కురాన్ భావామృతం/అల్-ముదస్సిర్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

74. ముదస్సిర్‌ (దుప్పటి కప్పుకొని పడుకున్నవాడు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 56)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
దుప్పటి కప్పుకొని పడుకున్నవాడా! లే, లేచి (ప్రజలను) హెచ్చరించు. నీ ప్రభువు ఔన్నత్యం చాటిచెప్పు. నీ దుస్తులు పరిశుభ్రంగా ఉంచుకో. అపవిత్రత, అపరిశుద్ధతలకు దూరంగా ఉండు. ఏ మేలయినా ప్రాపంచిక ప్రయోజనాలు ఆశించి చేయకు. (కష్టాలు వచ్చినప్పుడు) నీ ప్రభువు (ప్రసన్నత) కోసం సహనం వహించు. (1-7)
ప్రళయశంఖం పూరించబడే రోజు... ఆరోజు పరిస్థితి చాలా కఠినంగా, ఘోరంగా ఉంటుంది. అవిశ్వాసులకు ఏ మాత్రం తేలికగా ఉండదు. (8-10)
నేను ఒంటరిగా పుట్టించినవాడ్ని నాకు వదిలెయ్యి. (నేను చూసుకుంటాను అతని సంగతి.) నేనతనికి అపార సిరిసంపదలు ప్రసాదించాను. అతడ్ని ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే కొడుకుల్ని కూడా ఇచ్చాను. సుఖసంతోషాలకు కావల్సిన జీవన సామగ్రి నంతా ఇచ్చాను. అయినా నేను తనకు మరింత అనుగ్రహిస్తానని పేరాశతో ఉన్నాడు. అలా ఎన్నటికీ జరగదు.
వాడు మా సూక్తుల పట్ల ద్వేషం పెంచుకున్నాడు. త్వర లోనే నేనతడ్ని కఠినమైన (నరక) శిఖరం ఎక్కిస్తాను. అతను బాగా ఆలోచించి (మాకు వ్యతిరేకంగా) కుట్ర పన్నడానికి ప్రయత్నించాడు. వాడు నాశనంగాను! ఎలాంటి దుష్టయత్నానికి ఒడిగట్టాడు!! వాడు పాడుగాను! ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడు!! (11-20)
తర్వాత అతను (జనంవైపు)చూశాడు. ఆతర్వాత భృకుటి ముడిచి, మూతి విరుచు కున్నాడు. ఆపై వెనక్కితిరిగి హూంకరించాడు. చివరికతను “ఇది పూర్వకాలం నుంచీ సాగుతున్న మంత్రజాలం తప్ప మరేమీ కాదు. ఇది మానవ వాక్కు మాత్రమే” అన్నాడు#
త్వరలోనే నేనతడ్ని నరకంలో విసరిపడేస్తాను. ఆ నరకం ఏమిటో నీకేం తెలుసు? అది (మనిషిని) మిగల్చదూ, వదలిపెట్టదు. చర్మాన్ని నిలువుగా మాడ్చివేస్తుంది. దాని నిర్వ హణకు పంధొమ్మిది మంది కార్యకర్తలు నియమించబడ్డారు. (21-30)
మేము నరక పాలకులుగా దైవదూతల్ని నియమించాం. వారి సంఖ్యను అవిశ్వాసు లకు పరీక్షగా చేశాం. గ్రంథప్రజలకు నమ్మకం కుదరడానికి, విశ్వాసుల విశ్వాసం మరింత దృఢం కావడానికి ఇలా చేశాం. కనుక గ్రంథప్రజలు, విశ్వాసులు ఎలాంటి అనుమానంలో పడిపోకూడదు. హృదయంలో (కాపట్య) రోగమున్నవారు, అవిశ్వాసులు (విమర్శిస్తూ) “దేవుడు చెప్పిన ఈ వింతమాటలోని అంతరార్థం ఏమిటో!” అంటారు. ఇలా దేవుడు తాను తలచిన విధంగా కొందరిని దారి తప్పిస్తాడు; మరికొందరికి దారి చూపుతాడు. నీ ప్రభువు సైన్యాల్ని గురించి ఆయనకు తప్ప మరెవరికీ తెలియదు. ప్రజలకు హితోపదేశం చేయడానికే ఈ (నరకదూతల) ప్రస్తావన తెచ్చాము. (31)
(ఇది ఆషామాషీ విషయం) కాదు. చంద్రుడిసాక్షి! గడచిపోతున్న రాత్రిసాక్షి! తెల్లారు తున్న ఉదయం సాక్షి! ఈ నరకం గొప్ప విషయాలలో ఒకటి. నరకం మానవుల పాలిట భయంకరమైన విషయం. మీలో (సత్యాన్ని స్వీకరించడానికి) ముందుకు రా దలిచే, లేక వెనకుండి పోగోరే ప్రతివ్యక్తి పాలిటా ఇది భయంకరమైన విషయమే. (32-37)
ప్రతి మానవుడూ తన కర్మలకు బదులు తాకట్టు వస్తువు లాంటివాడు. అయితే స్వర్గవనాలలో ప్రవేశించే కుడిపక్షం వారు మాత్రం కాదు. వారు (నరకంలో) పాపాత్ముల్ని చూసి “మిమ్మల్ని ఏ విషయం నరకంలో పడవేసింది?” అని అడుగుతారు. (38-42)
దానికి పాపాత్ములు ఇలా అంటారు: “మేము నమాజు చేసే వారిలో చేరలేదు. పేదలకు అన్నదానం చేసేవారం కాము. సత్యతిరస్కారులతో కలసి మేమూ (సత్యాన్ని) తిరస్కరిస్తుండేవాళ్ళం. తీర్పుదినాన్ని అసత్య విషయమని ఖండిస్తుండేవాళ్ళం. ఈ స్థితి లోనే చివరికి అనివార్యవిషయం (మృత్యువు) మా ముందుకొచ్చింది.”అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు. (43-48)
ఇంతకూ వీరికేమయింది, పులిని చూసి పారిపోయే అడవిగాడిదల్లా మా హితోప దేశానికి విముఖులైపోతున్నారు? వారిలో ప్రతిఒక్కడూ తనపేర మేము బహిరంగ లేఖ పంపాలని కోరుతున్నాడు. కాదు, అది కూడా కాదు. వారికసలు పరలోకమంటే భయమే లేదు. (అంచేత దాన్నిగురించి వారు ప్రశాంతంగా ఆలోచించడం లేదు.) (49-53)
ఎంతమాత్రం కాదు. ఇదొక హితోపదేశం. ఇష్టమైనవారు దీన్నుండి గుణపాఠం నేర్చుకోవచ్చు. (అదైనా) దేవుడు తలచుకుంటే తప్ప ఎవరూ గుణపాఠం నేర్చుకోలేరు. మానవులంతా దేవునికే భయపడాలి. ఆ హక్కు ఆయనకే ఉంది. తనకు భయపడే వారినే ఆయన క్షమిస్తాడు. క్షమించే అర్హత (అధికారం) ఆయనకే ఉంది. (54-56)