Jump to content

కురాన్ భావామృతం/అల్-జాసియా

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

45. జాసియా (కూలబడిన వారు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 37)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
హా-మీమ్‌. ఇది మహా శక్తిమంతుడు, వివేకవంతుడైన దేవుని నుండి అవతరించిన గ్రంథం. విశ్వసించేవారికి భూమ్యాకాశాల్లో అనేక నిదర్శనాలున్నాయి. మీపుట్టుకలో కూడా ఉన్నాయి. దేవుడు వ్యాపింపజేసిన జంతుజాలంలో కూడా నమ్మేవారికి గొప్ప నిదర్శనా లున్నాయి. రేయింబవళ్ళ చక్రభ్రమణంలో, ఆకాశంనుండి దేవుడు దించే ఉపాధి (వర్షం) లో, తద్వారా ఆయన మృతభూమికి జీవం పోసే (సస్యశ్యామలం చేసే) ప్రక్రియలో, గాలుల చలనంలోనూ బుద్ధీజ్ఞానాలు కలవారికి అద్భుత నిదర్శనాలున్నాయి. (1-5)
ఇవన్నీ దైవనిదర్శనాలు. వీటిని మేము నీముందు ఉన్నవివున్నట్లు వివరిస్తున్నాం. దేవుడ్ని, ఆయన నిదర్శనాలు-సూక్తుల్ని వదిలేస్తే ఇక ఏవిషయాన్ని వారు విశ్వసిస్తారు?#
అబద్ధాలకోరు, దుష్కర్ముడయిన ప్రతివాడికీ వినాశం (రాసిపెట్టి) ఉంది. అతనికి దేవుని సూక్తులు విన్పిస్తున్నప్పుడు అతను వాటిని వినడానికైతే ఎలాగో వింటాడు. కాని ఆ తరువాత వాటిని విననే లేదన్నట్లు తలబిరుసుతో పంతానికి పోయి, తన అవిశ్వాస వైఖరినే గట్టిగా పెనవేసుకొని ఉంటాడు. అలాంటి వాడికి దుర్భరయాతన కాచుకొని ఉందని శుభవార్త విన్పించు! మా హితబోధ ఏదైనా అతని దృష్టికి వస్తే దాన్ని ఎగతాళి చేసి ఎగరగొడ్తాడు. అలాంటివారికి అవమానకరమైన యాతన (సిద్ధంగా)ఉంది. (6-9)
వారి ముందు నరకం (పొంచి)ఉంది. వారు సంపాదించుకున్నదేదీ వారికి పనికి రాదు. వారు దేవుడ్ని వదలి తమకు సంరక్షకులుగా చేసుకున్న మిధ్యాదైవాలు వారిని ఆదుకోలేవు. వారికి తీవ్రమైన యాతన ఉంది. ఇది మార్గదర్శక గ్రంథం. తమ ప్రభువు సూక్తులు నమ్మనివారి కోసం అతి బాధాకరమైన యాతన కాచుకొని ఉంది. (10-11)
మీ కోసం సముద్రాన్ని అదుపులో ఉంచినవాడు దేవుడే. తన ఆదేశంతో ఓడలు నడవడానికి, తద్వారా మీరు దైవానుగ్రహం అన్వేషించి తనకు కృతజ్ఞతలు చూపడానికే ఇలా చేశాడు. (అసలు) ఆయన భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తాన్ని మీ ఉపయోగార్థమే అదుపులో ఉంచాడు. యోచించేవారికి ఇందులో గొప్ప సూచనలున్నాయి. (12-13)
ప్రవక్తా! విశ్వాసులకు చెప్పు: “దేవుని నుండి తమకు దుర్దినాలు దాపురించవని నిర్భయంగా ఉండేవారి చేష్టల్ని చూసీచూడనట్లు వదిలేయండి. దేవుడే ఒక వర్గానికి దాని చేష్టలకు తగిన దుష్ఫలం చవిచూపిస్తాడు. ఎవరు సత్కార్యం చేస్తాడో అది అతనికే మేలు చేకూరుస్తుంది. మరెవరు దుష్కార్యానికి పాల్పడుతాడో దాని దుష్ఫలితం అతను అనుభవిస్తాడు. చివరికి అందరూ తమ ప్రభువు దగ్గరికి పోవలసినవారే.” (14-15)
