కురాన్ భావామృతం/అర్-రూమ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

30. రూమ్‌ (రోమ్‌వాసులు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 60)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌- మీమ్‌. రోమన్లు సమీపభూభాగం (ఈరాన్‌)లో తప్పకుండా పరాజయం పాలవుతారు. పరాజయం పాలైన కొన్నేండ్లలోనే వారు తిరిగి విజయం సాధిస్తారు. ఇంతకు ముందు కూడా దేవునికే అధికారం ఉండేది; ఆ తరువాత కూడా ఆయనదే అధికారం. అది దేవుడు ప్రసాదించిన విజయం పట్ల ముస్లింలు ఆనందో త్సవాలు జరుపుకునే రోజవుతుంది. దేవుడు తాను కోరిన వారికి సహాయం చేస్తాడు. ఆయన మహా శక్తిమంతుడు, అమిత దయామయుడు. దేవుడే ఈ(విజయ) వాగ్దానం చేస్తున్నాడు. ఆయన తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగపరచడు. కాని చాలా మంది (ఈ వాస్తవాన్ని) గ్రహించడం లేదు. (1-6)
ప్రజలకు ఇహలోక జీవితానికి సంబంధించిన బాహ్యస్వరూపమే తెలుసు. పరలోకం గురించి ఏమరుపాటుకు లోనయి ఉన్నారు. వారు తమ అస్తిత్వాన్ని గురించి ఎన్నడూ యోచించలేదా? దేవుడు భూమ్యాకాశాల్ని, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఒక నిర్ణీత కాలం కొరకు సత్యబద్ధంగా సృష్టించాడు. కాని చాలామంది తమ ప్రభువును కలుసుకోవలసి ఉందన్న సత్యాన్ని నిరాకరిస్తున్నారు. (7-8)
వీరెప్పుడూ ప్రపంచం తిరిగి చూడలేదా? తమకు పూర్వం గతించిన వారికి ఏం గతి పట్టిందో వీరికి తెలియదా? వీరికన్నా వారు ఎంతో శక్తిమంతులు. వారు నేలను బాగా దున్నారు. వీరికంటే వారే భూమిని ఎక్కువ నిర్మాణకార్యాలతో వృద్ధిపరిచారు. వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తెచ్చారు. దేవుడు వారికి అన్యాయం చేయలేదు. వారే (ఆత్మవంచనకు పాల్పడి) తమకు తాము అన్యాయం చేసుకున్నారు. చివరికి చెడ్డ పనులకు పాల్పడిన ప్రజలు ఘోరమైన దుష్ఫలితం చవిచూశారు. కారణం వారు దేవుని సూక్తులు తిరస్కరించి వాటిని పరిహసిస్తుండేవారు. (9-10)
దేవుడే సృష్టిని ప్రారంభించేవాడు. వాటిని పునరుత్పత్తి చేసేవాడు కూడా ఆయనే. చివరికి మీరు ఆయన దగ్గరికే పోవలసి ఉంది. ప్రళయం సంభవించే రోజు నేరస్థులు నిరాశా నిస్పృహలతో క్రుంగిపోతారు. వారు కల్పించుకున్న మిధ్యాదైవాల్లో ఒక్కటీ వారికి సిఫారసు చేయలేదు. వారు తమ కల్పితదైవాలను తిరస్కరిస్తారు. (11-13)
ప్రళయదినాన (మానవులు) విభిన్న వర్గాలుగా విడిపోతారు. సత్యాన్ని విశ్వసించి సత్కర్మలు చేసినవారు స్వర్గంలో సుఖసంతోషాలతో ఉంటారు. మా సూక్తుల్ని, పరలోక సంభవాన్ని తిరస్కరించిన అవిశ్వాసులు (నరక)యాతనల్లో మగ్గుతారు. (14-16)
కనుక (విశ్వాసులారా!) మీరు సాయంత్రం చీకటిపడిన తరువాత, ఉదయంవేళ దేవుడ్ని స్మరించండి. భూమ్యాకాశాలంతటా ఆయనే స్తుతింపదగినవాడు. పొద్దువాలిన తర్వాత వేళ, మధ్యాహ్నం వేళ కూడా (ఆయన్ని స్మరించండి).
