కురాన్ భావామృతం/అల్-సాఫ్ఫత్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

37. సాప్ఫాత్‌ (పంక్తులు తీరినవారు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 182)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
పంక్తులు తీరి సిద్ధంగా ఉన్నవారి సాక్షి! తరువాత గద్దించి అదలించేవారి సాక్షి!! ఆపై హితోక్తులు విన్పించేవారి సాక్షి!!! మీ ఆరాధ్యదైవం ఒక్కడే. ఆయన భూమ్యాకాశా లకు, భూమ్యాకాశాల్లో ఉన్న సకల సృష్టిరాసులకు ప్రభువు, పోషకుడు. సమస్త తూర్పు దిశలకు (సూర్యోదయాలకు) కూడా ఆయనే ప్రభువు. (1-5)
మేము మీ సమీపాకాశాన్ని తేజోవంతమైన నక్షత్రాలతో తీర్చిదిద్ది, తలబిరుసు షైతాన్‌ల నుండి రక్షణ కల్పించాం. ఈ పిశాచాలు ఊర్థ్వలోక సదస్సు విషయాలు విన లేవు. నలువైపుల నుండి తరిమికొట్టబడతాయి. వాటికోసం ఎడతెగని యాతన కాచుకొని ఉంటుంది. ఏదైనా పిశాచం (దైవదూతలు చెప్పుకునే) విషయాలేవైనా తస్కరించడానికి ప్రయత్నిస్తే తక్షణమే తీక్షణమైన ఓ అగ్నిజ్వాల దాన్ని తరిమికొడ్తుంది. (6-10)
ఇప్పుడు వారిని అడుగు, వారిని సృజించడం కష్టమా లేక మేము సృజించిన (సమస్త) సృష్టిరాసులనా? మేము వారిని మెత్తటి బంకమన్నుతో సృజించాం. నీవు (దేవుని శక్తిసామర్థ్యాలు చూసి) ఆశ్చర్యపోతున్నావు. వారికేమో ఇదంతా ఎగతాళిగా ఉంది. ఎంత నచ్చజెప్పినా వారికి తలకెక్కడం లేదు. ఏదైనా మహిమ చూస్తే హేళన చేసి, ఇది పూర్తిగా మంత్రజాలం అంటూ దాన్ని ఎగరగొడ్తున్నారు. (11-15)
పైపెచ్చు, వారు (పిడివాదం చేస్తూ) “మేము చచ్చి మట్టిలో కలిసి అస్తిపంజరాల్లా మారినా మమ్మల్ని మళ్ళీబ్రతికించి లేపడం జరుగుతుందా? మాకు పూర్వం చనిపోయిన మా తాతముత్తాతల్ని కూడా బ్రతికించి లేపుతారా?” అని అడుగుతున్నారు. “తప్పకుండా, మీరు (దేవుని శక్తిముందు) నిమిత్తమాత్రులేన”ని చెప్పు. (16-18)
ఒకేఒక భయంకరమైన గర్జన విన్పిస్తుంది. అంతే, ఒక్కసారిగా వారి కళ్ళ ముందు అంతా ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వారు (బిత్తరబోయి) “అయ్యయ్యో, మాపాడు గాను! (మనమెంత ఏమరుపాటులో పడివున్నాం!) ఇది తీర్పుదినమే!!” అంటారు.“మీరు (నిన్నటిదాకా) నిరాకరిస్తుండిన తీర్పుదినం ఇదే”... “దుర్మార్గుల్ని, వారి అనుచరమూకను చుట్టుముట్టి తీసుకురండి. అల్లాహ్‌ని కాదని వారు పూజించిన మిధ్యాదైవాలను కూడా చుట్టుముట్టి తీసుకురండి. తర్వాత వారందరికీ నరకందారి చూపండి”.
