కురాన్ భావామృతం/అర్-రహ్మాన్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

55. రహ్మాన్‌ (కరుణామయుడు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 78)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
కరుణామయుడే ఈ ఖుర్‌ఆన్‌ని (తన ప్రవక్తకు) నేర్పినవాడు. ఆయనే మానవుడ్ని సృష్టించి అతనికి మాట్లాడటం నేర్పాడు. సూర్యచంద్రులు ఓ నియమావళికి కట్టుబడి ఉన్నారు. నక్షత్రాలు, వృక్షాలు కూడా సాష్టాంగపడుతూ ఆజ్ఞాబద్ధమైఉన్నాయి. ఆయనే ఆకాశాన్ని, త్రాసుని(న్యాయాన్ని) స్థాపించాడు. కనుక మీరు త్రాసు సమతూకం చెడగొట్ట కండి. న్యాయంగా, పూర్తిగా తూచివ్వండి. కొలతపరిమితులు అతిక్రమించకండి. (1-9)
ఆయన భూమిని యావత్తు జీవరాసుల కోసం రూపొందించాడు. అందులో రక రకాల పండ్లూ-ఫలాలూ అసంఖ్యాకంగా ఉన్నాయి. పొరలలో చుట్టబడిన ఖర్జూరపండ్లు కూడాఉన్నాయి. ఇంకా రకరకాల ధాన్యాలున్నాయి. అందులో ఊక కూడా ఉంటుంది, గింజలు కూడా ఉంటాయి. కనుక (మానవులారా, జిన్నులారా!) మీ ప్రభువు ప్రసాదిం చిన ఏ మహాభాగ్యాలు మీరు నిరాకరించగలరు? ( 10-13)
ఆయన మానవుడ్ని పెంకులాంటి ఎండిన రేగడమట్టితో సృజించాడు. జిన్‌ (భూతం)ని అగ్నిజ్వాలతో సృజించాడు. కనుక (మానవులారా, జిన్నులారా!) మీ ప్రభువు సృష్టించిన ఏ అద్భుతాలు మీరు తిరస్కరించగలరు? రెండు తూర్పులకు, రెండు పడమరలకు ఆయనే ప్రభువు, పాలకుడు. కనుక మీరు మీ ప్రభువుకున్న ఏ శక్తి సామర్థ్యాలు త్రోసిపుచ్చగలరు? (14-18)
ఆయన రెండు సముద్రాలను పరస్పరం కలసిపోయేలా వదలిపెట్టాడు. ఆయినా వాటి మధ్య ఒక అడ్డుతెర ఉంది. దానివల్ల అవి ఒకదానిలో ఒకటి చొచ్చుకు పోలేవు. మరి మీరు మీ ప్రభువు శక్తిపరిధిలోని ఏ మహిమను నిరాకరించగలరు? (19-21)
ఆ సముద్రాలలో ముత్యాలు, పగడాలు (కూడా) లభిస్తాయి. కనుక మీరు మీ ప్రభువులో ఉన్న ఏ ఔన్నత్యాన్ని కాదనగలరు? సముద్రంలో కొండల్లా ఎత్తుగా నిలబడి సాగిపోయే ఓడలు కూడా ఆయనవే. కనుక మీరు మీ ప్రభువు చేసిన ఏ మేళ్ళు తిరస్కరించగలరు? (22-25)
ఈ ధరణిపై ఉన్న సమస్త ప్రాణికోటి నశించిపోయేదే. మహోన్నతుడు, మహిమాన్వి తుడయిన నీ ప్రభువు అస్తిత్వమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కనుక మీ ప్రభువుకున్న ఏ శక్తియుక్తులు మీరు ఖండించగలరు? (26-28)
