Jump to content

కురాన్ భావామృతం/అల్-అన్కబూత్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

29. అన్కబూత్‌ (సాలెపురుగు)
అవతరణ: మక్కా; సూక్తులు: 69)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అలిఫ్‌-లామ్‌-మీమ్‌. ప్రజలు కేవలం తాము విశ్వసించాం అని పలికినంత మాత్రాన తమను వదలిపెట్టడం జరుగుతుందని భావిస్తున్నారా? తమను పరీక్షించడం జరగదని తలుస్తున్నారా? వారికి పూర్వం గతించినవారిని కూడా మేము పరీక్షించాము. (మీలో) నిజాయితీపరులెవరో, మోసగాళ్ళెవరో దేవుడు తప్పకుండా పరీక్షించవలసి ఉంది. దుష్టచర్యలకు పాల్పడుతున్నవారు మా అదుపు నుండి పారిపోగలమని భావిస్తున్నారా? అదంతా వారి (భ్రమ,) తప్పుడు ఆలోచన మాత్రమే. (1-4)
దేవుడ్ని కలుసుకోగలనని ఆశిస్తున్నవాడు ఆయన నిర్ణయించిన సమయం అతి సమీపంలో ఉందని తెలుసుకోవాలి. దేవుడు సమస్తవిషయాలు వింటున్నాడు. ఆయన సర్వం ఎరిగినవాడు. ఎవరైనా పాటుపడుతున్నాడంటే అతను తన శ్రేయస్సు కోసమే పాటుపడుతున్నాడు. దేవునికి లోకులతో పనేలేదు. ఆయన నిరపేక్షాపరుడు. సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారి నుండి వారి చెడులను మేము తొలిగిస్తాం. వారు ఆచరించిన సత్కర్మలకు మేము వారికి మంచి ప్రతిఫలం ప్రసాదిస్తాం. (5-7)
తల్లిదండ్రులకు సేవచేయాలని, వారి పట్ల సద్భావంతో మెలగాలని మేము మాన వునికి ఉపదేశించాం. అయితే “వారొకవేళ నీకు తెలియని మరొక దైవాన్ని నాకు సాటి కల్పించమని వత్తిడితెస్తే మాత్రం నీవు వారికి విధేయత చూపకు. మీరంతా చివరికి నా దగ్గరకే తిరిగిరావలసి ఉంది. అప్పుడు నేను మీరు (ప్రపంచంలో ఉండగా) ఏమేమి చేస్తుండేవారో మీకు తెలియజేస్తాను” అని కూడా మేమతనికి బోధించాం. సత్యాన్ని విశ్వ సించి సదాచార సంపన్నులైనవారిని మేము తప్పక సజ్జనులుగా పరిగణిస్తాం. (8-9)
కొందరు తాము దేవుడ్ని విశ్వసించాం అంటారు. కాని దేవుని విషయంలో హింసించబడితే, లోకులు పెట్టిన ఆ బాధల్ని వారు దేవుడు విధించిన శిక్షగా భావిస్తారు. అయితే నీ ప్రభువు నుండి విజయం, సహాయం లభిస్తే వారు (నీ దగ్గరకొచ్చి) “మేము మీతోపాటే ఉన్నాం” అనంటారు. ప్రజలలో ఇలాంటివారు కూడా ఉన్నారు. ప్రపంచ వాసుల హృదయాల్లో ఏముందో దేవునికి తెలియదనుకుంటున్నారా వీరు? నిజమైన విశ్వాసులెవరో, కపటవిశ్వాసులెవరో దేవుడు తప్పక పరీక్షించవలసి ఉంది. (10-11)
