Jump to content

కురాన్ భావామృతం/అల్-జుమా

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

62. జుముఆ (సప్తాహ సమావేశం)
(అవతరణ: మదీనా; సూక్తులు: 11)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమ్యాకాశాల్లో ఉన్న ప్రతీదీ దేవుని ఔన్నత్యం చాటుతూ, ఆయన పవిత్రతను ప్రశంసిస్తోంది. ఆయన (విశ్వ) సామ్రాట్టు, పరిశుద్ధుడు, సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. (1)
ఆయనే నిరక్షరాస్యుల్లో వారిజాతికే చెందిన ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్త వారికి దైవసూక్తులు విన్పిస్తూ వారి జీవితాలు సంస్కరిస్తున్నాడు. వారికి గ్రంథం లోని విషయాల్ని, వివేకాన్ని నేర్పుతున్నాడు. దీనికిపూర్వం వారు పూర్తిగా మార్గవిహీనులై ఉండేవారు. (అతని దౌత్యం) వారిలో ఇంకాచేరని (ఇతర జాతుల, భావితరాల) వారికి కూడా వర్తిస్తుంది. దేవుడు అపార శక్తిమంతుడు, వివేకవంతుడు. ఇది దేవుని అనుగ్రహం; దేవుడు తాను కోరినవారికి దాన్ని ప్రసాదిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహశీలి. (2-4)
తౌరాత్‌ (ఆజ్ఞలు పాటించే) బాధ్యత మోపబడినవారు ఆ బాధ్యత నిర్వహించలేదు. వారిని పుస్తకాలుమోసే గాడిదతో పోల్చవచ్చు. (తౌరాత్‌జ్ఞానం తెలిసి కూడా అంధులై) దైవసూక్తుల్ని నిరాకరించినవారు అంతకంటే దిగజారిపోయారు. ఇలాంటి దుర్మార్గులకు దేవుడు సన్మార్గం చూపడు. (ప్రవక్తా!) వారితో ఇలా అను: “యూదులుగా మారిన ప్రజలారా! మానవులందరిలో మీరొక్కరే దేవునికి అత్యంత ప్రియమైనవారని కదా మీ వాదన! మీ వాదన నిజమైతే చావును కోరుకోండి (చూద్దాం).” (5-6)
కాని వారు చావును ఎన్నటికీ కోరుకోరు, తాము చేసిన అకృత్యాల కారణంగా. (వారికసలు చావంటేనే భయం.) ఆ దుర్మార్గుల సంగతి దేవునికి బాగా తెలుసు. (7)
వారికిలా చెప్పు: “ఏ మృత్యువు నుండి మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారో ఆ మృత్యువు మిమ్మల్ని కబళించి తీరుతుంది. ఆ తర్వాత మీరు గోచర, అగోచరాలన్నీ ఎరిగిన దేవుని సన్నిధిలో ప్రవేశపెట్టబడతారు. అప్పుడాయన మీరు (ఇహలోకంలో) ఏమేమి చేస్తుండేవారో అంతా మీ ముందు రట్టు చేస్తాడు.” (8)
విశ్వాసులారా! శుక్రవారం సమావేశం రోజున నమాజు కోసం పిలుపునిచ్చినప్పుడు మీరు వెంటనే అమ్మకం, కొనుగోళ్ళ వ్యవహారాలు వదిలేసి దైవస్మరణ (ధర్మబోధ) వైపుకు పరుగెత్తండి. మీరు అర్థం చేసుకుంటే ఇది మీకెంతో శ్రేయస్కరమైనది.
నమాజ్‌ ముగిసిన తరువాత మీరు యధాప్రకారం నేల నలువైపులా విస్తరించి దైవానుగ్రహం (ఉపాధి) అన్వేషించవచ్చు. (ఆ సందర్భంలో కూడా) దేవుడ్ని ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. దీనివల్ల మీకు సాఫల్యభాగ్యం లభించవచ్చు. (9-10)
వారు వ్యాపారసంరంభం, వినోదం చూడగానే నిన్ను నిలబడ వదిలేసి వాటి వైపు పరుగెత్తారు. వారికిలా చెప్పు: “ఈ వ్యాపారం, వినోదాలకంటే దేవుని దగ్గర ఉన్నవి అనేక రెట్లు శ్రేష్ఠమైనవి. దేవుడు అందరికంటే అత్యంత శ్రేష్ఠమైన ఉపాధిప్రదాత.”(11)