Jump to content

కురాన్ భావామృతం/అల్-ఫతహ్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

48. ఫతహ్‌ (విజయం)
(అవతరణ: మదీనా; సూక్తులు: 29)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ముహమ్మద్‌ (స)! మేము నీకు స్పష్టమైన విజయం ప్రసాదించాం. దేవుడు నీగత పొరపాట్లు, భావిపొరపాట్లు మన్నించి నీపై తన అనుగ్రహం పరిపూర్తి చేయాలని, నీకు రుజుమార్గం చూపి, పెద్ద సహాయం చేయాలని (ఈ శుభవార్త నీకు విన్పిస్తున్నాడు)#
ఆయనే ముస్లింల విశ్వాసం ద్విగుణీకృతం కావడానికి వారి హృదయాలలో శాంతీ స్థిమితాలను అవతరింపజేశాడు. భూమ్యాకాశాల సైన్యాలన్నీ దేవుని అధీనంలోనే ఉన్నాయి. ఆయన సర్వం ఎరిగినవాడు, ఎంతో వివేకవంతుడు. (1-4)
(ఇలా చేయడానికి కారణం) విశ్వసించిన స్త్రీ పురుషుల్ని శాశ్వతనివాసం కొరకు సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేయాలని, వారి నుండి చెడులను తొలగిం చాలని- దేవుని దృష్టిలో ఇది గొప్పవిజయం- దేవుడ్ని గురించి అనుమాన రోగానికి గురైన కపట, బహుదైవారాధక స్త్రీపురుషుల్ని శిక్షించాలని ఆయన సంకల్పించాడు.
ఈ అనుమాన రోగిష్టులు తమంతట తామే కీడువలలో చిక్కుకున్నారు. వారిపై దైవాగ్రహం విరుచుకుపడుగాక! ఆయన ఈ దుర్మార్గుల్ని శపించాడు. వారికోసం అతిచెడ్డ నివాసమైన నరకకూపం సిద్ధపరచి ఉంచాడు. భూమ్యాకాశాల సైన్యాలన్నీ ఆయన అధీనంలోనే ఉన్నాయి. ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. (5-7)
ముహమ్మద్‌ (స)! మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్త అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. ఎందుకంటే (మానవులారా!) మీరు దేవుడ్ని, ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయనకు మీ సహాయసహకారాలు అందజేయండి. ఆయన్ని గౌరవించండి. ఉదయం, సాయంత్రం దేవుని పవిత్రత స్మరిస్తూ ఉండండి. (8-9)
ప్రవక్తా! నీముందు శపథం చేస్తున్నవారు నిజానికి దేవుని ముందు శపథం చేస్తు న్నారు. వారి చేయి దేవుని చేతిలో ఉంది. ఇప్పుడీ ప్రమాణాన్ని ఎవరైనా భంగపరిస్తే దాని కీడు వారిపైనే పడుతుంది. ఎవరు దేవుని ముందు ప్రమాణంచేసి దాన్ని నెరవేరు స్తారో, దేవుడు వారికి త్వరలోనే గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (10)
ప్రవక్తా! గ్రామీణుల్లో (యుద్ధానికి బయలుదేరకుండా) వెనకుండిపోయినవారు ఇప్పుడు నీ దగ్గరికొచ్చి (సాకులు చెబుతూ) “మా ఆస్తులూ, భార్యాపిల్లల గొడవలో పడి మేము రాలేక పోయాము. (దయచేసి) మా మన్నింపు కోసం దైవాన్ని ప్రార్థించండి” అని తప్పకుండా అంటారు. వీరు తమ మనసులో లేని మాటలు చెబుతారు. కనుక వారికిలా చెప్పు: “అదా సంగతి! అయితే దేవుడు మీకు కీడు లేదా మేలు చేయదలిస్తే ఆయన నిర్ణయాన్ని ఎవరు అడ్డుకో గలుగుతారు? మీ వ్యవహారాలను గురించి దేవునికి బాగా తెలుసు. మీరసలు దైవప్రవక్త, విశ్వాసులు (యుద్ధంలో చిక్కుకొని) తమ ఇండ్లకు తిరిగి రాలేరనుకున్నారు. ఈ ఆలోచన మీ మనస్సుకు ఎంతగానో నచ్చింది. మీరిలా దుష్ట ఆలోచనలకు పోయిన పరమదుర్మార్గులు.” (11-12)
