Jump to content

కురాన్ భావామృతం/అల్-అన్ఫాల్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ


8. అన్ఫాల్‌ (సమరసొత్తు)
(అవతరణ: మదీనా; సూక్తులు: 75)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ముహమ్మద్‌ (స)! వారు నిన్ను సమరసొత్తు గురించి అడుగుతున్నారు. వారికిలా చెప్పు: ఈ సమరసొత్తు దేవునికి, ఆయన ప్రవక్తకు మాత్రమే చెందుతుంది. కనుక మీరు నిజమైన విశ్వాసులైతే దేవునికి భయపడి మీ పరస్పర సంబంధాలు మెరుగుపరచుకోండి; దేవునికి, ఆయన ప్రవక్తకు పూర్తిగా విధేయులయి మసలుకోండి. (1)
నిజమైన విశ్వాసుల హృదయాలు దేవుని ప్రస్తావన వస్తే చాలు కంపించిపోతాయి. వారి ముందు దేవుని సూక్తులు పఠిస్తుంటే వారి విశ్వాసం ద్విగుణీకృతమవుతుంది. వారు తమ ప్రభువు మీదే భారం వేస్తారు; ప్రార్థనా వ్యవస్థ స్థాపిస్తారు. మేము ప్రసాదించిన సంపద నుండి (దైవమార్గంలో కూడా) ఖర్చుపెడతారు. అలాంటివారే మా దృష్టిలో నిజమైన విశ్వాసులు. వారికోసం వారి ప్రభువు వద్ద హోదా, అంతస్తులున్నాయి; పాపాల మన్నింపు ఉంది; ఎంతో శ్రేష్ఠమైన ఉపాధి కూడా ఉంది. (2-4)
నీ ప్రభువు నిన్ను ఇంటినుండి (యుద్ధానికి) బయలుదేరతీసినప్పుడు, కొందరు విశ్వాసులకు ఇది నచ్చలేదు. విషయం స్పష్టంగా ఉన్నా నీతో వాదనకు దిగారు. పైగా తామేదో మృత్యుముఖంలోకి పంపబడుతున్నట్లు ఆందోళన చెందసాగారు. (5-6)
రెండు వర్గాలలో ఒకవర్గం మీకు చేజిక్కుతుందని దేవుడు మీకు వాగ్దానం చేశాడు. ఆ సందర్భం గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు మీరు (ఆయుధాలు లేని) బలహీన (వ్యాపార)వర్గం మీకు చిక్కితే బాగుంటుందని భావించసాగారు. కాని దేవుడు తన ఆదేశాలతో సత్యాన్ని సత్యంగా నిరూపించదలిచాడు. అంతేకాకుండా నేరస్థులకు ఎంత వెగటు అన్పించినా సత్యం సత్యంగా, అసత్యం అసత్యంగా రుజువుకావడానికి ఆయన అవిశ్వాసుల్ని పూర్తిగా తుడిచిపెట్టాలని కూడా సంకల్పించుకున్నాడు. (7-8)
మీరు మీ ప్రభువుని వేడుకుంటున్నప్పటి సందర్భం- దానికి సమాధానంగా ఆయన “నేను మీకు సహాయంగా ఒకరి తరువాత మరొకరు చొప్పున వేయిమంది దైవదూతల్ని పంపిస్తున్నాను” అని అన్నాడు. మీ మనస్సులు కుదుటపడేందుకు దేవుడు ఈ విషయాన్ని మీకు శుభవార్తగా తెలియజేశాడు. సహాయం ఎప్పుడు లభించినా, ఏ రూపంలో లభించినా అది దేవుని దగ్గర నుండే లభిస్తుంది. దేవుడు అత్యంత శక్తి మంతుడు, మహా వివేకవంతుడు. (9-10)
