కురాన్ భావామృతం/అల్-ముజాదిలా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

58. ముజాదలా (వాదిస్తున్న స్త్రీ)
(అవతరణ: మదీనా; సూక్తులు: 22)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
(ప్రవక్తా!) నీతో తనభర్త విషయంలో వాదిస్తూ దైవాన్ని మొరపెట్టుకున్న స్త్రీ మాటల్ని దేవుడు విన్నాడు. దేవుడు మీఇద్దరి సంభాషణ వింటున్నాడు. ఆయన సర్వం వినేవాడు, సమస్తం చూసేవాడు. (1)
మీలో ఎవరు తమ భార్యల్ని తల్లుల వంటివారని చెప్పి, వారిపట్ల దాంపత్య విచ్ఛిన్న వైఖరి అవలంబిస్తారో వారి భార్యలు వారికి తల్లులు కాలేరు. వారి తల్లులు వారిని కన్నవారే అవుతారు. వీరు అనుచితమైన అబద్ధం పలుకుతున్నారు. (ఈవైఖరికి వారిపై దైవశిక్ష వచ్చిపడేది, కాని) దేవుడు అపార దయామయుడు, గొప్పక్షమాశీలి. (2)
ఎవరు తమ భార్యల్ని తల్లుల వంటివారని చెప్పి వారిపట్ల దాంపత్య విచ్ఛిన్న వైఖరి అవలంబిస్తారో వారు (తప్పు తెలుసుకొని) దాంపత్య సంబంధం పునరుద్ధరించు కోవడానికి సిద్ధమైనప్పుడు, దంపతులు కలుసుకోక ముందే (భర్త) ఒక బానిసకు బానిస త్వం నుండి విముక్తి కలిగించాలి. దీనిద్వారా మీకు హితోపదేశం చేయబడుతోంది. మీరు చేసేదంతా దేవునికి తెలుసు. ఒకవేళ బానిస లేకపోతే, ఇద్దరు కలుసుకోక ముందే అతను రెణ్ణెల్లు నిరంతరాయంగా ఉపవాసం పాటించాలి. అదీ చేయలేకపోతే అరవై మంది పేదలకు అన్నదానం చేయాలి. మీరు దేవుడ్ని, ఆయన ప్రవక్తను (మనస్ఫూర్తిగా) విశ్వసించడానికే ఈఆజ్ఞ ఇవ్వబడుతోంది. ఇవి దేవుడు నిర్ణయించిన పరిధులు. (వీటిని అతిక్రమించకూడదు. ఈ) సత్యాన్ని తిరస్కరించినవారికి దుర్భరశిక్ష పడుతుంది. (3-4)
గతంలో కొందరు దేవుడ్ని, ఆయన ప్రవక్తను వ్యతిరేకించినప్పుడు దేవుడు వారిని నికృష్ట స్థితికి దిగజార్చాడు. నేడు కూడా అలాంటి వైఖరి అవలంబించినవారికి అదే గతి పడ్తుంది. మేము (మాత్రం ఎలాంటి అరమరికలులేని) నిర్దిష్టమైన సూక్తులు అవతరింప జేశాము. (కనుక) అవిశ్వాసులకు అవమానకరమైన శిక్ష తప్పదు. ఆరోజు దేవుడు వారందర్నీ తిరిగి బ్రతికించి లేపి, వారు (ప్రపంచంలో) ఏమేమి చేసివచ్చారో తెలియ జేస్తాడు. వారు మరచిపోతారు, కాని దేవుడు వారి కర్మలన్నిటిని లెక్కించి మరీ భద్ర పరుస్తున్నాడు. దేవుడు ప్రతి విషయానికీ సాక్షిగా ఉన్నాడు. (5-6)
భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం దేవునికి తెలుసని నీవెరుగవా? ముగ్గురు వ్యక్తులు గుసగుసలాడుకుంటున్నప్పుడు వారిలో నాల్గోవాడిగా దేవుడుంటాడు. లేదా ఐదుగురు రహస్య సమాలోచనలు జరుపుకుంటున్నప్పుడు కూడా వారిలో ఆరోవాడిగా దేవుడు తప్పక ఉంటాడు. గుసగుసలాడుకునేవారు అంతకంటే తక్కువమంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా దేవుడు వారిని వెన్నంటేఉంటాడు. ఆ తర్వాత ప్రళయదినాన వారేమి చేసి వచ్చారో ఆయన వారికి వివరిస్తాడు. దేవుడు సకల విషయపరిజ్ఞానం కలవాడు (7)
(ప్రవక్తా!) నీవు గమనించలేదా? రహస్యమంతనాలు జరపవద్దని వారించినా మళ్ళీ వారు అవే తప్పుడుపనులకు పాల్పడుతున్నారు. పాపకార్యాలు, అన్యాయం అక్రమాల్ని గురించి, ప్రవక్తపట్ల అవిధేయత గురించి గుసగుసలాడుకుంటున్నారు. వీరు నీ దగ్గరి కొచ్చినప్పుడు దేవుడు తెలిపిన సలాంచేసే పద్ధతి కాదని (దురుద్దేశంతో) మరో విధంగా నీకు సలాం చేస్తారు. అప్పుడు వీరు మనసులో “మనం పలుకుతున్న ఈ పలుకులకు దేవుడు మనల్ని ఎందుకు శిక్షించడు?”అని అనుకుంటారు. వారికసలు నరకమే తగినశిక్ష. వారు తప్పక నరకానికి ఇంధనం అవుతారు. అది మహాచెడ్డ నివాసస్థలం. (8)
విశ్వాసులారా! మీరు రహస్యంగా ఏదైనా మాట్లాడుకోదలిస్తే పాపకార్యాలు, అక్రమాలు, అన్యాయాలు, ప్రవక్తపట్ల అవిధేయతలాంటి విషయాల్ని గురించి గాకుండా సత్కార్యాలు, భయభక్తుల్ని గురించి మాట్లాడుకోండి. పునరుత్థానంనాడు మిమ్మల్ని దేవునిముందు ప్రవేశపెడతారు. కనుక ఈ భావనతో మీరెల్లప్పుడూ దేవునికి భయపడుతూ మసలుకోండి. కుత్సిత బుద్ధితో గుసగుసలు చెప్పుకోవడం పైశాచిక చర్య. విశ్వాసుల్ని బాధించడానికే ఇలాంటి చేష్టలు జరుగుతాయి. కాని దానివల్ల విశ్వాసులకు దైవాజ్ఞ లేనిదే ఎలాంటి నష్టం వాటిల్లదు. కాబట్టి విశ్వాసులు దైవాన్నే నమ్ముకోవాలి. (9-10)
విశ్వాసులారా! మీసమావేశాల్లో సర్దుకొని చోటు కల్పించమని చెప్పినప్పుడు మీరు చోటు కల్పించండి, దేవుడు మీకు (స్వర్గంలో) చోటు కల్పిస్తాడు. లేచి వెళ్ళిపోండని చెబితే వెళ్ళిపోండి. మీలో (సత్యాన్ని) విశ్వసించి (ధర్మ)జ్ఞానం ప్రసాదించబడిన వారికి దేవుడు ఉన్నత హోదాలు ప్రసాదిస్తాడు. మీరు చేస్తున్నదంతా దేవునికి తెలుసు. (11)
విశ్వాసులారా! మీరు దైవప్రవక్తతో ఏకాంతంగా మాట్లాడదలచుకుంటే ముందుగా ఏదైనా దానం చేయండి. ఇది మీకెంతో శ్రేయస్కరం, పవిత్రమైనది, దానం చేయడానికి మీదగ్గర ఏమీ లేకపోతే, పోనీయండి. దేవుడు గొప్పక్షమాశీలి, అమిత దయామయుడు#