దేవుడ్ని, ఆయన ప్రవక్తను నమ్మని అవిశ్వాసుల కోసం మేము భగభగమండే నరకాగ్ని సిద్ధపరచి ఉంచాం. భూమ్యాకాశాల సామ్రాజ్యానికి సార్వభౌముడు దేవుడే. ఆయన తలచుకున్న విధంగా కొందరిని క్షమిస్తాడు, మరికొందరిని శిక్షిస్తాడు. తిరస్కార వైఖరి విడనాడినవారి పట్ల ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (13-14)
మీరు సమరసొత్తు సేకరించడానికి బయలుదేరితే వెనుక వదిలేయబడినవారు మీ దగ్గరికొచ్చి ‘మమ్మల్ని కూడా మీతోపాటు తీసికెళ్ళండ’ని తప్పక అంటారు. వీరు దైవ నిర్ణయాన్ని మార్చేయజూస్తున్నారు. (కనుక) “మీరు మాతోపాటు రావడానికి వీల్లేదు. దేవుడు ఈ విషయాన్ని ముందే నిర్ణయించాడ”ని వారికి స్పష్టంగా చెప్పేయండి. దానికి వారు (లోలోన ఉడికిపోతూ) “లేదు, మీరసలు మమ్మల్ని ద్వేషిస్తున్నారు” అనంటారు. (ఇక్కడ ద్వేషం ప్రసక్తే లేదు.) వీరసలు మంచిమాటను సరిగా గ్రహించరు. (15)
వెనకుండిపోయే గ్రామీణులతో ఇలా అనండి: “త్వరలోనే మీరు చాలా శక్తిమంతు లైనవారితో పోరాడేందుకు పిలువబడతారు. వారితో మీరు యుద్ధం చేయవలసి ఉంది. లేదా వారు విధేయులయి లొంగిపోవచ్చు. అప్పుడు మీరు యుద్ధాజ్ఞను శిరసావహిస్తే దేవుడు మీకు మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అలాకాకుండా మీరు ఇదివరకు ముఖం చాటేసినట్లు చాటేస్తే దేవుడు మీకు అతి బాధాకరమైన శిక్ష విధిస్తాడు.” (16)
అంధులు, కుంటివాళ్ళు, వ్యాధిగ్రస్తులు యుద్ధంలో పాల్గొనలేకపోతే ఎలాంటి తప్పులేదు. దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులైనవారిని దేవుడు సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. విముఖులయ్యేవారికి దుర్భరశిక్ష విధిస్తాడు. (17)
విశ్వాసులు చెట్టు క్రింద నీచేతిలో చేయి వేసి శపథం చేస్తున్నప్పుడు దేవుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారి ఆంతర్యాల స్థితి ఆయనకు తెలుసు. అందువల్ల వారిపై ఆయన శాంతీస్థిమితాలు అవతరింపజేశాడు. బహుమానంగా వారికి సమీప విజయాన్ని, అపార సమరసొత్తును అనుగ్రహించాడు. దాన్ని వారు (త్వరలోనే) సాధిస్తారు. దేవుడు మహా శక్తిమంతుడు, ఎంతో వివేచనాపరుడు. (18-19)
దేవుడు మీకు పెద్దఎత్తున సమరసొత్తు లభిస్తుందని వాగ్దానం చేస్తున్నాడు. ప్రస్తు తం ఆయన మీకు ఈవిజయం ప్రసాదించి, భవిష్యత్తులో మీకు వ్యతిరేకంగా ఇతరులు తోక జాడించకుండా వారిని నిలువరించాడు. మరోవైపు విశ్వాసులకు ఒక నిదర్శనంగా చేశాడు. మీరు సన్మార్గంలో స్థిరంగా ఉండేందుకు దేవుడు మీకు మరింత సద్బుద్ధి ఇవ్వా లన్న ఉద్దేశ్యం కూడా దీని వెనకుంది. మరికొన్ని సమరసొత్తులు కూడా మీకు లభిస్తా యని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాటిని మీరింకా సాధించలేదు. దేవుడు వాటిని చుట్టుముట్టి ఉంచాడు. దేవుడు ప్రతిపనీ చేయగల సర్వశక్తిమంతుడు. (20-21)
ఇప్పుడీ అవిశ్వాసులు గనక మీతో పోరాడితే తప్పకుండా వెన్నుజూపి పారిపోతారు. వారికి ఎలాంటి మద్దతు, సహాయం లభించవు. ఇది పూర్వకాలం నుండీ వస్తున్న దైవ సంప్రదాయం. దైవసంప్రదాయంలో నీవు ఎన్నడూ ఏ మార్పూ చూడలేవు. దేవుడే మక్కా లోయలో వారి చేతుల్ని మీనుండి, మీ చేతుల్ని వారినుండి (యుద్ధం జరగకుండా) నిరోధించాడు. నిజానికి ఆయన వారిపై మీకు ఇంతకు ముందే ఆధిక్యత (విజయం) ప్రసాదించాడు. మీరు చేస్తున్నదంతా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (22-24)