సత్యాన్ని నిరాకరించినవారు విశ్వసించినవారితో “మీరు మా(మత)విధానం అనుస రించండి, మేము మీ పాపభారం మోస్తాం” అంటారు. కాని వారు విశ్వాసుల పాపాన్ని ఏమాత్రం నెత్తిమీద వేసుకోరు. వారు పచ్చి అబద్ధాలరాయుళ్ళు. వారు తమ పాపాలతో పాటు ఇతరుల పాపభారం కూడా మోస్తారు. ప్రళయదినాన వారి అభూత కల్పనలను గురించి వారిని తప్పకుండా నిలదీయడం జరుగుతుంది. (12-13)
మేము నూహ్‌ను (ప్రవక్తగా నియమించి) అతని జాతి ప్రజల దగ్గరకు పంపాము. అతను వారి మధ్య యాభయి తక్కువ వేయి సంవత్సరాలు గడిపాడు. చివరికి వారు దుర్మార్గంలో పడివున్న స్థితిలో వారిపైకి (భయంకరమైన) తుఫాను వచ్చిపడింది. ఆ తర్వాత మేము నూహ్‌ని, (అతనితోపాటు) ఓడలో ఎక్కినవారిని రక్షించాం. దీన్ని మేము ప్రపంచ మానవులకు ఒక సూచనగా, ఒక గుణపాఠంగా చేసి ఉంచాం. (14-15)
ఇబ్రాహీంని (అతనిజాతి దగ్గరకు) పంపాము. అప్పుడతను తనజాతికి హితోపదేశం చేస్తూ ఇలా అన్నాడు: “మీరు దేవుడ్ని మాత్రమే ఆరాధించండి. ఆయనకే భయపడండి. విషయం తెలుసుకుంటే ఇందులోనే మీ శ్రేయస్సుంది. మీరు దేవుడ్ని వదలి పూజిస్తున్న వస్తువులు విగ్రహాలు మాత్రమే. (ఇలా) మీరు ఒక అసత్యాన్ని కల్పించుకున్నారు.
దేవుడ్ని వదలి మీరు పూజిస్తున్న ఈ విగ్రహాలు మీకు ఎలాంటి ఉపాధి ఇవ్వలేవు. కనుక మీరు దేవుని సన్నిధిలో ఉపాధిని గురించి అర్థించండి. ఆయన్నే ఆరాధించండి, ఆయనకే కృతజ్ఞతలు తెలుపుకోండి. చివరికి మీరు ఆయన సన్నిధికే మరలి పోవలసి ఉంది. మీరు నా మాటలు తిరస్కరిస్తే (నాకొచ్చే నష్టమేమీ లేదు.) మీకు పూర్వం కూడా అనేక జాతులు తిరస్కరించాయి. (దైవ)సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప దైవప్రవక్తపై మరెలాంటి బాధ్యత లేదు.” (16-18)
దేవుడు జీవరాసుల్ని మొదటిసారి ఎలా సృజిస్తున్నాడో, తరువాత వాటిని ఎలా పునరుత్పత్తి చేస్తున్నాడో వీరు గమనించడం లేదా? ఇలా చేయడం దేవునికి చాలా సులభం. వారికిలా చెప్పు: “ప్రపంచంలో తిరిగి చూడండి, ఆయన ప్రాణికోటిని మొదటి సారి ఎలా సృజించాడో అలాగే మళ్ళీ ఆయన వాటినుండి జీవరాసుల్ని పుట్టిస్తున్నాడు. ఆయన ప్రతిపనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. (19-20)
ఆయన తాను తలచిన విధంగా కొందరిని శిక్షిస్తాడు; కొందరిని కరుణిస్తాడు. చివరికి మీరంతా ఆయన వద్దకే పోవలసిఉంది. ఆయన పట్టునుండి భూమండలం లోనూ తప్పించుకోలేరు, ఆకాశంలోనూ తప్పించుకోలేరు. మిమ్మల్ని కాపాడే ఏ సహాయ కుడూ, సంరక్షకుడూ ఉండడు. దేవుని సూక్తుల్ని, ఆయన దర్శనభాగ్యాన్ని నిరాకరించిన వారు నా కారుణ్యకటాక్షాల పట్ల నిరాశచెందారు. వారికోసం వ్యధాభరితమైన శిక్ష కాచుకొని ఉంది. (21-23)
