కురాన్ భావామృతం/బనీ ఇస్రాయీల్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ


17. బనీ ఇస్రాయీల్‌ (ఇస్రాయీల్‌ సంతతి)
(అవతరణ: మక్కా; సూక్తులు: 111)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
దేవుడు ఎంతో పరిశుద్ధుడు. ఆయన తన నిదర్శనాలు చూపడానికి ఒకరోజు రాత్రి వేళ తన దాసుణ్ణి కాబామసీదు నుండి దూరాన ఉన్న అఖ్సామసీదు దగ్గరకు తీసి కెళ్ళాడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. ఆయన సమస్తం వింటున్నాడు. ప్రత్యక్షంగా ప్రతిదాన్నీ చూస్తున్నాడు. (1)
మేము ఇదివరకు మూసాకు కూడా దివ్యగ్రంథం ప్రసాదించాము. నన్ను తప్ప మరెవరినీ సంరక్షకుడిగా చేసుకోవద్దని ఉపదేశిస్తూ ఆ గ్రంథాన్ని మేము ఇస్రాయీల్‌ సంతతికి మార్గదర్శినిగా చేశాము. నూహ్‌తోపాటు మేము ఓడలో ఎక్కించినవారి సంతానమా! (వినండి) నూహ్‌ దేవుని పట్ల కృతజ్ఞుడయిన భక్తుడు. (2-3)
మేము మాగ్రంథంలో ఇస్రాయీల్‌ సంతతివారిని హెచ్చరిస్తూ, మీరు ప్రపంచంలో రెండుసార్లు అరాచకం సృష్టిస్తారని, మితిమీరిన దురహంకారం ప్రదర్శిస్తారని పేర్కొన్నాం. ఆరెండిటిలో మొదటిసారి దురంహంకారం ప్రదర్శించే సమయం వచ్చినప్పుడు మేము మీకు వ్యతిరేకంగా అత్యంత శక్తిమంతులైన మాదాసుల్ని తీసుకొచ్చాం. వారు మీదేశంలో చొచ్చుకుపోయి నలుమూలలా వ్యాపించారు. అదొక వాగ్దానం. అదిలా నెరవేరింది. తర్వాత మీకు వారిపై ఆధిక్యత పొందే అవకాశమిచ్చాం. సంతానం, సిరిసంపదలతో సహాయం చేశాం. మీ జనాభాను పెంచాం. వినండి! మీరేదైనా మంచిపని చేస్తే అది మీ శ్రేయస్సుకే దోహదపడుతుంది. చెడుపని చేస్తే అది మీ కీడుకే దారితీస్తుంది.
ఆ తరువాత రెండవ వాగ్దాన సమయం వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా మేము మరొక శత్రువర్గాన్ని తెచ్చిపెట్టాము. వారు మీ రూపురేఖలను వికృతంగా మార్చివేయ డానికి, ఇదివరకటి శత్రువర్గంలాగే (బైతుల్‌ మఖ్దిస్‌) మసీదులోకి చొచ్చుకు పోవడానికి, వారు ఆక్రమించిన ప్రతిదాన్నీ సర్వనాశనం చేయడానికి మేమిలా చేశాం. ఇప్పుడు మీ ప్రభువు మిమ్మల్ని కరుణించే అవకాశం లేకపోలేదు. అయితే మీరు మళ్ళీ గతంలో చేసి నటువంటి చేష్టలే చేస్తే మాత్రం, మేమూ మీకు తిరిగి అదే శాస్తి చేస్తాం. సత్యతిర స్కారుల కోసం మేము నరకాన్ని కారాగారంగా చేసిఉంచాము. (4-8)
నిస్సందేహంగా ఈఖుర్‌ఆన్‌ పూర్తిగా రుజుమార్గం చూపుతుంది. సత్యాన్ని విశ్వసించి సత్కర్మలు ఆచరించేవారికి గొప్పప్రతిఫలం లభిస్తుందని శుభవార్త అందజేస్తోంది. పరలోకాన్ని విశ్వసించనివారికి మేము దుర్భరయాతన సిద్ధపరచి ఉంచామని కూడా ఇది హెచ్చరిస్తోంది. మానవుడు (ముందుచూపు లేకుండా) మేలుకు బదులు కీడు కోరు కుంటున్నాడు. అతను నిజంగా చాలా తొందరపాటు కలవాడు. (9-11)
మేము రాత్రిని, పగటిని రెండు సూచనలుగా చేశాం. రాత్రి సూచనను (మీ విశ్రాంతి కోసం) చీకటిమయంగా చేశాం. అలాగే మీరు మీప్రభువు అనుగ్రహం(ఉపాధి) అన్వేషించడానికి; నెలలు, సంవత్సరాల లెక్క తెలుసుకోడానికి మేము పగటిని ప్రకాశ వంతంగా చేశాం. ఇలా మేము ప్రతి విషయాన్నీ స్పష్టంగా విశదీకరించాం. (12)