సత్యాన్ని తిరస్కరించినవారు, మిమ్మల్ని ప్రతిష్ఠాలయం (కాబాగృహం)కు రానివ్వ కుండా నిరోధించినవారు, బలిపశువుల్ని వాటి బలిప్రదేశానికి చేరనీకుండా అడ్డుకున్న వారు వారేకదా! (మక్కాలో) మీరెరుగని స్త్రీపురుష విశ్వాసులు లేకుండాఉంటే, పొర పాటున మీరు వారిపై కూడా దాడిచేస్తారన్న ప్రమాదం, దానివల్ల మీరు అప్రతిష్ఠ పాలవు తారన్న భయం కూడా లేకుండా ఉంటే (ఈ యుద్ధాన్ని మేము నిరోధించేవారం కాదు). దేవుడు తానుకోరిన వారిని తన కారుణ్యఛాయలోకి తీసుకోవడానికే (ఈ యుద్ధాన్ని నిరోధించాడు). ఈ విశ్వాసులు వేరేచోటికి పోయివుంటే (మక్కాలో మిగిలివుండే) అవి శ్వాసుల్ని మేము తప్పకుండా కఠినంగా శిక్షించేవాళ్లం. (25)
(ఈ కారణంగానే) ఈ అవిశ్వాసులు మొండి పట్టుదలకు పొయినప్పడు దేవుడు తన ప్రవక్తకు, విశ్వాసులకు సహనం, సంయమనాలు ప్రసాదించాడు. వారిని భయ భక్తుల వైఖరికి కట్టుబడిఉండేలా చేశాడు. అసలు వారే భయభక్తులు కలిగిఉండటానికి ఎక్కువ అర్హులు. దేవుడు సర్వం ఎరిగినవాడు. (26)
దేవుడు తన ప్రవక్తకు స్వప్నం చూసిన సంగతి నిజమే. అది సత్యంతో కూడుకున్న స్వప్నం. (దాని ప్రకారం) దేవుడు తలిస్తే (త్వరలోనే) మీరు తప్పకుండా ప్రతిష్ఠాలయం (కాబా)లో నిర్భయంగా, నిశ్చింతగా ప్రవేశిస్తారు. అక్కడ మీతలలను పూర్తిగా గొరిగించు కుంటారు లేదా కత్తిరించుకుంటారు. మీకు ఎలాంటి భయముండదు. మీకు తెలియని విషయాలు (ఎన్నో) ఆయనకు తెలుసు. అందువల్ల ఈ స్వప్నం నిజం కావడానికి ముందుగా ఆయన ఈ సమీప విజయాన్ని మీకు ప్రసాదించాడు. (27)
ఆ దేవుడే తన ప్రవక్తకు సన్మార్గం, సత్యధర్మం ఇచ్చి, అది యావత్తు జీవనవ్యవస్థ లపై ఆధిక్యత వహించడానికి పంపాడు. దీనికి దేవుని సాక్ష్యమే చాలు. (28)
ముహమ్మద్‌ (స) దేవుని సందేశహరుడు. ఆయన అనుచరులు అవిశ్వాసులకు ఏమాత్రం లొంగని దృఢమనస్కులు. అయితే వారు పరస్పరం మృదుహృదయులు, దయామయులు. నీవు ఎప్పుడైనా వారిని చూస్తే వారు రుకూ, సజ్దాలు (ప్రార్థన) చేయ డంలో, దేవుని అనుగ్రహం, ఆయన ప్రసన్నతలు అర్థించడంలో నిమగ్నులై ఉండటం కన్పిస్తుంది. వారి ముఖాలపై సాష్టాంగప్రణామ చిహ్నాలు ఉంటాయి. ఆ చిహ్నాల్ని బట్టే వారిని గుర్తించవచ్చు. ఇవి తౌరాత్‌లో వారిని గురించి వర్ణించబడిన లక్షణాలు.
ఇన్జీల్‌లో వారి లక్షణాలు ఈవిధంగా పోల్చబడ్డాయి: ఒక పొలం ఉంది. అందులో మొదట విత్తనం నుండి చిన్న మొలక అంకురిస్తుంది. తరువాత అది పటిష్ఠమవుతుంది. ఆ తర్వాత కాస్త లావెక్కి కాడగా మారుతుంది. ఆపై ఆ మొక్క తన కాండం మీద నిటారుగా నిలబడుతుంది. అప్పుడు రైతులకు ఆ దృశ్యం కనులపండువగా ఉంటుంది; అవిశ్వాసులు అసూయాగ్నిలో మాడిపోవడానికి (ఈవిధంగా విశ్వాసుల సద్గుణ సంపత్తి పుష్పించి ఫలిస్తుంది). వారిలో సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులయిన వారిని దేవుడు మన్నించి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తానని వాగ్దానం చేశాడు. (29)