కురాన్ భావామృతం/అష్-షూరా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

42. షూరా (సలహా సంప్రదింపులు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 53)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
హా-మీమ్‌, ఐన్‌-సీన్‌- ఖాఫ్‌. మహా శక్తిమంతుడు, అపార వివేకవంతుడయిన దేవుడు గత ప్రవక్తల దగ్గరకు ఏవిధంగా దివ్యావిష్కృతి పంపుతుండేవాడో అదేవిధంగా ఇప్పుడు నీదగ్గరకు కూడా దివ్యావిష్కృతి పంపుతున్నాడు. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం ఆయనదే. ఆయన సర్వాధికుడు, సర్వోన్నతుడు. (1-4)
(దేవుని ఘనత-పవిత్రలను కించపరిచే చేష్టల వల్ల) పైనుండి ఆకాశం బ్రద్దలై పడి పోవచ్చు. దైవదూతలు తమ ప్రభువుని స్తుతిస్తూ ఆయన్ని స్మరిస్తున్నారు. భూలోకవాసుల పాపాలు క్షమించమని కూడా మనవిచేస్తున్నారు. వినండి, దేవుడే గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. తనను వదలి ఇతరుల్ని సంరక్షకులుగా చేసుకున్నవారిని ఆయన గమనిస్తూనే ఉన్నాడు. నీవు వారి (తిరస్కారవైఖరి)కి బాధ్యుడవు కావు. (5-6)
అలాగే మక్కావారిని, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలవారిని (సత్యతిరస్కార పర్యవ సానం గురించి) హెచ్చరించడానికి మేమీ ఖుర్‌ఆన్‌ని అరబీభాషలో నీవద్దకు పంపాము. (మానవులంతా) సమావేశమయ్యే రోజు (సంభవించే భయంకర పరిణామాల్ని) గురించి కూడా హెచ్చరించు. ఆరోజు తప్పకుండా వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు ఒక వర్గం స్వర్గానికి, మరొక వర్గం నరకానికి పోవలసి ఉంటుంది. (7)
దేవుడు తలచుకుంటే వీరందర్నీ ఒకే సమాజంగా చేయగలడు. కాని ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యఛాయలోకి తీసుకుంటాడు. దుర్మార్గులకు మాత్రం ఏ సహాయకుడూ, సంరక్షకుడూ ఉండడు. వారు దేవుడ్ని వదలి ఇతరుల్ని సంరక్షకులు గా చేసుకున్నారా? నిజానికి అసలు సంరక్షకుడు దేవుడే. ఆయనే మృతుల్ని తిరిగి బ్రతి కించేవాడు. ఆయన ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (8-9)
(ప్రవక్తా! చెప్పు:) “మీమధ్య ఏ విషయంలో విభేదం వచ్చినా దాన్ని పరిష్కరించే పని దేవునిదే. ఆయనే నా ప్రభువు. ఆయన్నే నేను నమ్ముకున్నాను. (ఏ సమస్య వచ్చినా) నేను ఆయన (హితవుల) వైపుకే మరలుతాను.” (10)
ఆయన భూమ్యాకాశాలకు సృష్టికర్త. ఆయనే మీజాతి నుండి మీకు తోడుగా జంటల్ని పుట్టించాడు. అలాగే జంతువుల్లో కూడా జంటల్ని పుట్టించాడు. ఇలా ఆయన ప్రాణికోటి సంతతిని విస్తరింపజేస్తున్నాడు. యావత్తు విశ్వవ్యవస్థలో ఆయన్ని పోలిన వస్తువు, (జీవి)లేదు. ఆయన సమస్తం వింటున్నాడు, చూస్తున్నాడు. భూమ్యాకాశాల తాళపుచెవులు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన తలచినట్లు కొందరికి పుష్కలంగా, కొందరికి స్వల్పంగా ఉపాధి నిస్తున్నాడు. ఆయన సర్వం ఎరిగినవాడు. (11-12)
