కురాన్ భావామృతం/అల్-మర్యం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

19. మర్యం
(అవతరణ: మక్కా; సూక్తులు: 98)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
కాఫ్‌-హా-యా-ఐన్‌-సాద్‌. ఇది నీ ప్రభువు తన దాసుడు జకరియ్యాపై చిలికించిన కరుణామృతానికి సంబంధించిన ప్రస్తావన. అతను ఏకాంతంలో తన ప్రభువును వేడు కున్నప్పటి విషయం. (1-3)
అతనిలా వేడుకున్నాడు: “ప్రభూ! వృద్ధాప్యం వల్ల నా ఎముకలు సైతం చితికి మెత్తబడిపోయాయి. నా తల నెరసిన వెండ్రుకలతో తెల్లగా మెరసిపోతోంది. ప్రభూ! నిన్ను వేడుకొని నేను ఏనాడూ విఫలం కాలేదు. నా తదనంతరం నా సోదరులు, బంధువులు ఎలా వ్యవహరిస్తారోనని నాకు భయంగా ఉంది. నాభార్య గొడ్రాలు. అంచేత నాకూ, యాఖూబ్‌ సంతానానికీ వారసుడయ్యేలా నీ ప్రత్యేక అనుగ్రహంతో నాకొక వారసుడ్ని ప్రసాదించు. ప్రభూ! అతడ్ని ఆమోదయోగ్యునిగా కూడా రూపొందించు.” (4-6)
“జకరియ్యా! మేము నీకు కుమారుడు పుడతాడని శుభవార్త విన్పిస్తున్నాం. అతని పేరు యహ్యా అవుతుంది. మేమీ పేరుగల ఏ మనిషినీ ఇదివరకు పుట్టించలేదు.” (7)
“ప్రభూ! నాకు కొడుకు ఎలా పుడ్తాడు? నాభార్య గొడ్రాలు కదా! ఇటు నేను కూడా పండు ముసలివాణ్ణయి పోయానే!!” అన్నాడతను. (8)
“అలాగే పుడ్తాడు. నీ ప్రభువు చెబుతున్నాడు- నాకిది చాలా సులువైన పని. నీకు ఒక ఉనికి అన్నదే లేనప్పుడు నేను నిన్ను పుట్టించలేదా?” (9)
“అయితే ప్రభూ! నాకోసం ఏదైనా సూచన నిర్ణయించు” అన్నాడు జకరియ్యా.
“నీవు వరుసగా మూడు రోజులు దాకా ప్రజలతో మాట్లాడలేవు. ఇదే నీకోసం సూచన” అన్నాడు దేవుడు. (10)
తర్వాత జకరియ్యా ప్రార్థనగది నుండి బయలెడి తనజాతి ప్రజల ముందుకొచ్చి వారికి ఉదయం, సాయంత్రం దైవస్మరణ చేస్తుండాలని సైగలతో ఉపదేశించాడు. (11)
“యహ్యా! దైవగ్రంథాన్ని దృఢంగా పట్టుకో”- మేమతనికి బాల్యంలోనే విజ్ఞత, వివేకాలు ప్రసాదించాం. మావద్ద నుండి వాత్సల్యం, పరిశుద్ధతలు కూడా అనుగ్రహిం చాము. అతను గొప్ప దైవభీతిపరుడు; తల్లిదండ్రుల పట్ల వినయవిధేయతలు కలవాడు. అహంకారంగాని, తలబిరుసుతనంగాని మచ్చుకైనా లేనివాడు. అతను పుట్టిన రోజున, చనిపోయే రోజున, తిరిగి బ్రతికించి లేపబడే రోజున అతనికి శాంతి కలుగుగాక! (12-15)
ముహమ్మద్‌ (స)! ఈ గ్రంథంలో మర్యం వృత్తాంతం ప్రస్తావించు. ఆమె ప్రజల నుండి వేరయి, తూర్పు వైపున ఏకాంత కుహరంలోకి వెళ్ళి తెరవేసుకొని కూర్చున్నది. అప్పుడు మేము ఆమె దగ్గరికి మా ఆత్మ (దైవదూత)ను పంపాము. అతను పరిపూర్ణ మానవాకారంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. (16-17)
