కురాన్ భావామృతం/అన్-నూర్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

24. నూర్‌ (జ్యోతి)
(అవతరణ: మదీనా; సూక్తులు: 64)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ఇదొక అధ్యాయం (సూరా). దీన్ని మేము అవతరింపజేశాం. ఈ అధ్యాయం(లోని ఆదేశాల)ను విధిగా పాటించాలని నిర్ణయించాం. మీరు గ్రహించడానికి ఇందులో మేము స్పష్టమైన హేతుబద్ధమైన సూక్తులు అవతరింపజేశాం. (1)
వ్యభిచారి, వ్యభిచారిణి- వీరిద్దరిలో ప్రతిఒక్కరినీ వందేసి కొరడాదెబ్బలు కొట్టండి. మీరు దేవుడ్ని, అంతిమదినాన్ని విశ్వసించినవారయితే దైవధర్మం విషయంలో వారి (శిక్ష) పట్ల మీరు ఏమాత్రం సానుభూతి వెలిబుచ్చకూడదు. వారిని శిక్షించేటప్పుడు కొందరు విశ్వాసులు దగ్గర ఉండాలి. (2)
ఒక వ్యభిచారి వ్యభిచారిణిని లేదా బహుదైవారాధకురాలిని తప్ప మరెవరినీ వివాహమాడరాదు. అలాగే ఒక వ్యభిచారిణి వ్యభిచారిని లేదా బహుదైవారాధకుడ్ని తప్ప మరెవరినీ పెండ్లాడకూడదు. విశ్వాసులకు ఇలాంటి వివాహం నిషేధించబడింది. (3)
శీలవతులైన స్త్రీలపై అపనింద మోపి, దానికి నలుగురు సాక్షులు తీసుకురాలేని వారిని ఎనభై కొరడాదెబ్బలు కొట్టండి. అలాంటి వ్యక్తులు చెప్పే సాక్ష్యాన్ని ఇక ఎన్నటికీ స్వీకరించకండి. వారసలు దుర్జనులు. ఐతే ఈ నిర్వాకం తర్వాత పశ్చాత్తాపంతో దైవాన్ని వేడుకొని తమ నడవడికను సరిదిద్దుకున్నవారు మాత్రం దుర్జనులుగా పరిగణించ బడరు. (వారి విషయంలో) దేవుడు క్షమాశీలి, దయామయుడు. (4-5)
ఇక భార్యలపై అపనింద మోపిన భర్తలు, దానికి తాము తప్ప మరెవరూ సాక్షులు లేని పక్షంలో (ఇలా చేయాలి:) వారిలో ఒకరు నాలుగు సార్లు దేవుని మీద ప్రమాణం చేసి తన ఆరోపణ నిజమేనని సాక్ష్యం చెప్పాలి. అయిదోసారి తన ఆరోపణ అబద్ధమైతే తనపై దేవుని అభిశాపం పడుగాక అని పలకాలి. (6-7)
అలాగే (నిందితురాలైన) స్త్రీ కూడా నాలుగు సార్లు దేవుని మీద ప్రమాణం చేసి అతని ఆరోపణ అబద్ధమని సాక్ష్యమివ్వాలి. ఐదో సారి, అతని ఆరోపణ నిజమైతే తనపై దైవాగ్రహం విరుచుకుపడుగాకని పలకాలి. ఇలా ఆమెకు శిక్ష తప్పుతుంది. (8-9)
మీమీద దేవుని కారుణ్యానుగ్రహాలు లేకపోయిఉంటే (మీరు చేసిన తప్పిదాల పట్ల) మీరు దేవుడ్ని క్షమించేవాడుగా, వివేచనాపరుడుగా చూడగలిగేవారు కాదు. (10)
ఈ అపవాదును మీలోనే ఒకవర్గం లేవదీసింది. (అయితే) దీన్ని మీరు చెడుగా భావించకండి. ఇది మీకు (ఒకందుకు)మంచిదే. ఇందులో ఎవరెంత పాత్ర వహించారో ఆమేరకు వారు పాపం మూటగట్టుకున్నట్లే. ఇందులో అత్యధిక బాధ్యత నెత్తిమీద వేసుకున్న ప్రధాన సూత్రధారికి కఠినాతికఠిన శిక్ష కాచుకొనిఉంది. (11)