మీరు నిర్భయంగా, నిశ్చింతగా ఉండేందుకు దేవుడు మీపై ఒకవిధమైన మైకం ఆవహింపజేసినప్పటి సందర్భం: మీమీద షైతాన్‌ వేసిన మాలిన్యం తొలగించి మిమ్మల్ని పరిశుద్ధ పరచడానికి, మీలో ధైర్యసాహసాలు జనింపజేసి మీకాళ్ళకు స్థిరత్వం కలిగించ డానికి ఆయన ఆకాశం నుండి మీమీద వర్షం కురిపించాడు. నీప్రభువు తన దూతలకు ప్రత్యేక సూచనలు ఇచ్చినప్పటి సందర్భం- అప్పుడు వారితో ఆయన “నేను మీవెంట ఉంటాను. మీరు విశ్వాసుల్ని స్థిరంగా ఉంచండి. నేనూ అవిశ్వాసుల గుండెల్లో బెదురు పుట్టిస్తాను. మీరు వారి మెడలపై, కీళ్ళపై వ్రేటు వేస్తుండండి” అనిఅన్నాడు. (11-12)
కారణం- వారు దేవునిపై, ఆయన ప్రవక్తపై తిరగబడ్డారు. దేవునిపై, ఆయన ప్రవక్తపై తిరగబడినవారి పట్ల దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు- “ఇదే మీకు (ఇహలోకంలో) శిక్ష. ఇక దీన్ని చవిచూడండి. సత్యాన్ని తిరస్కరించేవారికి (పరలోకంలో) నరకశిక్ష పడుతుందన్న సంగతి తెలిసిందే.” (13-14)
విశ్వాసులారా! మీరు యుద్ధరంగంలో అవిశ్వాసుల్ని ఎదుర్కొంటున్నప్పుడు వారికి వెన్నుజూపి పారిపోకండి. అలా పారిపోయేవారు దైవాగ్రహానికి గురవుతారు. చివరికి వారి నివాసం నరకమవుతుంది. అది చాలా చెడ్డనివాసం. అయితే యుద్ధతంత్రంగాగాని, మరేదైనా సైనికదళాన్ని చేరుకునే ఉద్దేశ్యంతోగాని అలా చేస్తే తప్పు లేదు. (15-16)
నిజానికి వారిని వధించింది మీరు కాదు; దేవుడే వారిని వధించాడు. అలాగే వారిపై (ఇసుక మంత్రించి) విసిరేసింది నీవు కాదు; దేవుడే విసిరేశాడు. విశ్వాసుల్ని ఒక మంచి పరీక్ష నుండి విజయవంతంగా గట్టెక్కించడానికే దేవుడు ఈవిధంగా చేశాడు. దేవుడు సమస్తం వింటున్నాడు, సర్వం ఎరిగినవాడు. (17)
ఇది దేవుడు మీపట్ల వ్యవహరించిన తీరు. ఇక అవిశ్వాసులపట్ల- దేవుడు వారి పథకాలను పూర్తిగా వమ్ముచేశాడు. (వారికిలా చెప్పు:) “మీరు (మా)తీర్పు కోరుతుంటే ఇదిగో, తీర్పు మీ ముందుకొచ్చింది. కనుక ఇకనైనా తిరుగుబాటు ధోరణి మానుకోండి. అందులోనే మీ శ్రేయస్సుంది. దానికి బదులు మీరు అదే మూర్ఖత్వాన్ని మళ్ళీ ప్రదర్శిస్తే మేమూ అదే శిక్షను పునరావృతం చేస్తాం. మీ సంఖ్యాబలం ఎంత అధికంగా ఉన్నా అది మీకేమాత్రం ఉపయోగపడదు. దేవుడు విశ్వాసుల పక్షం ఉన్నాడు.”(18-19)
విశ్వాసులారా! దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి. ఆజ్ఞ విన్న తర్వాత దానికి విముఖులైపోకండి. మనస్ఫూర్తిగా వినకుండా ‘మేము విన్నాం’ అని పలికినవారి లా మీరు తయారవకండి. బుద్ధినుపయోగించని బధిరులు, మూగలు దేవుని దృష్టిలో పశువులకన్నా నికృష్టులు. వారిలో కాస్తయినా మంచితనముంటే దేవుడు వారికి (సత్యా న్ని) అర్థంచేసుకునే సద్బుద్ధి తప్పక ప్రసాదించేవాడు. మంచితనం లేదు గనకనే మంచి విషయం విన్పించినా వారు నిర్లక్ష్యంతో ముఖం తిప్పుకుంటున్నారు. (20-23)