మర్యం (అతడ్ని చూడగానే) “నేను నీబారి నుండి కరుణామయుని శరణు కోరు తున్నాను. నీవు దేవునికి భయపడే వాడివయితే (నాదగ్గరకు రాకు)” అన్నది. (18)
“నేను నీ ప్రభువు దగ్గర్నుండి వచ్చిన దూతను. నీకొక పరిశుద్ధ బాలుడ్ని ఇచ్చే ఉద్దేశ్యంతో పంపబడ్డాను” అన్నాడతను. (19)
“ఏమిటీ, నాకు కొడుకు ఎలా కలుగుతాడు? నన్ను ఏ మానవుడూ తాకనైనా తాక లేదే! నేను శీలంలేని స్త్రీని కూడా కాదే!!” అన్నది మర్యం (కంగారుపడుతూ). (20)
“అలాగే కలుగుతాడు. నీ ప్రభువే ఇలా సెలవిస్తున్నాడు: ‘ఇలా చేయడం నాకు చాలాతేలిక. ఈ బాలుడ్ని మేము ప్రజల కోసం ఒక సూచనగా చేయాలని, మా వైపున కారుణ్యమూర్తిగా రూపొందించాలని నిర్ణయించాము. అందుకే ఇలా చేయబోతున్నాం. ఈ పని జరిగి తీరవలసిఉంది” అన్నాడు దైవదూత. (21)
మర్యం ఆబాలుడికి సంబంధించిన గర్భం దాల్చింది. ఆమె గర్భస్థపిండం తీసుకొని దూరాన ఉన్న ఓ స్థలానికి చేరుకుంది. ప్రసవవేదన ఆమెను ఒక ఖర్జూరపుచెట్టు క్రిందికి చేర్చింది. ఆమె (లోలోన బాధపడుతూ) “అయ్యో! (ఏమిటి నాకీ పరీక్ష) నేనీ ప్రసవానికి ముందే చనిపోయి నామరూపాల్లేకుండా పోతే బాగుండు!!” అన్నది. (22-23)
అప్పుడు దైవదూత ఆమె క్రింది వైపు నుండి పిలుస్తూ ఇలా అన్నాడు: “మర్యం! విచారించకు. నీ ప్రభువు నీ క్రింద ఒక మంచినీటి ఊటను సృష్టించాడు. కాస్త ఈ చెట్టుమొదలు పట్టుకొని ఊపు, నీముందు తాజా ఖర్జూరపండ్లు రాలిపడతాయి. వీటిని తింటూ, త్రాగుతూ హాయిగా ఉండు. మనుషులెవరైనా కన్పిస్తే ‘నేను కరుణామయుని (ప్రసన్నత) కోసం ఉపవాసముంటానని మొక్కుకున్నాను, అందువల్ల నేనీ రోజు ఎవరి తోనూ మాట్లాడను’ అని చెప్పెయ్యి.” (24-26)
ఆ తరువాత ఆమె ఆ పిల్లవాడ్ని తీసుకొని తన జాతి ప్రజల దగ్గరకు వెళ్ళింది. ప్రజలు (ఆమెను చూడగానే) “మర్యం! నీవు చాలా ఘోరమైన పాపం చేశావు. హారూన్‌ (సంతతి) సోదరీ! నీ తండ్రి చెడ్డవాడు కాదు. నీ తల్లి కూడా శీలం చెడిన స్త్రీ కాదే! (నువ్విలా ఎందుకు తయారయ్యావు?)” అని అడిగారు. (27-28)
మర్యం (నోటితో సమాధానమివ్వకుండా ఒడిలో ఉన్న) పిల్లవాడి వైపు చూపింది. ప్రజలు (ఆశ్చర్యపోతూ) “మేమీ చంటిపిల్లవాడితో ఎలా మాట్లాడుతాం?” అన్నారు. (29)
(వెంటనే) ఆ పిల్లవాడు ఇలా మాట్లాడటం మొదలెట్టాడు: “నేను దేవుని దాసుడ్ని. ఆయన నాకు దివ్యగ్రంథం ప్రసాదించాడు. ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా నన్ను శుభప్రదమైనవాణ్ణిగా చేశాడు. నేను బ్రతికున్నంతకాలం నమాజ్‌, జకాత్‌ విధులు పాటిస్తుండాలని ఆదేశించాడు. నాతల్లి పట్ల నేను విధేయతకలవాడ్నిగా చేశాడు. ఆయన నన్ను దుర్మార్గుడిగా, దౌర్భాగ్యుడిగా చేయలేదు. నేను పుట్టినప్పుడు, చనిపోయేటప్పుడు, తిరిగి బ్రతికించి లేపబడేటప్పుడు నాపై శాంతి అవతరించు గాక!” (30-33)
