Jump to content

కురాన్ భావామృతం/అత్-తగాబూన్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

64. తగాబున్‌ (జయాపజయాలు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 18)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమ్యాకాశాల్లో ఉన్న అణువణువూ దేవుని ఔన్నత్యం చాటుతూ, ఆయన పవిత్రతను ప్రశంసిస్తోంది. యావత్‌ విశ్వసామ్రాజ్యం ఆయనదే. సకల స్తుతిస్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. ఆయనకు ప్రతి దానిపై అదుపు, అధికారం ఉన్నాయి. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. తరువాత మీలో కొందరు విశ్వాసులుగా, మరికొందరు అవిశ్వాసులుగా (మారి)ఉన్నారు. మీరు చేస్తున్నదంతా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (1-2)
ఆయన భూమ్యాకాశాలను సత్యం ప్రాతిపదికపై సృష్టించాడు. మిమ్మల్ని అద్భుతంగా రూపొందించాడు. చివరికి మీరంతా ఆయన వైపుకే మరలి పోవలసి ఉంది. భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త విషయాలు ఆయనకు తెలుసు. మీరు దాచే విషయాలు, బహిర్గతం చేసే విషయాలు అన్నీ ఆయనకు తెలుసు. చివరికి మీ అంతరంగాల్లో మెదిలే నిగూఢ విషయాలు కూడా ఆయనకు తెలుసు. (3-4)
ఇంతకు పూర్వం అవిశ్వాసులైపోయి, తమ దుష్కర్మల పర్యవసానాన్ని చవిచూసిన వారి వృత్తాంతం మీకు చేరలేదా? మున్ముందు వారికి (అంతకంటే) ఎంతో వ్యధా భరిత మైన (నరక) శిక్ష ఉంది. దీనిక్కారణం, వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శ నాలు, ప్రమాణాలు తీసుకొచ్చినప్పుడు “ఒక మానవమాత్రుడా మనకు సన్మార్గం చూపే వాడు?” అన్నారు వారు. ఈవిధంగా వారు సత్యాన్ని విశ్వసించడానికి నిరాకరించి ముఖం తిప్పుకున్నారు. అప్పుడు దేవుడు కూడా వారిని ఖాతరు చేయకుండా వదిలేశాడు. ఆయన నిరపేక్షాపరుడు, స్వతహాగా ప్రశంసనీయుడు. (5-6)
ఈ సత్యతిరస్కారులు తాము చనిపోయిన తరువాత తిరిగి బ్రతికించబడటమనేది జరగనే జరగదని వాదిస్తున్నారు. వారికిలా చెప్పు: “నా ప్రభువు సాక్షి! మీరు తప్పకుండా బ్రతికించి లేపబడతారు. అప్పుడు మీకు (ప్రపంచంలో) మీరు ఏఏ పనులు చేశారో తెలియజేయబడుతుంది. ఇలా చేయడం దేవునికి చాలా తేలిక.” (7)
కనుక (మానవులారా!) దేవుడ్ని, ఆయన ప్రవక్తను, మేము పంపిన (ఖుర్‌ఆన్‌) జ్యోతిని విశ్వసించండి. మీరు చేసేదంతా దేవునికి తెలుసు. (పరలోక) సమావేశం రోజు మిమ్మల్నందర్నీ సమీకరించడం జరుగుతుంది. అదే పరస్పరం జయాపజయాల రోజు. విశ్వసించి సదాచార సంపన్నులైనవారిని దేవుడు (ఆరోజు) పాపప్రక్షాళన చేసి సెల యేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అదే గొప్ప విజయం. మా సూక్తులు తిరస్కరించి అవిశ్వాసులై పోయినవారు నరక వాసులవుతారు. నరకంలోనే వారు ఎల్లకాలం పడిఉంటారు. నరకం పరమ చెడ్డ నివాసస్థలం. (8-10)
దైవాజ్ఞ లేనిదే ఏ ఆపదా రాదు. దేవుడ్ని విశ్వసించేవారికి దేవుడు (కష్టాలలోను, సుఖాలలోను) సద్బుద్ధి ప్రసాదిస్తాడు. దేవుడు సర్వం ఎరిగినవాడు. (కనుక) దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులయి పోండి. మీరు (మా) విధేయతకు విముఖులైపోతే, సత్యాన్ని స్పష్టంగా అందజేయడమే మాప్రవక్త బాధ్యత. అల్లాహ్‌ తప్ప మరోఆరాధ్యుడు లేడు. కాబట్టి విశ్వాసులు (అలాంటి) దేవుడ్నే నమ్ముకోవాలి. (11-13)
విశ్వాసులారా! మీ భార్యాపిల్లలలో కొందరు మీకు శత్రువులై ఉంటారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండండి. అయితే వారిని దయార్ద్ర హృదయంతో క్షమిస్తే దేవుడు (కూడా మీపట్ల) క్షమాశీలి, దయానిధి (అవుతాడు). మీ సంతానం, సిరిసంపదలు మీకు పరీక్షగా చేయబడ్డాయి. (దీన్నుండి గట్టెక్కితే మీకు) దేవునివద్ద గొప్పప్రతిఫలం ఉంది. (14-15)
కనుక మీరు వీలైనంతవరకు (ప్రతి వ్యవహారంలో) దేవునికి భయపడుతూ జీవితం గడపండి. వినండి, విధేయత పాటించండి. (దైవమార్గంలో) మీ ధనాన్ని ఖర్చుపెట్టండి. ఇది మీకెంతో మంచిది. పిసినారితనాన్ని దరికి చేరనివ్వనివారే కృతార్థులవుతారు. (16)
మీరు గనక దేవునికి శ్రేష్ఠమైన రుణం (నిస్వార్థ బుద్ధితో కూడిన దానధర్మాలు) ఇస్తే, దేవుడు దాన్ని అనేక రెట్లు పెంచి మీకు తిరిగిస్తాడు. అదీగాక మీ పొరపాట్లు క్షమిస్తాడు. దేవుడు ఎంతో ఆదరించేవాడు, విశాలహృదయుడు; గోచర అగోచర విషయా లన్నీ ఎరిగినవాడు; అపార శక్తిమంతుడు; అసామాన్య వివేకవంతుడు. (17-18)