ఇంతకు పూర్వం మేము ఇస్రాయీల్‌ సంతతికి గ్రంథాన్ని, వివేకాన్ని, దైవదౌత్యాన్ని ప్రసాదించాము. వారికి మేము శ్రేష్ఠమైన జీవనసామగ్రి అనుగ్రహించాము. యావత్తు ప్రపంచ మానవులపై వారికి ఔన్నత్యాన్నిచ్చి, ధర్మం గురించి స్పష్టమైన హితవులు ప్రసాదించాం. కాని తరువాత వారిలో విభేదాలు పొడసూపాయి అంటే (అజ్ఞానం వల్ల కాదు), దివ్యజ్ఞానం వచ్చిన తర్వాతే (దాన్ని విస్మరించడం వల్ల) పొడసూపాయి. అదీగాక వారు పరస్పరం ఒకరికొకరు అన్యాయం చేసుకోజూశారు. వారు విభేదిస్తున్న విషయా లను గురించి రేపు ప్రళయదినాన దేవుడు తప్పకుండా తీర్పు చేస్తాడు. (16-17)
ముహమ్మద్‌ (స)! ఆ తర్వాత మేము నిన్ను ధర్మం విషయంలో చక్కని రాచబాట లో నిలబెట్టాం. కాబట్టి నీవు అదే బాటలో నడు. (ధర్మ)జ్ఞానం లేనివారి మనోవాంఛల్ని నీవు ఎన్నటికీ అనుసరించకు. (అలా చేస్తే) దేవునికి వ్యతిరేకంగా వారు నీకు ఏమాత్రం ఉపయోగపడరు. దుర్మార్గులు ఒకరికొకరు స్నేహితులు. దైవభీతిపరులకు దేవుడే స్నేహితుడు. ఈ (ఖుర్‌ఆన్‌) గ్రంథం యావత్తు మానవాళి కోసం స్పష్టమైన సూచన; సత్యాన్ని విశ్వసించేవారి కోసం మార్గదర్శిని, కారుణ్యప్రదాయిని. (18-20)
దుష్కార్యాలకు పాల్పడుతున్నవారు తమను, సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేస్తున్నవారిని మేము ఒకేగాటన కట్టివేస్తామని భావిస్తున్నారా? వారుభయుల చావుబ్రతు కులు (పర్యవసానాలు) ఒకటే అవుతాయనుకుంటున్నారా? చాలా తప్పుడు ఆలోచన వారిది. ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రతిమనిషికీ అతని సంపాదనకు తగిన ప్రతి ఫలం ఇవ్వడానికి దేవుడు భూమ్యాకాశాల్ని సత్యం ప్రాతిపదికపై సృష్టించాడు. (21-22)
మనోవాంఛల్ని దైవంగా చేసుకున్నవాడ్ని గురించి నీవెప్పుడైనా ఆలోచించావా? అతను విద్యాజ్ఞానాలు కలిగివున్నా దేవుడు అతడ్ని దారి తప్పించాడు. అతని హృదయ కవాటాలు మూసివేశాడు; చెవులకు సీలువేశాడు; కళ్ళకు గంతలుకట్టాడు. దేవుడే అలా చేశాక ఇక అతనికి ఎవరు దారి చూపగలరు? మీరు గుణపాఠం నేర్చుకోరా? (23)
“జీవితమంటే ఈ ప్రపంచజీవితమే. ఇక్కడే మనం చావాలి, ఇక్కడే బ్రతకాలి. కాల చక్రభ్రమణం తప్ప మనల్ని ఏదీ నాశనం చేయలేదు” అంటారు వీరు. వీరి దగ్గర ఎలాంటి (సత్య)జ్ఞానం లేదు. వీరు కేవలం ఊహాగానాలు చేస్తున్నారు. (24)