మేము ప్రతి మానవుడి జాతకాన్ని అతని మెడలోనే వ్రేలాడదీశాం. ప్రళయదినాన ఒక చిట్టా తీసి అతని ముందు పెడ్తాము. అతను దాన్ని తెరచిన పుస్తకంలా చూస్తాడు- ‘ఇదిగో చదువుకో నీకర్మల చిట్టా. ఈరోజు నీకర్మల లెక్క చూడటానికి నీవే చాలు.’ ఏమనిషి సన్మార్గం అవలంబిస్తాడో ఆ సన్మార్గం అతనికే లాభదాయకమవుతుంది. అలాగే ఎవడు మార్గభ్రష్టుడైపోతాడో ఆ మార్గభ్రష్టత్వం అతనికే చేటు తెచ్చిపెడ్తుంది. (పాప)భారం మోసే వాడెవడూ ఇతరుల (పాప)భారం మోయలేడు. (ప్రజలకు ధర్మం ఏమిటో, అధర్మం ఏమిటో వివరించడానికి) ఒక సందేశహరుడ్ని పంపనంత వరకు మేము ఎవరినీ ఎన్నటికీ శిక్షించము. (13-15)
మేమేదైనా జనపదాన్ని నాశనం చేయదలచుకుంటే ముందుగా అక్కడి ధనికులకు ఒక ఆజ్ఞ జారీచేస్తాం. దాన్ని వారు పెడచెవినపెట్టి దుర్మార్గాలకు పాల్పడతారు. దాంతో ఆ జనపదం శిక్షార్హురాలై పోతుంది. మేము దాన్ని సమూలంగా తుడిచిపెడ్తాం. (ఇలా) మేము నూహ్‌(ప్రవక్త) తర్వాత అనేక తరాలను నాశనం చేశాం. నీ ప్రభువుకు తన దాసుల పాపకార్యాలేమిటో బాగా తెలుసు. ఆయన అన్నిటినీ గమనిస్తున్నాడు. (16-17)
సత్వరం లభించే ప్రాపంచిక వస్తువులు కోరుకునేవారిలో మేము తలచిన వానికి తలచిన వస్తువు ఇహలోకంలోనే ఇచ్చివేస్తాం. తర్వాత అతనికి నరకం రాసిపెడ్తాం. చివరికి అతను నిరాశానిసృహలతో క్రుంగిపోయి నరకంలో కాలి మాడిపోతుంటాడు.#
ఇక పరలోకభాగ్యం కోరుకుంటూ దానికోసం తగిన కృషిచేసే వారైతే, దాంతో పాటు వారు విశ్వాసులు కూడా అయివుంటే, వారి కృషికి తప్పక ఆదరణ లభిస్తుంది. ఈ ఉభయులకు మేము (ప్రపంచంలో ఎంతోకొంత) జీవనసామగ్రి ఇస్తుంటాము. ఇది నీప్రభువు అనుగ్రహం నీప్రభువు అనుగ్రహాన్ని ఎవరూ అడ్డుకోలేరు. (18-20)
మేము ప్రపంచంలో ఒకరిపై మరొకరికి ఎలా ఔన్నత్యం ప్రసాదించామో చూడండి. పరలోకంలోనైతే వారి హోదాఅంతస్తులు మరింత పెరుగుతాయి. కనుక మీరు దేవునితో పాటు మరోశక్తిని ఆరాధ్యదైవంగా చేసుకొని పూజించకండి. అలా చేస్తే మీరు నిందితులై, నిస్సహాయులై కూలబడిపోతారు. (21-22)
నీ ప్రభువు తన ఆజ్ఞలు ఇలా జారీ చేస్తున్నాడు:

 • మీరు ఒక్క (నిజ) దేవుడ్ని తప్ప మరెవరినీ ఆరాధించకండి.
 • తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మసలుకోండి. మీ ముందు వారిద్దరిలో ఎవరైనా వృద్ధులైఉంటే వారిని ‘ఉఫ్‌’ అని కూడా విసుక్కోకండి. కసురుకుంటూ విదిలించి మాట్లాడకండి. వారితో గౌరవంగా మాట్లాడండి; దయార్ద్రహృదయంతో, వినయంతో వారి ముందు తలవంచిఉండండి. (వారిపట్ల గౌరవాదరణలతో) “ప్రభూ! వీరు నన్ను చిన్నతనంలో ఎలా కరుణతో, వాత్సల్యంతో పెంచిపోషించారో అలా నీవు వీరిని కరుణించు” అని ప్రార్థించండి. (23-24)
 • మీ హృదయంలో ఏముందో మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సజ్జనులై ఉంటే, (పశ్చాత్తాపంతో) తనవైపు మరలేవారందర్నీ ఆయన క్షమిస్తాడు. (25)
 • బంధువులు, నిరుపేదలు, బాటసారుల హక్కులు నెరవేర్చండి.
