కురాన్ భావామృతం/అల్-మోమిన్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

40. మోమిన్‌ (విశ్వాసి)
(అవతరణ: మక్కా; సూక్తులు: 85)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
హా-మీమ్‌. ఇది మహా శక్తిమంతుడు, సర్వజ్ఞుడైన దేవుని దగ్గర్నుండి అవతరించిన గ్రంథం. ఆయన పాపాలు క్షమించేవాడు; పశ్చాత్తాపంతో చేసిన వేడుకోలును స్వీకరించే వాడు; కఠినంగా శిక్షించేవాడు; ఎంతో ఉదారస్వభావుడు కూడా. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన దగ్గరికే అందరూ మరలిపోవలసి ఉంది. (1-3)
దేవుని సూక్తుల విషయంలో కృతఘ్నులు, సత్యతిరస్కారులు తప్ప మరెవరూ పిడి వాదం చేయరు. (వారికి ఎటూ నరక యాతనలు తప్పవు.) అంచేత వారు ప్రపంచంలో (వైభవోపేతంగా వెలిగిపోతూ) తిరగడం చూసి నీవు మోసపోకూడదు సుమా! వారికి పూర్వం నూహ్‌జాతి తిరస్కరించింది. ఆ తరువాత కూడా అనేక జాతులు తిరస్కరిం చాయి. ప్రతిజాతీ తన దైవప్రవక్తను పట్టుకోవడానికి అతనిపై లంఘించింది. వారంతా తమ పైశాచిక ఎత్తుగడలతో సత్యాన్ని రూపుమాపడానికి ప్రయత్నించారు. అయితే చివరికి నేను వారిని పట్టుకున్నాను. ఇక చూడు. నాశిక్ష ఎంత కఠినమైనదో! (4-5)
అదేవిధంగా సత్యతిరస్కారానికి పాల్పడినవారంతా నరకాగ్నికి సమిధలవుతారని నీ ప్రభువు చేసిన నిర్ణయం కూడా వారి విషయంలో అమలు జరిగి తీరుతుంది. (6)
విశ్వప్రభువు సింహాసనాన్ని ఎత్తిపట్టుకున్న దైవదూతలు, దాని చుట్టూ నిలబడిన దైవదూతలు తమ ప్రభువు ఔన్నత్యం కీర్తిస్తూ, ఆయన పవిత్రతను స్మరిస్తున్నారు. వారు ఆయన్ని (దృఢంగా) విశ్వసిస్తున్నారు; విశ్వసించినవారిని క్షమించమని ఇలా ప్రార్థిస్తారు:
“ప్రభూ! నీవు నీ కారుణ్యంతో, జ్ఞానసంపత్తితో ప్రతి వస్తువునీ పరివేష్ఠించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపంచెంది నీ మార్గం అవలంబించినవారిని క్షమించు. వారిని నరక యాతనల నుండి కాపాడు. ప్రభూ! నీవు వారికి వాగ్దానం చేసిన శాశ్వత స్వర్గవనాలలో వారిని ప్రవేశింపజేయి. వారి తల్లిదండ్రులలో, భార్యాపిల్లలో, సజ్జనులయిన వారిని కూడా (స్వర్గంలో వారి దగ్గరకు చేర్చు). నిజంగా నీవు అద్వితీయ శక్తిసంపన్నుడవు, అద్భుత వివేకవంతుడవు. వారిని ఆపదలు, అనర్థాల నుండి కాపాడు. ప్రళయదినాన నీవు ఎవరిని ఆపదలు, అనర్థాల నుండి కాపాడుతావో వారిని నీవు కటాక్షించినట్లే. అదే ఘనవిజయం, పరమమోక్షం.” (7-9)