ఈ నిందారోపణ వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు అనుమానానికి గురికా కుండా సహృదయంతో ఎందుకు ఉండలేదు? మీరు అప్పటికప్పుడు ‘ఇది నిరాధారమైన అపనింద’ అని ఎందుకు ఖండించలేదు? వారు (తమ ఆరోపణను నిరూపించుకోవ డానికి) నలుగురు సాక్షుల్ని ఎందుకు తీసుకురాలేదు? వారు సాక్ష్యం తీసుకురాలేదు, (తీసుకురాలేరు కూడా.) దేవుని దృష్టిలో వారే పచ్చి అబద్ధాలరాయుళ్ళు. (12-13)
మీమీద ఇహపరలోకాల్లో దేవుని అనుగ్రహం, ఆయన కరుణాకటాక్షాలే లేకపోయి వుంటే, మీరు ఏ (నిరాధారమైన) మాటల్లో పడిపోయారో వాటి పర్యవసానంగా మీపై ఘోరమైన విపత్తు వచ్చిపడేది. ఈ అసత్యారోపణ (ఎంతచెడ్డ విషయమో ఆలోచించండి. అది)మీలో ఒకరినుంచి మరొకరికి (కార్చిచ్చులా) వ్యాపిస్తూపోయింది. వాస్తవం ఏమిటో తెలియని మాట మీనోట వెలువడింది. మీరు దాన్ని సాధారణ విషయమని భావిస్తుండే వారు. కాని దేవుని దృష్టిలో ఇది చాలా తీవ్రమైన విషయం. (14-15)
ఈసంగతి వినగానే “ఇలాంటి మాటలు అనడం మనకు తగదు. దేవుడు పరి శుద్ధుడు. ఇది పచ్చిఅపనింద” అని మీరెందుకు అనలేదు? మీరు (నిజమైన) విశ్వాసు లైతే ఇకముందు ఎన్నటికీ ఇలాంటి చేష్టలకు పాల్పడకూడదని దేవుడు మీకు ఉప దేశిస్తున్నాడు. ఆయన సర్వం తెలిసినవాడు, ఎంతో వివేకవంతుడు. విశ్వాసులలో అశ్లీల విషయాలు వ్యాపించాలని కోరుకునేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకం లోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులవుతారు. (సమాజంపై అశ్లీలం ఎంత దుష్ప్రభావం వేస్తుందో) దేవునికి తెలుసు, మీకు తెలియదు. మీమీద దేవుని అనుగ్రహం, ఆయన కరుణాకటాక్షాలే గనక లేకపోయివుంటే మీరు దేవుడ్ని వాత్సల్యమూర్తిగా, దయామ యునిగా చూడగలిగేవారు కాదు. (16-20)
విశ్వాసులారా! షైతాన్‌ అడుగుజాడల్లో నడవకండి. వాడు తనను అనుసరించే వారికి (ఎల్లప్పుడూ) చెడు, అశ్లీలతలను గురించే దుర్బోధ చేస్తాడు. మీమీద దేవుని అనుగ్రహం, ఆయన కరుణా కటాక్షాలే గనక లేకపోతే మీలో ఏ ఒక్కడూ పరిశుద్ధుడు (పావనం) కాలేడు. అయితే దేవుడు తాను తలచిన వారిని పావనం చేస్తాడు. ఆయన సర్వం వినేవాడు, సమస్తం ఎరిగినవాడు. (21)