ఆయన నూహ్‌కు ఆదేశించిన జీవనమార్గాన్నే మీకోసం నిర్దేశించాడు. (ప్రవక్తా!) దానినే ఇప్పుడు దివ్యావిష్కృతి ద్వారా నీ దగ్గరకు పంపించాడు. ఈ జీవన మార్గాన్నే మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీం, మూసా, ఈసాల క్కూడా అందజేస్తూ అందులోనే (జీవితాంతం) స్థిరంగా ఉండాలని, వర్గభేదాలు సృష్టించకూడదని హెచ్చిరించాం. ఈ విషయాన్ని గురించే నీవు బోధిస్తున్నప్పుడు బహుదైవారాధకులు బెదిరిపోతున్నారు. దేవుడు తానుకోరిన మనిషిని తనవాడిగా చేసుకుంటాడు. తన వైపు మరలేవాడికే ఆయన తన సాన్నిధ్యానికి చేరుకునే మార్గం చూపిస్తాడు. (13)
మానవులు తమ దగ్గరకు (సత్య)జ్ఞానం వచ్చిన తర్వాత, (దాన్ని వదలి) పరస్పరం పంతాలకు పోయి కలహించుకోవడం వల్లనే వారిలో వర్గభేదాలు ఏర్పడ్డాయి. నీ ప్రభువు దగ్గర నిర్ణీత సమయం అనే మాట లేకపోయిఉంటే ఆయన వారి కథ ఎప్పుడో పరిసమాప్తం చేసివుండేవాడు. పూర్వీకుల తరువాత (దైవ)గ్రంథానికి వారసులుగా చేయ బడినవారు దాన్ని సందేహిస్తూ, తీవ్ర సందిగ్ధంలో పడిపోయారు. (14)
ఏమైనప్పటికీ (ప్రవక్తా!) నీవు అదే జీవనవిధానం వైపు ప్రజలను ఆహ్వానించు. నీకివ్వబడిన ఆదేశం ప్రకారం ఆ విధానంలోనే స్థిరంగా ఉండు. అంతేగాని లోకుల మనోవాంఛల్ని అనుసరించకు. వారికిలా తెలియజెయ్యి: “నేను దేవుడు పంపిన ప్రతి గ్రంథాన్ని విశ్వసిస్తున్నాను. మీ వ్యవహారాలన్నీ న్యాయంగా, నిష్పక్షపాతంగా పరిష్కరిం చాలని నాకు ఆజ్ఞయింది. దేవుడే మా ప్రభువూ, మీ ప్రభువు కూడా. మేము చేసే కర్మలు మాతో పాటు ఉంటాయి. మీరు చేసే కర్మలు మీతో పాటుంటాయి. (కనుక) మీకూ, మాకూ మధ్య ఎలాంటి జగడంలేదు. దేవుడు ఓరోజు మనల్నందర్నీ సమావేశపరుస్తాడు. మనమంతా చివరికి ఆయన దగ్గరికే మరలి పోవలసి ఉంది.” (15)
దైవసందేశం స్వీకరించిన తర్వాత కొందరు దేవుని విషయంలో జగడమాడు తున్నారు. వారి వివాదం దేవుని దృష్టిలో అన్యాయమైనది, అధర్మమైనది. వారిపై దైవాగ్రహం విరుచుకు పడుతుంది. వారి కోసం కఠినశిక్ష కాచుకొని ఉంది. (16)
ఆ దేవుడే సత్యం ప్రాతిపదికపై ఈ గ్రంథాన్ని, త్రాసుని (అంటే ధర్మశాస్త్రాన్ని) అవతరింపజేశాడు. తీర్పుఘడియ సమీపంలోనే ఉందేమో మీకేం తెలుసు? దాన్ని విశ్వసించనివారే దానికోసం తొందరపెడ్తున్నారు. దాన్ని విశ్వసించినవారు మాత్రం దాని పట్ల భయపడుతున్నారు. అది తప్పకుండా వస్తుందని వారికి తెలుసు. వినండి, ఆ ఘడియ రాక గురించి సందేహాస్పదమయిన వాదనలు చేస్తున్నవారు మార్గభ్రష్టత్వంలో పడి బహుదూరం కొట్టుకుపోయారు. (17-18)
దేవుడు తన దాసుల విషయంలో అమిత దయామయుడు, అపార వాత్సల్యుడు. ఆయన తలచినవారికి తలచినది ప్రసాదిస్తాడు. ఆయన ఎంతో బలాఢ్యుడు, మహా శక్తి మంతుడు. పరలోక సుకృతఫలం కోరుకునేవారి కోసం మేము వారి పుణ్యఫలం వృద్ధి చేస్తాం. ఇహలోకఫలం కోరుకునేవారికి మేము ఇహలోకంలోనే దాన్ని ప్రసాదిస్తాం. అయితే పరలోక(సుకృతఫల)ంలో వారికి ఎలాంటి వాటా లభించదు. (19-20)