ఆ తర్వాత వారు, ఇతడ్ని చంపండి లేక కాల్చివేయండి అన్నారు. అంతకుమించి వారి దగ్గర ఎలాంటి సమాధానం లేకపోయింది. చివరికి దేవుడు అతడ్ని అగ్ని నుండి రక్షించాడు. విశ్వసించేవారికి ఈ సంఘటనలో గొప్ప సూచన ఉంది. (24)
అతను వారితో ఇలా అన్నాడు: “మీరు ఇహలోక జీవితంలో దేవుడ్ని వదలి విగ్రహా లను మీ మధ్య పరస్పరం ప్రేమాభిమానాలు జనింపజేసే సాధనాలుగా చేసుకున్నారు. కాని పునరుత్థాన దినాన మీరు ఒకర్నొకరు ఖండించుకుంటూ దూషించుకుంటారు. నరకాగ్నే మీకు నివాసమవుతుంది. అక్కడ మీకు సహాయం చేసేవాడే లభించడు.” (25)
అప్పుడు లూత్‌ అతడ్ని విశ్వసించాడు. “నేను నా ప్రభువు (ప్రసన్నత) వైపు వలస పోతున్నాను. ఆయన ఎంతో శక్తిసంపన్నుడు, వివేకవంతుడు” అన్నాడు ఇబ్రాహీం. అతనికి మేము ఇస్‌హాఖ్‌ (అనే కొడుకు)ని, యాఖూబ్‌ (అనే మనవడి)ని ప్రసాదించాం. అతని సంతతిలో దైవదౌత్యం, (దివ్య)గ్రంథం నెలకొల్పాం. మేమతనికి ప్రపంచంలో ప్రతిఫలం ప్రసాదించాం. పరలోకంలో అతను తప్పక సజ్జనుల్లో చేరివుంటాడు. (26-27)
మేము లూత్‌ని (ప్రవక్తగా చేసి) పంపాము. అతను తన జాతివారికి హితవు చేస్తూ ఇలా అన్నాడు:“మీరెంత అశ్లీలానికి పాల్పడుతున్నారు! మీకు పూర్వం లోకంలో ఎవరూ ఇలాంటి పని చేయలేదే!! మీరు (స్త్రీలను వదలి) పురుషుల వెంటపడ్డారా? దారి దోపిడీలు (కూడా) చేస్తున్నారు. నిండుసభల్లో (సిగ్గువిడిచి ఈ) పాడుపని చేస్తున్నారే!”
దానికి వారు “నీవు చెప్పేది నిజమైతే (మాపైకి) దైవశిక్ష తీసుకురా” అన్నారు. అంతకుమించి వారిదగ్గర ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు లూత్‌ “ప్రభూ! ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా నాకు సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు. (28-30)
మా దూతలు (ఓ రోజు) ఇబ్రాహీం దగ్గరకు ఒక శుభవార్త తీసుకొని వెళ్ళారు. ఆ సందర్భంలో వారు “మేమా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం. ఆ పట్టణవాసులు పరమ దుర్మార్గులయి పోయారు” అని తెలిపారతనికి. (31)
ఇబ్రాహీం ఈమాట విని “అక్కడ లూత్‌ ఉన్నాడు కదా?” అన్నాడు. దానికి వారు “అక్కడ ఎవరెవరున్నారో మాకు బాగా తెలుసు. మేము లూత్‌భార్యను తప్ప అతడ్ని, అతని కుటుంబాన్ని రక్షిస్తాం. ఆ స్త్రీ వెనుకుండిపోయేవారిలో ఉండిపోతుంది” అన్నారు#