మీలో ఉదార స్వభావులు, (ఆర్థిక) స్తోమత కలిగినవారు (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, దైవమార్గంలో ఇల్లువాకిలి వదలి వలసవచ్చినవారికి సహాయం చేయంఅని ప్రమాణం చేయకూడదు. వారిని క్షమించాలి, ఉపేక్షించాలి. దేవుడు మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? దేవుడు ఎంతో క్షమా శీలి, అమిత దయామయుడు. శీలవతులైన అమాయక ముస్లిం మహిళలపై లేనిపోని అపనిందలు మోపేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ శాపగ్రస్తులవు తారు. వారికోసం కఠినాతి కఠిన శిక్ష కాచుకొని ఉంటుంది. (22-23)
ఇలా అపనిందలు మోపేవారు (తమకు వ్యతిరేకంగా) తమ నోళ్ళు, కాళ్ళు, చేతులే తమ అకృత్యాలను గురించి సాక్ష్యమిచ్చే రోజొకటి వస్తుందన్న సంగతి మరచి పోకూడదు. ఆరోజు దేవుడు వారి అర్హతనుబట్టి వారికి పూర్తి ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు తెలుస్తుంది వారికి దేవుడే సత్యమని, దేవుడే నిజాన్ని నిజంచేసి చూపేవాడని. (24-25)
అపవిత్ర పురుషులకు అపవిత్ర స్త్రీలు, అపవిత్ర స్త్రీలకు అపవిత్ర పురుషులే తగిన జంటలు. అలాగే పవిత్ర పురుషులకు పవిత్ర స్త్రీలు, పవిత్ర స్త్రీలకు పవిత్ర పురుషులు మాత్రమే యోగ్యులు. జనం చెప్పుకునే (తప్పుడు) మాటలకు అతీతంగా వారు పరి శుద్ధులు, పవిత్రులు. వారికోసం మన్నింపు, ఉదారమైన ఉపాధి ఉన్నాయి. (26)
విశ్వాసులారా! మీరు మీ ఇండ్లలోకి తప్ప ఇతరుల ఇండ్లలోకి వారి అనుమతి లేకుండా, వారికి సలాం చేయకుండా ప్రవేశించకండి. ఇది మీకెంతో మంచిపద్ధతి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని మేమిలా బోధిస్తున్నాం. ఆ సమయంలో అక్కడఎవరూ కన్పించకపోతే, అనుమతి లభించనంతవరకు మీరు లోపలికి ప్రవేశించకండి. ఒకవేళ మీకు (లోపల నుంచి) తిరిగి వెళ్ళిపోండని సమాధానం వస్తే మీరు వెళ్ళిపోండి. ఇది మీకెంతో శ్రేష్ఠమైన పద్ధతి. మీరు చేసే పనులన్నీ దేవునికి బాగా తెలుసు. (27-28)
అయితే ఎవరూ నివసించని ఇండ్లలో మీకు ప్రయోజనం చేకూర్చే వస్తువు ఏదైనా ఉంటే అలాంటి ఇండ్లలో (స్వేచ్ఛగా) ప్రవేశించవచ్చు. అందులో తప్పులేదు. మీరు దాస్తున్నదేమిటో, వ్యక్తపరుస్తున్నదేమిటో అంతా దేవునికి తెలుసు. (29)
ప్రవక్తా! విశ్వసించిన పురుషులు తమ చూపులు (పరస్త్రీలపై పడకుండా వేరే వైపు) మరల్చుకోవాలని, తమ మర్మావయవాలను కాపాడుకోవాలని వారికి చెప్పు. వారికిది చాలా శ్రేష్ఠమైన పద్ధతి. వారు చేసే పనులన్నీ దేవుడు గమనిస్తూనేఉంటాడు. (30)
(అలాగే) విశ్వసించిన స్త్రీలు తమ చూపులు (పరపురుషులపై పడకుండా వేరే వైపు) మరల్చుకోవాలని, తమ మర్మావయవాలు కాపాడుకోవాలని వారికి చెప్పు. అదీ గాక వారు తమ అలంకరణలను బయటికి కనబడనీయకూడదు. ఒకవేళ వాటంతటవే బయటపడితే తప్పులేదు. వారు తమ వక్షస్థలాలను ఓణీలతో కప్పుకోవాలి.
