కురాన్ భావామృతం/అన్-నజ్మ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

53. నజ్మ్‌ (నక్షత్రం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 62)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
అస్తమిస్తున్న నక్షత్రం సాక్షి! మీ సహచరుడు (పొరపాటున కూడా) దారితప్ప లేదు, (కావాలని కూడా) పెడదారి పట్టలేదు. అతను తన మనోవాంఛలకు తలయొగ్గి మాట్లా డడు. ఇది అతని (హృదయఫలకం)పై అవతరింపజేయబడిన దివ్యావిష్కృతి. ఎంతో వివేకవంతుడైన ఓ మహాశక్తిమంతుడు అతనికీ విషయాలు నేర్పుతున్నాడు. (1-6)
అతను తూర్పుదిక్కున ఎగువ దిగ్మండలంపై ఉన్నప్పుడు ఇతను అతనికి ఎదురుగా నిలబడ్డాడు. తరువాత మరికాస్త దగ్గరగా వచ్చి శూన్యంలో నిల్చున్నాడు. ఇలా అతను రెండు ధనస్సులంత దూరాన లేక అంతకంటే కొంచెం తక్కువ దూరాన (వచ్చి) నిలబడ్డాడు. అప్పుడతను దైవదాసునికి అందజేయవలసిన దివ్యసందేశం అందజేశాడు. కళ్ళు చూసిన దానిలో హృదయం అసత్యాన్ని మిళితం చేయలేదు. ఇలా చర్మచక్షువు లతో చూసిన దాని విషయంలో మీరు ఇతనితో వాదిస్తున్నారా? (7-12)
ఇతను మరోసారి కూడా అతడ్ని (సప్తమాకాశంలో) ‘సిద్రతుల్‌ మున్తహా’ అనే దివ్య వృక్షరాజం దగ్గర చూశాడు. దాని దరిదాపులోనే నివాసయోగ్యమైన స్వర్గధామం ఉంది. ఆ సమయంలో ఆ వృక్షరాజంపై అనిర్వచనీయమైన అద్భుతమేదో ఆవరిస్తూ ఉండింది. అతని చూపులు వేరేవైపు మరలడంగాని, హద్దుమీరి ముందుకు పోవడంగాని జరగ లేదు. (ఈవిధంగా) అతను తన ప్రభువు (ప్రతిభ)కు సంబంధించిన గొప్ప నిదర్శనాలలో (అంటే మహిమలలో) కొన్నిటిని చూశాడు. (13-18)
ఇక మీరే చెప్పండి, ఎప్పుడైనా మీరు (మీ మిధ్యాదైవాలైన) లాత్‌, ఉజ్జా, మరో విగ్రహమైన మనాత్‌లను గురించి (ప్రశాంత మనస్సుతో) ఆలోచించారా? మీకు కొడుకులు, దేవునికైతే కూతుళ్ళా? ఇది చాలా దారుణమైన అక్రమవిభజన! (19-22)
నిజానికి ఇవి మీరు, మీ పూర్వీకులు పెట్టుకున్న కొన్ని పేర్లు తప్ప మరేమీ కాదు. వీటిని గురించి దేవుడు ఎలాంటి ప్రమాణం పంపలేదు. జనం కేవలం ఊహాజనిత విష యాల్ని అనుసరిస్తూ మనోవాంఛలకు బానిసలైపోయారు. వారి దగ్గరకు వారి ప్రభువు నుండి చక్కని హితోపదేశం వచ్చింది. (అయినా వారు అంధులయి అపమార్గంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.) మానవుడు తాను కోరుకున్నదే తనపాలిట సత్యం(ధర్మం) అవుతుందా? ఇహపర లోకాలు (అన్నీ) దేవుని అధీనంలోనే ఉన్నాయి. (23-25)
ఆకాశంలో అసంఖ్యాకమైన దైవదూతలున్నారు. కాని దేవుని అనుమతి, అభీష్టాలు లేకుండా వారు ఎవరి విషయంలోనూ ఎలాంటి సిఫారసు చేయలేరు. వారి సిఫారసు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పరలోకం మీద నమ్మకంలేనివారు దైవదూతలకు స్త్రీల పేర్లిచ్చి దేవతలుగా కొలుస్తున్నారు. నిజానికి దీన్ని గురించి వారి దగ్గర ఎలాంటి (ప్రామాణిక)జ్ఞానం లేదు. వారు కేవలం ఊహాజనిత విషయాలు పట్టుకు వ్రేలాడు తున్నారు. సత్యం సమక్షంలో ఊహాగానాలకు ఎలాంటి విలువలేదు. (26-28)
కనుక ప్రవక్తా! మా హితబోధకు విముఖులై ప్రాపంచిక జీవితమే సర్వస్వంగా భావి స్తున్నవాడ్ని గురించి పట్టించుకోకు; అతడ్ని అతని మానాన వదిలెయ్యి. వారి దగ్గరున్న జ్ఞానం అంతే. (వారిదృష్టి ఐహిక ప్రయోజనాలు దాటి ముందుకు పోదు.) ఎవరు సన్మార్గంలో ఉన్నారో, మరెవరు దారితప్పారో నీ ప్రభువుకు బాగా తెలుసు. (29-30)
భూమ్యాకాశాల్లోని అణువణువూ ఆయనకు చెందినదే. దేవుడు దుర్జనులకు వారి దుష్కార్యాలకుగాను ప్రతిఫలం ఇవ్వవలసి ఉంది. అలాగే చిన్న చిన్న పొరపాట్లు తప్ప ఘోరపాపాలు, స్పష్టమైన అశ్లీల చేష్టలు మానుకున్నవారికి సత్ఫలం కూడా ప్రసాదించ వలసిఉంది. నీప్రభువు గొప్ప క్షమాశీలి. దేవుడు మిమ్మల్ని నేల నుండి సృజించినప్పటి నుంచీ, మీరింకా మీ మాతృగర్భాల్లో పిండాలుగా ఉన్నప్పటి నుంచీ ఆయనకు మీ పరిస్థితి బాగాతెలుసు. కనుక మీరు ఆత్మశుద్ధిని గురించి గొప్పలు చెప్పుకోకండి. మీలో నిజమైన దైవభీతిపరుడెవరో ఆయనకు బాగాతెలుసు. (31-32)
ప్రవక్తా! దైవమార్గం తప్పి, కొంచెం మాత్రమే (ధనం) ఇచ్చి ఆగిపోయినవాడ్ని నీవు చూశావా? (పరలోక) వాస్తవికతను చూడటానికి అతని దగ్గర అగోచరజ్ఞానం ఉందా? మూసా గ్రంథంలో పేర్కొనబడిన విషయాలు అతనికి తెలియవా? నిజాయితీపరుడైన ఇబ్రాహీంకు ఇవ్వబడిన గ్రంథంలోని విషయాలు (కూడా) అతనికి తెలియవా? (అతనికి చెప్పు: పాప)భారం మోసేవాడెవడూ ఇతరుల (పాప)భారం మోయలేడు. (33-38)
మానవుడు దేనికోసం కృషిచేస్తాడో అదే అతనికి లభిస్తుంది. అతని కృషికి త్వర లోనే గుర్తింపు లభిస్తుంది. అతనికి దాని ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడుతుంది. (39-41)