విశ్వాసులారా! ప్రవక్త మీకు మంచి జీవితం ప్రసాదించే విషయం వైపు పిలిచి నప్పుడు మీరతని పిలుపునకు స్పందించి దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులైపోండి. వినండి, దేవుడు మనిషికి, అతని హృదయానికి మధ్యవుండి అతని అంతరంగంలో మెదిలే విషయాల్ని సైతం పసిగడ్తాడు. చివరికి మీరు ఆయన వైపుకే సమీకరించ బడతారు. మీలో పాపాలు చేసినవారికే పరిమితమైపోని ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దేవుడు అతి కఠినంగా శిక్షించేవాడని తెలుసుకోండి. (24-25)
మీరు చాలా అల్పసంఖ్యలో ఉన్నప్పటి పరిస్థితి గుర్తుచేసుకోండి. అప్పుడు మీరు దేశంలో చాలా బలహీనులుగా ఉండేవారు. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా అంతమొందిస్తారే మోనని మీరు భయపడుతుండేవారు. అలాంటి స్థితిలో దేవుడు మీకు మంచి ఆశ్రయం కల్పించాడు. ఆయన తన సహాయసహకారాలతో మీకు శక్తి, మంచిఉపాధి కూడా అనుగ్రహించాడు. మీరు కృతజ్ఞులై ఉంటారనే ఆయన ఇదంతా చేశాడు. (26)
విశ్వాసులారా! (వాస్తవం తెలిసి కూడా) మీరు దేవునికి, ఆయన ప్రవక్తకు ద్రోహం తలపెట్టకండి. మీకప్పగించబడే బాధ్యతల విషయంలో కూడా ద్రోహబుద్ధితో వ్యవహ రించకండి. మీ సంతానం, సిరిసంపదలు మీ పాలిట పరీక్షా సాధనాలని గుర్తుంచు కోండి. మీకోసం దేవుని దగ్గర ఇంతకంటే ఎంతో గొప్పప్రతిఫలం ఉంది. (27-28)
విశ్వాసులారా! మీరు గనక భయభక్తుల వైఖరి అవలంబిస్తే దేవుడు మీకు మంచీ చెడుల విచక్షణాజ్ఞానం ప్రసాదిస్తాడు; మీలో ఉన్న చెడుగులు తొలగిస్తాడు; మీ తప్పులు మన్నిస్తాడు. దేవుడు అపార దయామయుడు. (29)
ముహమ్మద్‌ (సల్లం)! సత్యతిరస్కారులు నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతుండిన సందర్భం గుర్తుకుతెచ్చుకో. వారు నిన్ను బంధించి ఉంచాలా, లేక హతమార్చివేయాలా, లేక దేశబహిష్కరణ చేయాలా అని రకరకాలుగా ఆలోచిస్తూ పన్నాగాలు పన్నసాగారు. ఆవిధంగా వారు పన్నాగాలు పన్నుతుంటే, దేవుడు కూడా (తనదైన రీతిలో) పన్నాగాలు పన్నుతుండే వాడు. దేవుడే అందరికంటే గొప్ప పన్నాగం పన్నేవాడు. (30)
వారికి మా సూక్తులు విన్పిస్తున్నప్పుడు “ఆ...విన్నాంలే. తలచుకుంటే మేము కూడా ఇలాంటి మాటలు సృష్టించగలం. ఇవి పూర్వం నుండీ జనం చెప్పుకుంటూ వస్తున్న పుక్కిటి పురాణాలే కదా! ఈనాడు కొత్తేముంది?” అని పలికేవారు. (31)
