కురాన్ భావామృతం/అల్-హుజూరాత్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

49. హుజురాత్‌ (నివాసగృహాలు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 18)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
విశ్వాసులారా! దేవుని సమక్షంలో, ఆయన ప్రవక్త సమక్షంలో మీరు మితిమీరి పోకండి. దేవునికి భయపడండి. దేవుడు సమస్తం వింటున్నాడు; సర్వం ఎరిగినవాడు.(1)
మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకున్నట్లు దైవప్రవక్త ముందు బిగ్గరగా మాట్లాడ కండి. (దీనివల్ల) మీరు చేసుకున్న సత్కర్మలు మీ ఆలోచనకు సైతం తట్టని విధంగా నిష్ఫలం కావచ్చు. దైవప్రవక్త ఎదుట (వినయంతో) కంఠస్వరం తగ్గించి మాట్లాడేవారే నిజమైన దైవభీతిపరులు. భయభక్తుల కోసం దేవుడు వారి హృదయాలు పరీక్షించి చూశాడు. వారికి మన్నింపు, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. (2-3)
ప్రవక్తా! (నీ) నివాసగృహాల బయటనుంచి నిన్ను కేకలు పెట్టి బిగ్గరగా పిలుస్తున్న వారిలో చాలామందికి బుద్ధిలేదు. నీవు బయటికి వచ్చేదాకా వారు ఓపిక పట్టివుంటే వారికి మేలైఉండేది. (సరే పోనివ్వు.) దేవుడు క్షమాశీలి, దయామయుడు. (4-5)
విశ్వాసులారా! మీ దగ్గరకు ఎవరైనా దుర్జనుడు ఏదైనా (ముఖ్య)సమాచారం తీసు కొస్తే దాన్ని ఓసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అలా చేయకుంటే మీరు ఏదైనా వర్గానికి పొరపాటున నష్టం కల్గించవచ్చు. ఆతర్వాత మీరు జరిగినదానికి విచారిస్తారు. అలాంటి పరిస్థితి రాకూడదు సుమా! జాగ్రత్త! మీమధ్య దైవప్రవక్త ఉన్నాడన్న సంగతి మరచి పోకండి. అనేక వ్యవహారాల్లో ఆయన మీమాట ఒప్పుకుంటే చివరికి మీరే ఇబ్బందుల్లో పడిపోతారు. దేవుడు మీ విశ్వాస వైఖరి పట్ల మీలో ప్రేమాభిమానాలు జనింపజేశాడు. దాన్ని మీ హృదయాలకు ప్రియమైన వస్తువుగా చేశాడు. అవిశ్వాసం, అవిధేయత, దుర్న డతల పట్ల మీకు ఏవగింపు కలిగించాడు. ఇలాంటివారే దేవుని అనుగ్రహం, ఔదార్యాల వల్ల సన్మార్గంలో ఉన్నారు. దేవుడు సర్వజ్ఞాని, మహా వివేకవంతుడు. (6-8)
విశ్వాసుల్లో రెండువర్గాలు పరస్పరం జగడానికి దిగితే వారిమధ్య రాజీ కుదర్చండి. ఒకవేళ (రాజీయత్నం విఫలమై) ఆ రెండువర్గాల్లో ఒక వర్గం రెండో వర్గంపై దౌర్జాన్యానికి పాల్పడితే, దౌర్జాన్యానికి పాల్పడిన వర్గం దేవుని ఆజ్ఞ వైపు మరలివచ్చే దాకా దానితో పోరాడండి. అది దేవుని ఆజ్ఞ వైపు మరలివస్తే వాటి మధ్య న్యాయంగా రాజీ కుదర్చండి. న్యాయం చేయండి, న్యాయం చేసేవారిని దేవుడు ప్రేమిస్తాడు. (9)
విశ్వాసులు పరస్పరం అన్నదమ్ముల్లాంటివారు. కనుక మీ అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు నెలకొల్పండి. దేవునికి భయపడండి, మీరు కరుణించబడతారు. (10)