ఆయన జీవి నుండి నిర్జీవపదార్థాన్ని నిర్జీవపదార్థం నుండి జీవిని బయటికి తీస్తాడు. భూమి (బీటలు వారి) మృతప్రాయమై ఉన్నప్పుడు దానిక్కూడా ఆయనే (వర్షం ద్వారా) జీవం పోస్తున్నాడు. అదేవిధంగా మీరు కూడా (మరణావస్థ నుండి) బయటికి తీయబడతారు. ఆయన మిమ్మల్ని మట్టితో సృజించాడు. తరువాత మీరు ఒక్కసారిగా మానవులయి విస్తరిస్తూ పోయారు. ఆయన సూచనల్లో ఇదొక సూచన. (17-20)
ఆయన మీకోసం మీజాతి నుండే జీవిత భాగస్వాము(స్త్రీ)లను సృజించాడు, వారి దగ్గర మీరు సౌఖ్యం పొందడానికి. ఇంకా ఆయన మీ మధ్య ప్రేమానురాగాలు, దయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన సూచనల్లోనిదే. యోచించే వారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (21)
ఆయన సూచనల్లో భూమ్యాకాశాల నిర్మాణం, మీ భాషలు, వర్గ వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. విజ్ఞులకు ఇందులో అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఆయన సూచనల్లో రాత్రివేళ మీరు పడుకోవడం, పగలు మీరాయన అనుగ్రహాన్ని (ఉపాధిని) అన్వేషించడం కూడా ఉన్నాయి. ఆలకించేవారికి ఇందులో అనేక నిదర్శనాలున్నాయి. (22-23)
ఆయన సూచనల్లో మరొకటి...ఆయన మీకు భయాన్ని కలిగించే, ఆశను రేకెత్తించే మెరుపును చూపిస్తున్నాడు. ఆకాశం నుండి వర్షం కురిపించి మృతభూమికి జీవం పోస్తున్నాడు. ఇందులోనూ బుద్ధిమంతులకు గొప్ప నిదర్శనాలున్నాయి. ఆయన సూచన ల్లో వేరొకటి...భూమ్యాకాశాలు ఆయన ఆజ్ఞతోనే ఏర్పడ్డాయి. ఆయన నేల నుండి (లేచి రమ్మని) పిలువగానే మీరు ఒకేఒక పిలుపుతో తక్షణమే లేచివస్తారు. (24-25)
భూమ్యాకాశాల్లోఉన్న సమస్తం ఆయన దాసులే, ఆయన ఆజ్ఞల్ని శిరసావహించే వారే. ఆయనే సృష్టినిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాడు. తిరిగి ఆయనే సృష్టితాలను పునరు త్పత్తి చేస్తున్నాడు. ఈపని చేయడం ఆయనకు చాలా తేలిక. భూమ్యాకాశాల్లో ఆయన ఔన్నత్యం అద్వితీయమైనది. ఆయన మహా శక్తిమంతుడు, వివేకవంతుడు. (26-27)
ఆయన మీ గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: మేము మీకు ప్రసాదించిన సిరిసంపదల్లో మీతోపాటు సమాన భాగస్వాములైన మీ బానిసలు ఎవరైనా ఉన్నారా? మీరు మీతోటి యజమానులకు భయపడినట్లు వారిని చూసి భయపడతారా? ఇలా మేము బుద్ధీజ్ఞానం కలవారికోసం మా సూక్తులు విడమరచి తెలియజేస్తున్నాం. (28)