భూమ్యాకాశాల్లోని జీవరాసులన్నీ తమ అవసరాల కోసం ఆయన్నే అర్థిస్తున్నాయి. ఆయన అనుక్షణం సృష్టికి సంబంధించిన ఏదో ఒక అద్భుతకార్యంలో నిమగ్నుడయి ఉంటాడు. మరి మీరు మీప్రభువులో ఉన్న ఏ సృజనాత్మక లక్షణాలు నిరాకరిస్తారు?#
భూమికి భారమయిపోయిన వారలారా! త్వరలోనే మేము మీకర్మల విచారణ కోసం తీరిక చేసుకుంటాం. (అప్పుడు) మీరు మీ ప్రభువుకున్న ఏ శక్తిసామర్థ్యాలు తిరస్కరించగలరో (మేము చూస్తాము). (29-32)
మానవులారా! జిన్నులారా!! మీరు భూమ్యాకాశాల పరిధులు దాటి పారిపోగలరేమో ప్రయత్నించి చూడండి. దానికోసం అసాధారణ ప్రజ్ఞా పాటవాలు కావాలి. కనుక మీరు మీ ప్రభువులోని ఏ ప్రజ్ఞాపాటవాలు నిరాకరిస్తారు? (ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నిస్తే,) మీపైకి అగ్నిజ్వాల, పొగ వదలి పెట్టబడతాయి. వాటిని మీరు ఏమాత్రం ఎదుర్కోలేరు. కనుక మీరు మీప్రభువులో ఉన్న ఏ శక్తిసామర్థ్యాలు ధిక్కరించగలరు? (33-36)
ఆకాశం బ్రద్దలై వలచిన చర్మంలా ఎర్రబారిపోతుంది. అప్పుడు (మీ పరిస్థితి ఏమిటో ఆలోచించండి.) మరి మీ ప్రభువు చూపే ఏ మహిమల్ని మీరు ఖండిస్తారు?#
ఆరోజు ఏ మానవుడ్నీ, జిన్‌నీ అతని పాపం గురించి అడగవలసిన అవసరమే లేదు. మరి మీప్రభువులోని ఏ శక్తియుక్తుల్ని కాదనగలరు? పాపాత్ముల్ని వారి ముఖాల్ని బట్టే గుర్తించవచ్చు. వారి ముంగురుల్ని, కాళ్ళను పట్టి బరబర ఈడ్చుకుపోవడం జరుగు తుంది. అప్పుడు మీప్రభువుకున్న ఏశక్తిసామర్థ్యాలు మీరు నిరాకరించగలరు? (37-42)
నేరస్థులు అసత్య విషయంగా భావించి త్రోసిపుచ్చిన నరకం ఇదే. ఈ నరకంలోనే వారు (నానా యాతనలు అనుభవిస్తూ, తీవ్రమైన దప్పికతో) యాతన స్థలానికి, సలసల కాగుతున్న నీటి చలమలకూ మధ్య తిరుగుతుంటారు. కనుక మీరు మీప్రభువులో ఉన్న ఏ ప్రతిభాశక్తులు తిరస్కరించగలరు? (43-45)
విశ్వప్రభువు ముందు నిలబడి తన కర్మలకు సమాధానం ఇచ్చుకోవలసి ఉంటుందని భావించి భయభక్తులతో జీవితం గడిపిన ప్రతి వ్యక్తికీ రెండు (స్వర్గ)వనాలు లభిస్తాయి. కనుక (మానవులారా! జిన్నులారా!) మీ ప్రభువు ప్రసాదించే ఏ వరాలు మీరు నిరాకరిస్తారు? పచ్చటి రెమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరించిన ఉద్యానవనాలవి. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహించే ఏ కానుకలు తిరస్కరించగలరు? (46-49)