“వారిని ఆపండి ప్రశ్నించాలి”. ఏమయింది మీకు? ఇప్పుడు మీరు ఒకరికొకరు సహాయం చేసుకోరెందుకు?” ఈరోజు వీరు (మాకు)పూర్తిగా లొంగిపోయారు. (19-26)
ఆ తర్వాత వారు ఒకరి వైపొకరు తిరిగి వాదించుకోవడం మొదలెడతారు. (అనుచరులు తమ నాయకులతో) “మీరు మా దగ్గరికి అరచేతి వైకుంఠం చూపుతూ, మాయోపాయాలతో వస్తుండేవారు” అంటారు. (27-28)
వారి నాయకులు దాన్ని ఖండిస్తూ “అసలు మీరే (సత్యాన్ని) విశ్వసించేవారు కాదు. మేము మీపై ఎలాంటి వత్తిడి తీసుకురాలేదు. మీరు స్వతహాగానే దుర్మార్గులు, తలపొగరు మనుషులు. చివరికి మనమంతా ‘మేము శిక్ష చవిచూపిస్తాం’ అన్న దైవాజ్ఞకు అర్హులైపోయాము. అందుకే మేము దారి తప్పడమేగాక మిమ్మల్ని కూడా మాయ మాటలతో దారి తప్పించాం” అని చెబుతారు. (29-32)
ఈవిధంగా ఆరోజు వీరంతా శిక్ష అనుభవిస్తారు. నేరస్థుల పట్ల మేము ఇలాగే ప్రవర్తిస్తాం. దేవుడు తప్ప మరో ఆరాధ్యుడు లేడని చెబితే “ఏమిటీ! ఓ పిచ్చికవి చెప్పే మాటలు విని మా దైవాలను వదలుకోవాల్నా?” అంటారు వారు గర్వంతో. (33-36)
కాని అతను సత్యం తీసుకొచ్చాడు. గత ప్రవక్తల (బోధనల)ను ధృవపరుస్తున్నాడు. (అలాంటి ప్రవక్తను నిరాకరిస్తే) మీరు తప్పక అతి బాధాకరమైన శిక్ష చవిచూడవలసి వస్తుంది. మీకు లభించే ప్రతిఫలం మీరు చేసుకునే కర్మల్నిబట్టే ఉంటుంది. (37-39)
అయితే నిజాయితీపరులైన దైవదాసులు మాత్రం (పరలోకంలో) సురక్షితంగా ఉంటారు. వారికోసం (గతంలో) తెలియజేయబడిన మంచి ఆహారం సిద్ధంగా ఉంటుంది. సకల విధాల రుచికరమైన పదార్థాలు ఉంటాయి. భోగభాగ్యాలతో నిండిన స్వర్గోద్యానవనాల్లో వారిని ఎంతో గౌరవంగా ఉంచడం జరుగుతుంది. (40-42)
వారక్కడ కుర్చీలపై ఎదురెదురుగా కూర్చుంటారు. వారుణీ వాహిని నుండి నింపిన మధుపాత్రలు వారి ముందుంచుతారు. అది కాంతిమంతమైన (విశేష)మధువు; సేవించేవారికి ఎంతో మధురంగా ఉంటుంది. దానివల్ల వారి దేహారోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. వారి బుద్ధీవివేచనలు కూడా మందగించవు. వారి దగ్గర పరపురుషుడ్ని కన్నెత్తి కూడా చూడని విశాలాక్షులు ఉంటారు. ఆ స్త్రీలు కోడిగుడ్డు పెంకు క్రింద ఉండే సున్నితమైన పొరలాంటి కోమలాంగులు. (43-49)
ఆ దాసులు ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. వారిలో ఒకడు ఇలా అంటాడు: “ప్రపంచంలో నాకో స్నేహితుడుండేవాడు. అతను నాతో ‘నువ్వు కూడా సమర్థించేవారిలో చేరిపోయావా? మనం చనిపోయి మట్టిలో కలిసి అస్తిపంజరాల్లా మారాక నిజంగా మనకు కర్మలఫలం ఇవ్వడం జరుగుతుందంటావా?’ అని అంటుండే వాడు. అతనిప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో మీరు చూడాలనుకుంటున్నారా?” (50-54)