 • దుబారాఖర్చు చేయకండి. దుబారాఖర్చు చేసేవారు షైతాన్‌ సోదరులుగా పరిగణించబడతారు. షైతాన్‌ తన ప్రభువుకు కృతఘ్నుడైపోయాడు. (26-27)
 • మీరు దైవానుగ్రహం ఆశించి దానికోసం నిరీక్షిస్తూ (పేదలకు సహాయం చేయలేక) వారినుండి తప్పించుకోవలసివస్తే, వారికి మృదువుగా జవాబివ్వండి. (28)
 • మీరు మీచేతిని (ఏమాత్రం దానంచేయకుండా) మెడకేసి కట్టి ఉంచకండి. అలాగే దాన్ని పూర్తిగా తెరచి ఉంచడం కూడా సరికాదు. అలాచేస్తే మీరు నిందితులయి, నిస్సహాయులై పోతారు. నీ ప్రభువు తాను కోరినట్లు కొందరికి ఇతోధికంగా ఉపాధినిస్తే, మరికొందరిని లేమికి గురిచేస్తాడు. ఆయనకు తన దాసుల స్థితిగతులు బాగా తెలుసు. ఆయన వారిని చూస్తూనేఉన్నాడు. (29-30)
 • దారిద్య్రభయంతో మీసంతానాన్ని చంపుకోకండి. మేము వారికీ ఆహారమిస్తున్నాం, మీకూ ఇస్తున్నాం. వారిని చంపడం ఘోరమైన పాపం. (31)
 • వ్యభిచారం దరిదాపులకు పోకండి. అది చాలా హేయమైనది, పరమచెడ్డదారి#
 • న్యాయసమ్మతంగా తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. ఎవరైనా అన్యాయంగా హతమార్చ బడితే అతని వారసులకు మేము బదులు తీర్చుకునే అధికారమిచ్చాం. అయితే వారసుడు (హంతకుడ్ని) వధించడంలో హద్దు మీరకూడదు. అప్పుడే అతనికి సహాయం చేయబడుతుంది. (32-33)
 • అనాథపిల్లలు యుక్తవయస్సుకు చేరుకునే వరకు న్యాయసమ్మతంగా తప్ప వారి సొమ్ము దరిదాపులకు వెళ్ళకండి.
 • (వాగ్దానం) ఒప్పందం నెరవేర్చండి. (వాగ్దానం) ఒప్పందం గురించి మీరు తప్పనిసరిగా (దేవుని ముందు) సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. (34)
 • సరైన పాత్రతో పూర్తిగా కొలచి ఇవ్వండి. తూచవలసివస్తే సరైన త్రాసుతో తూచి ఇవ్వండి. ఇదే సరైన పద్ధతి. ఫలితంరీత్యా కూడా ఈపద్ధతే మంచిది. (35)
 • మీకు తెలియనిదాని వెంటపడకండి. కళ్ళు, చెవులు, హృదయం వగైరా సమస్త అవయవాల్ని గురించి (దేవునికి) సమాధానం చెప్పుకోవలసిఉంటుంది. (36)
 • భూమిపై నిక్కుతూ, నీల్గుతూ నడవకండి. (ఈ అహంకారంతో) మీరు భూమిని చీల్చి వేయలేరు. పర్వతాల ఎత్తుకు ఎదగనూ లేరు. (37)

ఇవన్నీ దుష్కార్యాలు. మీ ప్రభువు దృష్టిలో ఎంతో హేయమైనవి. ఇవి వివేకంతో కూడిన విషయాలు. వీటిని నీ ప్రభువు నీ హృదయఫలకంపై అవతరింపజేశాడు.
వినండి! దేవునితో పాటు మరో ఆరాధ్యదైవాన్ని చేసుకోకండి. అలాచేస్తే మీరు నిందితులై, సమస్త శ్రేయోశుభాలకు దూరమై నరకంలో వేయబడతారు. (38-39)
మీ ప్రభువు మీకు కుమారుల్ని అనుగ్రహించి తనకోసం దైవదూతల్ని కుమార్తెలుగా చేసుకున్నాడా? ఎంత విచిత్రం! మీరు మీనోట పలుకుతున్న ఈ మాటలు పచ్చి అబ ద్ధాలు, నిరాధారమైనవి. మేమీ ఖుర్‌ఆన్‌లో సత్యాన్ని అర్థంచేసుకోవలసిందిగా ప్రజలకు రకరకాలుగా నచ్చజెప్పా. కాని వారు దానికి మరింత దూరమయిపోతున్నారు. (40-41)
వారికిలా చెప్పు: వారన్నట్లు దేవునితో పాటు ఇతర దైవాలు కూడా ఉంటే ఆ దైవాలు సింహాసనాధీశుని స్థాయికి చేరుకోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాయి. దేవుడు పరిశుద్ధుడు. వారు పలుకుతున్న ఈ పలుకులకు దేవుడు అతీతుడు, ఎంతో ఉన్నతుడు. సప్తాకాశాలు, భూమి, భూమ్యాకాశాల్లోని యావత్తు సృష్టిరాసులు ఆయన పవిత్రతను కొనియాడుతున్నాయి. ఆయన ఔన్నత్యంతో పాటు ఆయన పవిత్రతను ప్రశంసించని సృష్టి అంటూ ఏదీ లేదు. కాని అవి చేసే దైవస్మరణను మీరు గ్రహించలేరు. ఆయన ఎంతో ఉదారుడు, గొప్ప క్షమాశీలి. (42-44)