ఆతర్వాత మా దూతలు లూత్‌ వద్దకు చేరుకున్నారు. వారిని చూసి అతను తీవ్ర ఆందోళనచెందాడు. అతని హృదయం కుంచించుకుపోయింది. వారతని పరిస్థితి గమ నించి “భయపడకు, విచారించకు. మేము నిన్ను, నీ కుటుంబసభ్యుల్ని రక్షిస్తాం, నీ భార్యను తప్ప. ఆమె వెనుకుండిపోయేవారిలో ఉండిపోతుంది. ఈ పట్టణవాసులు చేస్తున్న పాడుపనికి మేము వీరిపై ఆకాశం నుండి శిక్ష దించబోతున్నాం” అని చెప్పారు. మేమా పట్టణాన్ని (సమూలంగా తుడిచిపెట్టి) బుద్ధీజ్ఞానం కలవారికోసం స్పష్టమైన సూచన (గుణపాఠం)గా చేసి వదలిపెట్టాము. (32-35)
మద్యన్‌జాతి ప్రజల దగ్గరికి వారి సోదరుడు షుఐబ్‌ని పంపాము. అతను వారికి హితోపదేశం చేస్తూ “నాజాతి ప్రజలారా! దేవుడ్ని ఆరాధించండి. అంతిమదినం గురించి భయపడండి. ప్రపంచంలో దుర్మార్గులైపోయి అన్యాయాలు, అక్రమాలు చేస్తూ తిరగ కండి” అన్నాడు. కాని వారు షుఐబ్‌ని తిరస్కరించారు. చివరికి తీవ్రమైన ఓ భూకంపం వారిని మట్టుబెట్టింది. వారు తమ ఇండ్లలో బోర్లా పడిపోయారు. (36-37)
మేము ఆద్‌, సమూద్‌ జాతుల్ని కూడా తుడిచిపెట్టాము. వారి నివాస ప్రాంతాల్ని మీరు చూసేఉన్నారు. షైతాన్‌ వారి చేష్టల్ని మనోహరమైనవిగా చేసి, వారిని సన్మార్గం లోకి రాకుండా అడ్డుకున్నాడు. బుద్ధీజ్ఞానాలు వుండి కూడా వారు షైతాన్‌ వలలో పడిపోయారు. (38)
మేము ఖారూన్‌, ఫిరౌన్‌, హామాన్‌లను కూడా హతమార్చాం. వారి వద్దకు మూసా నిదర్శనాలు తీసుకొని వెళ్ళాడు. కాని వారు (మా పట్టునుండి) తప్పించుకోలేని వారైనప్ప టికీ ప్రపంచంలో తమ హోదా, అంతస్తులు చూసుకొని మిడిసిపడ్డారు. వారు చేసిన పాపాలకు (శిక్షగా) మేము వారిలో ప్రతి ఒక్కడ్నీ పట్టుకున్నాం. వారిలో కొందరిపై మేము రాళ్ళవర్షం కురిపించే గాలిని పంపాము. కొందరిని భయంకరమైన విస్ఫోటం మట్టుబెట్టింది. కొందర్ని మేము భూమిలోకి అణగద్రొక్కాం. మరికొందర్ని (సముద్రంలో) ముంచివేశాం. దేవుడు వారికి ఏమాత్రం అన్యాయం చేయలేదు. వారే (ఆత్మవంచనకు పాల్పడి) తమకుతాము అన్యాయం చేసుకున్నారు. (39-40)
దేవుడ్ని వదలి ఇతరుల్ని సంరక్షకులుగా చేసుకున్నవాడ్ని సాలీడుతో పోల్చవచ్చు. సాలీడు తనకోసం ఇల్లు కట్టుకుంటుంది. అందరి ఇండ్లకన్నా సాలీడుఇల్లే అత్యంత బల హీనమైనది. (ఇలాంటి దృష్టాంతాల ద్వారానైనా) వీరు (విషయాన్ని) గ్రహిస్తే బాగుండు#
వారు (నిజ)దేవుడ్ని వదలి ఏ మిధ్యాదైవాలను వేడుకుంటున్నారో వాటిని గురించి దేవునికి బాగా తెలుసు. ఆయన సర్వ శక్తిమంతుడు, ఎంతో వివేకవంతుడు. ప్రజలకు విషయం బోధపరచడానికి మేమీ దృష్టాంతాలు ఇస్తున్నాం. అయితే జ్ఞానం కలవారే వాటిని అర్థంచేసుకుంటారు. దేవుడు భూమ్యాకాశాల్ని సత్యం ప్రాతిపదికపై సృష్టించాడు. విశ్వాసుల కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. (41-44)