భర్తలు, తండ్రులు, భర్తల తండ్రులు, కన్నకొడుకులు, భర్తల కొడుకులు (అంటే సవతి కొడుకులు), అన్నదమ్ములు, అన్నదమ్ముల కొడుకులు, అక్కచెల్లెళ్ళ కొడుకులు, తమతో కలసిమెలసిఉండే సహచర స్త్రీలు, సొంతబానిసలు, తమ అధీనంలోని స్త్రీవాంఛ లేని పురుషులు, స్త్రీల ఆంతరంగిక విషయాలు తెలియని బాలురు- వీరి ఎదుట తప్ప ఇతరుల ముందు స్త్రీలు తమ అందచందాలు, అలంకరణలను బహిర్గతం చేయ కూడదు. ఇంకా తాము దాచిన అలంకరణల సంగతి ప్రజలకు తెలిసేలా వారు తమ కాళ్ళను నేలకేసి కొడ్తూ నడవకూడదు. విశ్వాసులారా! మీరంతా కలసి దేవుడ్ని క్షమాపణ కోరుకోండి. అప్పుడే మీరు కృతార్థులయ్యే అవకాశముంటుంది. (31)
మీలో భార్యవిహీనులుగా, భర్తవిహీనులుగా ఉన్నవారికి పెళ్ళిళ్ళు చేయండి. అలాగే మీ బానిసలలో యోగ్యులైనవారికి కూడా పెళ్ళిళ్ళు చేసేయండి. వారొకవేళ నిరుపేదలైతే దేవుడు తన అనుగ్రహంతో వారిని ధనికులుగా చేస్తాడు. దేవుడు సకల సాధన సంపన్నుడు, సమస్తం తెలిసినవాడు. (32)
పెళ్ళిచేసుకునే (ఆర్థిక) స్తోమత లేనివారు (అశ్లీల చేష్టలకు పాల్పడకుండా) దేవుడు తన అనుగ్రహంతో తమకు ఆర్థికస్తోమత చేకూర్చే వరకు ఆత్మనిగ్రహం పాటించాలి. మీ బానిసలలో ఎవరైనా స్వాతంత్య్ర ఒప్పందం గురించి మీకు విన్నవించుకుంటే, వారిలో మంచితనం ఉందని మీకు అన్పించినప్పుడు వారి విన్నపాన్ని అంగీకరించి ఒప్పందం చేసుకోండి. దేవుడు మీకు ప్రసాదించిన సంపదలో కొంతభాగం (బానిసత్వం నుండి విముక్తి పొందడానికి సహాయంగా) వారికి అందజేయండి.
మీ బానిసమహిళలు శీలవతులుగా ఉండదలచుకున్నప్పుడు, ప్రాపంచిక ప్రయోజ నాల కోసం వారిని మీరు బలవంతంగా పడుపువృత్తిలోకి దించకండి. వారిని ఎవరైనా బలవంతంగా అలా మార్చితే ఆ బలాత్కారం తరువాత వారి విషయంలో దేవుడు ఎంతో క్షమించేవాడు, కరుణించేవాడు (అవుతాడు). (33)
మేము మీదగ్గరికి స్పష్టమైన సూక్తులు అవతరింపజేశాం. మీకు పూర్వం గతించిన జాతుల గాధలు, దైవభీతిపరులకు ఉపయోగపడే హితోక్తులూ అవతరింపజేశాం. (34)
దేవుడు యావత్‌ భూమ్యాకాశాలకు జ్యోతి లాంటివాడు. ఆయన కాంతి (అపారం, అపురూపం. దాని)ని ఇలా పోల్చవచ్చు: ఒక గూటిలో వెలుగుతున్న దీపం ఉంది. ఆ దీపం ఓ అందమైన గాజుచిమ్నీ మధ్య ఉంది. ఆ గాజుచిమ్నీ ముత్యంలాంటి నక్షత్రంలా మెరిసిపోతుంది. ఆ దీపం ఆలివ్‌ చెట్టు నుండి తీసిన నూనెతో వెలుగుతుంది. ఆ చెట్టు ఉదయం నుండి సాయంత్రం వరకు నలువైపులా ఎండ తగిలే ప్రదేశంలో పెరిగే బహుళప్రయోజక వృక్షరాజం. దాని చమురు అత్యంత శ్రేష్ఠమయినది. అగ్నితో రాజేసినా రాజేయక పోయినా తనంతటతాను మండగల స్వయంజలన తైలం. వెలుగు మీద వెలుగు(తో కూడిన అద్భుతమైన కాంతిమయం ఆ దృశ్యం).