ప్రళయదినాన (దైవదూతలు) అవిశ్వాసుల్ని ఎలుగెత్తి పిలిచి ఇలా అంటారు: “ఈ రోజు మీకు మీపై ఎంతకోపం వస్తున్నదో, (సత్యాన్ని) విశ్వసించమని మిమ్మల్ని పిలు స్తుంటే మీరు దాన్ని తిరస్కరిస్తున్నప్పుడు దేవుడు మీపట్ల అంతకంటే ఎక్కువ ఆగ్రహో దగ్రుడయ్యేవాడు.” దానికి వారు “ప్రభూ! నీవు మాకు రెండుసార్లు మృత్యువు కలిగించి, రెండుసార్లు ప్రాణం పోశావు. ఇప్పుడు మేము మా పొరపాట్లు ఒప్పుకుంటున్నాం. మరి మేము ఇక్కడ్నుంచి బయటపడే మార్గం ఏదైనా ఉందా?” అనంటారు. (10-11)
“(ఇప్పుడా మీరొప్పుకునేది, ఆనాడేమయింది మీ బుద్ధి?) ఆనాడు ఏకైక దేవుని వైపు పిలిచినప్పుడు మీరు నిరాకరిస్తుండేవారు. అదే (మరెవరైనా) దేవునితో పాటు ఇతరుల్ని కలిపితే మీరు ఒప్పుకునేవారు. అందుకే మీకీ దుర్గతి పట్టింది. (ఇక దీన్నుంచి బయటపడే ప్రసక్తే లేదు.) నిర్ణయాధికారం ఇప్పుడు పరమోన్నతుడు, సర్వాధికుడైన దేవుని చేతిలో ఉంది” (అని వారికి సమాధానం లభిస్తుంది). (12)
ఆయనే మీకు తన నిదర్శనాలు చూపిస్తున్నాడు. ఆయనే మీకోసం ఆకాశం నుండి (వర్షంద్వారా) ఉపాధినిస్తున్నాడు. ఆయనవైపు పశ్చాత్తాపంతో మరలేవారే (ఈ నిదర్శనాల ద్వారా) గుణపాఠం నేర్చుకుంటారు. (విశ్వాసులారా!) అవిశ్వాసులు ఎంత అసహ్యించు కున్నా సరే, మీ జీవితవిధానాన్ని దేవునికి ప్రత్యేకించి ఆయన్నే ప్రార్థించండి. (13-14)
ఆయన మహోన్నతమైన హోదా, అంతస్తులు కలవాడు, (సర్వాధికార) సింహాసనా ధీశుడు. ఆయన తన దాసులలో తాను తలచుకున్న వారిపై తన దివ్యావిష్కృతి అవత రింపజేస్తున్నాడు. వారు పరలోక సమావేశం రోజు గురించి హెచ్చరించాలన్నదే దీని ఉద్దేశ్యం. ఆరోజు మానవులంతా నిరాటంకంగా ముందుకొస్తారు. దేవుని దగ్గర వారు ఏ విషయాన్నీ దాచలేరు. (అప్పుడు వారిని పిలిచి) “ఈరోజు సార్వభౌమత్వం ఎవరిద”ని అడుగుతారు. (దానికి యావత్‌ సృష్టి) “చండశాసనుడైన ఏకేశ్వరునిదే” (అంటుంది). ఆరోజు ప్రతిమనిషికీ అతను చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ అన్యాయం జరగదు. లెక్క చూడటానికి దేవునికి ఎంతోసేపు పట్టదు. (15-17)
ప్రవక్తా! అతి సమీపానికి వచ్చివున్న (ప్రళయ)దినం గురించి ప్రజల్ని భయపెట్టు. ఆరోజు గుండెలు (గుభేలుమంటూ) గొంతులలోకి వస్తాయి. ప్రజలు పుట్టెడు దుఃఖం బలవంతంగా దిగమింగుతూ నోరుమూసుకొని నిల్చుంటారు. దుర్మార్గులకు ఏ ఆప్త మిత్రుడూ లభించడు. వారికి అనుకూలంగా సిఫారసు చేసేవారు కూడా ఉండరు. వారి సిఫారసు అంగీకరించడం జరగదు. దేవునికి (మానవుల) దొంగచూపులు, (వారి) హృద యాల్లో దాగిన రహస్యాలు సైతం తెలుసు. దేవుడు న్యాయంగా, నిష్పక్షపాతంగా తీర్పు చేస్తాడు. (బహుదైవారాధకులు) దేవుడ్ని వదలి ప్రార్థిస్తున్న మిధ్యాదైవాలు ఏ విషయం లోనూ తీర్పు చేయలేవు. దేవుడు (సర్వం) వినేవాడు, చూసేవాడు. (18-20)