ప్రవక్తా! నీ దగ్గరకు పంపబడిన (ఖుర్‌ఆన్‌) గ్రంథాన్ని పఠిస్తూఉండు. నమాజ్‌ను నెలకొల్పు. నిస్సందేహంగా నమాజ్‌ (మనిషిని) చెడులు, అశ్లీలచేష్టల జోలికి పోకుండా నిరోధిస్తుంది. దేవుని స్మరణ ఎంతో గొప్పవిషయం. మీరు చేస్తున్నదంతా దేవునికి తెలుసు. (45)
గ్రంథప్రజలలో దుర్మార్గులు కానివారితో ఉత్తమరీతిలో వాదించండి. వారితో ఇలా అనండి: “మేము మా దగ్గరకు పంపబడిన దానిని (ఖుర్‌ఆన్‌ని), మీ దగ్గరకు పంపబడిన దానిని (తౌరాత్‌, ఇన్జీల్‌లను) విశ్వసిస్తున్నాము. మా దేవుడు, మీ దేవుడు ఒక్కడే. మేము ఆయనకే విధేయులై (ముస్లిములై) పోయాము.” (46)
ప్రవక్తా! అలాగే మేము నీ దగ్గరక్కూడా గ్రంథం అవతరింపజేశాం. దీన్ని లోగడ గ్రంథం ఇవ్వబడినవారు విశ్వసిస్తున్నారు. వీరిలో కూడా అనేకమంది దీన్ని విశ్వసిస్తు న్నారు. అవిశ్వాసులు మాత్రమే మాసూక్తులు నిరాకరిస్తారు. నీవు గతంలో ఏ గ్రంథాన్ని చదవలేదు. నీ చేతులతో వ్రాయనూ లేదు. అలా జరిగివుంటే ఈ మిధ్యావాదులు నిన్ను శంకించేవారు. ఇవి జ్ఞానం ఇవ్వబడినవారి హృదయాల్లో చోటుచేసుకునే తేజోవంతమైన సూక్తులు. దుర్మార్గులు తప్ప మరెవరూ మాసూక్తులు నిరాకరించరు. (47-49)
వారు (నీ గురించి) “అతని దగ్గరకు అతని ప్రభువు నుండి నిదర్శనాలు ఎందుకు రాలేదు?”అని ప్రశ్నిస్తారు. “నిదర్శనాలు దేవుని వద్ద చాలా ఉన్నాయి. నేను (విషయాన్ని) స్పష్టంగా తెలియజేసి హెచ్చరించేవాడ్ని మాత్రమే” అని చెప్పు. (50)
మేము నీ (హృదయం)లో గ్రంథం అవతరింపజేశాము. దాన్ని నీవు పఠించి (ప్రజలకు) విన్పిస్తున్నావు. ఇదొక్క నిదర్శనం చాలదా వారికి? ఈ గ్రంథంలో విశ్వసించే వారి కోసం (దైవ)కారుణ్యం, హితోపదేశం ఉన్నాయి. వారికిలా చెప్పు: “మీకూ, నాకూ మధ్య సాక్షిగా దేవుడే చాలు. ఆయన భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త విషయాలు ఎరిగిన వాడు. దేవుడ్ని తిరస్కరించే మిధ్యవాదులే నష్టపోయేవారు.” (51-52)
వారు శిక్ష కోసం తొందరపడ్తున్నారు. దీనికి ఒక సమయమంటూ ముందే నిర్ణ యించక పోయివుంటే వారిపై శిక్ష ఎప్పుడో వచ్చిపడేది. అది తప్పకుండా (దాని నిర్ణీత సమయానికి) వారికి తెలియకుండానే హఠాత్తుగా వచ్చిపడుతుంది. వారు శిక్షకోసం తొందరపడ్తున్నారు గాని, నరకం (ఈ) అవిశ్వాసులకు (ఇప్పటికే) చుట్టుముట్టి ఉంది. వారిని (నరక)శిక్ష వారి పైనుండి, వారికాళ్ళ క్రింది నుండి వచ్చి కమ్ముకునే రోజున దేవుడు వారితో “ఇక మీరు చేసుకున్న కర్మలు చవిచూడండి” అంటాడు.