వారన్న మరోమాట కూడా గమనార్హమైనదే, “దేవా! ఇది నిజంగా సత్యధర్మం అయితే, నీదగ్గర్నుండే వచ్చినదైతే (మా తిరస్కారవైఖరికి) మాపై రాళ్ళవర్షం కురిపించు, లేదా మరేదైనా ఘోర ఉపద్రవం తెచ్చిపడెయ్యి” అని వారు ప్రార్థించారు. ఆ సమయం లో దేవుడు వారిపై శిక్ష(విపత్తు) తెచ్చి పడేసేవాడే. కాని నీవు వారి మధ్య ఉన్నావు. అదీగాక కొందరు ప్రజలు తమ పాపాల పట్ల పశ్చాత్తాపం చెంది దేవుడ్ని క్షమాపణ వేడు కుంటున్నారు. అలాంటివారిని శిక్షించడం దేవుని అభిమతం కాదు. (32-33)
అయితే (ఇప్పుడు పరిస్థితి మారింది). వారు ప్రతిష్ఠాలయానికి న్యాయసమ్మతమైన ధర్మకర్తలు కానప్పటికీ ప్రజల్ని అక్కడకు రానివ్వకుండా నిరోధిస్తున్నారు. అలాంటివారిని ఇప్పుడు ఎందుకు శిక్షించకూడదు? ప్రతిష్ఠాలయానికి న్యాయసమ్మతమైన ధర్మకర్తలు దైవభీతి పరాయణులే అవుతారు. కాని చాలామంది ఈవిషయాన్ని ఎరగరు. దేవాలయం లో ఈలలు వేయడం, చప్పట్లు కొట్టడం మినహా వారు చేసే ప్రార్థన మరేముంది? “కనుక మీ సత్యతిరస్కారానికి ప్రతిఫలంగా (మా)శిక్ష చవిచూడండి.” (34-35)
అవిశ్వాసులు (ప్రజల్ని) దైవమార్గం నుండి నిరోధించే కార్యకలాపాల కోసం తమ ధనాన్ని వెచ్చిస్తున్నారు. ఇకముందు కూడా మరింత వెచ్చిస్తారు. అయితే చివరికి ఈ (పైశాచిక) కార్యకలాపాలే వారి పశ్చాత్తాపానికి కారణమవుతాయి. ఆతర్వాత వారు మాకు లొంగిపోతారు. ఆపై ఈ అవిశ్వాసులు నరకం వైపు తోలబడతారు. పరిశుభ్రత నుండి మాలిన్యాన్ని వేరుచేసి, ఆ మాలిన్యాలన్నిటిని ఒకదానిపె ఒకటి కుప్పగాపోసి, ఆకుప్పను నరకంలో పడేయడానికే దేవుడిలా చేస్తున్నాడు. వారే నష్టపోయేవారు. (36-37)
ముహమ్మద్‌ (స)! సత్యతిరస్కారులకు ఇలా చెప్పెయ్యి: “ఇప్పటికైనా మీరు (మీ తిరుగుబాటు ధోరణి) మానుకుంటే గతంలో జరిగినదాన్ని క్షమించడం జరుగుతుంది.” ఒకవేళ వారు తమ పూర్వ వైఖరినే పునరావృతం చేస్తే మాత్రం, గతజాతులకు పట్టిన దుర్గతి అందరికీ తెలిసిందే. (అలాంటి దుర్గతే వారికీ పడ్తుంది). (38)
విశ్వాసులారా! అరాచకం పూర్తిగా సమసిపోయి సర్వత్రా దైవధర్మం నెలకొనేదాకా అవిశ్వాసులతో పోరాడండి. వారు తమ వైఖరి మార్చుకుంటే (ఇక వారి జోలికి పోకండి.) వారి వ్యవహారం దేవుడే చూసుకుంటాడు. మార్చుకోకపోతే మీ సంరక్షకుడు దేవుడేనని తెలుసుకోండి. ఆయన అందరికంటే మంచి సంరక్షకుడు, సహాయకుడు. (39-40)