వీరు ప్రపంచంలో ఎన్నడూ పర్యటించలేదా? పర్యటిస్తే గత జాతులకు ఎలాంటి గతి పట్టిందో తెలిసేది కదా? వీరికంటే వారు ఎంతో శక్తిమంతులు. వారు ప్రపంచంలో వీరికంటే ఎంతో అద్భుతమైన చిహ్నాలు వదలిపెట్టారు. అయితే వారు చేసిన పాపాలకు దేవుడు వారిని పట్టుకున్నాడు. అప్పుడు దేవుని పట్టు నుండి వారిని ఏ శక్తీ కాపాడలేక పోయింది. వారికీ దుర్గతి పట్టడానికి కారణం వారి దగ్గరకు వారి ప్రవక్తలు సూచనలు, సూక్తులు తెచ్చినా వాటిని నమ్మడానికి నిరాకరించారు. చివరికి దేవుడు వారిని పట్టు కున్నాడు. దేవుడు మహాశక్తిమంతుడు. ఆయన శిక్ష చాలాకఠినంగా ఉంటుంది. (21,22)
మేము మూసాకు మా నిదర్శనాలు, స్పష్టమైన నియామక ప్రమాణాలు ఇచ్చి ఫిరౌన్‌, హామాన్‌, ఖారూన్‌ల దగ్గరకు పంపాము. కాని వారు (అతను తెచ్చిన సత్యాన్ని నిరాకరిస్తూ) “నీవు మాంత్రికుడవు, అసత్యవంతుడవు” అన్నారు. (23-24)
ఆ తరువాత మూసా మా తరఫున సత్యం(తో కూడిన అనేక మహిమలు) వారి ముందుకు తీసుకువచ్చాడు. (దాంతో చాలామంది ఇస్రాయీలీలు మూసాకు అనుచరు లైపోసాగారు. కాని ఆ దుర్మార్గులకు మాత్రం కనువిప్పు కలగ లేదు.) వారు (మూసా అనుచరుల్లో భయోత్పాతం సృష్టించేందుకు) “సత్యాన్ని విశ్వసించి అతనితో కలసి పోయినవారి మగపిల్లలను హతమార్చండి. వారి ఆడపిల్లల్ని మాత్రమే సజీవంగా వదలి పెట్టండి” అన్నారు. కాని సత్యతిరస్కారుల పాచికలేవీ పారలేదు. (25)
ఓరోజు ఫిరౌన్‌ తన సభాసదులతో “నన్ను వదలండి, నేను మూసాను చంపి తీరుతా. అతను తన ప్రభువును మొరపెట్టుకోనివ్వండి (చూద్దాం). ఇతని ధోరణి చూస్తుంటే ఇతను మీ మతాన్ని, మీ జీవనవ్యసస్థను మార్చివేస్తాడని నాకు అనుమానం గా ఉంది. లేదా ఇతను దేశంలో అరాచకాన్నయినా సృష్టించవచ్చు” అని అన్నాడు. (26)
మూసా (ఈ బెదిరింపుల్ని ఖాతరుచేయకుండా) “తీర్పుదినాన్ని నమ్మని ప్రతి గర్విష్ఠి నుండి నేను నాప్రభువు, మీప్రభువు అయిన దేవుని శరణు పొందాను” అన్నాడు. (27)
ఆ సందర్భంలో ఫిరౌన్‌వంశానికి చెందిన ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని బహిర్గతం చేయకుండా ఇలా అన్నాడు: “మీరు ఒక మనిషిని తన ప్రభువు దేవుడేనని అన్నంత మాత్రాన చంపుతారా? అతను మీ ప్రభువు నుండి మీ వద్దకు సాక్ష్యాధారాలు తెచ్చాడు. ఒకవేళ అతను చెప్పేది అబద్ధమైతే అతని అబద్ధం అతనికే చుట్టుకుంటుంది. అలాగాక అతను చెప్పేది, చూపించేది నిజమే అయితే, అతను హెచ్చరిస్తున్న భయంకర దుష్పరి ణామాలలో కొన్నయినా మీపై వచ్చి పడటం ఖాయం. అబద్ధాల కోరుకు, హద్దుమీరి ప్రవర్తించేవాడికి దేవుడు ఎన్నటికీ సన్మార్గబుద్ధి ప్రసాదించడు.”