వారు ఆశ్రయించిన మిధ్యాదైవాలలో ఏవైనా దేవుడు అనుమతించని ధర్మమార్గం వారి కోసం నిర్ణయించాయా? తీర్పు విషయం ముందే నిర్ణయించబడకపోయిఉంటే వారి కథ ఎప్పుడో సమాప్తమయి ఉండేది. అలాంటి దుర్మార్గులకు తప్పనిసరిగా దుర్భర శిక్ష పడుతుంది. అప్పుడీ దుర్మార్గులు తమ దుష్కర్మల పర్యవసానం పట్ల భయపడ టాన్ని నీవు చూస్తావు. అది వారి మీద తప్పకుండా వచ్చిపడుతుంది. పోతే సత్యాన్ని విశ్వసించి, సదాచార సంపన్నులైనవారు స్వర్గవనాల్లో ఉంటారు. వారికి వారు కోరుకున్న దల్లా వారి ప్రభువు వద్ద లభిస్తుంది. ఇదే అన్నిటికంటే గొప్ప దైవానుగ్రహం. (21-22)
ఇలాంటి శుభవార్తనే దేవుడు సత్యాన్ని విశ్వసించి సదాచరణ వైఖరి అవలంబిం చిన దాసులకు అందజేస్తున్నాడు. కనుక ప్రవక్తా! వారికిలా చెప్పు: “నేనీ (ధర్మప్రచారం) పని కోసం మీనుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించడం లేదు. కాకపోతే బంధుప్రేమను మాత్రం మీనుండి తప్పక ఆశిస్తాను.” సత్కార్యాలు చేసేవారికి ఆ సత్కార్యాల్లో మేము వృద్ధీవికాసాలు కలిగిస్తాం. దేవుడు గొప్ప క్షమాశీలి, ఎంతో ఆదరించేవాడు. (23)
వారు (నీగురించి) “ఈమనిషి దేవునిపై నిందలు మోపుతున్నాడ”ని అంటున్నారా? (అదే నిజమైతే) దేవుడు తలచుకుంటే నీ హృదయకవాటాలు మూసివేస్తాడు. (కాని వారు చెబుతున్నది పచ్చిఅబద్ధం, నీపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు.) దేవుడు అసత్యాన్ని అంతమొందిస్తున్నాడు. తన సద్వచనాలతో సత్యాన్ని సత్యంగా నిరూపిస్తున్నాడు. ఆయనకు (మానవుల) ఆంతర్యాలలో మెదిలే రహస్యాలు సైతం తెలుసు. (24)
ఆయనే తన దాసులు పశ్చాత్తాపంతో చేసే వేడుకోలు స్వీకరించి వారి పొరపాట్లు మన్నిస్తున్నాడు. ఆయనకు మీ చేష్టలన్నీ తెలుసు. (అయినప్పటికీ ఆయన మిమ్మల్ని ఉపేక్షిస్తున్నాడు.) విశ్వసించి, సదాచార సంపన్నులైనవారు చేసే వేడుకోలును ఆయన స్వీకరిస్తాడు. పైగా ఆయన తన అనుగ్రహంతో వారికి మరింత(భాగ్యం) ప్రసాదిస్తాడు. సత్యతిరస్కారులకు మాత్రం దుర్భర యాతనలు తప్పవు. (25-26)
ఒకవేళ దేవుడు తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధినిస్తే, వారు ప్రపంచంలో గర్విష్ఠులయి తిరుగుబాటుకు పాల్పడతారు. అందువల్ల ఆయన తానుతలచిన విధంగా ఒక నిర్ణీత పరిమాణంలో (ఉపాధి) దించుతున్నాడు. ఆయనకు తనదాసుల (స్వభావం) గురించి బాగా తెలుసు. వారిని ఆయన ఓకంట గమనిస్తున్నాడు. (27)
ప్రజలు (వర్షాభావంతో) నిరాశ చెందినప్పుడు ఆ దేవుడే వర్షం కురిపించి తన కారుణ్యాన్ని విస్తృతం చేస్తున్నాడు. ఆయనే (అందరికీ) సంరక్షకుడు, ప్రశంసనీయుడు#
ఆయన నిదర్శనాలలో భూమ్యాకాశాల సృష్టి కూడా ఒకటి. ఆ రెండిటిలోనూ ఆయన జీవరాసులను వ్యాపింపజేసి ఉంచాడు. తాను తలచుకున్నప్పుడు వాటిని (పరలోకంలో ఒకచోట) సమీకరించగలడు. (28-29)
మీకు ఏ ఆపద వచ్చినా అది మీ చేజేతులా తెచ్చిపెట్టుకున్నదే అవుతుంది. మీరు చేస్తున్న అనేక పొరపాట్లను ఆయన ఇట్టే క్షమించి వదలిపెడ్తున్నాడు. (అయినా మీరు మీ దురాగతాలను మానుకోవడం లేదు.) అయితే మీరు ప్రపంచంలో దేవుని పట్టు నుండి తప్పించుకొని ఎక్కడికీ పారిపోలేరు. దేవునికి వ్యతిరేకంగా మీకు ఎలాంటి సహాయకుడూ, సంరక్షకుడూ లభించడు. (30-31)
