కురాన్ భావామృతం/యాసీన్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

36. యాసీన్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 83)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
యా-సీన్‌. వివేకంతో కూడిన ఖుర్‌ఆన్‌ సాక్షి! నీవు నిస్సందేంగా దైవప్రవక్తవే; సన్మార్గంలో ఉన్నావు. నీవు ఒక జాతిని హెచ్చరించడానికి మహాశక్తిమంతుడు, అమిత దయామయుడైన దేవుడు పంపిన గ్రంథం ఇది. ఆ జాతిప్రజల తాతముత్తాతల్ని లోగడ హెచ్చరించడం జరగలేదు. అంచేత వారు ఏమరుపాటుకు లోనైఉన్నారు. (1-6)
వారిలో చాలామంది గురించి (దైవ) నిర్ణయం జరిగిపోయింది. అందువల్లనే వారు (సత్యాన్ని) విశ్వసించడంలేదు. మేము వారి మెడలకు (కన్పించని) గుదిబండలు కట్టివేశాం. అవి వారి గడ్డాలదాకా బిగించబడ్డాయి. అందుకే వారు (గర్వపోతుల్లా) తలలు పైకెత్తి నిలబడ్డారు. మేము వారికి ముందు ఒకగోడ, వెనుక ఒకగోడ నిలబెట్టి. వారిని పూర్తిగా కప్పివేశాం. దాంతో వారికి ఏ (మంచి)విషయమూ తోచదు. కనుక నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించకపోయినా ఒకటే. వారు ఎన్నటికీ నమ్మరు. కరుణామయుని చూడకుండానే ఆయనకు భయపడి, సత్యోపదేశాన్ని అనుసరించేవాడ్ని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి గొప్పప్రతిఫలం లభిస్తుందని శుభవార్త అందజేయి. (7-11)
మేము తప్పకుండా ఒకరోజు మృతుల్ని బ్రతికిస్తాము. వారు చేస్తున్న కర్మలన్నిటినీ మేము నమోదుచేస్తున్నాం. వారు తమ వెనుక వదలిపెట్టిన చిహ్నాలను కూడా గ్రంథస్థం చేస్తున్నాం. ప్రతి విషయాన్నీ మేము స్పష్టమైన ఓ గ్రంథంలో నమోదుచేస్తున్నాం. ఉదా హరణకు దైవప్రవక్తలు వచ్చిన ఒక పట్టణానికి చెందిన ప్రజలగాధ విన్పించు వారికి. మేమా పట్టణప్రజల దగ్గరకు ఇద్దరు ప్రవక్తలను పంపాము. వారా ఇద్దరినీ తిరస్క రించారు. తర్వాత ఆ ఇద్దరికి మద్దతుగా మేము మరోప్రవక్తను పంపాము. ఆ ముగ్గురు “మేము మీ దగ్గరకు దైవప్రవక్తలుగా పంపబడ్డాం” అన్నారు. (12-14)
దానికి వారు “మీరు మాలాంటి మానవమాత్రులే తప్ప మరేమీ కాదు. కరుణా మయుడైన దేవుడు ఏదీ పంపలేదు. మీరు చెబుతున్నదంతా బూటకం” అన్నారు. (15)
“మా ప్రభువుకు తెలుసు. మేము నిజంగానే దైవప్రవక్తలుగా నియమితులై మీ దగ్గరకు పంపబడ్డాం. ఎలాంటి అరమరికలు లేకుండా దైవసందేశం అందజేయడమే మాపని. అంతకుమించి మరో బాధ్యత మాపై లేదు” అన్నారు దైవప్రవక్తలు. (16-17)
“మేము మిమ్మల్ని మా పాలిట అపశకునంగా భావిస్తున్నాము. మీరు గనక (ఈ ప్రచారం) మానుకోకపోతే మేము మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తాం. మా నుండి మీరు దుర్భర శిక్ష చవిచూడవలసి వస్తుంది” అన్నారు పట్టణవాసులు బెదిరిస్తూ. (18)
“మీ అపశకునం మిమ్మల్నే చుట్టుకొనిఉంది. మేము మీకు హితబోధచేస్తున్నామ నేనా మీరీ మాటలు అంటున్నది? మీరసలు హద్దుమీరిపోయారు” అన్నారు ప్రవక్తలు#