మీకు లభించిన సమరసొత్తులో అయిదోవంతు దేవునికి, ఆయన ప్రవక్తకు, బంధువులకు, అనాధబాలలకు, నిరుపేదలకు, బాటసారులకు చెందినదని తెలుసు కోండి. మీరు దేవుడ్ని, (సత్యాసత్యాలను) వేరుచేసిన రోజు, అంటే రెండుసైన్యాలు పరస్పరం ఢీకొన్న రోజు మేము మా దాసునిపై అవతరింపజేసినదాన్ని విశ్వసించిన వారైతే (ఈ అయిదోవంతు సమరసొత్తు సంతోషంగా ఇచ్చేయండి). దేవుడు ప్రతి దానిపై అదుపు, అధికారం గల సర్వసమర్థుడు. (41)
లోయకు ఒకవైపున మీరు, రెండోవైపున వారు, మీ వెనుకవైపు (తీరమైదానంలో) వర్తకబిడారాలు ఉన్న సందర్భం జ్ఞాపకం చేసుకోండి. మీకూ వారికీ మధ్య ముందుగానే చర్చలు జరిగివుంటే, మీరు నిర్ణీత స్థలానికి చేరుకోవడంలో తప్పకుండా తాత్సారం చేసేవారు. అయితే జరిగిందేదో దేవుడు తీసుకున్న నిర్ణయం అమల్లోకి రావడానికే జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం వధించబడవలసిన వాడు సహేతుకంగా స్పష్టమైన ప్రమాణంతో వధించబడ్డాడు. సజీవంగా ఉండవలసినవాడు కూడా సహేతుకంగా, స్పష్టమయిన ప్రమాణంతోనే సజీవంగా ఉన్నాడు. నిస్సందేహంగా దేవుడు సమస్తం వింటున్నాడు, సర్వం ఎరిగినవాడు. (42)
ముహమ్మద్‌ (స)! దేవుడు వారిని నీ కలలో తక్కువ సంఖ్యలో ఉన్నట్లు చూపిన సందర్భం గుర్తుకు తెచ్చుకో. ఆయన వారిని నీకు అధికసంఖ్యలో గనక చూపి ఉంటే మీరు తప్పకుండా ధైర్యం కోల్పోయి యుద్ధవ్యవహారంలో పరస్పరం పోట్లాడుకునేవారు. కాని దేవుడే మిమ్మల్ని ఆ వివాదం నుండి కాపాడాడు. ఆయన (మానవ) హృదయాల్లో మెదిలే రహస్య విషయాలు సైతం ఎరిగినవాడు. (43)
దేవుడు తలచుకున్న కార్యం నెరవేరవలసి ఉన్నందున యుద్ధసమయంలో కూడా ఆయన మీ కళ్ళకు శత్రువుల్ని, వారి కళ్ళకు మిమ్మల్ని తక్కువ సంఖ్యలో ఉన్నట్లు చూపించాడు. సమస్త వ్యవహారాలు చివరికి దేవుని వైపుకే చేరుకోవలసిఉంది. (44)
విశ్వాసులారా! మీరేదయినా వర్గాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు స్థిరంగా నిలబడి ధైర్యంగా పోరాడండి; దేవుడ్ని ఎక్కువగా స్మరిస్తూ ఉండండి; మీకు విజయం సిద్ధిస్తుంది. దేవునికి, ఆయన ప్రవక్తకు విధేయులైఉండండి. పరస్పరం కలహించుకోకండి. అలాచేస్తే మీలో ధైర్యం సన్నగిల్లి మీశక్తి నిర్వీర్యమైపోతుంది. సహనం, సంయమనాలతో వ్యవహ రించండి. సహనం వహించేవారికి దేవుడు తప్పకుండా తోడుగా ఉంటాడు. (45-46)
కొందరు అహంకారంతో విర్రవీగుతూ, పటాటోపం ప్రదరిస్తూ తమ ఇండ్ల నుండి (యుద్ధానికి) బయలుదేరుతారు. అలాంటి (అవిశ్వాసుల) వైఖరి మీరు ఎన్నటికీ అవ లంబించకండి. వారు (ప్రజలను) దైవమార్గం నుండి నిరోధిస్తుంటారు. వారి కార్యకలాపా లను దేవుడు ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు. (47)