ప్రవక్తా! నీవు ఖుర్‌ఆన్‌ పఠిస్తున్నప్పుడు మేము నీకూ, పరలోకం నమ్మనివారికీ మధ్య అడ్డుతెర ఉంచి వారి హృదయకవాటాలు మూసేస్తాం. దాంతో ఏ విషయాన్నీ గ్రహించ లేరు. వారి చెవులకు చెవుడు కల్పిస్తాం. ఖుర్‌ఆన్‌లో నీవు మాటిమాటికి నీ ప్రభువు ఒక్కడ్ని గురించే ప్రస్తావిస్తుంటే వారు ఏవగింపుతో ముఖం తిప్పుకుంటున్నారు.#
ఎప్పుడైనా వారు నీమాటలు చెవియొగ్గి వింటే వారసలు ఏంవిన్నారో, ఆతర్వాత వారు ఏకాంతంలో కలుసుకొని ఏం గుసగుసలాడుకున్నారో అన్నీ మాకు తెలుసు. ఆ దుర్మార్గులు నీగురించి“ఈ మనిషి చేతబడికి గురైన పిచ్చివాడు. అలాంటి పిచ్చివాడి వెంటపడ్డారు మీరు” అంటారు (ముస్లింలతో). చూడు నీగురించి ఎలాంటి మాటలు అంటున్నారో. వీరసలు మార్గభ్రష్టులైపోయారు. వీరిక దారికి రారు. (45-48)
వారు (ఆశ్చర్యంతో) “మేము (చచ్చి) ఎముకలుగా, మట్టిగా మారిపోయాక మళ్ళీ బ్రతికించి లేపబడతామా?” అంటారు. వారికిలా స్పష్టంగా చెప్పెయ్యి: “మీరు (చచ్చి) రాళ్ళయిపోయినా, ఇనుమైపోయినా సరే (తప్పకుండా లేపబడతారు).” (49-50)
ఆ తర్వాత వారు “మమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపే వాడెవడు?” అని తప్పకుండా అడుగుతారు. “మిమ్మల్ని మొదటిసారి పుట్టించినవాడే” అని చెప్పు. వారు (ఆశ్చర్యంతో) తలలూపుతూ “అయితే అది ఎప్పుడు సంభవిస్తుందంటావు?” అని మళ్ళీ అడుగుతారు. “అది ఎంతో దూరం లేదు, త్వరలోనే సంభవించవచ్చ”ని చెప్పు వారికి. (51)
ఏరోజు ఆయన మిమ్మల్ని కేకవేసి పిలుస్తాడో ఆరోజు మీరు ఆయన పిలుపునకు వెంటనే స్పందించి ఆయన్ని స్తుతిస్తూ (బిలబిల పరుగెత్తుకు) వస్తారు. అప్పుడు మీరు మనసులో “మనమీ స్థితిలో కొద్దిసేపే ఉన్నాం” అని అనుకుంటారు. (52)
ముహమ్మద్‌ (స)! నాదాసులతో ‘మీరు మంచిమాటనే మీనోట వెలువరించాల’ని చెప్పు. మానవుల మధ్య షైతాన్‌ కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. షైతాన్‌ మానవులకు బహిరంగ శత్రువు. మీ పరిస్థితి గురించి మీ ప్రభువుకు బాగా తెలుసు. ఆయన తలచుకుంటే మిమ్మల్ని కరుణిస్తాడు లేదా శిక్షిస్తాడు. మేము నిన్ను ప్రజల మీద పర్యవేక్షకునిగా నియమించి పంపలేదు. భూమ్యాకాశాలలోని సమస్త సృష్టిరాసుల్ని గురించి నీ ప్రభువుకు బాగాతెలుసు. మేము ప్రవక్తలలో కొందరికి కొందరికన్నా ఉన్నత హోదాలు కల్పించాం. మేమే దావూద్‌కు జబ్బూర్ గ్రంథం ఇచ్చింది. (53-55)
చెప్పు: “మీరు దేవుడ్ని కాదని ఆరాధిస్తున్న మీ మిధ్యాదైవాలను మొరపెట్టుకొని చూడండి. అవి మీకష్టాలను ఏమాత్రం దూరంచేయలేవు. ఆ స్థితిని మార్చలేవు కూడా. అవి స్వయంగా తమ ప్రభువుసాన్నిధ్యం అన్వేషిస్తూ తమలో దేవునికి ఎవరెక్కువ సన్నిహి తులో అని ఆలోచిస్తున్నాయి. ఆయన అనుగ్రహం ఆశిస్తూ, ఆయన శిక్షకు భయపడు తున్నాయి. నిజానికి నీ ప్రభువు శిక్ష భయపడవలసిన విషయమే. (56-57)