ఈమాట చెప్పి అతను నరకంలోకి తొంగిచూస్తాడు. ఆ వ్యక్తి నరకంలో అట్టడుగు భాగాన కన్పిస్తాడు. అతడ్ని పిలిచి “దైవసాక్షి! నీవు నన్ను సర్వనాశనం చేసి ఉండేవాడివి. నా ప్రభువు నన్ను కటాక్షించి ఉండకపోతే, ఈరోజు నేను కూడా (నీలాగే) పట్టుబడి వచ్చినవారిలో ఒకణ్ణయి ఉండేవాడ్ని. సరే, (స్వగతంలో) ఇప్పుడు మనం ఎన్నటికీ చనిపోము కదూ! మనకు రావలసిన మృత్యువేదో ఇదివరకే వచ్చింది. ఇక మనకు ఎలాంటి శిక్షా ఉండదు కదూ!” అని అంటాడు. (55-59)
నిస్సందేహంగా ఇదే గొప్ప విజయం. ఇలాంటి విజయం కోసమే క్రియాశీలురు పని చేయాలి. చెప్పండి, ఈ ఆతిథ్యం మంచిదా లేక జఖ్ఖూమ్‌ (నాగజెముడు చెట్టు) ఆతిథ్యం మంచిదా? మేమీ (జఖ్ఖూమ్‌) వృక్షాన్ని దుర్మార్గులకు పరీక్షగా చేశాము. అది నరకంలో అట్టడుగున మొలుస్తుంది. దాని పండ్లగుత్తులు రాకాసి తలల్లా (భయంకరం గా) ఉంటాయి. నరకవాసులు వాటిని (ఆవురావురుమంటూ) తిని కడుపు నింపు కుంటారు. తరువాత త్రాగడానికి వారికి సలసల కాగే నీళ్ళు లభిస్తాయి. ఆ తర్వాత వారిని తిరిగి నరకాగ్ని వైపు తోలుకెళ్ళడం జరుగుతుంది. (60-68)
వారు దారితప్పిన తమ తాతముత్తాతల మార్గాన్నే గుడ్డిగా అనుసరించారు. నిజానికి వారికి పూర్వం ఎందరో దారితప్పి ఉండగా మేము వారి వద్దకు హెచ్చరించే వారిని పంపాము. అప్పుడు హెచ్చరించబడినవారికి ఎలాంటి దుర్గతి పట్టిందో చూడండి. ఆ దుర్గతి నుండి సచ్ఛీలురైన దైవదాసులు మాత్రమే రక్షించబడ్డారు. (69-74)
దీనికి పూర్వం నూహ్‌(ప్రవక్త) మమ్మల్ని మొరపెట్టుకున్నాడు. మేమే (దాసుల) మొరల్ని బాగా ఆలకించేవాళ్ళం. నూహ్‌ని, అతని కుటుంబ సభ్యులు, సంబంధీకులను ఓ పెద్ద ఆపద నుండి కాపాడాము. (అందర్నీ తుడిచిపెట్టి) అతని సంతతిని మాత్రమే మిగిలి ఉండేలా చేశాం. తరువాతి తరాలలో అతని పేరు, ప్రస్తావనలు వదలిపెట్టాము. అతనికి యావత్తు ప్రపంచంలో శాంతీ సౌభాగ్యాలు కలుగుగాక! సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తుంటాం. వారసలు విశ్వసించిన మా ప్రియదాసులు. (అవిశ్వాసులైన) రెండవ వర్గాన్ని మేము ముంచివేశాం. (75-82)
ఇబ్రాహీం కూడా నూహ్‌ మార్గాన్నే అనుసరించేవాడు. అతను తన ప్రభువు సన్నిధికి నిష్కల్మషమైన హృదయంతో వచ్చాడు. తన తండ్రిని, తన జాతి ప్రజలను ఉద్దేశించి “మీరు పూజిస్తున్న ఈ వస్తువులేమిటి? మీరు (నిజ)దేవుడ్ని వదలి స్వయంకృత దైవాలను (పూజించడాన్ని) ఇష్టపడుతున్నారా? మరి సర్వలోక ప్రభువు, పోషకుడైన దేవుని గురించి మీరేమనుకుంటున్నారు?” అని అడిగాడు. (83-87)
తర్వాత అతను (ఆకాశంలోని) నక్షత్రాల వైపు చూసి “నాకు వంట్లో బాగాలేదు” అన్నాడు. అందువల్ల వారతడ్ని వదలి (జాతరలో పాల్గొనడానికి) వెళ్ళిపోయారు.