దేవుడు తానుకోరిన వారికి తన కాంతి వైపు దారి చూపుతాడు. ఆయన (ఇలాంటి) ఉదాహరణల ద్వారా మానవులకు విషయాన్ని వివరిస్తున్నాడు. ఆయన ప్రతి విషయం క్షుణ్ణంగా ఎరిగినవాడు. (35)
దేవుడు ఏ ఆలయాలను ఉద్ధరించి, అక్కడ తన పేరును స్మరిస్తుండాలని ఆదే శించాడో ఆ ఆలయాలలోనే (ఆయన చూపిన సన్మార్గం పొందేవారు) ఉంటారు. వారా ఆలయాలలో ఉదయం, సాయంత్రం ధ్యానంచేస్తూ ఎంతో నిష్ఠాగరిష్ఠులై ఉంటారు. దైవస్మరణ, నమాజ్‌స్థాపన, జకాత్‌ చెల్లింపు (వగైరా) విధుల నిర్వహణ నుండి (ఐహిక వ్యామోహం,) వ్యాపార వ్యవహారాలు వారిని ఎన్నటికీ విస్మరింపజేయలేవు.
వారు గుండెలు అదిరిపోయే, కనుగుడ్లు స్తంభించే ప్రళయదినం గురించి భయ పడతారు. దేవుడు తమ సత్కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వడంతో పాటు తన ప్రత్యేక అనుగ్రహంతో మరింతభాగ్యం ప్రసాదిస్తాడన్న ఆశతోనే (వారీ విధులన్నీ పాటిస్తుంటారు). దేవుడు తాను తలచిన వారికి అపరిమితంగా అనుగ్రహిస్తాడు. (36-38)
(ఇక) అవిశ్వాసుల కర్మలు ఎండమావుల్లా నిరుపయోగమవుతాయి. దప్పిక గొన్నవాడు ఎడారి మైదానంలో ఎండమావిని చూసి, అక్కడేదో జలాశయం ఉందని భావిస్తాడు. తీరా ఆ ప్రదేశానికి చేరుకుంటే అక్కడసలు నీరే ఉండదు. పైగా (తీవ్రమైన దాహంతో నాలుక పిడచగట్టుకుపోయి, కొనఊపిరితో కొట్టుమిట్టాడే స్థితిలో) అతనికక్కడ దేవుడు గుర్తుకొస్తాడు. (కాని) దేవుడు అతని లెక్క పూర్తిచేసి (దుష్కృతఫలం ఇవ్వడానికి) సిద్ధంగాఉంటాడు. (కర్మల)లెక్క చూడటానికి దేవునికి ఎంతోసేపు పట్టదు. (39)
లేదా అతని పరిస్థితిని ఈవిధంగా కూడా పోల్చవచ్చు: ఒక లోతైన సముద్రంలో అంతా చీకటిమయంగా ఉంటుంది. ఒక అలల పొరపై మరొక అలల పొర ఆవరించి ఉంటుంది. ఆపై (నింగిలో) కారుమేఘం; ఇలా అంధకారంపై అంధకారంతో (నలువైపులా) గాఢాంధకారం అలుముకొని ఉంటుంది. (అలాంటి కటిక చీకటిలో) ఎవరైనా చేయిజాపి చూడదలచుకుంటే ఆ చేయి కూడా అతనికి కానరాదు. దేవుడు ఎవరికి తన (జ్ఞాన) కాంతి ప్రసాదించడో అతనికి మరి ఎలాంటి కాంతీ లభించదు. (40)
భూమ్యాకాశాలో ఉఉన్న సమస్త చరాచరాలు, రెక్కలుజాపి ఎగిరే పక్షులు దేవుడ్ని ఎలా స్మరిస్తున్నాయో మీకు కన్పించడం లేదా? వాటిలో ప్రతిదానికీ తన ప్రార్థన, స్మర ణల పద్ధతి ఏమిటో తెలుసు. అవి చేస్తున్న పనులన్నీ దేవునికి తెలుసు. భూమ్యాకాశాల సామ్రాజ్యమంతా దేవునిదే. అందరూ ఆయన సన్నిధికే పోవలసి ఉంది. (41-42)