ఈ పిల్లవాడే మర్యం కుమారుడు ఈసా. ఇతడ్ని గురించి ప్రజల్లో ఉన్న అపార్థా లకు భిన్నంగా అసలు వృత్తాంతం ఇది. ఒకర్ని కొడుకుగా చేసుకోవడం దేవునికి ఏ మాత్రం శోభించదు. ఆయన ఎంతో పరిశుద్ధుడు. ఆయన ఏదైనా చేయదలచుకుంటే ‘అయిపో’ అంటే చాలు, ఆ పని ఇట్టే చిటికలో జరిగిపోతుంది. (34-35)
(ఈసా ప్రజలకు హితబోధ చేస్తూ) “దేవుడే నా ప్రభువు. మీ ప్రభువు కూడా ఆయనే. కనుక మీరు ఆయన్నే ఆరాధించండి. ఇదే సరైన మార్గం” అన్నాడు. (36)
కాని వారిలో విభిన్నవర్గాలు పరస్పరం విభేదించుకోసాగాయి. భయంకర దినం వచ్చినప్పుడు అవిశ్వాసులకది వినాశకారిగా పరిణమిస్తుంది. వారు మాసన్నిధికి చేరుకునే రోజు వారి వినికిడి శక్తి బాగానే ఉంటుంది. వారి దృష్టి కూడా బాగానే ఉంటుంది. ఈ రోజు మాత్రం ఈ దుర్మార్గులు పూర్తిగా మార్గభ్రష్టత్వంలో పడివున్నారు. (37-38)
ముహమ్మద్‌ (స)! వారిప్పుడు ఏమరుపాటుకు లోనై సత్యాన్ని విశ్వసించే స్థితిలో లేరు. (ఏమైనా) తుదితీర్పు జరిగి పశ్చాత్తాపం తప్ప మరేమీ మిగలని రోజు గురించి వారిని భయపెట్టు. చివరికి మేమే భూమికి, దానికి సంబంధించిన సమస్త వస్తువులకు వారసులవుతాం. అందరూ చివరికి మా సన్నిధికే తిరిగి రావలసిఉంది. (39-40)
ఈ గ్రంథంలో ఇబ్రాహీం గాధ ప్రస్తావించు. అతను ఎంతో సత్యసంధుడు; గొప్ప దైవప్రవక్త కూడా. అతను (తన తండ్రికి హితోపదేశం చేస్తూ) ఇలా అన్నాడు:
“నాన్నా! మీరు వినలేని, చూడలేని వాటిని పూజిస్తున్నారేమిటీ? అవి మీకు ఏవిధం గాను తోడ్పడలేవు కదా? నాన్నా! మీ దగ్గర లేనటువంటి (దివ్య)జ్ఞానం నా దగ్గరుంది. కనుక మీరు నన్ను అనుసరించండి; నేను మీకు రుజుమార్గం చూపుతాను. నాన్నా! మీరు షైతాన్‌ని ఆరాధించకండి. షైతాన్‌ కరుణామయుడ్ని తిరస్కరించిన అహంకారి. నాన్నా! (మీ ధోరణి చూస్తుంటే) మీరు కరుణామయుని శిక్షకు గురయి, ఆ తరువాత షైతాన్‌కు సహచరులయి పోతారేమోనని నాకు భయంగా ఉంది.” (41-45)
దానికి తండ్రి (మండిపడుతూ) “ఇబ్రాహీం! నీవు మన దేవతలకు విముఖుడై పోయావా? నీ ధోరణి మార్చుకోకపోతే నేను నిన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తాను. (వెళ్ళిపో) నానుండి శాశ్వతంగా వేరయిపో” అన్నాడు. (46)
“మీకు శాంతి కల్గుగాక! మిమ్మల్ని క్షమించమని నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. ఆయన నాపట్ల అమిత దయగలవాడు. నేను మిమ్మల్ని, దేవుడ్ని కాదని మీరు ప్రార్థి స్తున్న మీ మిధ్యాదైవాల్ని వదిలేసి వెళ్తున్నాను. నేను నా ప్రభువునే ప్రార్థిస్తాను. నా ప్రభువుని ప్రార్థించి నేను వైఫల్యం చెందనని ఆశిస్తున్నాను” అన్నాడు ఇబ్రహీం. (47-48)