వారలా పోగానే ఇబ్రాహీం వారి దేవతల గుళ్ళోకి జొరబడి “మీరు (ప్రసాదం) తినరే మిటీ? ఏమైంది మీకు కనీసం మాట్లాడనైనా మాట్లాడరు?” అన్నాడు. తర్వాత అతను ఆ విగ్రహాలపై విరుచుకుపడి కుడిచేత్తో వాటిని గట్టిగా బాది విరగ్గొట్టాడు. (88-93)
వారు (జాతర నుండి తిరిగొచ్చి) పరుగు పరుగున అతని దగ్గరకు వచ్చారు. అప్పుడతను వారితో “మీరు స్వయంగా చెక్కుకున్న ఈ విగ్రహాలను ఎలా పూజిస్తున్నారు? నిజానికి దేవుడు మాత్రమే మిమ్మల్ని, మీరు తయారచేసుకున్న విగ్రహాలను సృష్టించాడు. (అలాంటి సృష్టికర్తను వదలి సృష్టితాల వెంటపడ్డారా?)” అన్నాడు.(94-96)
అప్పుడు వారు పరస్పరం సంప్రదించుకొని “అతని కోసం ఓ అగ్నిగుండం తయారుచేసి, భగభగమండే ఆ అగ్నిగుండంలో అతడ్ని విసిరిపడేద్దాం” అని నిర్ణయించు కున్నారు. (ఈవిధంగా) వారతనికి వ్యతిరేకంగా ఒకచర్య తీసుకోదలిచారు. అయితే మేము (వారి దుశ్చర్యను వమ్ముచేసి) వారి పీచం అణచివేశాం. (97-98)
(ఆ తర్వాత) ఇబ్రాహీం (ప్రజలతో) “నేను నా ప్రభువు (ఆదేశం) వైపు వెళ్తున్నాను. ఆయనే నాకు మార్గదర్శనం చేస్తాడు” అన్నాడు. (ఆ సందర్భంలో) “ప్రభూ! నాకొక సద్గుణ సంపన్నుడైన కుమారుడ్ని ప్రసాదించు” అని దేవుడ్ని వేడుకున్నాడు. మేమతనికి సహనశీలుడైన ఒక పిల్లవాడు కలుగుతాడని శుభవార్త తెలిపాము. (99-101)
ఆ బాలుడు అతనితో పాటు పరుగెత్తే వయస్సుకు చేరుకున్న తరువాత (ఓరోజు) ఇబ్రాహీం అతనితో “బాబూ! నేను నిన్ను బలి ఇస్తున్నట్లు కలగన్నాను. దీనిపై నీ అభిప్రాయం ఏమిటో చెప్పు” అన్నాడు. దానికి ఆ బాలుడు (ఏమాత్రం కంగారుపడ కుండా) “నాన్నా! మీకు దేన్ని గురించి ఆజ్ఞ ఇవ్వబడిందో దాన్ని నెరవేర్చండి. దైవచిత్త మయితే మీరు నన్ను సహనశీలిగా చూస్తారు” అని అన్నాడు. (102)
ఇలా వారిద్దరూ (మాఆజ్ఞ) శిరసావహించారు. ఆ తరువాత ఇబ్రాహీం తన కుమారుడ్ని బోర్లాపడవేశాడు (బలిచేయడానికి). అప్పుడు మేము “ఇబ్రాహీం! నీవు కలను నిజంచేసి చూపావు. సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తుంటాము. నిజంగా ఇది నీకొక స్పష్టమైన పరీక్ష. (అందులో నీవు నెగ్గావు).” అని అన్నాము. (103-106)
మేము పరిహారం క్రింద ఒక పెద్ద బలిదానం ఇచ్చి ఆ బాలుడ్ని కాపాడాము. అతని కీర్తి ప్రతిష్ఠలను తరువాతి తరాలలో శాశ్వతంగా వదలిపెట్టాము. ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక! సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తాం. అతను విశ్వ సించిన మా ప్రియదాసులలో ఒకడు. మేమతనికి ఇస్‌హాఖ్‌ పుడ్తాడని (మరొక) శుభవార్త అందజేశాం. ఇస్‌హాఖ్‌ సద్గుణసంపన్నుడైన దైవప్రవక్త. మేము ఇబ్రాహీంకు, ఇస్‌హాఖ్‌కు (ఎన్నో) శుభాలు కలిగించాం. వారిద్దరి సంతతి నుండి ఇప్పుడు కొందరు పుణ్యాత్ములు, మరికొందరు ఆత్మవంచనకు పాల్పడిన పాపాత్ములు జన్మించారు. (107-113)
