కురాన్ భావామృతం/అత్-తహ్రీమ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ


66. తహ్రీమ్‌ (నిషేధం)
(అవతరణ: మదీనా; సూక్తులు: 12)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ప్రవక్తా! దేవుడు మీ (ముస్లింల) కోసం ధర్మసమ్మతం చేసిన దాన్ని నిషేధించు కుంటావా నీవు? (దీనిద్వారా) నీవు నీ భార్యలకు సంతోషం కల్గించదలిచావా? (సరే పోనివ్వు) దేవుడు క్షమాశీలి, దయామయుడు. దేవుడు మీకోసం మీ ప్రమాణాల పరి పూర్తి నుండి బయట పడేందుకు ఒక పద్ధతి నిర్ణయించాడు. దేవుడే మీ కార్యసాధకుడు. ఆయన సర్వం తెలిసినవాడు, ఎంతో వివేకవంతుడు. (1-2)
దైవప్రవక్త తన భార్యలలో ఒక భార్యతో రహస్యంగా ఒక మాటన్నాడు. తరువాత ఆమె ఆ రహస్యాన్ని (మరొకరి ముందు) బహిర్గతంచేయగానే ఆ సంగతి దేవుడు తన ప్రవక్తకు తెలియజేశాడు. అప్పుడు దైవప్రవక్త (ఆ భార్యకు) విషయం కొంత తెలిపి కొంత దాటవేశాడు. ఆ తర్వాత ఈ (రహస్యం బయటపడిన) సంగతి ప్రస్తావించినప్పుడు ఆమె (ఆశ్చర్యపోతూ) “మీకీ సంగతి ఎవరు తెలియజేశారు?” అని అడిగింది. దానికి దైవప్రవక్త “సర్వం ఎరిగినవాడు, బాగా తెలిసినవాడు నాకు తెలియజేశాడు” అన్నాడు. (3)
(ప్రవక్త సతులారా!) మీరిద్దరి హృదయాలు గాడి తప్పాయి. కనుక పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపణ కోరుకోండి. మీరు దైవప్రవక్తకు వ్యతిరేకంగా ముఠా కట్టితే, దేవుడు అతనికి రక్షకుడుగా ఉన్నాడు. ఆ తర్వాత (దైవదూత)జిబ్రీల్‌, సజ్జనులైన యావత్తు విశ్వాసులు, దైవదూతలు అతనికి (మద్దతుదారులుగా,) సహాయకులుగా ఉన్నారు. (4)
ఒకవేళ దైవప్రవక్త మీకందరికీ విడాకులిస్తే, దేవుడు మీ స్థానంలో అతనికి మీకంటే శ్రేష్ఠమైన భార్యల్ని ప్రసాదిస్తాడు. వారు (మీకంటే) ఎంతో మంచి ముస్లింలుగా, విశ్వస నీయులుగా, వినయవతులుగా, క్షమాపణ కోరుకునేవారుగా, దైవారాధకులుగా, ఉపవా సకులుగా ఉంటారు. వారు భర్తవిహీనులూ కావచ్చు, లేదా కన్యలూ కావచ్చు. (5)
విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీభార్యాపిల్లల్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి. దానికి మానవులు, రాళ్ళు సమిధలవుతారు. అక్కడ దృఢకాయులైన, కఠిన (హృదయు లైన) దైవదూతలు (నరకనిర్వాహకులుగా) నియమితులైఉంటారు. వారు దేవుని ఆజ్ఞల్ని ఏమాత్రం జవదాటరు. ఏఆజ్ఞ వచ్చినా తక్షణమే దాన్ని శిరసావహిస్తారు. (వారు నరక వాసులతో) “అవిశ్వాసులారా! ఈరోజు మీరు సాకులు చెప్పకండి. మీరెలాంటి కర్మలు చేసుకున్నారో అలాంటి ప్రతిఫలమే మీకివ్వబడుతోంది” అనంటారు. (6-7)
విశ్వాసులారా! మీరు మనస్ఫూర్తిగా దేవుడ్ని క్షమాపణ కోరుకోండి. మీప్రభువు మీ పాపాలు మన్నించి, మిమ్మల్ని సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆరోజు దేవుడు తన ప్రవక్తకు, అతనితోపాటు విశ్వసించినవారికి ఎలాంటి అవమానా లకు గురిచేయడు. వారి జ్యోతి వారి ముందు కుడివైపు పరుగిడుతూ ఉంటుంది. అప్పుడు వారు “ప్రభూ! మా జ్యోతిని మాకోసం పరిపూర్ణం(గా కాంతినిచ్చేలా) చెయ్యి. మమ్మల్ని క్షమించు. నీవు ప్రతిదానిపై అదుపు కలిగివున్నావు” అని ప్రార్ధిస్తారు. (8)
ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడు. వారిపట్ల కఠినంగా వ్యవహరించు. వారి నివాసం నరకమవుతుంది. అది మహా చెడ్డ నివాసం. (9)
అవిశ్వాసుల విషయంలో దేవుడు నూహ్‌, లూత్‌ (ప్రవక్త)ల భార్యల్ని ఉదాహర ణలుగా పేర్కొంటున్నాడు. ఆ స్త్రీలిద్దరు పుణ్యాత్ములైన మా భక్తులిద్దరి దాంపత్యంలో ఉండేవారు. అయితే వారు తమ భర్తలపట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. అందువల్ల వారా స్త్రీలను దేవుని(శిక్ష) నుండి ఏమాత్రం కాపాడలేకపోయారు. వారిద్దరితో “వెళ్ళండి, అగ్నిలో పడేవారితో మీరూ అగ్నిలోకి పోయిపడండి” అని చెప్పడం జరిగింది. (10)
విశ్వాసుల విషయంలో దేవుడు ఫిరౌన్‌భార్య గాధను దృష్టాంతంగా పేర్కొంటు న్నాడు. ఆమె (దైవాన్ని ప్రార్థిస్తూ) “ప్రభూ! నాకోసం నీ దగ్గర స్వర్గంలో ఒక గృహం నిర్మించు. నన్ను ఫిరౌన్‌ బారినుండి, అతని (దుష్ట)కర్మల (కీడు)నుండి కాపాడు. (ఈ) దుర్మార్గపు జాతి నుండి నాకు విముక్తి కలిగించు” అని అన్నది. (11)
అలాగే దేవుడు ఇమ్రాన్‌ కుమార్తె మర్యంని కూడా ఉదాహరణగా పేర్కొంటు న్నాడు. ఆమె తన మానాన్ని కాపాడుకున్న పరమ శీలవతి. మేము మావైపు నుండి ఆమె (గర్భం)లోకి ఒక ఆత్మను ఊదాము. ఆమె తన ప్రభువు బోధనలను, ఆయన గ్రంథాలను విశ్వసించి, దైవవిధేయులలో చేరిపోయింది. (12)