వారి చేష్టల్ని షైతాన్‌ వారి కళ్ళకు అద్భుతమైన పనులుగా చేసి చూపిన సందర్భం గుర్తుకు తెచ్చుకో. అప్పుడు షైతాన్‌ వారితో “ఈరోజు మిమ్మల్నెవరూ జయించలేరు. నేను మీకు తోడున్నాను” అన్నాడు. అయితే రెండువర్గాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు వాడు గుండెలు బాదుకుంటూ పిక్కబలం కొద్దీ పారిపోయాడు. అలా పారిపోతూ “మీతో నాకెలాంటి సంబంధంలేదు. మీరు చూడలేనివాటిని నేను చూస్తున్నా. దేవుడంటే నాకు చాలాభయంగా ఉంది. ఆయన శిక్ష చాలా తీవ్రంగా, కఠినంగా ఉంటుంది” అన్నాడు#
కపటులు, హృదయాల్లో (అవిశ్వాస) జాడ్యమున్నవారు “వారి ధర్మం వారిని గర్వ పోతులుగా చేసింద”ని అంటున్నారు. అయితే దేవుని మీద భారం వేసేవారు దేవుడు అత్యంత శక్తిమంతుడు, అసామాన్య వివేకవంతుడని తెలుసుకోవాలి. (48-49)
దైవదూతలు అవిశ్వాసుల ప్రాణాలు తీస్తున్నప్పటి స్థితి నీవు చూస్తే బాగుండు! వారప్పుడు అవిశ్వాసుల ముఖాలపై, పిరుదులపై కొడుతూ “ఇక దహనయాతన చవి చూడండి. ఇది మీరు చేజేతులా కొని తెచ్చుకున్నదాని పర్యవసానమే. అంతేగాని దేవుడు తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాదు” అని అంటారు. (50-51)
ఫిరౌనీయులకు, వారికి పూర్వం గతించినవారికి ఏగతి పట్టిందో వీరికీ అదే గతి పడ్తుంది. వారు దేవుని సూక్తులు తిరస్కరించారు. దేవుడు వారిని వారి పాపాల ఫలితంగా శిక్షించాడు. దేవుడు అత్యంత శక్తిమంతుడు, కఠినంగా శిక్షించేవాడు. ఏ జాతి అయినా తన ఆచరణ తీరు మార్చుకోనంత వరకూ దేవుడు ఆ జాతికి ప్రసాదించిన మహాభాగ్యాన్ని ఎన్నటికీ మార్చివేయడు. ఇది దేవుని సంప్రదాయం. దేవుడు సమస్తం వినేవాడు, సర్వం ఎరిగినవాడు. (52-53)
ఫిరౌనీయులకు, వారికి పూర్వం గతించినవారికి ఏగతి పట్టిందో అది ఈ సంప్రదా యం ప్రకారమే పట్టింది. వారు తమ ప్రభువు సూక్తులు నిరాకరించారు. అప్పుడు మేము వారి పాపాలకు పర్యవసానంగా వారిని తుదముట్టించాము. ఫిరౌనీయులను మేము (నడి సముద్రంలో) ముంచివేశాము. వారంతా పరమ దుర్మార్గులు. (54)
దేవుని దృష్టిలో సత్యాన్ని నిరాకరించి దాన్నిక స్వీకరించని అవిశ్వాసులే యావత్తు సృష్టిలో అత్యంత నీచులు. వారిలో (ముఖ్యంగా) నీతో (స్నేహ)ఒప్పందం చేసుకొని, దైవభీతి కాస్తయినా లేకుండా దాన్ని మాటిమాటికి ఉల్లంఘించేవారున్నారు. వారు గనక యుద్ధంలో మీ ఎదుటికి వస్తే, వారి అడుగుజాడల్లో నడిచే ఇతరులు వారిని చూసి భీతావహులై పారిపోయేలా వారిని కఠినంగా శిక్షించండి. ఇలా ఒప్పందం అతిక్రమించే వారి పర్యవసానం చూసయినా వారికి కనువిప్పు కలుగుతుంది. (55-57)