కాని ఈ దుర్మార్గులు బుద్ధినుపయోగించి ఆలోచించకుండా తమ అభూతకల్ప నలు పట్టుకొని వ్రేలాడుతున్నారు. దేవుడు దారి తప్పించినవాడ్ని ఇక ఎవరు దారికి తీసుకురాగలరు? అలాంటివారికి ఎవరూ సహాయం చేయలేరు. (29)
కనుక (విశ్వాసులారా!) మీరు ఏకాగ్రచిత్తులై (దేవుడు చూపిన) ఈ ధర్మాన్నే అంటి పెట్టుకొని ఉండండి. దేవుడు మానవుల్ని ఏ ప్రకృతి(ధర్మం) ఆధారంగా పుట్టించాడో ఆ ప్రకృతి (ధర్మం)లోనే స్థిరంగా ఉండండి. ఆయన రూపొందించిన ప్రకృతికి మార్పులేదు. ఇదే సరైనమార్గం, (సహజ)ధర్మం. కాని చాలామంది (దీన్ని) ఎరుగరు. (మీరు) దేవుని (మార్గం)వైపుకే మరలి ఆయనకు భయపడుతుండండి. నమాజు స్థాపించండి. బహుదైవా రాధకులతో కలసిపోకండి. వారు తమధర్మాన్ని చీల్చుకొని విభిన్నవర్గాలుగా విడిపోయారు. ప్రతివర్గం తన దగ్గరున్నదానిలో (కల్పిత మతాచారాల్లో) నిమగ్నమై ఉంది. (30-32)
ప్రజలు (సాధారణంగా) ఏదైనా కష్టం వచ్చినప్పుడు తమ (నిజ) ప్రభువు వైపు మరలి ఆయన్నే వేడుకుంటారు. కాని ఆయన (ఆ కష్టం దూరంచేసి) తన కారుణ్యాన్ని కాస్త చవిచూపించగానే వారిలో కొందరు మళ్లీ బహుదైవారాధనకు పాల్పడతారు. ఇలా మేము చేసిన మేలుకు మాపట్ల (కృతజ్ఞత చూపకుండా) కృతఘ్నులై పోతున్నారు. సరే, కొంతకాలం (ఐహిక)సుఖాలు జుర్రుకోండి. (దీని పర్యవసానం ఏమిటో) మీకు త్వర లోనే తెలుస్తుంది. మీరు చేస్తున్న ఈ బహుదైవారాధన సత్యమని నిరూపించే ఆధారం ఏదయినా మేము మీ దగ్గరకు పంపించామా? (33-35)
మేము ప్రజలకు ఎప్పుడైనా మా కారుణ్యం కాస్త చవిచూపిస్తే చాలు, వారు సంతోషంతో పొంగిపోతారు. (ఆపై అదంతా తమ కృషి ఫలితమని మిడిసిపడతారు.) కాని చేజేతులా చేసుకున్నదాని ఫలితంగా ఏదైనా ఆపద వచ్చిపడితే మాత్రం వెంటనే నిరాశ చెందుతారు. దేవుడే తాను తలచిన విధంగా కొందరికి పుష్కలంగా, మరికొంద రికి స్వల్పంగా ఉపాధి నిస్తున్న సంగతి వీరు గమనించడం లేదా? విశ్వసించేవారికి ఇందులో గొప్ప సూచనలున్నాయి. (36-37)
కనుక బంధువులకు రావలసిన హక్కులు బంధువులకు ఇచ్చేయండి. అలాగే పేదలకు, బాటసారులకు కూడా. దైవప్రసన్నత కోరుకునేవారికి ఇది చాలామంచి పద్ధతి. అలాంటివారే సార్థకజీవులు, సఫలీకృతులు. ప్రజల ధనంలో కలిసిపోయి వృద్ధిచెందు తుందన్న ఉద్దేశ్యంతో మీరిచ్చే వడ్డీ దేవుని దృష్టిలో ఎన్నటికీ వృద్ధిచెందదు. దైవప్రసన్నత కోసం (పేదల ఆర్థికహక్కుగా) మీరు చెల్లించే జకాత్‌ మాత్రమే (మీకు శుభాన్నిస్తుంది). అలా జకాత్‌ చెల్లించేవారే నిజానికి తమ ధనాన్ని వృద్ధిచేసుకుంటారు. (38-39)