మేము ప్రళయదినానికి పూర్వం ప్రతి పట్టణాన్ని, జనపదాన్ని సర్వనాశనం చేయ డమో లేక కఠినంగా శిక్షించడమో చేస్తాం. ఇది విధివ్రాతలో రాయబడిఉంది. (58)
వీరికిపూర్వం ప్రజలు మా మహిమలు తిరస్కరించారు. ఈ విషయం తప్ప మరేదీ మమ్మల్ని వాటిని పంపకుండా నిరోధించలేదు. మేము సమూద్‌ జాతి దగ్గకు (ప్రవక్త దౌత్యానికి) నిదర్శనంగా ఒక ఒంటెను తెచ్చాం. దానిపై వారు దౌర్జన్యం చేశారు. ప్రజలు మా మహిమలు చూసి భయపడి (సత్యాన్ని) విశ్వసిస్తారనే మేము వాటిని పంపాము#
ముహమ్మద్‌ (స)! నీ ప్రభువు వారిని పరివేష్ఠించి ఉన్నాడని మేము నీకు తెలియ జేశాం. మేమిప్పుడు నీకు చూపిన దాన్ని, ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన శాపగ్రస్త వృక్షాన్ని వారికోసం కఠినపరీక్షగా చేశాం. మేము వారిని మాటిమాటికి హెచ్చరిస్తూనే ఉన్నాం. కాని మా హెచ్చరికలు వారి తలబిరుసుతానాన్ని మరింతఅధికమే చేస్తున్నాయి. (59-60)
మేము దైవదూతలను ఆదంకు గౌరవసూచకంగా అభివాదం చేయమని ఆదేశించి నప్పుడు, ఇబ్లీస్‌ తప్ప అందరూ అభివాదం చేశారు. “నీవు మట్టితో సృజించిన వాడికి నేను అభివాదం చేయాల్నా?” అన్నాడతను. “కాస్త నీవే ఆలోచించు. నీవితనికి నాకంటే ఎక్కువ ఔన్నత్యాన్నిచ్చావు. అంతటి యోగ్యుడా ఇతను? ప్రళయందాకా నాక్కాస్త గడువి చ్చావంటే, నేనితని సంతతిని పూర్తిగా దారితప్పించి నా అధీనం చేసుకుంటాను. బహు తక్కువమంది మాత్రమే నాబారి నుండి బయటపడతారు” అన్నాడతను. (61-62)
దానికి సృష్టికర్త ఇలా అన్నాడు: “సరే వెళ్ళిపో (ఇక్కడ్నుంచి) నిన్ను, నిన్ను అనుస రించిన వారందరినీ నరకంలో పడవేస్తాను. అదే మీకు తగిన శాస్తి. వారిలో నీవు ఎవరె వరిని పిలిచి ప్రలోభపెడ్తావో ప్రలోభపెట్టుకో. (కావాలంటే) వారిపై నీ వాహనబలాన్ని, పదాతిదళాన్ని (కూడా) ప్రయోగించుకో. వారి సంతానం, సిరిసంపదల్లో కూడా భాగ స్వామిగా చేరిపో. వారిని వాగ్దానాలతో ఊరించి నీ వలలో వేసుకో.”
(మానవులారా! గుర్తుంచుకోండి) షైతాన్‌ చేసే వాగ్దానాలు ఉత్త మోసపు వాగ్దానాలు తప్ప మరేమీ కావు- “ఏమైనప్పటికీ నా ప్రియదాసులపై నీఅధికారం చెల్లదు (నీజిత్తులు పారవు).” నమ్ముకునేవారికి నీ ప్రభువే చాలు. (63-65)
సముద్రాలలో మీ శ్రేయస్సు కోసం నౌకలు నడిపేవాడు మీ ప్రభువే. ఆయన అనుగ్రహం అన్వేషించడానికి మీరు సముద్రయానం చేస్తారు. ఆయన మీపట్ల ఎంతో దయామయుడు. సముద్రయానం చేస్తున్నప్పుడు మీకేదైనా ఆపద వస్తే (మీరు నిజ దేవుడ్నే వేడుకుంటారు.) ఆయన తప్ప మీరు (రోజూ)వేడుకునే మిధ్యాదైవాలన్నీ అప్పుడు కనుమరుగైపోతాయి. కాని ఆయన మిమ్మల్ని ఆపద నుండి కాపాడిన తర్వాత మీరు ఆయనకు విముఖులైపోతారు. నిజంగా మానవుడు చాలాకృతఘ్నుడు. (66-67)
దేవుడు మిమ్మల్ని (తీరానికి చేర్చిన తర్వాత) భూమిలోకి అణగద్రొక్కడని నిర్భ యంగా ఉన్నారా? లేక మీపైకి రాళ్లవర్షంతో కూడిన పెనుతుఫాను పంపడని నిశ్చింతగా ఉన్నారా? అప్పుడా దుస్థితి నుండి మిమ్మల్ని కాపాడేవారే ఉండరు. దేవుడు మళ్ళీ ఎప్పు డైనా మిమ్మల్ని సముద్రంలోకి తీసికెళ్ళి మీరు చూపిన కృతఘ్నతకు ప్రతీకారంగా మీపైకి భయంకరమైన పెనుగాలులు పంపి మిమ్మల్ని సముద్రంలో ముంచివేయడని నిర్భ యంగా ఉన్నారా? అలా జరిగితే మమ్మల్ని ప్రశ్నించేవాడే ఉండడు. (68-69)