“నా జాతిప్రజలారా! ఈరోజు మీకు సామ్రాజ్య వైభవం ఉంది. దేశంలో మీ ఆధిక్యత, అధికారాలే చెలామణి అవుతున్నాయి (నిజమే). కాని (ఏ క్షణంలో నయినా హఠాత్తుగా) మనపై దైవశిక్ష విరుచుకుపడితే మనకెవరు సహాయం చేస్తారు?”
ఫిరౌన్‌ (అతని మాటలు పట్టించుకోకుండా) “నేను మాత్రం నాకు సమంజసమని తోచిన సలహా మీకిస్తున్నాను. నేను మిమ్మల్ని సరైన దారినే నడిపిస్తున్నాను” అన్నాడు#
దానికా విశ్వాసి ఇలా అన్నాడు: “సోదరులారా! (మీ ధోరణి చూస్తుంటే) గత జాతులకు దాపురించిన దుర్దినాలు వంటివి మీక్కూడా దాపురిస్తాయేమోనని నాకు భయంగా ఉంది. గతంలో నూహ్‌జాతికి, ఆద్‌జాతికి, సమూద్‌జాతికి, ఆతర్వాత కూడా అనేక జాతులకు దుర్దినాలు దాపురించాయి. దేవుడు మాత్రం (అనవసరమైన శిక్షలతో) తన దాసులకు అన్యాయం చేయాలనుకోడు.” (28-31)
“సోదరులారా! మొరలు, కేకలుపెట్టే దినం మీకు దాపురిస్తుందేమోనని నేను భయపడ్తున్నాను. ఆరోజు మీరు (సహాయంకోసం) ఒకర్నొకరు పిలుచుకుంటూ (కంగారు గా) అటూఇటూ పరుగెత్తుతారు. కాని అప్పుడు మిమ్మల్ని దేవుని పట్టు నుండి కాపాడే వారే ఉండరు. దేవుడు దారితప్పించిన వాడికి మరెవరూ దారిచూపించలేరు.”(32-33)
“గతంలో యూసుఫ్‌ (ప్రవక్త) కూడా మీ దగ్గరకు సాక్ష్యాధారాలు తీసుకొచ్చారు. కాని ఆయన హితబోధను మీరు అనుమానించారు. ఆయన చనిపోయిన తరువాత మీరు ఇక దేవుడు ఏ ప్రవక్తనూ ఎట్టి పరిస్థితిలో కూడా పంపడని అన్నారు. అలాగే హద్దులు మీరిపోయి (సత్యాన్ని) అనుమానిస్తూ ఎలాంటి ఆధారాలు, ప్రమాణాలు లేకుండానే దైవసూక్తుల విషయంలో పిడివాదం చేసే ప్రతివ్యక్తినీ దేవుడు దారి తప్పిస్తాడు. దేవుని దృష్టిలోనేగాక, విశ్వసించినవారి దృష్టిలో కూడా ఈవైఖరి చాలా హేయమైనది, అనుచితమైనది. దేవుడు అహంకారం, తలబిరుసుతనాలు గల ప్రతి దుర్మార్గుడి హృదయకవాటాలు మూసివేస్తాడు. (34-35)
ఫిరౌన్‌ (మరింత తలబిరుసుతో మాట్లాడుతూ) “హామాన్‌! నాకోసం ఒక ఎత్తయిన గోపురం కట్టించు. నేను (దానిమీదెక్కి) ఆకాశమార్గాలకు చేరుకొని అక్కడ మూసా ఆరాధించే దేవుడు ఉన్నాడో లేడో తొంగిచూస్తా. నాకైతే ఇతను పచ్చి అబద్ధాలకోరులా కన్పడుతున్నాడు” అని అన్నాడు. ఈవిధంగా ఫిరౌన్‌కు అతని దుష్కార్యాలన్నీ మనోహర మైనవిగా చేయబడ్డాయి. అతడు సన్మార్గం అవలంబించకుండా నిరోధించబడ్డాడు. ఫిరౌన్‌ పన్నిన దుష్ట పన్నాగాలన్నీ (అతని) వినాశానికే దారితీశాయి. (36-37)