ఆ రెండు వనాలలో రెండు సెలయేరులున్నాయి. కనుక మీ ప్రభువు ప్రసాదించే ఈ భాగ్యాలను మీరు ఎలా నిరాకరిస్తారు? రెండు వనాలలోనూ ప్రతిజాతి ఫలానికి చెందిన రెండు రకాలు ఉన్నాయి. మరి మీ ప్రభువు ప్రదానం చేసే ఈ బహుమానాలు మీరు నిరాకరించగలరా? (50-53)
స్వర్గవాసులు బంగారుజలతారు అంచులుండే పట్టు పరుపులపై మెత్తటి దిండ్లకా నుకొని కూర్చుంటారు. (వారిముందు) పండ్లతో నిండిన చెట్లరెమ్మలు వంగి ఉంటాయి. కనుక మీరు మీ ప్రభువు ప్రసాదించే ఏ మహాభాగ్యాలు నిరాకరిస్తారు? (50-55)
ఆ మహాభాగ్యాల మధ్య (వారి కోసం) సిగ్గులొలికించే స్వర్గ కన్యలుంటారు. వారిని ఈ స్వర్గవాసులకు పూర్వం ఏ మానవుడుగాని, జిన్‌గాని తాకనైనా తాకిఉండడు. కనుక మీరు మీ ప్రభువు ప్రదానం చేసే ఏ బహుమానాలు తిరస్కరించగలరు? వారు మణి మాణిక్యాల్లా అసామాన్య సౌందర్యరాసులు. మరి మీరు మీ ప్రభువు ప్రసాదించే ఈ బహుమానాలు కాదనగలరా? (56-59)
సత్కార్యానికి ప్రతిఫలం సత్కార్యం తప్ప మరేమవుతుంది? కనుక మీ ప్రభువు సద్గుణ సంపత్తిని మీరేవిధంగా త్రోసిపుచ్చగలరు? (60-61)
ఆ రెండు వనాలేగాక మరో రెండు వనాలు కూడా ఉన్నాయి. కనుక మీ ప్రభువు ఇచ్చే ఏ వరాలు మీరు తిరస్కరించగలరు? అవి దట్టమైన నిత్యహరిత వనాలు. మరి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో ఏ అనుగ్రహాన్ని నిరాకరించగలరు? (62-65)
ఆ రెండు వనాలలో రెండు సెలయేరులు పరవళ్ళు తొక్కుతుంటాయి. కనుక మీరు మీ ప్రభువు ప్రసాదించే ఏ కానుకలను తిరస్కరిస్తారు? (66-67)
ఆ ఉద్యానవనాలలో ఖర్జూరం, దానిమ్మ (మొదలైన) పండ్లు-ఫలాలు పుష్కలంగా ఉంటాయి. మరిమీరు మీప్రభువు అనుగ్రహించే ఏభాగ్యాలు కాదనగలరు? (68-69)
ఆ వనాలలో సద్గుణసంపత్తితో కూడిన సౌందర్యవతులైన సతులు ఉంటారు. కనుక మీరు మీ ప్రభువు ఇచ్చే ఏ వరాలు నిరాకరించగలరు? ఇంకా ఎల్లప్పుడూ పర్ణ శాలల్లోనే ఉండే సుందరాంగులు కూడా. కనుక మీ ప్రభువు ప్రసాదించే ఈ కానుకల్ని మీరెలా తిరస్కరిస్తారు? వారిని ఈ స్వర్గవాసులకు పూర్వం ఏ మానవుడుగాని, జిన్‌గాని తాకనయినా తాకిఉండడు. మరి మీ ప్రభువు ప్రదానం చేసే ఏ బహుమానాలు మీరు త్రోసిపుచ్చుతారు? (70-75)
అక్కడ స్వర్గవాసులు అత్యంత విలువైన, ఎంతో అపురూపమైన పచ్చటి తివాచీల మీద మెత్తటి దిండ్లకు ఆనుకొని కూర్చుంటారు. కనుక మీరు మీ ప్రభువు అనుగ్రహించే ఏ మహాభాగ్యాలు నిరాకరించగలరు? (76-77)
మహోన్నతుడు, మహిమాన్వితుడయిన నీ ప్రభువు పేరు అత్యంత శుభదాయక మయినది. (78)