మేము ఆదం సంతతికి గౌరవప్రతిష్ఠలు ప్రసాదించాం. వారికి నేలపై, నీటిపై ప్రయాణం చేయడానికి వాహనాలు, తినడానికి పరిశుద్ధమైన ఆహారపదార్థాలు ఇచ్చాం. మేము సృష్టించిన అనేక సృష్టితాలపై వారికి ఎంతో ఆధిక్యత, ఔన్నత్యం ప్రసాదించాం#
మేము ప్రతి మానవవర్గాన్ని దాని నాయకుడితో పాటు పిలిచే రోజొకటి వస్తుంది. ఆరోజు కుడిచేతికి కర్మలపత్రం ఇవ్వబడినవారు అందులో తాము చేసిన ఘనకార్యా లేమిటో చూసుకుంటారు. వారికక్కడ ఏమాత్రం అన్యాయం జరగదు. ఇహలోకంలో అంధుడై జీవితం గడిపినవాడు పరలోకంలో కూడా అంధుడుగానే ఉంటాడు. సన్మార్గం పొందడంలో అతను అంధుడికన్నా ఘోరంగా విఫలమయ్యాడు. (70-72)
ప్రవక్తా! మేము నీదగ్గరకు పంపిన దివ్యసందేశం నుండి వారు నిన్ను తప్పించ డానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా వారు నిన్ను భయప్రలోభాలతో లొంగదీసుకొని, మా పేరుతో నీవు మరేవిషయాలైనా కల్పించేలా చేయడానికి పడరానిపాట్లు పడ్డారు. ఒకవేళ నీవలా చేసివుంటే వారు నిన్ను తమ మిత్రుడిగా చేసుకునేవారు. మేము గనక నిన్ను స్థిరంగా ఉంచనట్లయితే వారి వైపు కొద్దోగొప్పో మొగ్గేవాడివి. వారి వైపు మొగ్గితే మాత్రం మేము నీకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ రెట్టింపు శిక్ష చవిచూపించేవారం. అప్పుడు మాకు వ్యతిరేకంగా నీకు ఎలాంటి సహాయం లభించేది కాదు. (73-75)
వారు నిన్ను ఈనేలపై నిలువనీడలేకుండా చేయడానికి, అసలు నిన్నిక్కడ నుండి గెంటివేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని వారలా చేస్తే ఆ తర్వాత వారు కూడా ఇక్కడ ఎంతోకాలం ఉండలేరు. ఇది మావిధానం. గతప్రవక్తల విషయంలో మేము ఈ విధా నాన్నే అవలంబించాం. మా విధానంలో నీవు ఎలాంటి మార్పు చూడలేవు. (76-77)
సూర్యుడు వాలినప్పటి నుండి రాత్రి పొద్దుపోయే వరకు నమాజ్‌ వ్యవస్థ స్థాపించు. వేకువజామున కూడా ఖుర్‌ఆన్‌ పఠనం చేస్తూ ఉండు. వేకువ జాము ఖుర్‌ఆన్‌ పఠనం (దైవదూతల) సాక్ష్యానికి కారణమవుతుంది. రాత్రివేళ తహజ్జుద్‌ నమాజ్‌ కూడా చేస్తూ ఉండు. ఇది నీకోసం అదనపు నమాజ్‌గా నిర్ణయించబడింది. నీ ప్రభువు నిన్ను త్వరలోనే అత్యున్నతమైన స్తుతిస్థానం మీద అధిష్ఠింప జేయవచ్చు. (78-79)
ప్రవక్తా! ఇలా వేడుకో: “ప్రభూ! నీవు నన్ను ఎక్కడికి తీసికెళ్ళినా మంచి స్థితిలో తీసికెళ్ళు. ఎక్కడ్నుండి తీసినా మంచి స్థితిలోనే తీసెయ్యి. నీ దగ్గర నుండి సహాయంగా నాకో అధికార శక్తి ప్రసాదించు.” ఇలా ప్రకటించు: “సత్యం వచ్చింది. అసత్యం తుడిచి పెట్టుకుపోయింది. అసత్యం (ఏనాటికైనా) తుడిచి పెట్టుకుపోయేదే.” (80-81)
మేమీ ఖుర్‌ఆన్‌లో విశ్వాసులకు స్వస్థత, (దైవ)కారుణ్యాలు చేకూర్చే విషయాలు అందజేస్తున్నాం. కాని దుర్మార్గులకు మాత్రం ఇది మరింత నష్టాన్నే కలిగిస్తుంది. (82)
మానవునికి మేమేదైనా భాగ్యం ప్రసాదించినప్పుడు అతను (మాకు కృతజ్ఞత చూప డానికి బదులు మిడిసిపడుతూ) ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. అదే కాస్తంత కష్టం వస్తే తల్లడిల్లిపోతూ నిరాశచెందుతాడు. వారికి చెప్పు: “ప్రతిఒక్కడూ తనకుతోచిన విధంగా పనిచేస్తున్నాడు. ఎవరు సన్మార్గంలో ఉన్నారో నీ ప్రభువుకు బాగా తెలుసు.” (83-84)