ఏ జాతయినా మీరు చేసుకున్న ఒప్పందం ఎప్పుడైనా ఉల్లంఘిస్తుందని మీరు భయపడితే ఆ ఒప్పందాన్ని దాని ముందు విసరిపడేయండి. నమ్మకద్రోహం చేసినవారిని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. అవిశ్వాసులు (ఏదో చమత్కారంచేసి) తాము తప్పించు కున్నామని భావించరాదు. వారు మాపట్టు నుండి ఎన్నటికీ తప్పించుకోలేరు. (58-59)
మీరు అవిశ్వాసులతో పోరాడేందుకు కట్టివేసి (సిద్ధంగా ఉంచి)న గుర్రాలతో సహా వీలైనంత ఎక్కువ శక్తి సమకూర్చుకొని సర్వసన్నద్ధంగా ఉండండి. ఆవిధంగా మీరు మీకు, దేవునికి ఉమ్మడి శత్రువులైనవారి గుండెల్లో గుబులు పుట్టించండి. అలాగే మీకు తెలియని ఇతరుల హృదయాల్లో కూడా భయోత్పాతం సృష్టించండి. వారి సంగతి మీకు తెలియకపోయినా దేవునికి తెలుసు. మీరు దైవమార్గంలో ఖర్చు పెట్టినదానికి పూర్తి ప్రతి ఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. మీకే మాత్రం అన్యాయం జరగదు. (60)
ప్రవక్తా! శత్రువులు సంధి వైపు మొగ్గితే మీరు కూడా అందుకు సిద్ధపడండి. దేవుని మీద భారం వేయండి. ఆయనే అన్ని విషయాలు వినేవాడు, సర్వం ఎరిగినవాడు. ఒకవేళ వారు ద్రోహబుద్ధితో ఒప్పందం ఉల్లంఘిస్తే, మీకు దేవుడే చాలు. ఆయనే తన సహాయ సహకారాల ద్వారా, విశ్వాసుల ద్వారా నిన్ను సమర్థించాడు. (61-62)
ముఖ్యంగా ఆయన విశ్వాసుల హృదయాలను పరస్పరం కలిపి నీకు కొండంత ధైర్యాన్నిచ్చాడు. నీవు ప్రపంచంలోని సంపద మొత్తం ఖర్చుపెట్టినా వారి హృదయాలను కలపలేవు. వారి హృదయాలను కలిపేవాడు దేవుడు మాత్రమే. నిస్సందేహంగా ఆయన అపార శక్తిసంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. ప్రవక్తా! నిన్ను, నీ అనుచరులైన విశ్వాసుల్ని ఆదుకోవడానికి ఆ ఒక్క దేవుడే చాలు. (63-64)
ప్రవక్తా! విశ్వాసుల్ని యుద్ధానికి ప్రేరేపించు. మీలో ఇరవైమంది స్థిరంగా నిలబడే వారుంటే వారు రెండొందల మందిని జయించగలరు. అలాంటి యోధులు వందమంది ఉంటే వారు వేయిమంది సత్యతిరస్కారుల్ని జయించగలరు. దీనిక్కారణం సత్యతిర స్కారులకు అవగాహనా శక్తి కొరవడటమే. (65)
ప్రస్తుతం దేవుడు మీ భారం తేలికగా చేశాడు. మీలో ఇంకా బలహీనత ఉందని ఆయనకు తెలుసు. కనుక మీలో స్థిరంగా నిలబడేవారు వందమంది ఉంటే వారు రెండొందల మందిని, వేయిమంది ఉంటే రెండువేల మందిని దైవాజ్ఞతో జయించ గలరు. అయితే స్థిరంగా నిలబడి ధైర్యంగా పోరాడేవారికే దేవుడు తోడుగా ఉంటాడు#