  • చివరికి (మానవులంతా) నీ ప్రభువు సన్నిధికే మరలిపోవలసి ఉంది. (42)
  • (మిమ్మల్ని) ఆయనే నవ్విస్తున్నాడు; ఆయనే ఏడ్పిస్తున్నాడు. (43)
  • ఆయనే (మీ) జీవన్మరణాలకు మూలకారకుడు. (44)
  • ఆయనే కార్చబడే వీర్యబిందువుతో ఆడమగ జంటల్ని పుట్టిస్తున్నాడు. (ప్రళయ దినాన) పునర్జీవం ప్రసాదించడం కూడా ఆయన బాధ్యతే. (45-47)
  • ఆయనే ఐశ్వర్యం అనుగ్రహించేవాడు; ఆయనే దారిద్య్రం కల్గించేవాడు. (48)
  • ఆయనే దేదీప్యమానంగా వెలిగిపోతున్న (విశేష) నక్షత్రానికి ప్రభువు. (49)
  • ఆయనే తొలి ఆద్‌జాతిని తుదముట్టించాడు. సమూద్‌ జాతిని కూడా ఆయనే సమూలంగా తుడిచిపెట్టాడు, ఒక్కడూ మిగలకుండా. (50-51)
  • ఆయనే అంతకు పూర్వం నూహ్‌జాతిని కూడా నాశనం చేసినవాడు. కారణం వారు పరమదుర్మార్గులు, విద్రోహులయి పోవడమే. (52)
  • ఆయనే తల్లక్రిందులైన జనపదాలను ఎత్తి విసిరి పడవేశాడు. తరువాత వాటి మీద ఆవరించవలసినది ఆవరించింది. (53-54)

కనుక నీప్రభువు ప్రసాదించిన ఏవరాల్ని గురించి నీవు అనుమానంలో పడ్డావు?
ఇది పూర్వం వచ్చిన హెచ్చరికల్లోని ఒక హెచ్చరిక. రానున్న (ప్రళయ) ఘడియ అతి సమీపంలోనే ఉంది. దేవుడు తప్ప మరెవరూ దాన్ని ఆపలేరు. వీటిని గురించేనా మీరు ఆశ్చర్యపోతున్నారు! (పైగా) మీరు నవ్వుతున్నారా! (సత్యతిరస్కార దుష్పరిణా మాలు తలచుకొని) మీరు ఏడ్వడంలేదే!! అదీగాక అల్లరిచేసి వీటిని దాట వేయ జూస్తున్నారా? (ఇప్పటికైనా) దేవుని ముందు సాష్టాంగపడండి; ఆయన్నే ఆరాధించండి. (55-62)