దేవుడు మేఘాలను మెల్లమెల్లగా ఎలా నడిపిస్తున్నాడో మీరు గమనించడం లేదా? తరువాత ఆయన ఆ మేఘాలను పరస్పరం కలిపేస్తాడు. ఆ తరువాత వాటిని పొరలు పొరలుగా చేసి ఓ పెద్ద మేఘమాలికను రూపొందిస్తాడు. ఆపై అందులో నుంచి వర్షం కురుస్తుంది. ఇదంతా మీరు చూస్తూనే ఉంటారు. ఆయన (నేల నుండి) పైకి ఉబికి వచ్చిన కొండల కారణంగా ఆకాశం నుండి వడగండ్లను కూడా కురిపిస్తాడు. తద్వారా ఆయన తాను తలచిన విధంగా కొందరికి నష్టం కలిగిస్తాడు; మరికొందరిని వాటి నుంచి కాపాడుతాడు. ఆ మేఘావృత నింగిలోని మెరుపు కళ్ళను మిరుమిట్లు గొలిపి దృష్టిని చెదరగొడ్తుంది. రేయింబవళ్ళ చక్రభ్రమణా నికి కూడా ఆయనే మూలకారకుడు. కళ్ళున్నవారికి ఇందులో కనువిప్పు కలిగించే గుణపాఠం ఉంది. (43-44)
దేవుడు ప్రతిప్రాణిని నీటితో సృజించాడు. వాటిలో కొన్ని పొట్టతో ప్రాకుతాయి. కొన్ని రెండుకాళ్ళతో, మరికొన్ని నాలుగుకాళ్ళతో నడుస్తాయి. దేవుడు తాను తలచిన దాన్ని సృజిస్తాడు. ఆయన ప్రతి పనీ చేయగల సమర్థుడు, సర్వశక్తిమంతుడు. మేము వాస్తవాన్ని స్పష్టంగా వివరించే సూక్తులు అవతరింపజేశాం. దేవుడు (వీటిద్వారా) తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. (45-46)
వారు (మీ దగ్గరికొచ్చినప్పుడు) తాము దేవుడ్ని, దైవప్రవక్తను విశ్వసించి విధేయు లైపోయామని అంటారు. కాని ఆ తరువాత వారిలో ఒకవర్గం (అవిధేయత చూపుతూ) ముఖం తిప్పుకుంటుంది. అలాంటివారు (నిజమైన)విశ్వాసులు కానేకాదు. వారి పరస్పర వివాదాలను పరిష్కరించే నిమిత్తం వారిని దేవుని వైపు, దైవప్రవక్త వైపు పిలిచినప్పుడు వారిలో కొందరు (నీ దగ్గరకు) రాకుండా ముఖం చాటేస్తారు. (47-48)
అయితే విషయం తమకు అనుకూలంగా ఉంటే మాత్రం వారు అతివినయం వొలకబోస్తూ ప్రవక్త దగ్గరికి వస్తారు. వారి హృదయానికేదైనా (కాపట్య) రోగం అంటు కుందా? లేక అనుమాన భూతం పట్టుకుందా? లేక దేవుడు, ఆయన ప్రవక్త తమకేదైనా అన్యాయం చేస్తారని వారు భయపడుతున్నారా? నిజానికి ఇవేవీ కావు. వారసలు స్వతహాగానే పరమ దుర్మార్గులు. నిజమైన విశ్వాసులైతే వారి వివాదాలను పరిష్కరించ డానికి దేవుని వైపు, ఆయన ప్రవక్త వైపు పిలిచినప్పుడు (వెంటనే) “మేము విన్నాం, విధేయులైపోయాం” అనాలి. అలాంటివారే సాఫల్యం చెందేవారు. దేవునికి, దైవప్రవక్తకు పూర్తిగా విధేయులయి, వారి ఆజ్ఞలను శిరసావహిస్తూ (ప్రతి వ్యవహారంలోనూ) దేవునికి భయపడుతూ ఉండేవారే ధన్యులు, కృతార్థులు. (49-52)