ఏకాంతంగా మాట్లాడటానికి ముందు దానం చేయవలసి ఉంటుందన్న ఆజ్ఞ విని భయపడ్డారా? సరే పోనీయండి: దేవుడు మిమ్మల్ని క్షమించేశాడు. అయితే మీరు నమాజ్‌ (పార్థనా)వ్యవస్థ నెలకొల్పాలి; (పేదల ఆర్థిక హక్కు) జకాత్‌ చెల్లిస్తుండాలి; దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండాలి. మీరు చేస్తున్నదంతా దేవునికి తెలుసు. (12-13)
దైవాగ్రహానికి గురైన వర్గం (యూదుల)తో చేతులు కలిపినవారిని మీరు చూడ లేదా? వారసలు మీతోనూ (స్నేహంగా) లేరు; ఆ వర్గంతోనూ లేరు. వారు తెలిసి కూడా ప్రమాణాలుచేస్తూ అబద్ధాలాడుతున్నారు. వారికి దేవుడు కఠినశిక్ష సిద్ధపరచి ఉంచాడు. వారు చాలా వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. వారు తమ ప్రమాణాలు అడ్డంపెట్టుకొని ప్రజల్ని దైవమార్గంలోకి రానీయకుండా నిరోధిస్తున్నారు. వారికోసం అవమానకరమైన శిక్ష ఉంది. దేవుని పట్టునుండి వారిని వారి సంతానం, సిరిసంపదలు ఏవీ కాపాడలేవు. వారు నరక నేస్తాలు. నరకంలోనే వారు ఎల్లకాలం పడిఉంటారు. (14-17)
దేవుడు (ప్రళయదినాన) వీరిని బ్రతికించి లేపినప్పుడు, ఆయన ముందు కూడా ఈరోజు నీముందు చేస్తున్నట్లే అసత్యప్రమాణాలు చేస్తారు. అలా అసత్య ప్రమాణాలు చేస్తే తమపని నెరవేరుతుందని భావిస్తారు. గుర్తుంచుకోండి! వారు పచ్చి అబద్ధాల కోరులు. వారిని షైతాన్‌ ఆవహించి దైవస్మరణ నుంచి మరిపింపజేశాడు. వారసలు షైతాన్‌ పక్షానికి చెందినవారు. జాగ్రత్త! షైతాన్‌ పక్షంవారే నష్టపోయేవారు. (18-19)
దేవుడ్ని, ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తున్నవారే పరమనీచులు. తాను, తన ప్రవక్తలు విజయం సాధిస్తారని దేవుడు రాసిపెట్టాడు. ఆయన మహాబలాఢ్యుడు, అసాధారణ శక్తి సంపన్నుడు. దేవుడ్ని, పరలోకాన్ని విశ్వసించినవారు దేవునిపై, ఆయన ప్రవక్తపై తిరుగు బాటు చేస్తున్నవారిని ఎన్నటికీ ప్రేమించరు. చివరికి వారు తమ తండ్రులైనా, కొడుకు లైనా, సోదరులైనా లేదా తమ కుటుంబసభ్యులైనా సరే, ససేమిరా ప్రేమించరు. అలా ప్రేమించడాన్ని నీవు ఎన్నటికీ చూడలేవు.
దేవుడు వారి హృదయాల్లో విశ్వాసాన్ని దృఢంగా పాదుకొల్పాడు. పైగా తన దగ్గర నుండి స్ఫూర్తి ప్రసాదించి వారికి మరింత బలంచేకూర్చాడు. ఇలా వారిని సెలయే రులు పారే స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు. అక్కడే వారు కలకాలం ఉంటారు. దేవుడు వారిపట్ల ప్రసన్నుడయ్యాడు; వారు దేవునిపట్ల సంతుష్టులయ్యారు. వారసలు దేవుని పక్షానికి చెందినవారు. వినండి! దేవుని పక్షంవారే కృతార్థులవుతారు. (20-22)