విశ్వసించిన వ్యక్తి ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! నామాట వినండి. నేను మీకు సరయిన మార్గం చూపుతాను. సోదరులారా! ఈ ప్రాపంచిక జీవితం మూన్నాళ్ళ ముచ్చట మాత్రమే. (మన) శాశ్వత నివాసం పరలోకంలో ఉంది. దుష్కర్మలు చేసిన వారికి వారి దుష్కర్మల్ని బట్టే ప్రతిఫలం లభిస్తుంది. అలాగే స్త్రీలైనా, పురుషులైనా సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్నులయి ఉంటే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికక్కడ అపరిమితమైన ఉపాధి లభిస్తుంది.” (38-40)
“సోదరులారా! ఏమిటీ, నేను మిమ్మల్ని సాఫల్యం వైపు పిలుస్తుంటే మీరు నన్ను నరకాగ్ని వైపు లాగుతున్నారు? దేవుడ్ని తిరస్కరించి, నేనెరగని శక్తులను ఆయనకు సాటి కల్పించమని చెబుతున్నారా నాకు? నేను మటుకు సర్వశక్తిమంతుడు, క్షమాశీలి అయిన దేవుని వైపు మిమ్మల్ని పిలుస్తున్నాను.” (41-42)
“మీరు నన్ను ఏ దైవేతరశక్తుల వైపు పిలుస్తున్నారో వాటి (దైవత్వాని)కి ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ ఎలాంటి విలువలేదు. మనమంతా (చివరికి) దేవుని దగ్గరికే మరలిపోవలసి ఉంటుంది. అయితే హద్దుమీరి ప్రవర్తించేవారు మాత్రం నరకానికి పోతారు. ఈరోజు నేను చెప్పేదంతా మీరు గుర్తుచేసుకునే సమయం ఒకరోజు తప్పకుండా వస్తుంది. నేను మాత్రం నా వ్యవహారాన్ని దేవునికి అప్పగిస్తున్నాను. ఆయనే తన దాసులకు సంరక్షకుడు.” (43-44)
చివరికి దేవుడు వారు పన్నిన కుట్రలు, కుయుక్తులన్నిటిని వమ్ముచేసి ఆ విశ్వాసిని కాపాడాడు. ఫిరౌన్‌ అనుయాయులే ఘోరవిపత్తులో చిక్కుకొని సర్వనాశన మయ్యారు. (ఆనాటి నుండి) వారిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నరకాగ్ని ముందు ప్రవేశపెట్టడం జరుగుతున్నది. ప్రళయదినం వచ్చినప్పుడు “ఫిరౌన్‌ అనుయా యుల్ని తీవ్రమైన (నరక)యాతనల్లో ప్రవేశింపజేయండి” అని ఆజ్ఞవుతుంది. (45-46)
తరువాత వారు నరకంలో పరస్పరం వాదించుకుంటారు. బలహీనులు తమ నాయకులతో “మేము మీకు విధేయులై ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు మమ్మల్నీ నరక బాధ నుండి మీరేమైనా కాపాడగలరా?” అని అడుగుతారు. దానికి నాయకులు “ఇక్కడ మనమంతా ఒకే స్థితిలో చిక్కుకొని ఉన్నాం. దేవుడు తన దాసుల్ని గురించి (అంతిమ) తీర్పిచ్చాడు. (ఇక దానికి తిరుగులేదు)” అంటారు.