అంతలో దూరాన పట్నంలో ఓ మూల నుండి ఒకతను పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: “నా జాతిప్రజలారా! దైవప్రవక్తల మాట విని వారిని అనుసరించండి. మీ నుండి ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించని ఈ సన్మార్గగాముల్ని అనుసరించండి. నన్ను సృష్టించినవాడ్ని నేనెందుకు ఆరాధించను? మీరంతా చివరికి ఆయన దగ్గరికే మరలి పోవలసి ఉంది. అలాంటి దేవుడ్ని వదలి నేను ఇతరుల్ని దైవాలుగా చేసుకోవాలా? కరుణామయుడైన ఆ దేవుడు నాకేదైనా నష్టం కలిగించదలిస్తే ఈ దైవాల సిఫారసు నాకేమాత్రం పనికి రాదు. దేవుని పట్టునుండి అవి నన్ను విడిపించలేవు. ఒకవేళ నేనలా చేస్తే నేను పూర్తిగా దారి తప్పినట్లే. నేను మటుకు మీ ప్రభువును విశ్వసిస్తున్నాను. మీరు కూడా నామాట వినండి.” (19-25)
(చివరికి వారు అతడ్ని అన్యాయంగా చంపి పొట్టన పెట్టుకున్నారు. అప్పుడతనికి) “స్వర్గంలో ప్రవేశించు” అని చెప్పారు (దైవదూతలు). ఆ సందర్భంలో అతను “నా ప్రభువు ఏవిషయం కారణంగా నా పాపాలు మన్నించి నన్ను గౌరవనీయులలో చేర్చాడో నాజాతి ప్రజలకు తెలిస్తే ఎంతబాగుండు!” అని అన్నాడు. ఆ తర్వాత మేమతని జాతిపై ఆకాశం నుండి ఎలాంటి సైన్యం దించలేదు. సైన్యాన్ని దించే అవసరం లేదు మాకు. ఒకేఒక విస్ఫోటం! అంతే, తృటిలో వారంతా ఆరి (నాశనమై) పోయారు.
దాసుల స్థితి ఎంత శోచనీయం! వారి దగ్గరికి ఏ ప్రవక్త వచ్చినా అతడ్ని వారు హేళన చేస్తారు. గతంలో మేము (తిరస్కార వైఖరి అవలంబించిన) ఎన్ని జాతులను నాశనం చేశామో వీరికి తెలియదా? ఆ తరువాత వారు మరెన్నడూ వీరి దగ్గరకు తిరిగి రాలేదు. చివరికి అందరూ ఒకరోజు మా సన్నిధికి చేరుకోవలసి ఉంది. (26-32)
వీరికోసం మృతభూమి ఒక సూచన. మేము దానికి (వర్షం ద్వారా) జీవంపోసి, అందులో నుంచి ధాన్యం (పండించి) తీస్తున్నాం. దాన్ని వీరు తింటున్నారు. అందులో మేము ఖర్జూరం, ద్రాక్షపండ్లు పండించాము. కాలువలు కూడా ప్రవహింపజేశాము. ఆ తోటల పండ్లు కూడా వీరు తింటున్నారు. ఇదంతా వారు తమ స్వహస్తాలతో పుట్టించ లేదు. మరి వీరు (మాకు) కృతజ్ఞతలు ఎందుకు అర్పించరు? అన్ని రకాల జంటలను సృష్టించిన దేవుడు పరమ పవిత్రుడు. ఆ జంటలు భూమి మీది వృక్షజాతికి సంబంధిం చినవైనా, స్వయంగా వీరి (మానవ) జాతికి సంబంధించినవైనా లేదా వీరికి తెలియని ఇతర వస్తువులకు సంబంధించినవైనా (అన్నిటినీ ఆయనే సృష్టించాడు). (33-36)
వారి కోసం మరొక సూచనగా రాత్రి ఉంది. మేము దాని పైనుండి పగటిని తొలగిస్తున్నాం. అప్పుడు వారిపై చీకటి ఆవరిస్తుంది. సూర్యుడు తన నిర్ణీత కక్ష్యలో సంచరిస్తున్నాడు. ఇది మహా శక్తిమంతుడు, అసాధారణ వివేకవంతుడయిన దేవుడు రూపొందించిన (అద్భుత) పథకం. (37-38)
చంద్రుని కోసం మేము మజిలీలు (చంద్రకళలు) నిర్ణయించాము. అతను వాటిని దాటుకుంటూ చివరికి ఎండిపోయిన ఖర్జూరపు మట్టలా మారిపోతాడు. చంద్రుని పట్టుకునే శక్తి సూర్యునిలో లేదు. అలాగే రాత్రి పగటిని దాటిపోలేదు. సమస్తం ఒక్కొక్క కక్ష్యలో (అంటే తమ తమ నిర్ణీత కక్ష్యల్లో) సంచరిస్తున్నాయి. (39-40)
