Jump to content

కురాన్ భావామృతం/అస్-సఫ్ఫ్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

61. సఫ్‌ (సైనికపంక్తి)
(అవతరణ: మదీనా; సూక్తులు: 14)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమ్యాకాశాల్లో ఉన్న అణువణువూ దేవుని ఔన్నత్యం చాటుతూ, ఆయన పవిత్ర తను ప్రశంసిస్తోంది. ఆయన అపార శక్తిమంతుడు, అసామాన్య వివేకవంతుడు. (1)
విశ్వాసులారా! మీరు చేయనిదాన్ని గురించి మాట్లాడుతారెందుకు? చేయనిదాన్ని గురించి చెప్పుకోవడం దేవునికి చాలా అప్రియమైన విషయం. దేవుడు తన మార్గంలో పంక్తులుతీరి దృఢమైన కాంక్రీటుగోడలా స్థిరంగా నిలచి పోరాడేవారినే ప్రేమిస్తాడు#
మూసా తన జాతిప్రజల్ని ఉద్దేశించి అన్న మాటలు గుర్తుచేసుకో. అతను వారితో “నా జాతిప్రజలారా! నేను మీకోసం దేవుడు పంపిన ప్రవక్తనని తెలిసికూడా మీరు నన్ను వేధిస్తారెందుకు?” అన్నాడు. ఆ తర్వాత వారు వక్రమార్గంలో నడవగానే దేవుడు వారి హృదయాలను వక్రీకరించాడు. దేవుడు దుర్జనులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. (2-5)
మర్యం కుమారుడు ఈసా గాధ కూడా. అతను తన జాతితో “ఇస్రాయీల్‌ సంతతి ప్రజలారా! నేను మీకోసం దేవుడు పంపిన ప్రవక్తను. నాకు పూర్వం అవతరించిన తౌరాత్‌ గ్రంథాన్ని ధృవపరచేవాడ్ని. నాతర్వాత మరొక ప్రవక్త రానున్నాడని శుభవార్త అందజేస్తు న్నాను. అతని పేరు ‘అహ్మద్‌’ అవుతుంది” అన్నాడు. కాని అతను స్పష్టమైన నిదర్శ నాలతో వారివద్దకు వచ్చినప్పుడు వారు “ఇది మంత్రజాలం మాత్రమే” అన్నారు. (6)
ఇస్లాం వైపు పిలుస్తున్నా దాన్ని పెడచెవినపెట్టి, దేవుని విషయంలో అసత్యాలు పలికేవాడి కంటే మించిన దుర్మార్గుడు మరెవరుంటారు? అలాంటి దుర్మార్గులకు దేవుడు ఎన్నటికీ సన్మార్గం చూపడు. వీరసలు దేవుని (ఇస్లాం విప్లవ) జ్యోతిని నోటితో ఊది ఆర్పజూస్తున్నారు. కాని అవిశ్వాసులు ఎంత అసహ్యించుకున్నా దేవుడు తన జ్యోతిని పూర్తిగా (నేల నాలుగు చెరగులా) వ్యాపింపజేసి తీరుతానని నిర్ణయించు కున్నాడు. ఆయనే తన ప్రవక్తకు సన్మార్గం, సత్యధర్మం ఇచ్చి పంపినవాడు. అవిశ్వా సులు ఎంత ఈసడించుకున్నా సరే ఆయన దాన్ని సమస్త జీవన విధానాలపై ఆధిక్యత కలిగించడానికి ఇలా చేశాడు. (7-9)
విశ్వాసులారా! మిమ్మల్ని దుర్భరమయిన (నరక) యాతనల నుండి కాపాడగలిగే వ్యాపార పద్ధతిని గురించి మీకు తెలుపమంటారా? మీరు మనస్ఫూర్తిగా దేవుడ్ని, ఆయన ప్రవక్తను విశ్వసించి ధనప్రాణాలు ఒడ్డి దైవమార్గంలో పోరాడండి. మీరు విషయం గ్రహించ గలిగితే అందులోనే మీ శ్రేయస్సు ఉంది. (10-11)
(ఈ ఆదేశాన్ని పాటిస్తే) దేవుడు మీ తప్పులు క్షమించి మిమ్మల్ని సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆ శాశ్వత స్వర్గవనాలలో మీకు అద్భుత మైన నివాసగృహాలు ప్రసాదిస్తాడు. ఇదే గొప్ప విజయం.
అదీగాక మీరు కోరుతున్న ఇతర వస్తువులు కూడా ఆయన మీకు అనుగ్రహి స్తాడు. అదే దేవుని సహాయం, త్వరలోనే లభించనున్న విజయం. ప్రవక్తా! విశ్వాసులకు ఈ శుభవార్త అందజెయ్యి. (12-13)
విశ్వాసులారా! మర్యం కుమారుడు ఈసా (ప్రవక్త) తన శిష్యుల్ని సంబోదిస్తూ “దేవుని వైపు (ప్రజల్ని పిలవడంలో) నాకు సహాయపడే వారెవరైనా ఉన్నారా?” అని అడిగాడు. దానికి వారు “మేమున్నాం దేవుని సహాయకులం” అన్నారు.
ఇలా మీరు కూడా దేవుని (ధర్మాని)కి సహాయకులుగా ఉండండి. ఆ సందర్భం లో ఇస్రాయీల్‌ సంతతిలో ఒక వర్గం (ఈసాను) విశ్వసించింది; రెండవ వర్గం తిరస్క రించింది. తరువాత మేము విశ్వాసులకు వారి విరోధులకు వ్యతిరేకంగా సహాయం చేశాము. (చివరికి) వారే విజయం సాధించారు. (14)