ఆ తరువాత నరకంలో పడినవారు నరకపాలకులతో “మా శిక్షను ఒక్క రోజైనా తగ్గించమని మీ ప్రభువును ప్రార్థించండి” అంటారు. దానికి నరక పాలకులు “మీ దగ్గరకు మీ ప్రవక్తలు నిదర్శనాలు ఏమీ తీసుకొని రాలేదా?” అని అడుగుతారు. వారు ‘వచ్చార’ంటారు. “అయితే మీరే మొరపెట్టుకోండి. అవిశ్వాసుల మొరలు నిరుపయో గమే అవుతాయి” అని చెబుతారు నరకపాలకులు. (47-50)
గుర్తుంచుకోండి, మేము ప్రవక్తలను, విశ్వసించినవారిని ఇహలోక జీవితంలోనూ ఆదుకుంటాము; (పరలోక న్యాయస్థానంలో) సాక్షులు నిలబడే రోజున కూడా వారిని ఆదుకుంటాము. అప్పుడు దుర్మార్గులకు వారి క్షమాపణ ఏమాత్రం ఉపయోగపడదు. వారిపై అభిశాపం పడుతుంది. వారికి పరమ చెడ్డనివాసం లభిస్తుంది. (51-52)
చూడండి, మేము మూసాకు ఎలా మార్గదర్శనం చేశామో! ఇస్రాయీల్‌ సంతతి వారిని మేము (తౌరాత్‌) గ్రంథానికి వారసులుగా చేశాము. అందులో విజ్ఞతా వివేచనలు కలవారి కోసం హితోపదేశం, మార్గదర్శకత్వం ఉన్నాయి. (53-54)
కనుక ప్రవక్తా! సహనం వహించు. దేవుని వాగ్దానం నిజమైనది. (అది తప్పక నెర వేరుతుంది.) నీ పొరపాట్లను గురించి క్షమాపణ కోరుకో. ఉదయం, సాయంత్రం నీ ప్రభువు (ఔన్నత్యాన్ని) స్తుతిస్తూ ఆయన (పవిత్ర నామాల)ను స్మరిస్తూఉండు. (55)
కొందరు తమ దగ్గరకు ఎలాంటి ప్రమాణం రాకపోయినా దేవుని సూక్తుల విష యంలో వితండవాదం చేస్తారు. వారి హృదయాల్లో తామేదో గొప్పవాళ్ళమన్న అహం కారం తిష్ఠవేసి ఉంది. కాని తాము విర్రవీగుతున్న ఆ గొప్పతనానికి వారు ఎన్నటికీ చేరుకోలేరు. కనుక నీవు (వారి దుష్టపన్నాగాల బారినుండి) దేవుని శరణువేడుకో. ఆయన సమస్తం చూస్తున్నాడు, వింటున్నాడు. (56)
మానవుల్ని సృష్టించడం కన్నా భూమ్యాకాశాల్ని సృష్టించడమే గొప్పకార్యం. కాని చాలా మందికి వాస్తవం తెలియదు. గుడ్డివాడు, కళ్ళున్నవాడు సమానులు కారు. అలాగే సత్యాన్ని విశ్వసించిన సదాచారసంపన్నుడు, నీతి నడవడికలు లేని దుర్జనుడు కూడా సమానం కారు. కాని (విషయాన్ని) మీరు బహుతక్కువ గ్రహిస్తారు. ప్రళయం తప్పక వస్తుంది. కాని చాలామంది దీన్ని నమ్మలేకపోతున్నారు. (57-59)
మీ ప్రభువు చెబుతున్నాడు: “నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థన స్వీకరిస్తాను. అహంకారంతో నన్ను ఆరాధించడానికి అంగీకరించనివారు నీచులై నరకానికి పోతారు#
మీరు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా రాత్రివేళను సృజించినవాడు దేవుడే. (పనులు చేసుకోవడానికి వీలుగా) పగటిని ప్రకాశవంతంగా చేసినవాడు కూడా ఆయనే. నిస్సందేహంగా దేవుడు మానవుల పట్ల అమిత దయగలవాడు. కాని చాలామంది (ఆయనకు) కృతజ్ఞత చూపడం లేదు. (మీ శ్రేయస్సుకోసం ఇదంతా చేసిన) ఆ దేవుడే మీప్రభువు. ఆయన సర్వసృష్టికర్త. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. మరి మీరెలా పెడదారి పట్టిపోతున్నారు? అదే విధంగా దేవుని సూక్తులు నిరాకరిస్తున్న వారంతా పెడదారి పట్టిపోతున్నారు. (60-63)
