుడు కరుణించాడు. దేవుడు వారి విషయంలో అపార వాత్సల్యంతో, అమితమైన దయతో వ్యవహరిస్తాడు. (117)
వ్యవహారం వాయిదావేయబడిన ఆముగ్గుర్ని కూడా కరుణించాడు. భూమివిశాలం గాఉన్నా అదివారికి ఇరుకైపోయింది. చివరికి వారిప్రాణాలే వారికి భారమైపోయాయి. దేవుని పట్టునుండి తప్పించుకోడానికి ఆయన కరుణాశ్రయం తప్ప ఎలాంటి ఆశ్రయం లేదని వారు గ్రహించారు. అప్పుడు దేవుడు దయతో వారివైపు మరలాడు, వారు తన వైపు మరలివచ్చేందుకు. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (118)
విశ్వాసులారా! దేవునికి భయపడండి. నిజాయితీపరులకు తోడ్పడండి. దైవప్రవక్తను వదలి, ఇంట్లో కూర్చొని స్వప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వడం మదీనావాసులకు, దాని చుట్టుప్రక్కల నివసించే గ్రామీణులకు ఏమాత్రం తగదు. దైవమార్గంలో శారీరక శ్రమ, ఆకలిదప్పులు సహిస్తే, సత్యతిరస్కారులకు వెగటు కలిగించే వ్వవహారంలో ఏదైనా చర్య తీసుకుంటే, (ధర్మవ్యవహారంలో) ఏదైనా శత్రువర్గానికి ప్రతీకారంచేస్తే, వాటికి ప్రతిఫలం గా వారి అదృష్టంలో పుణ్యం వ్రాయకుండా ఉండటమనేది ఎన్నటికీ జరగదు. సద్వర్తను లకు లభించవలసిన ప్రతిఫలాన్ని దేవుడు ఎన్నటికీ వృధాచేయడు. (119-120)
అలాగే (దైవమార్గంలో) కొద్దోగొప్పో ఖర్చుచేస్తే లేదా ఏవైనా గుట్టలుమిట్టలు దాటి పురోగమిస్తే ఆ సత్కార్యాలు కూడా (కర్మల్లో) వ్రాయకుండా ఉండటమనేది జరగదు. వారు చేసిన సత్కర్మలకు దేవుడు వారికి తగినప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాడు. (121)
విశ్వాసులంతా (యుద్ధానికి) మూకుమ్మడిగా బయలుదేరనవసరం లేదు. ధర్మావ గాహన పెంపొందించుకోవడానికి (కూడా) ప్రతిగ్రామం, ప్రతితెగ నుండి కొందరు చొప్పున ఎందుకు బయల్దేరలేదు? అలా వెళ్ళొచ్చి తమప్రజలు (సత్యవ్యతిరేక వైఖరి) మానేం దుకు వారిని హెచ్చరించివుంటే బాగుండేది కదా! అలా ఎందుకు జరగలేదు? విశ్వాసు లారా! మీ సమీపంలో (గోముఖవ్యాఘ్రాల్లా) ఉన్న సత్యతిరస్కారులతో పోరాడండి. (మీరు మెతక మనుషులు కాదని,) మీలో కాఠిన్యం ఉందని వారు తెలుసుకోవాలి. దేవుడు సదా భయభక్తులుకలవారికే తోడుగా ఉంటాడని తెలుసుకోండి. (122-123)
కొత్తగా ఏదైనా అధ్యాయం అవతరించినప్పుడల్లా వారిలో కొందరు “ఈఅధ్యాయం వల్ల మీలో ఎవరి విశ్వాసం పెరిగింద”ని (ముస్లింలను) అడుగుతారు. విశ్వసించినవారి విశ్వాసాన్ని ప్రతి అధ్యాయం అధికమే చేసింది. దానిపట్ల వారు సంతోషమే వెలిబుచ్చు తున్నారు. కాని హృదయాల్లో కాపట్యరోగమున్నవారికి మాత్రం కొత్తగా అవతరించే ప్రతి అధ్యాయం వారి (హృదయ)మాలిన్యాన్ని మరింత అధికమే చేస్తూపోయింది. దాంతో వారు చచ్చేదాకా అవిశ్వాసతిమిరంలోనే పడి కొట్టుమిట్టాడుతుంటారు. (124-125)
ప్రతి యేటా వారు ఒకటి రెండు సార్లు పరీక్షకు గురిచేయబడుతున్నారని వారికి తెలియదా? అయినా వారు పశ్చాత్తాపం చెంది దేవునికి క్షమాపణ చెప్పుకోవడం లేదు. ఎలాంటి గుణపాఠం నేర్చుకోవడంలేదు. కొత్తగా ఏదైనా అధ్యాయం అవతరించినప్పుడు తమను ఇతరులు చూస్తారేమోనని కళ్ళతోనే వారు పరస్పరం సైగలు చేసుకుంటూ నిశ్శబ్దంగా లేచి వెళ్ళిపోతారు. వారసలు మందబుద్ధులు. అందుకే దేవుడు వారి హృద యాలను (వారి పైశాచిక ప్రవృత్తికి అనుగుణంగా) మలచివేశాడు. (126-127)
(ప్రజలారా!) మీలో నుండే మీదగ్గరకు దైవప్రవక్త వచ్చాడు. మీరు నష్టపోవడం అతనికి ఎంతో బాధగా ఉంటుంది. మీ శ్రేయస్సునే అతను ఎక్కువగా కోరుకుంటు న్నాడు. విశ్వాసుల పాలిట అతను ఎంతో ప్రేమమూర్తి, దయామయుడు. (128)
(ప్రవక్తా! ఇంతగా నచ్చజెప్పినా వినకుండా) వారు ముఖం తిప్పుకుంటే ఇలా చెప్పు: “నాకు దేవుడొక్కడే చాలు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన్నే నేను నమ్ముకున్నాను. ఆయనే మహోన్నత సింహాసనానికి అధిపతి.” (129)