విషయస్పష్టత కలిగిన మాసూక్తులు విన్పిస్తున్నప్పుడు “నీవు చెప్పేది నిజమైతే మా తాతముత్తాతల్ని లేపుకురా” అంటారు వారు. వారికిలా చెప్పు: “దేవుడే మిమ్మల్ని బ్రతి కిస్తున్నాడు. ఆయనే మిమ్మల్ని చంపుతున్నాడు. ఆ తరువాత ఆయనే మిమ్మల్ని (మళ్ళీ బ్రతికించి) ప్రళయదినాన సమావేశపరుస్తాడు. ఆరోజు తప్పకుండా వస్తుంది. కాని చాలామందికి (ఈ సత్యం) తెలియదు. (25-26)
భూమ్యాకాశాల సార్వభౌమత్యం ఆయనదే. ఏరోజు ప్రళయఘడియ వచ్చిపడు తుందో ఆరోజు అసత్యాన్ని అంటిపెట్టుకున్నవారు ఘోరంగా నష్టపోతారు. (27)
ఆరోజు ప్రతివర్గం (నీల్గుడంతా పోయి నేలచూపులు చూస్తూ) మోకాళ్ళ మీద చతికిలబడి ఉండటం నీకు కన్పిస్తుంది. అప్పుడు ప్రతివర్గాన్నీ తన కర్మలచిట్టా వైపు రమ్మని పిలవడం జరుగుతుంది. తరువాత (దేవుడు) ఇలా అంటాడు: “ఈరోజు మీకు మీ కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఇది మేము తయారు చేయించిన కర్మపత్రాలు. మీ గురించి ఇవి ఉన్నవి ఉన్నట్లు సాక్ష్యమిస్తాయి. (ప్రపంచంలో) మీరు చేస్తున్నదంతా మేము (ఎప్పటికప్పుడు) వ్రాయిస్తూ ఉండేవాళ్ళం.” (28-29)
ఆ తరువాత సత్యాన్ని విశ్వసించి సాత్విక జీవితం గడిపినవారిని వారి ప్రభువు తన కారుణ్యఛాయలోకి తీసుకుంటాడు. ఇదే అసలు విజయం (పరమమోక్షం). (30)
అవిశ్వాసుల్ని ఇలా నిలదీయడం జరుగుతుంది “(బోధకులు) మీకు మా సూక్తులు విన్పిస్తుండేవారు కాదా? కాని మీరు అహంకారంతో నేరస్థులైపోయారు. ‘దేవుని వాగ్దానం సత్యమైనదని, ప్రళయం సంభవించడంలో ఎలాంటి సందేహం లేదని చెబుతున్నప్పుడు మీరు ‘ప్రళయమంటే ఏమిటో మాకు తెలియదు. అదేదో ఊహాకల్పనని మా అను మానం. దానిమీద మాకసలు నమ్మకం కుదరడంలేదు’ అని చెప్పేవారు.” (31-32)
అప్పుడు వారిముందు వారు చేసిన పనుల్లోని చెడులేమిటో బట్టబయలవుతాయి. వారు దేన్ని గురించి హేళన చేస్తుండేవారో దాని ఉచ్చులోనే పడిపోతారు. తర్వాత వారి తో (దైవదూతలు) ఇలా అంటారు: “నేటి సమావేశాన్ని మీరు (ఆనాడు) ఎలా విస్మరిం చారో ఈరోజు మేము కూడా మిమ్మల్ని విస్మరిస్తున్నాం. ఇప్పుడు మీ నివాసస్థలం నరకమే. ఇక మీకెవరూ సహాయం చేయరు. మీరు దేవుని సూక్తుల్ని అపహాస్యం చేశారు. మిమ్మల్ని ఐహిక జీవితం మోసగించింది. అందుకే మీకీ దుర్గతి పట్టింది.” కనుక ఈరోజు వారిని నరకం నుండి విముక్తి కలిగించడంగాని, క్షమాపణ కోరుకొని దైవప్రసన్నత పొందమని చెప్పడంగాని జరగదు. (33-35)
కాబట్టి (తెలుసుకోండి.) భూమ్యాకాశాల ప్రభువు, సర్వలోక స్వామి అయిన దేవుడే సకలవిధాల ప్రశంసలకు అర్హుడు. భూమ్యాకాశాల్లో ఘనత, ఔన్నత్యాలు ఆయనకే శోభిస్తాయి. ఆయన అపార శక్తిమంతుడు, అసామాన్య వివేకవంతుడు. (36-37)