మేము మూసా, హారూన్‌లకు (కూడా) ఎంతో మేలు చేశాం. వారిని, వారిజాతిని మహోపద్రవం నుండి కాపాడాము. మా సహాయసహకారాల ద్వారానే వారు విజయం సాధించారు. వారికి మేము స్పష్టమైన దివ్యగ్రంథం ప్రసాదించి రుజుమార్గం చూపిం చాము. వారి కీర్తిప్రతిష్ఠలను తరువాతి తరాలలో వదలిపెట్టాము. మూసా, హారూన్‌లకు శాంతి కలుగుగాక! సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తుంటాం. నిస్సం దేహంగా వీరు (సత్యాన్ని) విశ్వసించిన మా ప్రియదాసులు. (114-122)
ఇల్యాస్‌ కూడా దైవప్రవక్తే. అతను తనజాతికి హితోపదేశం చేస్తూ “మీరు (దేవునికి) భయపడరా? ఎంతోమంచి సృష్టికర్తను వదలి బాల్‌ (విగ్రహం)ను ప్రార్థిస్తున్నారా? మీకు, మీ తాతముత్తాతలకు ఆ దేవుడే కదా ప్రభువు?” అని అన్నాడు. అయితే వారతడ్ని తిరస్కరించారు. కనుక వారు తప్పక (నరక)శిక్ష కోసం మాముందు ప్రవేశపెట్టబడతారు. కాని విశ్వసనీయులైన దైవదాసులు మాత్రం కాదు. ఇల్యాస్‌ కీర్తి ప్రతిష్ఠలను మేము తర్వాతి తరాలలో శాశ్వతంగా వదలిపెట్టాము. ఇల్యాస్‌కు శాంతి కలుగుగాక! నీతిమంతు లకు మేము ఇలాంటి ప్రతిఫలమే ప్రసాదిస్తుంటాము. అతను విశ్వసించిన మా ప్రియ దాసులలో ఒకడై ఉన్నాడు. (123-132)
లూత్‌ కూడా దైవప్రవక్తే. మేము అతడ్ని, అతని కుటుంబసభ్యులను కాపాడాము. అయితే ఒక వృద్ధురాలిని మాత్రం మేము రక్షించలేదు. ఆమె వెనకుండేవారిలో కలసి ఉండి పోయింది. ఆ తరువాత మేము మిగిలిన వారందర్నీ పూర్తిగా తుడిచిపెట్టాము. ఈనాడు మీరు వారి శిథిల నివాసాల మీదుగానే రేయింబవళ్ళు ప్రయాణిస్తున్నారు. వాటిని చూసయినా మీకు కనువిప్పు కలగదా? (133-138)
యూనుస్‌ కూడా దైవప్రవక్తే. అతనొక నిండునావ వైపు పరుగెత్తాడు. అక్కడ ఇతర ప్రయాణీకుల పేర్లతో పాటు అతని పేరు కూడా కలిపి చీటీ వేయడం జరిగింది. ఈ చీటీలో అతను దెబ్బతిన్నాడు. చివరికి అతడ్ని ఒక చేప మింగేసింది. అతను (తనను తాను నిందించుకుంటూ) నిందితుడైపోయాడు. (139-142)
అప్పుడతను దైవాన్ని స్మరించి ఉండకపోతే పునరుత్థానదినం దాకా ఆచేప కడుపు లోనే ఉండిపోయేవాడు. చివరికి మేమతడ్ని వ్యాధిగ్రస్త స్థితిలో ఇసుక మైదానంలో విసిరేశాం. అతనికి నీడ కోసం అక్కడ ఒక తీగచెట్టు మొలిపించాం. తర్వాత అతడ్ని మేము లక్షమంది లేక అంతకు పైగాఉన్న ప్రజల దగ్గరికి పంపాము. వారు సత్యాన్ని విశ్వసించారు. కనుక మేము ఓ నిర్ణీతకాలం దాకా వారిని వదలిపెట్టాం. (143-148)