వీరు దేవునిపేరుతో గట్టి ప్రమాణాలు చేస్తూ “మీరు ఆజ్ఞపిస్తే మేము (వెంటనే) ఇండ్ల నుంచి బయలుదేరుతాం” అంటారు. వారికిలా చెప్పు: “(బూటకపు) ప్రమాణాలు చేయకండి. మీ విధేయతా గుట్టు మాకు తెలిసిపోయింది. మీ కార్యకలాపాలు దేవుడు గమనిస్తూనే ఉన్నాడు.” వారికి (ఈ సంగతి కూడా) చెప్పు: “దేవునికి, దైవప్రవక్తకు విధేయులై ఉండండి. ఒకవేళ మీరు (నిర్లక్ష్యంతో) ముఖం తిప్పుకుంటే గుర్తుంచుకోండి- ప్రవక్తపై మోపబడిన బాధ్యతకు ప్రవక్త బాధ్యుడవుతాడు. కాని మీపై ఉన్న బాధ్యతకు మీరే బాధ్యులవుతారు. కనుక ప్రవక్తకు విధేయులయితేనే మీరు సన్మార్గం పొందుతారు. ప్రవక్త బాధ్యత (దైవసందేశాన్ని) స్పష్టంగా అందజేయడమే.” (53-54)
మీ పూర్వీకులను దేవుడు ఏవిధంగా లోకంలో ఖలీఫా (దైవప్రతినిధి)గా చేశాడో అదేవిధంగా మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని కూడా ఖలీఫాగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అదీగాక వారికోసం తాను ఆమోదించిన ధర్మాన్ని వారు ఆచరించేందుకు పటిష్ఠమైన పునాదులపై నెలకొల్పుతానని, వారి (ప్రస్తుత) భయానక స్థితిని శాంతియుతంగా మారుస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు. అయితే వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు మరెవరినీ సాటి కల్పించకూడదు. ఆ (వాగ్దానం) తర్వాత ఎవరు తిరస్కారవైఖరి అవలంబిస్తారో వారే దుర్జనులు. (55)
విశ్వాసులారా! ప్రార్థనావ్యవస్థ నెలకొల్పండి. పేదల ఆర్థికహక్కు (జకాత్‌) నెర వేర్చండి. దైవప్రవక్త పట్ల విధేయత కలిగిఉండండి. అప్పుడే మీరు కటాక్షించబడతారని ఆశించగలరు. అవిశ్వాసులు ప్రపంచంలో దేవుని పట్టునుండి తప్పించుకో గలరని భావించకూడదు. వారి నివాసం నరకమవుతుంది. అది పరమ చెడ్డనివాసం. (56-57)
విశ్వాసులారా! మీ బానిసలు, ప్రాజ్ఞత వయస్సుకు చేరుకోని మీ బాలబాలికలు (పడగ్గదిలో) మీదగ్గరకు రావాలంటే వారు మూడు వేళల్లో మీ అనుమతి తీసుకోవాలి. అవి- ప్రాతఃకాల ప్రార్థనకు ముందు, మధ్యాహ్నం మీరు (విశ్రాంతికై) మీ పైఉడుపులు తీసివేసినప్పుడు, రాత్రివేళ ప్రార్థన తరువాత. ఈ మూడు వేళలు మీకోసం ఏకాంత సమయాలు. అవి గడచిపోయిన తర్వాత వారు మీ అనుమతి లేకుండా వస్తే అందులో మీతప్పు లేదు, వారి తప్పు కూడా లేదు. మీరు మాటిమాటికి ఒకరి దగ్గరకు మరొకరు రావలసిన అవసరముంటుంది. (అంచేత ఈఆజ్ఞ ఇవ్వబడింది.) ఈవిధంగా దేవుడు తన సూక్తులు మీకు విశదీకరిస్తున్నాడు. ఆయన సర్వం ఎరిగినవాడు, మహా వివేకవంతుడు. మీ పిల్లలు ప్రాజ్ఞత వయస్సుకు చేరుకున్న తర్వాత వారు తమ పెద్దల లాగే (ఏవేళైనా) అనుమతి తీసుకొని రావాలి. ఇలా దేవుడు తనసూక్తులు మీకు వివరిస్తున్నాడు. ఆయన సర్వం ఎరిగినవాడు, మహా వివేకవంతుడు. (58-59)