దేవుడే మిమ్మల్ని పుట్టించి మీకు ఉపాధినిస్తున్నాడు. ఆయనే మీకు మరణం కలిగి స్తున్నాడు. ఆయనే మిమ్మల్ని (పునరుత్థాన దినాన) బ్రతికించి లేపేవాడు కూడా. మీరు దేవునికి సాటికల్పించిన మిధ్యాదైవాలేవైనా వీటిలో ఒక్క పనైనా చేయగలవా? వీరు చేస్తున్న బహుదైవారాధనకు దేవుడు ఎంతోఅతీతుడు, ఉన్నతుడు, పరమపవిత్రుడు. (40)
ప్రజలు చేసిన (అ)కృత్యాల కారణంగా నేలపై, నీటిపై సంక్షోభం ఏర్పడింది. వారికి దేవుడు వారి దుష్కార్యాల పర్యవసానాన్ని చవిచూపేందుకే ఇలా జరిగింది, ఈ శిక్ష వల్ల వారు (తమ దుశ్చర్యలు) మానుకుంటారేమో (చూడాలి). (41)
(ప్రవక్తా!) పూర్వం గతించిన ప్రజలకు ఎలాంటి గతి పట్టిందో ప్రపంచంలో తిరిగి చూడండని చెప్పు. వారిలో చాలామంది బహుదైవారాధకులే. కనుక దేవుని తరఫున అనివార్య (ప్రళయ)దినం రాకముందే నీవీ ధర్మమార్గం వైపు మరలి అందులో స్థిరంగా ఉండు. ఆరోజు ప్రజలు ఛిన్నాభిన్నమై ఒకరినుండి మరొకరు విడిపోతారు. (42-43)
సత్యాన్ని ఎవరు తిరస్కరిస్తారో ఆ తిరస్కార నష్టం వారికే వాటిల్లుతుంది. సత్కా ర్యాలు చేస్తున్నవారు నిజానికి తమ ముక్తిమార్గాన్నే సుగమం చేసుకుంటున్నారు. విశ్వసించి సత్కర్మలు చేసేవారికి దేవుడు దయతో ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఆయన సత్యతిరస్కారుల్ని ఎన్నటికీ ప్రేమించడు. (44-45)
దేవుని సూచనల్లో ఒకటి... ఆయన (తన అనుగ్రహం వర్షిస్తుందన్న) శుభవార్తను తెలిపే చల్లటి గాలులు పంపిస్తున్నాడు; మీకు తన కారుణ్యం(వర్షం) ప్రసాదించడానికి. తన ఆజ్ఞతో ఓడలు నడవడానికి, తన అనుగ్రహాన్ని (ఉపాధిని) మీరు అన్వేషించడానికి, తన పట్ల మీరు కృతజ్ఞత చూపడానికి ఆయన ఈ ఏర్పాటు చేశాడు. (46)
మీకు పూర్వం మేము అనేక జాతుల దగ్గరకు ఆ జాతులకు చెందిన ప్రవక్తలను పంపాము. వారు తమ జాతిప్రజల దగ్గరకు స్పష్టమైన సూచనలు తీసికెళ్ళారు. ఆ తర్వాత పాపాలకు పాల్పడినవారికి మేము ప్రతీకారం చేశాం. (వారిలో) సత్యాన్ని విశ్వ సించినవారికి మేము సహాయం కూడా చేశాము. అది మా బాధ్యత. (47)