(ఇలా) ఇబ్రాహీం ఆ ప్రజల్ని, వారి దైవేతరశక్తుల్ని వదలి వెళ్ళిపోయాడు. అప్పుడు మేమతనికి ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ వంటి సంతానం ప్రసాదించాం. వారిద్దర్ని ప్రవక్తలుగా చేశాం. వారందరిపై నా కరుణామృతం చిలికించి వారి కీర్తిప్రతిష్ఠల్ని ఉన్నతం చేశాం#
ఈ గ్రంథంలో మూసా గాధ ప్రస్తావించు. అతనొక సత్పురుషుడు, సందేశహరు డైన దైవప్రవక్త. మేమతడ్ని తూర్‌పర్వతం కుడి వైపు నుండి పిలిచి రహస్య సంభాషణ ద్వారా మా సాన్నిధ్యం ప్రసాదించాం. మా అనుగ్రహంతో అతని సోదరుడు హారూన్‌ని (కూడా) ప్రవక్తగా నియమించి అతనికి (సహాయకునిగా) ఇచ్చాము. (49-53)
ఈ గ్రంథంలో ఇస్మాయీల్‌ గాధ ప్రస్తావించు. అతను మంచి వాగ్దానపాలకుడు, సందేశహరుడైన దైవప్రవక్త. తన కుటుంబసభ్యులకు నమాజ్‌, జకాత్‌ విధుల్ని గురించి ఆజ్ఞాపిస్తుండేవాడు. అతను తనప్రభువు దృష్టిలో ఆమోదయోగ్యుడైన మనిషి. (54-55)
ఈ గ్రంథంలో ఇద్రీస్‌ని గురించి కూడా ప్రస్తావించు. అతను సత్యసంథుడు, దైవప్రవక్త. అతడ్ని మేము ఉన్నత స్థాయికి చేర్చాము. (56-57)
ఆదం సంతానంలో, నూహ్‌తో పాటు ఓడలో ఎక్కినవారి సంతతిలో, ఇబ్రాహీం సంతతిలో, ఇస్రాయీల్‌ (యాఖూబ్‌) సంతతిలో వీరు దేవుని విశేషానుగ్రహం పొందిన దైవప్రవక్తలు. మేము సన్మార్గం చూపి ప్రత్యేకంగా ఎన్నుకున్న సత్పురుషుల్లోనివారు. వారి ముందు కరుణామయుని సూక్తులు పఠిస్తుంటే వారు కన్నీటిధారలతో (అప్రయ త్నంగా దేవుని సన్నిధిలో) సాష్టాంగపడుతుండేవారు. (58)
ఆ తర్వాత అనర్హులు, అయోగ్యులు వారికి వారసులైపోయాలు. వారు నమాజ్‌ని వదిలేసి మనోవాంఛలకు బానిసలై పోయారు. త్వరలోనే వారు తమ మార్గభ్రష్టత్వానికి తగిన శిక్ష అనుభవిస్తారు. అయితే పశ్చాత్తాపం చెంది, సత్యాన్ని విశ్వసించి సదాచార వైఖరి అవలంబించేవారు మాత్రం స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి అణుమాత్రం కూడా అన్యాయం జరగదు. వారికోసం శాశ్వతంగా ఉండే స్వర్గవనాలు ఉన్నాయి. వారు కళ్ళారా చూడకపోయినా అవి లభిస్తాయని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. (59-61)
వారక్కడ ఎలాంటి పనికిమాలిన మాటలు వినరు. అన్నీ సమంజసమైన మాటలే వింటారు. వారికక్కడ రోజూ ఉదయం, సాయంత్రం ఆహారం లభిస్తుంది. ఇలాంటి స్వర్గానికే మేము మాదాసులలో భయభక్తులు కలవారిని వారసులుగా చేస్తాం. (62-63)