వారికోసం మరొక సూచన కూడా ఉంది. మేము మానవజాతిని ఒక నిండునావ లో ఎక్కించాం. ఆ తర్వాత వారికోసం అలాంటి నావలనే (అనేకం) సృజించాం. వాటిలో ఎక్కి వీరు ప్రయాణం చేస్తున్నారు. మేము తలచుకుంటే వారిని (సముద్రంలో) ముంచి వేయగలం. ఆ తర్వాత వారి మొరాలకించే నాథుడే ఉండడు. ఏవిధంగానూ వారు ఈ గండం నుంచి గట్టెక్కలేరు. మా అనుగ్రహం మాత్రమే వారిని గట్టెక్కించి, ఒక నిర్ణీత కాలం వరకు ప్రాపంచిక ప్రయోజనాలు పొందే అవకాశమిస్తుంది. (41-44)
“మీముందు వస్తున్న పర్యవసానం నుండి, మీ వెనుక గతించిన దానినుండి తప్పించుకోండి, మీరు కరుణించబడతారు” అని చెప్పినప్పుడు వారు వినీ విననట్లు ఉండిపోతారు. తమ ప్రభువు నుండి తమ వద్దకు ఏదైనా సూక్తిగాని, సూచనగాని వచ్చి నప్పుడల్లా వారు ముఖం తిప్పుకుంటారు. (అలాగే) దేవుడు మీకు ప్రసాదించిన ఉపాధి నుండి దైవమార్గంలో కూడా వినియోగించండని అన్నప్పుడు సత్యతిరస్కారులు విశ్వ సించినవారితో “దేవుడు తలచుకుంటే వారిని పోషించగలడు కదా? అలాంటివారికి మేము తిండి పెట్టాలా? మీరు పూర్తిగా దారితప్పారు” అంటారు. (45-47)
“నీవు గనక సత్యవంతుడవైతే ప్రళయం గురించిన (నీ) బెదిరింపు ఎప్పుడు నెర వేరుతుందో చెప్పు”అని అడుగుతున్నారు వారు. వారసలు దేనికోసం ఎదురుచూస్తున్నారో అదొక విస్పోటం మాత్రమే. వారు (ప్రాపంచిక వ్యవహారాల్లో తలమునకలై) జగడమాడు కుంటున్న స్థితిలో అది హఠాత్తుగా వారిని చుట్టుముడ్తుంది. అప్పుడు వారు వీలునామా సైతం వ్రాయలేరు. అంతేకాదు, వారు తమ ఇండ్లకు కూడా చేరుకోలేరు. (48-50)
ఆ తర్వాత శంఖం ఊదబడుతుంది. దాంతో వారు తమప్రభువు ముందు హాజరు కావడానికి ఒక్కసారిగా తమ సమాధుల నుంచి లేచి బిలబిలా బయటికి వస్తారు. (పరిస్థితి అర్థంగాక) కంగారుపడుతూ “అరె! ఎవరు మనల్ని మన పడకల నుండి లేపారు?” అని అంటారు. (అప్పుడు) “కరుణామయుడయిన దేవుడు వాగ్దానం చేసిన విషయం ఇదే. (ఆనాడు) దైవప్రవక్తలు నిజమే చెప్పారు” (అని సమాధానం వస్తుంది). అది దిక్కులు పిక్కుటిల్లే ఒకేఒక భీకర గర్జన!! దాంతో యావన్మందీ మాముందు ప్రవేశ పెట్టబడతారు. “ఈరోజు మీకు ఎలాంటి అన్యాయం జరగదు. మీరు ఎలాంటి కర్మలు చేసుకున్నారో అలాంటి ప్రతిఫలమే లభిస్తుంది.” (51-54)
“ఈరోజు స్వర్గవాసులు సుఖసంతోషాలలో తేలియాడుతుంటారు. వారూ, వారి భార్యలు దట్టమైన నీడల క్రింద మెత్తటి ఆసనాలపై దిండ్లకానుకొని కూర్చొని ఉంటారు. వారికక్కడ తినడానికి, త్రాగడానికి కోరినవన్నీ లభిస్తాయి. వారు కోరిందల్లా మరుక్షణం సిద్ధం. కరుణామయుడైన ప్రభువు నుండి వారికి దీవెనలు లభిస్తుంటాయి.” (55-58)
“పాపాత్ములారా! ఈరోజు మీరు (మానుంచి) తొలగి దూరంగా ఉండండి... ఆదం సంతానమా! షైతాన్‌ని ఆరాధించవద్దని, వాడు మీకు బహిరంగశత్రువని నేను మిమ్మల్ని హెచ్చరించలేదా? నన్నే ఆరాధించాలని, అదే సన్మార్గమని ఉపదేశించలేదా? అయినా వాడు మీలో అత్యధికమందిని దారి తప్పించాడు. మీకా (మాత్రం) జ్ఞానం లేదా? నరక మంటే ఇదే. దీన్ని గురించే మిమ్మల్ని లోగడ హెచ్చరించడం జరిగింది. మీ అవిశ్వాస వైఖరికి పర్యవసానంగా ఈరోజు మీరు దీనికి సమిధలై పోండి.” (59-64)