వారు ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. “ఈ ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది. (దీన్ని మీరు గ్రహించలేరని,) మీకు పరిమిత జ్ఞానం ప్రసాదించబడింద”ని చెప్పు. (85)
ముహమ్మద్‌ (స)! మేము తలచుకుంటే దివ్యావిష్కృతి ద్వారా నీకు ప్రసాదించిన విషయాలన్నిటినీ వెనక్కి తీసుకోగలం. అప్పుడు నీవు మాకు వ్యతిరేకంగా ఎలాంటి సహాయం పొందలేవు. కాని (అలా జరగలేదంటే) అదంతా నీ ప్రభువు అనుగ్రహం. ఆయన కారుణ్యకటాక్షాలు నీపై ఎంతగానో ఉన్నాయి. (86-87)
వారికి చెప్పు: “యావత్తు మానవులు, జిన్నులు ఏకమయి కఠోర తపస్సు చేసినా, పరస్పరం సహకరించుకున్నా, ఖుర్‌ఆన్‌లాంటి గ్రంథాన్ని ఎన్నటికీ రచించలేరు.” (88)
మేము ఖుర్‌ఆన్‌లో ప్రజలకు అనేక విధాలుగా నచ్చజెప్పాం. కాని చాలామంది తిరస్కారవైఖరే ప్రదర్శించారు. “నీవు మాకోసం భూమిని చీల్చి ఒక నీటిబుగ్గ తీయనంత వరకు మేము నీమాటలు నమ్మం. లేదా నీకోసమే ఖర్జూరాలు, ద్రాక్షపండ్లు గల ఒక తోట తెప్పించుకో. అందులో కాలువలు కూడా పారుతుండాలి. లేదా నీవు చెబుతున్నట్లు ఆకాశాన్ని తునాతునకలుగా చేసి మామీద పడెయ్యి. లేదా దేవుడ్ని, దైవదూతల్ని మా ముందు ప్రత్యక్షపరచు. అదీకాకపోతే నీకోసం ఒక స్వర్ణగృహం రప్పించుకో. పోనీ నీవు ఆకాశంపై కయినా ఎక్కిపోవాలి. అయితే మేము చదవగలిగే పత్రం ఏదైనా మాముందు దించనంతవరకు నీవు ఆకాశంపై కెక్కిన విషయాన్ని కూడా మేము నమ్మలేం” అంటారు వారు. వారికిలా చెప్పు: “నా ప్రభువు పరిశుద్ధుడు. నేను కేవలం మానవమాత్రుడ్ని. ప్రజలకు దైవసందేశం అందజేసే సందేశహరుడ్ని మాత్రమే.” (89-93)
ప్రజల దగ్గరకు (మా) హితబోధ వచ్చినప్పుడు దాన్ని విశ్వసించనీయకుండా వారిని ఒక్కవిషయం తప్ప ఏదీ నిరోధించలేదు. “దేవుడు (మనలాంటి) మానవుడ్ని సందేశ హరుడిగా పంపాడా?” అన్న విషయమే వారిని నిరోధించింది. వారికిలా చెప్పు: “ఒకవేళ దైవదూతలు ప్రపంచంలో (మానవుల్లా జీవిస్తూ) ప్రశాంతంగా తిరగ్గలిగితే మేము వారి దగ్గరకు తప్పక దైవదూతనే ప్రవక్తాగా నియమించి పంపేవారం.” వారికీ విషయం తెలియజేయి: “నాకూ మీకూ మధ్య ఒక్క దేవుని సాక్ష్యమే చాలు. ఆయనకు తన దాసుల స్థితిగతులు బాగా తెలుసు. ఆయన సమస్తం చూస్తున్నాడు.” (94-96)
దేవుడు ఎవరికి సద్బుద్ధి ప్రసాదిస్తాడో అతనే సన్మార్గం పొందగలడు. దేవుడు దారి తప్పించినవారిని దేవుడు తప్ప మరెవరూ ఆదుకోలేరు. అలాంటివారిని మేము ప్రళయ దినాన బోర్లాపడేసి ఈడ్చుకొస్తాం. వారు అంధులు, బధిరులు, మూగలు. నరకమే వారి నివాసం. దాని అగ్నిజ్వాలలు మందగించినప్పుడల్లా మేము మళ్ళీ ప్రజ్వరిల్లజేస్తాం. (97)
వారు మాసూక్తులు తిరస్కరించారు. పైగా “మేము ఎముకలుగా, తునాతున కలుగా మారిపోయాక మళ్ళీ బ్రతికించి లేపబడతామా?” అని అనేవారు. అందుకే వారికీ శిక్ష విధించబడింది. భూమ్యాకాశాల్ని సృష్టించగలిగిన దేవుడు వారిలాంటి మానవుల్ని సునాయాసంగా బ్రతికించి లేపగలడని వారు గ్రహించలేరా? వారి పునరుత్థానం కొరకు ఆయన సమయం నిర్ణయించాడు. ఆ ఘడియ తప్పకుండా వస్తుంది. దుర్మార్గులు దాన్ని విశ్వసించకుండా మూర్ఖంగా నిరాకరిస్తున్నారు. (98-99)