విశ్వాసులారా! పురుషులు తోటిపురుషుల్ని హేళన చేయకూడదు. వీరికంటే వారే మంచివారై ఉండవచ్చు. అలాగే స్త్రీలు తోటిస్త్రీలను గేలి చేయకూడదు. వీరికంటే వారే మంచివారై ఉండవచ్చు. మీరు ఒకరి తప్పులు మరొకరు ఎత్తిచూపుకుంటూ పరస్పరం బురద చల్లుకోకండి. తప్పుడు పేర్లతో పిలుచుకోకండి. విశ్వాసభాగ్యం పొందిన తర్వాత చెడ్డపేరు తెచ్చుకోవడం చాలా తప్పు. ఈ వైఖరి మానుకోని వారే దుర్మార్గులు. (11)
విశ్వాసులారా! మితిమీరిన అనుమానాలకు పోకండి. కొన్ని అనుమానాలు (మీకు) పాపాలుగా పరిణమించవచ్చు. (ప్రజల) రహస్య విషయాల వెనుక పడకండి. మీలో ఎవరూ ఇతరుల్ని పరోక్షంగా నిందించకూడదు. మీలో ఎవరైనా మీ మృతసోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా? (ఇష్టపడరు.) చూశారా, మీరే దాన్ని అసహ్యించు కుంటారు. దేవునికి భయపడండి. దేవుడు ఎంతో క్షమాశీలి, దయామయుడు. (12)
మానవులారా! మేము మిమ్మల్ని ఒకే స్త్రీపురుష జంట నుండి పుట్టించాం. తర్వాత మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని విభిన్న జాతులుగా, తెగలుగా చేశాం. అయితే మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే దేవుని దృష్టిలో ఎక్కువ గౌరవ నీయుడు. దేవుడు సర్వజ్ఞాని, సమస్త విషయాలు తెలిసినవాడు. (13)
ఈ గ్రామీణులు తాము విశ్వసించామని చెప్పుకుంటారు. వారితో ఇలా అను: “మీరసలు (సత్యాన్ని)విశ్వసించలేదు. దానికిబదులు మేము లొంగిపోయామని చెప్పండి. మీ ఆంతర్యాలలో విశ్వాసం ఇంకా ప్రవేశించలేదు. మీరు దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులై మసలుకుంటే దేవుడు మీ కర్మఫలంలో ఎలాంటి కొరత చేయడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు.” దేవుడ్ని, ఆయన ప్రవక్తను మనస్పూర్తిగా విశ్వసించి, ఇకదానిపై ఎలాంటి అనుమానానికి ఆస్కారమివ్వకుండా దైవమార్గంలో ధన ప్రాణాలొడ్డి పోరాడేవారే నిజమైన విశ్వాసులు. వారే సత్యవంతులు. (14-15)
ప్రవక్తా! (విశ్వసించామని చెప్పుకుంటున్న) వారికి చెప్పు: “మీరు దేవునికే ఆయన ధర్మం గురించి నేర్పుతున్నారా? ఆయన భూమ్యాకాశాల్లోని సమస్త విషయాలు ఎరిగిన వాడు. ప్రతి వస్తువుకు, ప్రతి విషయానికి సంబంధించిన పరిజ్ఞానం ఆయనకుంది. వీరు ఇస్లాం స్వీకరించి నీకేదో ఉపకారం చేసినట్లు మాట్లాడుతున్నారు. వారికి చెప్పు: “మీ ఇస్లాం స్వీకరణకు సంబంధించిన ఉపకారం నామీద పెట్టకండి. దేవుడే మీకు ఇస్లాం స్వీకారభాగ్యం ప్రసాదించి ఎంతో మేలు చేశాడు; మీరు నిజమైన విశ్వాసు లైతే (మీ ఉపకారి ఎవరో మీకే తెలుస్తుంది).” భూమ్యాకాశాల్లోని నిగూఢ విషయాలన్నీ దేవునికే తెలుసు. మీరు చేస్తున్న ప్రతిపనీ ఆయన దృష్టిపథంలో ఉంది. (16-18)