కురాన్ భావామృతం/అత్-తలాఖ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

65. తలాఖ్‌ (విడాకులు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 11)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ప్రవక్తా! “మీరు మీ స్త్రీలకు విడాకులివ్వదలిస్తే వారి గడువు (ఆరంభం)లో వారికి విడాకులివ్వండి. గడువుకాలం సరిగ్గా లెక్కపెట్టండి. మీ ప్రభువయిన దేవునికి భయ పడుతూ వ్యవహరించండి. (గడువు కాలంలో) వారు స్పష్టంగా ఏదైనా చెడ్డపని చేస్తే తప్ప వారిని (మీ) ఇండ్ల నుంచి పంపివేయకండి. వారు కూడా ఇల్లు వదలి వెళ్ళిపో కూడదు. ఇవి దేవుడు నిర్ణయించిన హద్దులు. దేవుడు నిర్ణయించిన హద్దులు అతిక్ర మించేవాడు ఆత్మవంచనకు పాల్పడినవాడవుతాడు.
ఆ తరువాత దేవుడు బహుశా ఏదైనా అనుకూల వాతావరణం సృజించవచ్చు. మీకా విషయం తెలియదు. వారి గడువు కాలం ముగిసే సమయం ఆసన్నమైనప్పుడు వారిని (వేధించకుండా) మంచి పద్ధతితో (వివాహబంధంలో) ఆపి ఉంచండి, లేదా (విడాకులిచ్చి పంపివేయడం తప్పదనుకుంటే తగాదాలేమీ లేకుండా) మంచిగా వారి నుండి విడిపోండి. (అప్పడు) మీలో న్యాయం పాటించే ఇద్దరు వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోండి. (వారు) దేవుని కోసం ఉన్నదిఉన్నట్లు సరిగ్గా సాక్ష్యమివ్వాలి.
దేవుడ్ని, అంతిమదినాన్ని విశ్వసించినవారికి ఈమాటల ద్వారా ఉపదేశం చేయ బడుతోంది. దేవునికి భయపడుతుండేవాడికి దేవుడు కష్టాలనుంచి బయటపడే దారి చూపుతాడు. (ఒకవేళ ఆర్థిక ఇబ్బందులుంటే) అతనికి దేవుడు అతని ఊహ సైతం పోని దిశ నుండి ఉపాధినిస్తాడు. దేవుడ్ని నమ్ముకునేవాడికి దేవుడే చాలు. దేవుడు తన పని తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన ప్రతిదానికీ ఓలెక్క నిర్ణయించిపెట్టాడు. (1-3)
మీ స్త్రీలలో ఎవరైనా రుతుస్రావం పట్ల నిరాశచెందిఉంటే, వారి (గడువు నిర్ణ యించే విషయంలో) మీకేదైనా అనుమానం కలిగినప్పుడు వారి గడువు మూడు నెలలు (అని తెలుసుకోండి). ఈఆజ్ఞ రుతుస్రావం ఆరంభంకాని వారిక్కూడా వర్తిస్తుంది. ఇక గర్భవతుల విషయానికివస్తే, వారి గడువుకాలం వారు ప్రసవించేదాకా ఉంటుంది. దేవుడు తనకు భయపడేవారికి తగిన సౌలభ్యం కలిగిస్తాడు. ఇది దేవుని ఆజ్ఞ. దాన్ని ఆయన మీ దగ్గరికి అవతరింపజేశాడు. ఎవరు దేవునికి భయపడతాడో దేవుడు అతని లోని చెడులు తొలగించి అతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాడు. (4-5)
(గడువు కాలంలో) వారిని మీరు నివసించే చోటనే ఉంచండి. ఆచోటు ఎలాంటి దైనా పరవాలేదు. వారిపై వత్తిడి తేవడానికి (పొమ్మనలేక పొగ పెట్టినట్లు) వారిని వేధించకండి. వారు గర్భవతులయి ఉంటే ప్రసవించే వరకు వారి (పోషణ తదితర అవసరాల) కోసం ఖర్చుపెట్టండి. ఆ తర్వాత వారు మీకోసం (బిడ్డకు) పాలు పట్టవలసి వస్తే, అందుకు వారికి ప్రతిఫలం ముట్టజెప్పండి.
మీరు పరస్పరం సంప్రదించుకొని ఉభయులకు ఆమోదయోగ్యమయిన రీతిగా నిర్ణయం తీసుకోండి. ఒకవేళ (ప్రతిఫలం నిర్ణయంలో) మీరు ఒకరికొకరు ఇబ్బందులు కలిగించుకునే పరిస్థితి ఏర్పడితే మరెవరైనా స్త్రీ చేత బిడ్డకు పాలు పట్టించాలి. ధనికుడు తన ఆర్థిక స్తోమతను బట్టి ఈపోషణ ఖర్చులు భరించాలి. తక్కువ ఉపాధి ఇవ్వబడిన (పేద)వాడు దేవుడు తనకిచ్చిన దాన్నుంచే ఎంతోకొంత ఖర్చుపెట్టాలి. దేవుడు ఎవరికెంత ఇచ్చాడో అంతకుమించి వారిపై భారం మోపడు. దేవుడు మనిషికి లేమి తరువాత కలిమి కూడా ప్రసాదించవచ్చు. (6-7)
ఎన్నో జనపదాల్లోని జనం తమ ప్రభువాజ్ఞను, ఆయా ప్రవక్తల బోధనలను తిరస్క రించారు. అప్పుడు మేము వారిని కఠినంగా నిలదీసి తీవ్రంగా శిక్షించాం. (ఇలా) వారు తమ అకృత్యాల ఫలితం చవిచూశారు. వారి పర్యవసానమంతా నష్టమే నష్టం. దేవుడు వారికోసం ఘోరమైన శిక్ష సిద్ధపరచి ఉంచాడు. కనుక సత్యాన్ని విశ్వసించిన బుద్ధి మంతులారా! దేవునికి భయపడండి. దేవుడు మీ వద్దకు హితబోధ అవతరింపజేశాడు.
విశ్వసించి సత్కార్యాలు చేసే (ఉద్దేశ్యంకల) వారిని (అజ్ఞాన)చీకటి నుండి (జ్ఞాన) కాంతిలోకి తీసుకురావడానికి ఆయన మీకు స్పష్టమైన దైవసూక్తులు విన్పించే సందేశ హరుడ్ని కూడా పంపించాడు. సత్యాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని దేవుడు సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. అలాంటివారికి దేవుడు అత్యంత శ్రేష్ఠమైన ఉపాధి ప్రసాదిస్తాడు. (8-11)
ఆ దేవుడే ఏడు ఆకాశాలు సృష్టించాడు. అలాంటివే (మీ) భూమిని పోలినవాటిని కూడా సృష్టించాడు. వాటిపై (కూడా) ఆయన ఆజ్ఞలు అవతరిస్తూ ఉంటాయి. దేవుడు ప్రతి దానిపై అదుపు, అధికారంగల సమర్థుడు, సర్వశక్తిమంతుడని; ఆయన జ్ఞానం ప్రతి వస్తువునీ, ప్రతి విషయాన్నీ పరివేష్ఠించి ఉందని మీరు తెలుసుకోవడానికే (ఈ సంగతి మీకు తెలియ జేయబడుతోంది). (12)