కురాన్ భావామృతం/నూహ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

71. నూహ్‌
(అవతరణ: మక్కా; సూక్తులు: 28)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
మేము నూహ్‌ (ప్రవక్త)ను అతని జాతిప్రజల వద్దకు పంపి, వారిపై వ్యధాభరిత మైన శిక్ష వచ్చిపడక ముందే వారిని హెచ్చరించాలని ఆదేశించాం. (1)
(దాని ప్రకారం) అతను (తన జాతిప్రజల వద్దకెళ్ళి) ఇలా అన్నాడు: “నా జాతి ప్రజలారా! నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చినవాణ్ణి (దైవప్రవక్తను). కనుక (నామాట విని) దేవుడ్ని ఆరాధించండి. ఆయనకు భయపడండి. నాకు విధేయత చూపండి. (అప్పుడు) దేవుడు మీ పాపాలు మన్నించి ఒక నిర్ణీతకాలం వరకు మిమ్మల్ని క్షేమంగా ఉండనిస్తాడు. దేవుడు నిర్ణయించిన (శిక్షా) సమయం వచ్చినప్పుడు దాన్నెవరూ ఆపలేరు. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది!” (2-4)
(ఈవిధంగా నూహ్‌ ప్రవక్త అనేక సంవత్సరాలు ప్రజలకు హితబోధ చేసినా పెద్దగా ప్రయోజనం కన్పించలేదు. దాంతో) అతను దేవుడ్ని ఇలా మొరపెట్టుకున్నాడు:
“ప్రభూ! నేను నా జాతిప్రజల్ని (నీవైపు) రేయింబవళ్ళూ పిలిచాను. కాని నా పిలుపు వారి చెవికెక్కలేదు. వారు మరింత దూరంగా పారిపోతున్నారు. నీవు వారికి క్షమాభిక్ష పెట్టడానికి నేను వారిని పిలిచినప్పుడల్లా వారు చెవులలో వ్రేళ్ళు దూర్చుకునేవారు; వస్త్రంతో ముఖం కప్పుకునేవారు. మొండివైఖరి అవలంబించి గర్వపోతులయ్యారు. నేను బిగ్గరగా వారిని (దేవుని వైపు) పిలిచాను. తర్వాత బహిరంగంగా బోధచేశాను. ఆపై మెల్లిగా కూడా నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. నేను వారికి ఇలా బోధించాను-
‘మీ ప్రభువును క్షమాపణ కోరుకోండి. ఆయన గొప్ప క్షమాశీలి. ఆయన మీకోసం ఆకాశం నుండి వర్షం కురిపిస్తాడు. మీకు సంతానం సిరిసంపదలు అనుగ్రహిస్తాడు. మీకోసం తోటలు పండిస్తాడు; సెలయేరులు ప్రవహింపజేస్తాడు. ఏమైంది మీకు, దేవుని ఔన్నత్యాన్ని నమ్మరు? ఆయనే కదా మిమ్మల్ని వివిధ ఘట్టాలలో రూపొందించినవాడు.’
‘ఆయన ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలు సృష్టించాడు. అందులో చంద్రుడ్ని (చల్లటికాంతి వెదజల్లే) జ్యోతిలా చేశాడు. సూర్యుడ్ని (దేదీప్యమానమైన) దీపంగా సృజిం చాడు. ఇదంతా మీకు కన్పించడంలేదా?’ ‘దేవుడు మిమ్మల్ని నేలనుండి చిత్రవిచిత్రంగా మొలకెత్తించాడు. తర్వాత ఆయన మిమ్మల్ని అదే నేలలోకి తీసికెళ్తున్నాడు. చివరికి అందులో నుంచే మిమ్మల్ని బయటికి తీసి నిలబెడ్తాడు. మీరు ధరణిలో సువిశాల మార్గాలలో సంచరించడానికి ఆయన దాన్ని మీకోసం విశాలపరిచాడు.” (5-20)
నూహ్‌ ఇలా అన్నాడు: “ప్రభూ! వారు నామాటలు ధిక్కరించారు. సంతానం సిరి సంపదలతో మరింత (బరితెగించి) నష్టం కొనితెచ్చుకున్న ధనికులకే వారు విధేయు లయ్యారు. వారు (నామీద) పెద్ద కుట్రపన్నారు. వారు (మిధ్యాదైవాలనే పట్టుకువ్రేలా డుతూ) ‘మనం మన దైవాలను ఎన్నటికీ విడనాడకూడదు. వద్‌ని, సువాని వదలుకో కూడదు; యగూస్‌ని, యవూఫ్‌ని, నస్ర్‌ని కూడా మనం వదలుకోరాదు’ అని చెప్పు కున్నారు. ప్రభూ! ఇవి అనేక మందిని మార్గభ్రష్టత్వానికి గురిచేశాయి. నీవు కూడా ఈ దుర్మార్గులకు మార్గభ్రష్టత్వంలో తప్ప మరి దేనిలోనూ వృద్ధినివ్వకు.” (21-24)
(చివరికి) వారు తమ పాపాల కారణంగా (నీట) ముంచివేయబడ్డారు. (ఆ తరువాత) నరకాగ్నిలో విసరివేయబడ్డారు. ఇక వారిని దేవుని (పట్టు) నుండి ఏశక్తీ కాపాడలేకపోయింది. వారు ఎలాంటి సహాయం పొందలేకపోయారు. (25)
(ఆ సందర్భంలో) నూహ్‌ ఇలా అన్నాడు: “ప్రభూ! ఈ తిరస్కారులలో ఏ ఒక్కడ్నీ భూమండలంపై సజీవంగా వదలిపెట్టకు. నీవు గనక వీరిని వదిలేస్తే వీరు నీ దాసుల్ని దారి తప్పిస్తారు. వీరి సంతతి నుండి పుట్టే ప్రతివ్యక్తీ దుర్మార్గుడిగా, కరుడుగట్టిన తిరస్కారిగా మారుతాడు. ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రుల్ని, నాఇంట్లో విశ్వాసిగా ప్రవే శించిన ప్రతి మనిషినీ, విశ్వసించిన యావత్తు స్త్రీ పురుషుల్నీ క్షమించు. దుర్మార్గులకు మాత్రం వినాశంలో తప్ప మరెందులోనూ వృద్ధి కలిగించకు.” (26-28)