ఆ దేవుడే మీకోసం భూమిని నివాసస్థలంగా, ఆకాశాన్ని పందిరిగా నిర్మించాడు. ఆయనే మీకు ఒక రూపాన్నిచ్చి ఎంతో అందంగా మలిచాడు. ఆయనే మీకు పరిశుద్ధ పదార్థాలను ఉపాధిగా ప్రసాదించాడు. (ఇలాంటి సృష్టికార్యాలన్నీ చేసిన) ఆ దేవుడే మీ ప్రభువు, పరమ శుభదాయకుడు, సర్వలోక ప్రభువు. ఆయన మాత్రమే స్వతఃసిద్ధ జీవుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. (కనుక) మీరు మీ జీవన విధానాన్ని ఆయన కోసం ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ప్రార్థించండి. సకలవిధాల ప్రశంసలు, స్తోత్రాలు ఆయనకే శోభిస్తాయి. (64-65)
వారికిలా చెప్పు: “మీరు దేవుడ్ని వదలి ప్రార్థిస్తున్న దైవేతర శక్తుల్ని ఆరాధించవద్దని నన్ను వారించడం జరిగింది. నా ప్రభువు నుండి నా దగ్గరకు నిదర్శనాలు వచ్చాయి. నేను సర్వలోక ప్రభువుకే విధేయుడయి ఉండాలని నాకు ఆజ్ఞయింది.” (66)
ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించినవాడు. తర్వాత ఆయన మిమ్మల్ని వీర్య బిందువు ద్వారా తీసి, నెత్తుటి ముద్దగా చేసి, ఆపై శిశువుగా రూపొందించి పుట్టించాడు. ఆ తర్వాత మీరు పూర్తి శక్తిసామర్థ్యాలకు చేరుకునే వరకు మిమ్మల్ని పెంచుతున్నాడు. చివరికి మీరు వృద్ధాప్యంలోకి అడుగుపెట్టే వరకు వృద్ధిచేస్తున్నాడు. (అయితే) మీలో కొందరిని (యుక్త వయస్సుకు లేదా వృద్ధాప్యానికి చేరుకోక) ముందే వెనక్కి పిలిపించు కుంటున్నాడు. మీరు నిర్ణీత (మరణ) సమయానికి చేరుకునేందుకే ఇలా చేస్తున్నాడు. మీరు వాస్తవికత (జీవితపరమార్థం) గ్రహించడానిక్కూడా ఆయనిలా చేస్తున్నాడు. (67)
ఆయనే మీ జీవన్మరణాలకు కారకుడు. ఆయన ఏదైనా చేయదలచుకుంటే ‘అయిపో’ అని ఆజ్ఞాపిస్తే చాలు, మరుక్షణం అది రూపొంది ఉనికిలోకి వస్తుంది. (68)
దేవుని సూక్తుల విషయంలో వితండ వాదం చేసేవారిని చూశావా నీవు? వారు ఎలా పెడదారి పట్టిపోతున్నారు? వారు ఈ గ్రంథాన్ని, గతంలో మా ప్రవక్తల ద్వారా మేము పంపిన (దివ్య) గ్రంథాలన్నిటినీ తిరస్కరిస్తున్నారు. త్వరలోనే వారికి (నిజం) తెలిసొస్తుంది. అప్పుడు వారి మెడలకు గుదిబండలు కట్టి, సంకెళ్ళతో బంధించి సలసల మరిగే నీటి దగ్గరకు ఈడ్చుకెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత నరకాగ్నిలో విసరి వేయబడతారు. (69-72)
అప్పుడు వారిని (దైవదూతలు) “మీరు దేవునికి సాటి కల్పించిన దైవేతర శక్తులు ఇప్పుడేమయ్యారు?” అని అడుగుతారు. దానికి వారు “వారు మానుండి కనుమరుగై పోయారు. అసలు మేము లోగడ ఏ శక్తినీ ప్రార్థించలేదు” అని అంటారు. ఇలా దేవుడు అవిశ్వాసుల్ని దారి తప్పిస్తున్నాడు. (73-74)