ఆయన నిదర్శనాలలో సముద్రంలో కొండల్లా కన్పించే ఓడలు కూడా ఉన్నాయి. దేవుడు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు గాలిని స్తంభింపజేయగలడు. దాంతో ఆ ఓడలు సముద్రతలంపై (ముందుకు సాగకుండా ఎక్కడికక్కడ) నిలిచిపోతాయి. సహన వైఖరి అవలంబించి కృతజ్ఞులయి ఉండేవారికి ఇందులో గొప్ప సూచనలున్నాయి......లేదా ఓడ ప్రయాణీకులు చేసిన అనేక పాపాలను మేము క్షమించి, కేవలం కొన్ని పాపాల కారణంగా వారిని (నడి సముద్రంలో) ముంచివేయగలం. అప్పుడు మా సూక్తుల్ని గురించి వితండవాదం చేసేవారికి నిజం తెలిసొస్తుంది. రక్షణ పొందడానికి తమకిక ఎలాంటి అశ్రయం లేదని వారు తెలుసుకుంటారు. (32-35)
ఇహలోకంలో మీకివ్వబడిన జీవన సామగ్రి మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. దేవుని దగ్గర (పరలోకంలో) ఉన్నదే శ్రేష్ఠమైనది, శాశ్వతమైనది. అయితే సత్యాన్ని విశ్వసించి తమ ప్రభువును నమ్ముకున్నవారికే ఇది లభిస్తుంది. (36)
(అలా విశ్వసించినవారి గుణగణాలు ఈవిధంగా ఉంటాయి:)

  • వారు ఘోరపాపాలకు, నీతిబాహ్యమైన పనులకు దూరంగా ఉంటారు.
  • కోపోద్రేకాలు కలిగినప్పుడు (వాటిని దిగమింగి ఇతరుల్ని) క్షమిస్తారు.
  • తమ ప్రభువు ఆదేశాలు శిరసావహించడానికి సదా సిద్ధంగా ఉంటారు.
  • ప్రార్థనా (నమాజు) వ్యవస్థ నెలకొల్పుతారు.
  • పరస్పరం సలహా సంప్రదింపులతో తమ వ్యవహారాలు నడుపుకుంటారు.
  • మేము ప్రసాదించిన ఉపాధిలో కొంత మా మార్గంలోనూ ఖర్చుపెడతారు.
  • వారిపై ఎవరైనా దౌర్జన్యంచేస్తే వారు దాన్ని ఎదుర్కొంటారు. (37-39)

కీడుకు ప్రతీకారం అలాంటి కీడే. ఐతే ఎవరైనా ప్రతీకారం చేయకుండా ప్రత్యర్థిని క్షమించి పరిస్థితి చక్కబరిస్తే అతనికి (దాని) ప్రతిఫలమిచ్చే బాధ్యత దేవునిపై ఉంది. దేవుడు దౌర్జన్యపరుల్ని ప్రేమించడు. దౌర్జన్యం జరిగిన తర్వాత బదులు తీర్చుకుంటే తప్పులేదు. ఇతరులపై దౌర్జన్యంచేస్తూ దేశంలో అన్యాయంగా కల్లోలం రేపేవారినే తప్పు పట్టాలి. అలాంటివారికి దుర్భరశిక్ష ఉంది. కాకపోతే సహనంతో వ్యవహరిస్తూ (ప్రత్యర్థిని) క్షమించగలిగితే (ఎంతో మంచిది). ఇది ఎంతో ధైర్యసాహసా లతో కూడిన పని. (40-43)
దేవుడు ఎవరినైనా మార్గభ్రష్టుడిగా చేస్తే ఇక దేవునికి వ్యతిరేకంగా అతడ్ని రక్షించే వారెవరూ ఉండరు. ఈ దుర్మార్గులు (మా)శిక్ష కళ్ళారా చూసినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో నీవు చూస్తావు. వారు (నరక)యాతన చూసి “ఇప్పుడు (మాకు బుద్ధొచ్చింది. భూలోకానికి) తిరిగి వెళ్ళే మార్గమేదైనా ఉందా?” అని అడుగుతారు. (44)
వారిని నరకం దగ్గరకు తెచ్చినప్పటి పరిస్థితి కూడా నీవు చూస్తావు. అప్పుడు వారు అవమానభారంతో క్రుంగిపోతారు. బితుకు బితుకుమంటూ బిక్కచచ్చిన చూపులతో చూస్తారు. అప్పుడు విశ్వాసులు (వారి దుస్థితి చూసి) “ఈరోజు ప్రళయదినాన తమను, తమ కుటుంబీకులను నష్టపరచుకున్నవారే సర్వం కోల్పోయినవారు” అంటారు.