విశ్వాసులైన నా దాసులారా! నాభూమి విశాలంగా ఉంది. (ఇక్కడ కష్టంగా ఉంటే మీరు వేరేచోటికి వలసపోవచ్చు.) మీరు నన్నే ఆరాధించండి. ప్రతిప్రాణీ చావును చవి చూడవలసిందే. మీరంతా మా దగ్గరికే తిరిగిరావలసి ఉంది. (53-57)
విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని మేము స్వర్గంలో సెలయేరులు ప్రవహించే అత్యున్నతమైన భవనాలలో ఉంచుతాం. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సదాచార సంపన్నులకు లభిస్తున్న ఈ ప్రతిఫలం ఎంత మంచిప్రతిఫలం! వారు (కష్టాలు ఎదురై నప్పుడు) సహనం వహించి తమ ప్రభువునే నమ్ముకొని ఉంటారు. (58-59)
(మీలాగే) ఎన్నో జంతువులు ఉన్నాయి. కాని అవి తమ ఆహారాన్ని మోసుకొని తిరగడం లేదు. వాటికి ఆహారం దేవుడే ప్రసాదిస్తున్నాడు. మీకు ఆహారమిచ్చేవాడు కూడా ఆయనే. ఆయన సమస్త విషయాలు వింటున్నాడు; సర్వం ఎరిగినవాడు. (60)
భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారని, సూర్యచంద్రుల్ని ఎవరు అదుపులో ఉంచ గలిగారని నీవు అడిగితే, దేవుడే అని వారు తప్పకుండా అంటారు. అలాంటప్పుడు వారెలా మోసపోతున్నారు? దేవుడు తన దాసులలో తానుతలచిన విధంగా కొందరికి పుష్కలంగా ఆహారం ప్రసాదిస్తున్నాడు; కొందరికి దారిద్య్రం కలిగిస్తున్నాడు. దేవుడు సమస్త విషయాలు తెలిసినవాడు. (61-62)
ఆకాశం నుండి వర్షం కురిపించి తత్వారా మృతభూమికి జీవం పోస్తున్నదెవరని అడిగతే, దేవుడే అని వారు తప్పకుండా అంటారు. కనుక ఆ దేవుడే సకల ప్రశంసలకు అర్హుడని చెప్పు. కాని చాలామంది (ఈ సత్యాన్ని) గ్రహించడం లేదు. (63)
ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, వినోదం తప్ప మరేమీ కాదు. అసలు జీవితం పరలోక గృహ(జీవిత)మే. ఈ యదార్థం వారు అర్థంచేసుకుంటే ఎంత బాగుండు! (64)
వారు పడవ ఎక్కి బయలుదేరినప్పుడు తమ ధర్మాన్ని (నిజ)దేవునికే ప్రత్యేకించి (తమను క్షేమంగా దరికి చేర్చమని) ఆయన్ని ప్రార్థిస్తారు. కాని దేవుడు వారిని క్షేమంగా దరికి చేర్చగానే వారు (మళ్ళీ)బహుదైవారాధనకు పాల్పడతారు. తమను దేవుడు కాపాడి చేసినమేలు మరచి (ఐహిక)సుఖాలు జుర్రుకోవాలి అన్నట్టు కృతఘ్నులై పోతారు. సరే, (దాని పర్యవసానం ఏమిటో) త్వరలోనే వారికి తెలిసొస్తుంది. (65-66)
మేము (మక్కాలో) శాంతినిలయం నెలకొల్పిన విషయాన్ని వారు గమనించ లేదా? దాని చుట్టుప్రక్కల ప్రజలు (హింసా దౌర్జన్యాలతో) ఎలా నాశనమైపోతున్నారో వారికి కన్పించడం లేదా? ఇదంతా తెలిసికూడా వారు అసత్యాన్నే నమ్ముతున్నారా? దేవుని అనుగ్రహాలు పొంది ఆయన పట్లే కృతఘ్నులయిపోతారా? (67)
సత్యం (కళ్ళ)ముందుకు వచ్చినప్పటికీ దాన్ని ధిక్కరించే లేదా అసత్యాలు కల్పించే వాడి కంటే పరమదుర్మార్గుడు మరెవరుంటారు? అలాంటి తిరస్కారుల గతి నరక నివాసం కాదా? మా (ప్రసన్నత) కోసం శ్రమించేవారికి మా (సన్నిధికి చేరుకునే) మార్గం చూపుతాం. నిస్సందేహంగా దేవుడు సజ్జనులకు తోడుగా ఉంటాడు. (68-69)