దేశంలో శత్రువుల్ని పూర్తిగా అణచివేయనంత వరకు ఖైదీలను తన అధీనంలో ఉంచుకోవడం ఏ దైవప్రవక్తకూ శోభించదు. మీరు ప్రాపంచిక ప్రయోజనాలు ఆశిస్తు న్నారు. కాని దేవుని దృష్టిలో పరలోక ప్రయోజనాలే ఎంతో విలువైనవి. ఆయన అపార శక్తిసంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. దేవుడు (మీ అదృష్టంలో) ముందే రాసి ఉండకపోతే, మీరు (ఖైదీల విడుదల కోసం) తీసుకున్నదానికి (అంటే నష్టపరిహారానికి) ఆయన మిమ్మల్ని కఠినంగా శిక్షించే వాడు. సరే, మీరు పొందిన ధనాన్ని (నిస్సంకోచం గా) అనుభవించండి. అది ధర్మసమ్మతమైనది, పరిశుద్ధమైనది. దేవునికి భయపడుతూ ఉండండి. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (66-69)
ప్రవక్తా! నీఅధీనంలో ఉన్న ఖైదీలకు ఇలా చెప్పు: “మీ హృదయాల్లో మంచి అనేది ఉందని తెలిస్తే దేవుడు మీకు మీనుండి తీసుకోబడిన దానికంటే ఎన్నోరెట్లు (ఎక్కువగా) ప్రసాదిస్తాడు. పైగా మీపాపాలు క్షమిస్తాడు. దేవుడు క్షమించేవాడు, కరుణించేవాడు.
ఒకవేళ వారు నీకు నమ్మకద్రోహం తలపెట్ట జూస్తుంటే, ఇదివరకు కూడా వారు దేవునిపట్ల నమ్మకద్రోహంతో వ్యవహరించారు. కనుకనే శిక్షగా దేవుడు వారిని నీఅధీనం లోకి బందీలై వచ్చేలాచేశాడు. దేవుడు సర్వం ఎరిగినవాడు, ఎంతో వివేకవంతుడు.#
సత్యాన్ని స్వీకరించి (సత్యం కోసం స్వస్థలం వదలి) వలస పోవడంతో పాటు దైవ మార్గంలో ధనప్రాణాలొడ్డి (దుష్టశక్తులతో) పోరాడేవారు; వలస వచ్చినవారికి ఆశ్రయ మిచ్చి ఆదుకున్నవారు ఒకరికొకరు స్నేహితులు, శ్రేయోభిలాషులు. ఇక సత్యాన్ని విశ్వ సించిన తర్వాత వలస పోనివారు (మదీనాకు) వలస రానంతవరకు వారితో మీకు ఎలాంటి స్నేహసంబంధం లేదు. అయితే ధార్మిక వ్యవహారాల్లో సహాయం కోరితే మీరు తప్పక వారికి సహాయం చేయాలి. కాని మీతో ఒప్పందం కుదిరిన జాతికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేస్తున్నదంతా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. (70-72)
అవిశ్వాసులు ఒకరికొకరు సమర్థించుకొని సహకరించుకుంటున్నారు. మీరు (విశ్వాసులై ఉండి కూడా) పరస్పరం సహకరించుకోకపోతే లోకంలో అరాచకం ఏర్పడి పెద్ద అల్లకల్లోలం చెలరేగుతుంది. (73)
సత్యాన్ని విశ్వసించి, దైవమార్గంలో ఇల్లూ వాకిలి వదలి పోరాడేవారు, (వారికి) ఆశ్రయమిచ్చి సహాయసహాకారాలు అందజేసినవారు మాత్రమే నిజమైనవిశ్వాసులు. వారి పొరపాట్లు మన్నించబడతాయి. వారికి శ్రేష్ఠమైన ఉపాధి లభిస్తుంది. సత్యాన్ని ఆ తర్వాత విశ్వసించి, ఇల్లూవాకిలి వదలి (మదీనాకు) వలస వచ్చి, మీతో కలసి పోరాడేవారు కూడా మీవర్గానికే చెందుతారు. అయితే దైవగ్రంథం ప్రకారం రక్తసంబంధీకులే ఒకరి కొకరు ఎక్కువ హక్కుదారులు. దేవుడు ప్రతి విషయాన్నీ ఎరిగినవాడు.(74-75)