వారినడుగు, మీ ప్రభువుకు కుమార్తెలును, మీకు కుమారులా? మేము నిజంగా దైవదూతలను స్త్రీలుగా రూపొందించామా? వారు తమ కళ్ళతో చూసిచెబుతున్న మాట లేనా ఇవి? విను, దేవునికి సంతానముందని వీరు చెబుతున్న మాటలన్నీ వట్టి అభూత కల్పనలు మాత్రమే. వీరసలు పచ్చి అబద్ధాలకోరులు. దేవుడు కుమారులకు బదులు కుమార్తెల్ని కోరుకున్నాడా? ఏమయింది మీకు, ఇలాంటి కారుకూతలు కూస్తున్నారు? మీరు వాస్తవం గురించి ఆలోచించరా? లేక మీరు చెబుతున్న ఈ మాటలకు మీదగ్గర గట్టి ప్రమాణం ఏదైనా ఉందా? ఉంటే ఆ ప్రమాణమున్న గ్రంథం ఏమిటో తీసుకు రండి. మీ వాదన నిజమయితే ఈ పని చేసి చూపండి. (149-157)
వారసలు దేవునికి, దైవదూతలకు బంధుత్వాన్ని అంటగట్టారు. కాని వారు (నేరస్థు లుగా దేవుని ముందు) ప్రవేశపెట్టబడతారని దైవదూతలకు బాగా తెలుసు. (పైగా వారిలా అంటారు:) “విశ్వసనీయులైన దైవదాసులు తప్పఇతరులు ఆపాదించే ఇలాంటి లక్షణాలు దేవునిలో ఏమాత్రం లేవు. ఆయన ఎంతో పరిశుద్ధుడు. కనుక మీరు, మీ మిధ్యాదైవాలు నరకాగ్నిలో కాలిపోవలసిన వాడ్ని తప్ప మరెవరినీ దేవునికి వ్యతిరేకంగా (అధర్మకార్యాలకు) పురిగొల్పలేరు. ఇక మా విషయానికొస్తే, మాలో ప్రతి ఒక్కరికీ ఒక స్థానం నిర్ణయించబడింది. మేము విధినిర్వహణకై అనుక్షణం సిద్ధంగాఉండే సేవకులం, నిరంతరం దేవుని పవిత్రత ప్రశంసించేవాళ్ళం మాత్రమే.” (158-166)
వారు ఇంతకు పూర్వం (గ్రంథప్రజల ధార్మిక దుస్థితి చూస్తూ) “గత జాతులకు లభించిన (దివ్య) ప్రస్తావన మాదగ్గర కూడా ఉంటే ఎంత బాగుండు! మేము దేవునికి ప్రియదాసులై ఉండేవాళ్ళం” అని అంటుండేవారు. అయితే ఆ ప్రస్తావన (ఖుర్‌ఆన్‌ రూపంలో) రాగానే దాన్ని వారు తిరస్కరించారు. (ఈ తిరస్కార పర్యవసానం ఏమిటో) వారికి త్వరలోనే తెలుస్తుంది. మేము (దైవప్రవక్తలుగా నియమించి) పంపిన దాసులకు తప్పకుండా సహాయం చేయడం జరుగుతుంది. మా సైన్యమే విజయం సాధిస్తుందని మేము ముందే వాగ్దానం చేశాం. (167-173)
కనుక ప్రవక్తా! కొంతకాలం వారిని వారిమానాన వదలిపెట్టు. త్వరలోనే వారూ (తమకు దుర్గతి ఏమిటో) చూసుకుంటారు. మాశిక్ష కోసం వారు తొందరపడ్తున్నారా? కాని ఆశిక్ష వారి ముంగిట వాలినప్పుడు, (సత్యతిరస్యార గురించి) హెచ్చరించబడిన వారికి దుర్దినం దాపురించినట్లే. కనుక కొన్నాళ్ళు వారిని వారిమానాన వదిలేసి చూడు. వారు కూడా (తమకు ఎలాంటి గతి పడ్తుందో) చూసుకుంటారు. (174-179)
నీ ప్రభువు ఎంతో పవిత్రుడు, గౌరవనీయుడు. వారు కల్పిస్తున్న సమస్త విషయా లకు ఆయన అతీతుడు. దైవప్రవక్తలకు శాంతి కలుగుగాక! సర్వలోక ప్రభువైన దేవునికే సకల విధాల ప్రశంసలు శోభిస్తాయి. (180-182)