వారితో ఇలా అను: “ఒకవేళ మీ అధీనంలో నా ప్రభువు కారుణ్యనిక్షేపాలు ఉంటే వాటిని మీరు ఖర్చయిపోతాయన్న భయంతో తప్పకుండా దాచివుంచేవారు. మానవుడు నిజంగా చాలా సంకుచిత మనస్కుడయి పోయాడు.” (100)
మేము మూసాకు స్పష్టమైన తొమ్మిది నిదర్శనాలు ప్రసాదించాం. (కావాలంటే) వాటిని గురించి ఇస్రాయీల్‌ సంతతివారిని అడుగు. అవి వారిముందు ప్రదర్శించబడి నప్పుడు, ఫిరౌన్‌ (వాటిని చూసి) “మూసా! (నీ వ్యవహారం చూస్తుంటే) నీవు తప్పకుండా చేతబడికి గురయినట్లు అన్పిస్తోంది నాకు” అన్నాడు. (101)
మూసా దానికి సమాధానమిస్తూ “(అద్భుతమైన) ఈ నిదర్శనాలను భూమ్యా కాశాల ప్రభువు తప్ప మరెవరూ అవతరింపజేయలేదని (అవతరింపజేయలేరని కూడా) నీకు తెలుసు. ఫిరౌన్‌! (నీ మూర్ఖత్వం చూస్తుంటే) నీకేదో కీడు మూడిందని అన్పిస్తోంది నాకు” అని అన్నాడు. చివరికి ఫిరౌన్‌ ఎలాగైనా మూసాను, ఇస్రాయీల్‌ సంతతివారిని దేశంలో పూర్తిగా తుడిచిపెట్టాలని నిర్ణయానికి వచ్చాడు. అయితే మేము ఫిరౌన్‌ని, అతని అనుచర మూకను కట్టగలిపి (నడి సముద్రంలో) ముంచివేశాం. (102-103)
ఆతర్వాత మేము ఇస్రాయీల్‌ సంతతివారితో “మీరిప్పుడు ప్రపంచంలో హాయిగా జీవించండి. చివరికి పరలోకవాగ్దానం నెరవేరే సమయం వచ్చినపుడు మేము మిమ్మల్ని ఒక సమూహంగా చేసి (మా ముందు) సమావేశపరుస్తాం” అని చెప్పాము. (104)
మేమీ ఖుర్‌ఆన్‌ని సత్యప్రాతిపదికపై అవతరింపజేశాము. ఇది సత్యంతోనే అవత రించింది. ముహమ్మద్‌! మేము నిన్ను శుభవార్త అందజేసేవానిగా హెచ్చరించేవానిగా నియమించి పంపాము. మేమీ ఖుర్‌ఆన్‌ని కొద్దికొద్దిగా చేసి అవతరింపజేశాము. కనుక నీవు కూడా దీన్ని విడతలవారిగా ఆగి ఆగి ప్రజలకు విన్పించు. దీన్ని మేము (సందర్భో చితంగా) క్రమక్రమంగా అవతరింపజేశాము. (105-106)
వారికి చెప్పు: “మీరు దీన్ని విశ్వసించండి, విశ్వసించకపోండి. పూర్వం (దివ్యగ్రంథ) జ్ఞానం ప్రసాదించబడినవారి ముందు దీన్ని పఠిస్తే, వారు అప్రయత్నంగా సాష్టాంగపడి ‘మా ప్రభువు ఎంతో పరిశుద్ధుడు. ఆయన వాగ్దానం తప్పక నెరవేరుతుంది’ అంటారు. అంతేకాదు, వారు కంటతడి పెడుతూ బోర్లాపడి సాష్టాంగపడతారు. అది విన్న తర్వాత వారిలోని అణుకువ, భక్తిభావలు ద్విగుణీ కృతమయి పోతాయి.” (107-109)
వారికీ సంగతి కూడా చెప్పు: “మీరు (దేవుడ్ని) అల్లాహ్‌ అని పిలవండి లేదా రహ్మాన్‌ అని పిలవండి. ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఆయనకు మంచిపేర్లే.” మీరు నమాజులో (ఖుర్‌ఆన్‌ని) బిగ్గరగాగాని, మరీ మెల్లగాగాని పఠించకుండా మధ్యేమార్గం అవలంబించండి. (110)
ఇంకా ఈవిధంగా చెప్పండి: “స్తుతిస్తోత్రాలకు దేవుడు మాత్రమే అర్హుడు. ఆయన ఎవర్నీ కొడుకుగా చేసుకోలేదు. విశ్వసార్వభౌమత్వంలో ఆయనకు ఎవరూ భాగ స్వాములు లేరు. ఒకరి సహాయసహకారాలపై ఆధారపడటానికి ఆయన ఎంతమాత్రం అశక్తుడు, అసమర్థుడు కాదు.” ఆయన ఔన్నత్యాన్ని, అద్భుత శక్తిసామర్థ్యాలను ఘనంగా కీర్తించండి. (111)