కురాన్ భావామృతం/అన్-నబా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

78. నబా (సంచలనాత్మక వార్త)
(అవతరణ: మక్కా; సూక్తులు: 40)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
వారు ఏ విషయాన్ని గురించి చర్చించుకుంటున్నారు? తాము విభిన్న రకాలుగా అభిప్రాయపడుతున్న ఆ సంచలనాత్మక వార్తను గురించేనా? (వారనుకుంటున్నది) ఎంతమాత్రం (నిజం) కాదు. త్వరలోనే వారికి తెలుస్తుంది. ఔను, ఎంతమాత్రం (నిజం) కాదు. అతిత్వరలోనే వారికి తెలుస్తుంది. (1-5)
మేము భూమిని విశాలపరచి నివాసయోగ్యంగా రూపొందించలేదా? దానిపై పర్వతాలను మేకులుగా పాతలేదా? మిమ్మల్ని (స్త్రీపురుష) జంటలుగా సృష్టించలేదా? మీ నిద్రను సౌఖ్యసాధనంగా చేయలేదా? రాత్రిని విశ్రాంతి వేళగా, పగటిని జీవనోపాధి సమయంగా చేయలేదా? మీపైన దృఢమైన ఏడు ఆకాశాలు నిర్మించలేదా? వేడిని వెద జల్లే తేజోవంతమైన దీపాన్ని సృజించలేదా? ధాన్యం, కూరగాయలు, దట్టమైన తోటల పెరుగుదల కోసం మేఘాల నుండి ధారాపాత వర్షం కురిపించడం లేదా? (6-16)
తీర్పుదినం ఒక నిర్ణీత సమయం. (అది తన నిర్ణీత సమయంలో తప్పకుండా వస్తుంది) ఆరోజు శంఖం పూరించబడుతుంది. అప్పుడు మీరు (సమాధుల నుండి) గుంపులు గుంపులుగా వస్తారు. ఆకాశ ద్వారాలన్నీ తెరవబడతాయి. పర్వతాలు స్థాన భ్రంశం చెంది, తునాతనకలయి ఇసుక రేణువులుగా మారిపోతాయి. (17-20)
నిస్సందేహంగా నరకం మాటులాంటిది. తలబిరుసు ధిక్కారులకు నివాసమది. అందులో వారు యుగాల తరబడి పడివుంటారు. వారక్కడ చల్లదనంగాని, త్రాగడానికి తగిన పానీయంగాని చవిచూడలేరు. ఏదైనా దొరికితే అది సలసల కాగేనీరు, పరమ జుగుప్సాకరమైన చీము, నెత్తురు మాత్రమే. ఇదీ (వారికి లభించే) పూర్తి ప్రతిఫలం#
వారికి పరలోకవిచారణ పట్ల నమ్మకమే లేదు. మాసూక్తుల్ని అసత్య విషయాలుగా భావించి నిరాకరించారు. మేము మాత్రం ప్రతి విషయాన్నీ లెక్కగట్టి (వారి కర్మలచిట్టా లో నమోదుచేసి) ఉంచాము. “ఇక చవిచూడండి. మేము మీకు (నరక)యాతనలు తప్ప మరే విషయాన్నీ అధికం చేయము” (అని వారికి చెప్పబడుతుంది). (21-30)
దైవభీతిపరులకు వారి కోర్కెలునెరవేరే అద్భుతస్థానం ఉంది. మనోహరమైన ఉద్యానవనాలు, సుమధుర ద్రాక్షఫలాలు ఉన్నాయి. సమవయస్కులైన సుకన్యలు ఉన్నారు. మద్యంతో నిండిన మెరసిపోయే మధుపాత్రలున్నాయి.
వారక్కడ పనికిమాలిన మాటలు, అసత్యాలు వినరు. (ఇది) దయామయుడయిన నీ ప్రభువు నుండి వారికి లభించే ప్రతిఫలం. భూమ్యాకాశాలకు, వాటిమధ్య ఉన్న సమస్తానికి ప్రభువయిన దేవుని నుండి లభించే గొప్ప బహుమానం!
(ఆరోజు) ఆయన ముందు పెదవి విప్పడానికి కూడా ఎవరూ సాహసించలేరు. (31-37)
(పరిశుద్ధా)ఆత్మ, దైవదూతలు పంక్తులుతీరి ఎంతో వినమ్రులయి నిలబడతారు. అప్పుడు కరుణామయుని అనుమతితో సరైనమాట చెప్పేవారు తప్ప మరెవరూ ఆయన తో మాట్లాడటానికి సాహసించలేరు.
ఆరోజు రావడం తథ్యం. కనుక ఇష్టమున్నవారు తమ ప్రభువు వైపు మరలే మార్గం అవలంబించవచ్చు. (38-39)
మేము అతి సమీపంలోనే ఉన్న శిక్ష గురించి మిమ్మల్ని హెచ్చరించాము. మానవుడు తన చేజేతులా చేసుకొని ముందుగా పంపుకున్నదంతా ఆరోజు ప్రత్యక్షంగా చూసుకుంటాడు. అప్పుడు సత్యతిరస్కారి (తీవ్ర పశ్చాత్తాపంతో) “అయ్యో! నేను మట్టిలో మట్టయిపోయి ఉంటే ఎంత బాగుండేది!!” అని వాపోతాడు. (40)