“ముహమ్మద్‌ (సల్లం)! మేము (దైవదూతలం) నీ ప్రభువు అనుమతి లేకుండా అవతరించలేము. మా ముందున్నదానికి, వెనుకున్నదానికి, ఆ రెండిటి మధ్య ఉన్న దానికి, సమస్తానికీ ఆయనే యజమాని. నీ ప్రభువు (ఏవిషయమూ) మరచిపోయేవాడు కాదు. ఆయన భూమ్యాకాశాలకు, వాటి మధ్య వున్న సమస్త సృష్టితాలకే ప్రభువు. కనుక నీవు ఆయన్నే ఆరాధించు. ఆయన ఆరాధనలోనే (జీవితాంతం) స్థిరంగా ఉండు. నీ దృష్టిలో ఆయనకు సమానుడైనవాడు ఎవడైనా ఉన్నాడా?” (64-65)
మానవుడు (ఏమంటాడో చూడు,) “నేను చనిపోయాక నిజంగా నన్ను బ్రతికించి లేపడం జరుగుతుందా?” అనంటాడు. అతనికసలు ఉనికి అన్నదే లేనప్పుడు మేమతడ్ని మొదటిసారిగా పుట్టించిన సంగతి అతనికి గుర్తులేదా? (66-67)
నీ ప్రభువు సాక్షి! మేము వారందర్నీ, వారితోపాటు పిశాచాలను తప్పక చుట్టు ముట్టి తీసుకొస్తాం. తర్వాత వారిని నరకంచుట్టు మోకాళ్ళమీద వంగబెడ్తాం. ఆతర్వాత ప్రతివర్గం నుండి కరుణామయుని విషయంలో తలబిరుసుతో వ్యహరించిన విద్రోహు లందర్నీ ఏరివేస్తాం. నరకంలో విసరాడానికి ఎవరెక్కువ అర్హులో మాకు తెలుసు.
(వినండి!) మీలో ఎవరూ నరకం మీదుగా పోనివారంటూ ఉండరు. ఇదొక నిర్ణీత విషయం. ఈ పని నెరవేర్చవలసిన బాధ్యత నీప్రభువు మీద ఉంది. ఆ సందర్భంలో మేము దైవభీతిపరాయణుల్ని (నరకంలో పడకుండా) రక్షిస్తాము.(దైవనిర్ణీత హద్దులు మీరిన) దుర్మార్గుల్ని మాత్రం అందులో పడిపోవడానికి వదిలేస్తాం. (68-72)
అవిశ్వాసులకు మా విస్పష్ట సూక్తులు విన్పిస్తున్నప్పుడు వారు విశ్వాసులతో “చెప్పండి మన ఉభయవర్గాల్లో ఎవరు మంచిస్థితిలో ఉన్నారు, ఎవరి సభలు వైభవోపే తంగా ఉన్నాయి?” అనంటారు. కాని పూర్వం మేము వీరికంటే ఎక్కువ ఆస్తిపాస్తులు, బాహ్యపటాటోపం కలిగివున్న ఎన్నో జాతులను నాశనం చేశాం. (73-74)
వారికిలా చెప్పు: “మార్గభ్రష్టత్వంలోనే పడివుండేవారిని కరుణామయుడు చూసీ చూడనట్లు వదిలేస్తున్నాడు. చివరికి వారు తమకు వాగ్దానం చేయబడినదాన్ని అది దైవ శిక్షయినా లేదా ప్రళయఘడియ అయినా (కళ్ళారా) చూసుకుంటారు. అప్పుడు వారికి తెలుస్తుంది, ఎవరి పరిస్థితి అధ్వాన్నంగా, ఎవరి బలగం బలహీనంగా ఉందో.” (75)
దీనికి భిన్నంగా రుజుమార్గం అవలంబించిన వారికి దేవుడు మరింత సద్బుద్ధి ప్రసాదిస్తాడు. నీ ప్రభువు దృష్టిలో శాశ్వతంగా ఉండే సత్కార్యాలే పర్యవసానం రీత్యా, ఫలితం రీత్యా ఎంతో శ్రేష్ఠమైనవి. (76)
ప్రవక్తా! మా సూక్తులు తిరస్కరించిన వాడ్ని చూశావా? అతను (తన ప్రస్తుత పరిస్థితి చూసుకొని మిడిసిపడుతూ“ మీరు నన్ను దైవశిక్ష గురించి ఎంత బెదిరిస్తున్నా) నాకు మాత్రం సంతానం, సిరిసంపదలు ఇంకా లబిస్తూనే ఉంటాయి” అని అంటు న్నాడు. అతనికి ఏదైనా అగోర విషయం తెలిసిపోయిందా? లేక కరుణామయునితో ఏదైనా ఒప్పందం చేసుకున్నాడా? (77-78)
