కురాన్ భావామృతం/అల్-ఖియామా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

75. ఖియామ (ప్రళయం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 40)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
కాదు. నేను ప్రళయం సాక్షిగా చెబుతున్నాను. (మీరనుకునేది ఎంతమాత్రం నిజం) కాదు. నేను తననుతాను నిందించుకునే ఆత్మ సాక్షిగా చెబుతున్నాను. (మృత) మానవుని ఎముకల్ని మేము సమీకరించలేమని అతను భావిస్తున్నాడా? ఎందుకు సమీ కరించలేము? మేము అతని వ్రేళ్ళ కొనలను సైతం తిరిగి రూపొందించగలం. (1-4)
కాని మానవుడు ఇకముందు కూడా దుష్కార్యాలు చేస్తూ, విశృంఖలజీవితం గడప గోరుతున్నాడు. “ప్రళయం ఎప్పుడొస్తుంది? అసలింతకూ అది వస్తుందా లేదా?” అని అంటాడు. ఆరోజు మానవులు (తీవ్రమయిన భయాందోళనలతో) కళ్ళు తేలవేస్తారు. చంద్రుడు కాంతి విహీనుడయి పోతాడు. సూర్యచంద్రుల్ని కలిపివేయడం జరుగుతుంది. అప్పుడు ఈ మానవుడే “నేనెక్కడికి పారిపోవాలి?” అనంటాడు. (5-10)
ఎక్కడికీ పారిపోలేవు. ఎక్కడా నీకు రక్షణ లేదు. ఆరోజు నీవు నీ ప్రభువు సన్నిధికే వెళ్ళి నిలబడవలసి ఉంటుంది. ఆరోజు మానవునికి అతను ముందుకు పంపుకున్నవీ, వెనుక వదలి వచ్చినవీ అన్నీ తెలియజేయబడతాయి. అతను ఎన్ని సాకులు చూపినా, తనను గురించి తానే బాగా ఎరగ్గలడు. (11-15)
ప్రవక్తా! ఈ దివ్యావిష్కృతిని గుర్తుంచుకోవడానికి వడివడిగా నాలుక తిప్పకు. దాన్ని గుర్తుచేయించడం, నీచేత చదివించడం మాపని. కనుక మేము పఠిస్తున్నప్పుడు నీవు శ్రద్ధగా ఆలకిస్తే చాలు. తర్వాత దానిభావం తెలియజేయడం కూడా మా బాధ్యతే#
(మీరనుకునేది) ఎంతమాత్రం (నిజం)కాదు. మీరసలు త్వరగా లభించే (ఐహిక) వస్తువులపై అమితమైన వ్యామోహం పెంచుకొని పరలోకాన్ని విస్మరించారు. (16-21)
ఆరోజు కొందరి ముఖాలు కళకళలాడుతూ దేదీప్యమానంగా వెలిగిపోతుంటాయి. వారు తమ ప్రభువుని ప్రత్యక్షంగా చూస్తుంటారు. మరికొందరి ముఖాలు నిరాశా నిస్పృహలతో వాడి జావకారి పోతుంటాయి. వారు తమపై పెద్ద ఆపద విరుచుకుపడ బోతోందని భావిస్తూ (భయపడుతూ) ఉంటారు. (22-25)
(చనిపోయాక మళ్ళీ బ్రతికించబడటం కల్ల అనే మీ అభిప్రాయం) ఎంతమాత్రం (నిజం) కాదు. మనిషి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పుడు “మంత్రించే వారెవరైనా ఉన్నారా?” అంటారు జనం. ఆ మనిషి ఇక తాను ఇహలోకం వీడిపోయే సమయం ఆసన్నమయిందని అనుకుంటాడు. కష్టాల మీద కష్టాలు వచ్చిపడతాయి. అదే నీ ప్రభువు సన్నిధికి బయలుదేరవలసిన రోజు. (26-30)
అయితే అతను (ఈ) సత్యాన్ని అంగీకరించలేదు. ప్రార్థన (నమాజ్‌) చేయలేదు. పైగా సత్యాన్ని నిరాకరించి (దేవునిపై) తిరగబడ్డాడు. ఆ తరువాత నిక్కుతూ, నీల్గుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ వైఖరి ఎంతో శోచనీయం. ఇది నీకే శోభిస్తుంది. ఔను ఈ వైఖరి ఎంతో శోచనీయం. ఇది నీకే శోభిస్తుంది. (31-35)
మానవుడు తనను ఇట్టే వదలిపెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా? అతను మొదట (స్త్రీగర్భంలో) కార్చబడిన క్షుద్రబిందువుగా లేడా? తర్వాత ఒక నెత్తుటి ముద్దలా రూపొందాడు. ఆతర్వాత దేవుడు అతనికి దేహంనిర్మించి తగిన అవయవాలు పొందికగా అమర్చాడు. ఆపై అతని నుండి రెండు వేర్వేరు జాతులుగా స్త్రీ పురుషుల్ని పుట్టించాడు. ఇదంతా చేసినవాడు చనిపోయినవాడ్ని మళ్ళీ బ్రతికించలేడా? (36-40)