మేఘాలను మోసుకెళ్ళే గాలులను పంపేవాడు దేవుడే. ఆయనే తానుకోరినట్లు ఆ మేఘాలను ఆకాశంలో విస్తరింపజేస్తున్నాడు. ఆయనే వాటిని తునకలుగా విభజిస్తు న్నాడు. తరువాత ఆ మబ్బుతునకల నుండి వర్షం ధారాపాతంగా కురవడం మీకు కన్పిస్తుంది. ఆ వర్షాన్ని ఆయన తన దాసులలో తాను తలచిన వారిపై కురిపిస్తాడు. అప్పటిదాకా ఆశానిరాశల మధ్య ఊగిసలాడిన ఆ దాసులు (వర్షం చూసి) ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోతారు. దేవుని కారుణ్యప్రభావం చూడండి, (వర్షం కురవగానే) మృతప్రాయంగా పడివున్న నేల సజీవమై (సస్యశ్యామలమై) పోతుంది. (అలాగే) ఆయన (మరణానంతరం) మృతులకు తిరిగి ప్రాణంపోసి లేపుతాడు. ఆయన ప్రతి పనీ చేయగల సమర్థుడు, సర్వ శక్తిమంతుడు. (48-50)
మేము గనక తీవ్రమైన (వడ)గాలి పంపి, దాంతో వారి పంటపొలాలు (మాడి) పసుపుపచ్చగా మారిపోతే వారు అవిశ్వాసంలో మరింత కూరుకుపోతారు. నీవు మృతు లకు, ముఖంతిప్పి వెళ్ళే చెవిటోళ్ళకు సత్యాన్ని విన్పించలేవు. నీవు అంధుల్ని కూడా అపమార్గం నుండి తీసి సన్మార్గం చూపలేవు. మా సూక్తులు విశ్వసించి విధేయులయ్యే వారికే నీవు (సత్యాన్ని) విన్పించగలవు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని పుట్టిం చినవాడు దేవుడే. ఆ బలహీనత తర్వాత ఆయన మీకు శక్తి కల్గించాడు. ఆ శక్తి తర్వాత తిరిగి మిమ్మల్ని బలహీనులుగా, వృద్ధులుగా చేస్తున్నాడు. ఆయన తాను తలచిన దాన్ని సృజిస్తున్నాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు, సర్వ శక్తిమంతుడు. (51-54)
ప్రళయఘడియ వచ్చినప్పుడు పాపాత్ములు ప్రమాణంచేస్తూ “మేము ప్రపంచంలో ఘడియ కన్నా ఎక్కువసేపు ఉండలేద”ంటారు. అలాగే వారు ఐహిక జీవితంలో మోస పోతుండేవారు. కాని (దైవిక)జ్ఞానం, విశ్వాసభాగ్యం పొందినవారు వారితో “మీరు దైవ నిర్ణయం ప్రకారం పునరుత్థాన దినం వరకు పడివున్నారు. పునరుత్థాన దినమంటే ఇదే. కాని మీరు దీన్ని గ్రహించలేకపోయారు” అనంటారు. ఆరోజు దుర్మార్గులు చెప్పే సాకుల వల్ల ఎలాంటి లాభం ఉండదు. దేవుడ్ని క్షమాపణ కోరుకోవడానిక్కూడా వారికి అనుమతి లభించదు. (55-57)
మేమీ ఖుర్‌ఆన్‌ ద్వారా ప్రజలకు అనేక విధాల నచ్చజెప్పాం. కాని సత్యాన్ని నిరాక రించే వారి ముందు నీవు ఎలాంటి సూచన తెచ్చినా వారు నిన్ను అసత్యవాదివనే అంటారు. ఇలా దేవుడు మూర్ఖుల హృదయకవాటాలు మూసేస్తున్నాడు. కనుక నీవు ఓర్పు వహించు. దేవుని వాగ్దానం సత్యమైనది. విశ్వసించనివారు నిన్ను చులకన భావం తో చూడకూడదు సుమా! (వారి మాటలకు ఏమాత్రం లొంగకు.) (58-60)