కురాన్ భావామృతం/అల్-ముతఫ్ఫిఫీన్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

83. ముతప్ఫిఫీన్‌ (హస్తలాఘవం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 36)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
తూకం తగ్గించేవారికి వినాశం తప్పదు. వారు ప్రజల నుండి (సరుకు) తీసుకునే టప్పుడు పూర్తిగా తూచి లేక కొలచి తీసుకుంటారు; ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక భయంకర దినాన తాము లేపి ప్రవేశపెట్టబడతామని వారికి తెలియదా? ఆరోజు యావత్తు మానవులు విశ్వప్రభువు ముందు (తలలు వంచి) నిలబడతారు. (1-6)
(వారు తమ దుష్కార్యాలకు జవాబుచెప్పుకోవలసిన పనిలేదని భావిస్తున్నారా?) ఎంతమాత్రం కాదు. దురాత్ముల కర్మల వివరాలు కారాగారం చిట్టాలో ఉంటాయి. కారాగారం చిట్టా అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక లిఖితగ్రంథం. (7-9)
తీర్పుదినాన్ని తిరస్కరించే ధిక్కారులకు ఆరోజు వినాశం తప్పదు. హద్దులు మీరే పాపాత్ముడు తప్ప దాన్నెవరూ తిరస్కరించరు. మా సూక్తులు విన్పిస్తున్నప్పుడు “ఇవి పూర్వీకుల పుక్కిటిపురాణాలు.” అనంటాడతను. ఎంతమాత్రం కాదు. అసలు వీరి హృద యాలకు వీరిదుష్కార్యాల త్రుప్పుపట్టింది. ఎంతమాత్రం కాదు. ఆరోజు వీరు తప్పక తమ ప్రభువు దర్శనభాగ్యానికి దూరంగా ఉంచబడతారు. ఆతర్వాత నరకంలో పడతారు. అప్పుడు వారికి “మీరు తిరస్కరించినది ఇదే” అని చెప్పడం జరుగుతుంది. (10-17)
ఎంతమాత్రం కాదు. పుణ్యాత్ముల కర్మల వివరాలు మహోన్నతుల చిట్టాలో ఉంటాయి. మహోన్నతుల చిట్టా అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక లిఖిత గ్రంథం. దాన్ని సన్నిహితులైన దైవదూతలు కాపాడుతున్నారు. పుణాత్ములు భోగభాగ్యాలలో ఓల లాడుతుంటారు. ఉన్నతాసనాలపై కూర్చొని (స్వర్గవైభవాలు) తిలకిస్తుంటారు.
నీకు వారి ముఖాలలో సుఖసంతోషాలతో కూడిన కళాకాంతులు గోచరిస్తాయి. వారు స్వచ్ఛమైన విశేషమధుపానం సేవిస్తారు. ఆ మధుపాత్రలకు కస్తూరి సీళ్ళుంటాయి. సౌఖ్యాల కోసం పోటీపడేవారు దీన్ని సాధించడానికి పోటీపడాలి. ఆ మధువులో తస్నీం కలసివుంటుంది. ఇదొక సెలయేరు. సన్నిహిత భక్తులు దీని పానీయంతోపాటు సారా సేవిస్తారు. (18-28)
(ఇహలోకంలో) నేరస్థులు విశ్వాసుల్ని హేళన చేస్తుండేవారు. వారి ముందు నుంచి పోతున్నప్పుడు వారివైపు చూసి ఒకర్నొకరు కనుసైగలు చేసుకునేవారు. ఇండ్లకు తిరిగొస్తూ (ఏదోఘనకార్యం వెలగబెట్టినట్లు) తెగ సంబరపడిపోతారు. వారిని చూసినప్పు డల్లా “వీరా, వీరు మతభ్రష్టులండీ!” అంటారు. కాని (దేవుడు) వీరిని వారిపై రక్షక భటు లుగా నియమించి పంపలేదు. ఆరోజు విశ్వాసులు అవిశ్వాసుల్ని చూసి నవ్వుతుంటారు. ఉన్నతాసనాలపై (హుందాగా) కూర్చొని వారి దుస్థితి చూస్తుంటారు. ఇక తిరస్కారుల సంగతి- వారికి వారి (వికృత)చేష్టలకు తగిన ప్రతిఫలం దక్కిందికదా! (29-36)