వినండి! దుర్మార్గులు శాశ్వతంగా (నరక) యాతనల్లో చిక్కుకుంటారు. అక్కడ దేవునికి వ్యతిరేకంగా వారిని ఆదుకోవడానికి ఎలాంటి సహాయకుడూ, సంరక్షకుడూ ఉండడు. దేవుడు మార్గభ్రష్టత్వంలో పడవేసిన వాడికి ఇక అందులో నుంచి తప్పించు కునే మార్గమే ఉండదు. (కనుక మానవులారా!) దేవుని తరఫున ఎలాంటి పరిస్థితిలోనూ తప్పిపోని (పళయ)దినం రాకముందే మీ ప్రభువు మాట ఒప్పుకోండి. ఆరోజు మీకు ఎలాంటి రక్షణ లభించదు, మీ తలరాతను ఎవడూ మార్చలేడు. (45-47)
ప్రవక్తా! వీరు (మామాట వినకుండా) ముఖం తిప్పుకుంటే తిప్పుకోని. మేము నిన్ను వారి మీద పర్యవేక్షకుడిగా చేసి పంపలేదు. సందేశం అందజేయడమే నీ బాధ్యత. మానవుడు చాలా చిత్రమైన మనిషి. మేమతనికి మా అనుగ్రహం చవిచూపిస్తే సంతోషం తో పొంగిపోతాడు. కాని చేజేతులా చేసుకున్న దుష్కార్యమేదైనా ఆపద రూపంలో వచ్చిపడితే (లోగడ దేవుడు చేసిన మేలంతా మరచిపోయి) కృతఘ్నుడైపోతాడు. (48)
దేవుడు భూమ్యాకాశాలకు యజమాని, సార్వభౌముడు. తాను తలచిన ప్రతిదాన్నీ సృష్టించగలడు. తాను తలచిన విధంగా కొందరికి మగసంతానం, కొందరికి ఆడ సంతానం, మరికొందరికి ఆడ, మగ సంతానం ప్రసాదిస్తాడు. అలాగే తాను తలచినట్లు కొందరిని సంతాన హీనులుగా కూడా చేస్తాడు. ఆయన గొప్ప జ్ఞానసంపన్నుడు, సమస్త కార్యాలు చేయగల సమర్థుడు. (49-50)
దేవుడు ఏ మానవునితోనూ నేరుగా సంభాషించడు. మానవమాత్రుడికి అది సాధ్య మయ్యే పనికాదు. దేవుడు తనమాటను దివ్యావిష్కృతి ద్వారానో లేక తెరవెనుక నుంచో మనిషికి చేరవేస్తాడు. లేదా తానుకోరినది తనఆజ్ఞతో సూచించడానికి సందేశహరుడ్ని (దైవదూతను) పంపుతాడు. ఆయన మహోన్నతుడు, ఎంతో వివేకవంతుడు. (51)
ప్రవక్తా! అలాగే మేము దివ్యావిష్కృతి ద్వారా నీవద్దకు మా ఆజ్ఞల్ని పంపుతున్నాం. ఇంతకు ముందు నీకు గ్రంథం అంటే ఏమిటో తెలియనే తెలియదు. కాని ఆ తరువాత ఈ దివ్యావిష్కృతిని ఒక జ్యోతిగా చేసి మేము కోరిన మా దాసునికి రుజుమార్గం చూపు తున్నాం. నిస్సందేహంగా నీవు ప్రజలను సన్మార్గం వైపుకు నడిపిస్తున్నావు. అది భూమ్యా కాశాల్లోని సమస్త సృష్టిరాసులకు యజమాని అయిన దేవుని మార్గం. వినండి! సమస్త వ్యవహారాలు చివరికి దేవుని దగ్గరికే చేరుకుంటాయి. (52-53)