యౌవనదశ దాటిపోయి, పెళ్ళి ఆశలేని (వృద్ధ) మహిళలు తమ బురఖాలు తీసి వేస్తే తప్పు లేదు. కాకపోతే వారు అలంకరణ ప్రదర్శనకు పాల్పడని వారైఉండాలి. ఆ చేష్టలు కూడా మానేసి లజ్జావతులుగా మసలుకుంటే అది వారికెంతో శ్రేయస్కరం. దేవుడు సమస్తం వింటున్నాడు, సర్వం తెలిసినవాడు. (60)
అంధుడుగాని, కుంటివాడుగాని లేదా వ్యాధిగ్రస్తుడుగాని (ఎవరింట్లోనైనా ఏదైనా తింటే తప్పు లేదు.) మీరైనా సరే మీ ఇండ్లలోగాని, మీ తండ్రి, తాతల ఇండ్లలోగాని, మీ తల్లి- అమ్మమ్మ, నాయనమ్మల ఇండ్లలోగాని, మీ అన్నదమ్ముల ఇండ్లలోగాని, మీ అక్కచెల్లెళ్ళ ఇండ్లలోగాని, మీ బాబాయి, పెదనాన్నల ఇండ్లలోగాని, మీ మేనత్తల ఇండ్లలోగాని, మీ మేనమామల ఇండ్లలోగాని, మీ పిన్ని-పెద్దమ్మల ఇండ్లలోగాని, తాళపు చెవులు మీఅధీనంలో ఉన్న ఇండ్లలోగాని, లేదా మీ స్నేహితుల ఇండ్లలోగాని ఏదైనా తింటే తప్పు లేదు. అలాగే అందరూకలసి తిన్నా, వేర్వేరుగా తిన్నా తప్పులేదు. అయితే మీరు మీఇండ్లలో ప్రవేశించే ముందు ఇంట్లో ఉన్నవారికి సలాం చేయండి. ఇది దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం. ఎంతో శుభప్రదమైనది, పరిశుద్దమైనది. మీరు విషయాన్ని గ్రహించడానికి దేవుడిలా మీముందు తన సూక్తులు వివరిస్తున్నాడు. (61)
దేవుడ్ని, ఆయన ప్రవక్తను మనస్ఫూర్తిగా నమ్మినవారే (నిజమైన) విశ్వాసులు. ఎప్పుడైనా వారు ఏదైనా సామూహికకార్యంలో దైవప్రవక్త వెంట ఉంటే అతని అనుమతి లేకుండా (ఎక్కడికీ) వెళ్ళకూడదు. (ప్రవక్తా!) నీ అనుమతి తీసుకునేవారే దేవుడ్ని, దైవ ప్రవక్తను (చిత్తశుద్ధిగా) విశ్వసించేవారు. కనుక వారేదైనా పనికోసం (వెళ్ళిపోవడానికి) అనుమతి అడిగితే నీకిష్టమైన వారికి అనుమతి ఇవ్వచ్చు. అలాంటివారి పాపక్షమాపణ కోసం దేవుడ్ని ప్రార్థించు. దేవుడు గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (62)
ముస్లింలారా! దైవప్రవక్త పిలుపును మీరు ఒకరినొకర్ని పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో (ఏదో నెపంతో) చల్లగా జారుకునేవారెవరో దేవునికి బాగా తెలుసు. ఆయితే ప్రవక్త ఆజ్ఞల్ని ఉల్లంఘించేవారు తాము ఏదైనా ప్రమాదంలో చిక్కుబడతామే మోనని లేదా దుర్భరయాతనకు గురవుతామేమోనని తలచి భయపడాలి. (63)
వినండి! భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం దేవునికి చెందినదే. మీరు ఎలాంటి వైఖరి అవలంబించినా సరే అది దేవునికి తెలుసు. మీరు (మరణానంతరం) ఆయన సన్నధికి తిరిగి వచ్చినప్పుడు (లోగడ ప్రపంచంలో) మీరు ఏమేమి చేసివచ్చారో అంతా ఆయన మీకు తెలియజేస్తాడు. ఆయన సర్వం ఎరిగినవాడు. (64)