అదేమీ కాదు. అతను వాగుతున్నదంతా మేము (అతని కర్మలచిట్టాలో) నమోదు చేస్తున్నాం. అతనికి విధించే శిక్షను మరింత తీవ్రం చేస్తాం. అతను ప్రస్తావిస్తున్న సిరులూ గిరులూ, మందీమార్బలం అన్నీ చివరికి మాదగ్గరే ఉండిపోతాయి. (అన్నిటినీ ప్రపంచం లోనే వదిలేసి) అతను ఒంటరిగా మాసన్నిధికి రావలసి ఉంటుంది. (79-80)
వారు దేవుడ్ని వదిలేసి తమకు అండగా నిలువడానికి కొన్ని (మిధ్యా)దైవాలను తయారుచేసుకున్నారు. వారికసలు ఎవరూ అండగా నిలువరు. అవన్నీ (ప్రళయ దినాన) వారి పూజాపురస్కారాలను నిరాకరిస్తాయి. పైగా వారికి ప్రత్యర్థులైపోతాయి. (81-82)
మేము సత్యతిరస్కారుల పైకి పిశాచశక్తుల్ని ఎలా వదలిపెట్టామో చూడలేదా? అవి వారిని (సత్యతిరస్కారం గురించి) బాగా రెచ్చగొడ్తున్నాయి. సరే, నీవు వారి శిక్ష విషయంలో తొందరపడకు. వారికి ఎటూ రోజులు దగ్గరపడ్డాయి. (83-84)
ఆరోజు ఎంతో దూరంలేదు. అప్పుడు మేము దైవభీతిపరుల్ని అతిథుల్లా (గౌర విస్తూ) కరుణామయుని సన్నిధిలో ప్రవేశపెడ్తాం. పాపాత్ముల్ని దప్పికగొన్న జంతువుల్లా నరకం వైపు తోలుకెళ్తాం. ఆరోజు ప్రజలు ఎలాంటి సిఫారసు చేయలేరు. ఏదైనా చేస్తే కరుణామయుడి నుండి అనుమతి పొందినవారే సిఫారసు చేయగలరు. (85-87)
కరుణామయుడు ఒకడ్ని తన కొడుకుగా చేసుకున్నాడని అంటున్నారు వారు. “మీరు చాలా ఘోరమయిన మాట కల్పించి చెబుతున్నారు. కరుణామయునికి సంతానం ఉందని చెప్పటం ఎంత తీవ్రమైన విషయమంటే దానివల్ల మిన్ను విరిగి పడవచ్చు; భూమి బ్రద్దలై పోవచ్చు; పర్వతాలు పగిలి ముక్కలై పోవచ్చు. సంతానం కలిగివుండటం కరుణామయునికి ఎంతమాత్రం శోభించదు. (88-92)
భూమ్యాకాశాల్లో ఉన్న సమస్త సృష్టిరాసులు కట్టు బానిసలై ఆయన ముందుకు వస్తాయి. ఆయన అందర్నీ పరివేష్ఠించి ఉన్నాడు. ప్రతి ఒక్కర్నీ లెక్కపెట్టి ఉంచాడు. చివరికి యావన్మంది ప్రళయదినాన ఒంటరిగా ఆయన ముందు సమావేశమవుతారు#
విశ్వసించి సత్కార్యాలు చేస్తున్నవారి గురించి కరుణామయుడు త్వరలోనే ప్రజల హృదయాల్లో ప్రేమాభిమానాలు జనింపజేస్తాడు. ఇది తప్పక జరుగుతుంది. (93-96)
ప్రవక్తా! ఈగ్రంథం ద్వారా దైవభీతిపరులకు (స్వర్గ)శుభవార్త విన్పించు. పెడసరిగా మాట్లాడే మొండిఘటాలను (శిక్ష గురించి) భయపెట్టు. ఈపని కోసమే మేమీ వాణిని సులభతరం చేసి నీనోట వైలువరిస్తున్నాం. వారికి పూర్వం మేము ఎన్నో జాతుల్ని తుడిచిపెట్టాం. ఈరోజు వారి నామరూపాలు ఎక్కడైనా నీకు కన్పిస్తున్నాయా? లేక వారి అవశేషాలకు సంబంధించిన చిన్న శబ్దమైనా నీకు విన్పిస్తుందా? (97-98)