“ఈ దుర్గతికి కారణం మీరు ప్రపంచంలో ధర్మవ్యతిరేక కార్యకలాపాల్లో (సదా) తలమునకలై ఉండేవారు. పైగా (అవేవో ఘనకార్యాలైనట్లు) విర్రవీగి పోయేవారు. ఇక వెళ్ళండి. నరకంలోకి పోయిపడండి. అక్కడే మీరు (నానా యాతనలు అనుభవిస్తూ) శాశ్వతంగా పడివుంటారు. అది గర్వపోతుల కోసం నిర్ణయించబడిన పరమ చెడ్డస్థానం” అని (దైవదూతలు) అంటారు. (75-76)
కనుక (ప్రవక్తా!) సహనం వహించు. దేవుని వాగ్దానం పూర్తిగా సత్యమైనది. వారికి మేము భయపెడ్తున్న దుష్పరిణామాలలో ఏదైనా ఒకదాన్ని మేము నీ కళ్ళెదుటే వారికి (చవి) చూపినా, లేదా (దానికి ముందే) నీ జీవితం పరిసమాప్తమయినా, మొత్తంమీద వారు మా దగ్గరికే తిరిగిరావలసి ఉంటుంది. (77)
నీకు పూర్వం మేము అనేక మంది దైవప్రవక్తలను ప్రభవింపజేశాము. వారిలో కొందరి స్థితిగతుల్ని నీకు తెలిపాము. మరికొందరి స్థితిగతుల్ని తెలుపలేదు. దేవుని అనుమతి లేకుండా ఏ దైవప్రవక్త కూడా తనంతట తాను ఏ నిదర్శనాన్నీ (మహిమనూ) తీసుకురాలేడు. అయితే దైవాజ్ఞ వచ్చి న్యాయంగా తీర్పు జరిగినప్పుడు అధర్మపరులు మాత్రం (ఘోరంగా) నష్టపోతారు. (78)
దేవుడే మీకోసం పశువుల్ని సృష్టించాడు. వాటిలో కొన్నిటిపై మీరు స్వారీ చేస్తారు; మరికొన్నిటిని తింటారు. వాటి వల్ల మీకు ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి చేరుకోవడానికి అవి మీకు ప్రయాణ సాధనాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. ఆ పశువులపై మాత్రమే కాదు, ఓడలలో కూడా మీరు ఎక్కి ప్రయాణం చేస్తారు. ఈవిధంగా దేవుడు మీకు తన నిదర్శనాలు చూపిస్తున్నాడు. అసలు మీరు ఆయన చూపిస్తున్న ఏ నిదర్శనాలు నిరాకరించగలరు? (79-81)
వారు ప్రపంచంలో తిరిగి చూడలేదా, వీరికి పూర్వం గతించినవారి పర్యవసానం ఏమయిందో? వీరికన్నా వారే బలవంతులు, వారే గొప్ప వైభవచిహ్నాలు వదలివెళ్ళారు. కాని వారు సంపాదించినది వారికి ఏవిధంగానూ ఉపయోగపడలేదు. (82)
గత జాతులవారి దగ్గరకు వారి ప్రవక్తలు సూక్తులు, సూచనలు తీసుకు వచ్చి నప్పుడు వారు తమ దగ్గరున్న (స్వయంకృత) జ్ఞానంలో తలమునకలయి ఉన్నారు. చివరికి వారు తాము అపహాస్యం చేసిన విషయాల ఉచ్చులోనే పడిపోయారు. వారు తీరా మా శిక్ష చూసి “మేమిప్పుడు సాటిలేని ఏకేశ్వరుడ్ని విశ్వసించాం. (ఆయనకు) సాటి కల్పించిన మిధ్యా దైవాలన్నిటిని నిరాకరిస్తున్నాం” అని అరిచారు. కాని మా శిక్ష చూసిన తర్వాత వారి విశ్వాసం వారికి ఏమాత్రం ఉపయోగపడ లేదు.
ఇది దేవుని దాసుల్ని గురించి అనాదిగా వస్తున్న దైవసంప్రదాయం. (దాని ప్రకారమే ఆ) సత్యతిరస్కారులు సర్వనాశనమయి పోయారు. (83-85)