“ఈరోజు మేము వీరి నోళ్ళను కట్టివేస్తున్నాము. వీరు ప్రపంచంలో ఏమేమి చేస్తుండేవారో వీరి చేతులు మాకు చెబుతాయి, వీరి కాళ్ళు సాక్ష్యమిస్తాయి.” (65)
మేము తలచుకుంటే వారి కళ్ళు పోగొట్టగలం. అప్పుడు వారు దారి కోసం తచ్చాడుతారు. కాని వారికి దారెలా కన్పిస్తుంది? మేము తలచుకుంటే వారిని నిల్చున్న చోటే స్తంభింపజేయగలం. దాంతో వారు ముందుకూ నడవలేరు; వెనక్కీ తిరగలేరు. మేము దీర్ఘాయుష్షు ఇచ్చినవారిని బలహీనంచేసి వారి రూపురేఖల్ని సమూలంగా మార్చి వేస్తున్నాం. (ఈ స్థితి చూసయినా) వారికి జ్ఞానోదయం కలగదా? (66-68)
మేమితనికి కవిత్వం నేర్పలేదు. కవిత్వం అతనికి శోభించదు. ఇదొక హితోపదేశం, స్పష్టమైన పఠనగ్రంథం. (జ్ఞానం, చైతన్యం కలిగి) సజీవంగా ఉండే ప్రతివ్యక్తినీ హెచ్చ రించడం, తిరస్కరించేవారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఏర్పరచడం దీని లక్ష్యాలు. (69-70)
మేము మా స్వహస్తాలతో సృజించినవాటిలో వారికోసం పశువులు పుట్టించాము. వారిప్పుడు ఈ పశువులకు యజమానులై పోయారు. వీటిని మేము వారి అదుపాజ్ఞల్లో ఉంచాం. అందువల్ల వారు వాటిలో కొన్నిటిపై (సులువుగా) ఎక్కి తిరగ్గలుగుతున్నారు. మరికొన్ని పశువుల మాంసం తింటున్నారు. వారికోసం ఈ పశువుల్లో అనేక ప్రయోజ నాలు, పానీయాలున్నాయి. అందుకు వీరు (మాకు) కృతజ్ఞతలు తెలపరా? (71-73)
వారు (నిజ)దేవుడయిన అల్లాహ్‌ను కాదని మిధ్యాదైవాలనే ఆరాధిస్తున్నారు. పైగా కష్టకాలంలో అవి తమను ఆదుకుంటాయని ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ దైవాలు వారిని ఏ విధంగానూ ఆదుకోలేవు. పైపెచ్చు వారే వాటి (రక్షణ) కోసం సైన్యాలుగా తయారైఉన్నారు. సరే, వారు కల్పించి ప్రచారం చేస్తున్న విషయాల పట్ల నీవు బాధ పడకు. వారి అంతర్‌బాహ్య విషయాలన్నీ మాకు బాగా తెలుసు. (74-76)
మేము మానవుడ్ని ఎలాంటి (క్షుద్ర) బిందువుతో పుట్టించామో అతనికి తెలియదా? (ఎందుకు తెలియదూ, తెలుసు.) అయినా అతడు పెద్ద జగడాలమారిగా తయార య్యాడు. పైగా మమ్మల్ని సృష్టితాలతో పోల్చుతున్నాడు. అతడు తన పుట్టుక సంగతి మరచి “పుచ్చిపోయిన ఈ ఎముకల్ని ఎవడు బ్రతికిస్తాడు?” అని ప్రశ్నిస్తున్నాడు. “వారిని మొదట్లో ఎవరు పుట్టించారో ఆయనే వారిని మళ్లీ బ్రతికిస్తాడు. ఆయనకు సృష్టికి సంబంధించిన ప్రతి విషయమూ తెలుసు” అని చెప్పు. (77-79)
ఆయనే మీకోసం పచ్చటివృక్షం నుంచి అగ్ని పుట్టించాడు. ఆ అగ్నితో మీరు పొయ్యి రాజేసుకుంటున్నారు. భూమ్యాకాశాల్ని సృష్టించగలిగినవాడు వారిలాంటి మానవుల్ని (మళ్ళీ) సృజించలేడా? ఎందుకు సృజించలేడు? ఆయన సృష్టినిర్మాణంలో ఆరితేరిన మహా సృష్టికర్త. ఆయన ఏదైనా చేయదలచుకుంటే ‘అయిపో’ అంటే చాలు, అది ఇట్టే తయారయి ఉనికిలోకి వస్తుంది. ప్రతి విషయంలోనూ సర్వాధికారాలు తన గుప్పెట్లో పెట్టుకున్న ఆ దేవుడు ఎంతో పవిత్రుడు. మీరంతా ఆయన దగ్గరికే మరలి పోవలసి ఉంది. (80-83)