కురాన్ భావామృతం/అజ్-జుఖ్రుఫ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

43. జుఖ్రుఫ్‌ (బంగారు నగలు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 89)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
హా-మీమ్‌. విషయస్పష్టత కలిగిన ఈగ్రంథం సాక్షి! మీరు అర్థంచేసుకోవడానికి దీన్ని మేము అరబీభాషలో పఠనగ్రంథం (ఖుర్‌ఆన్‌)గా చేశాం. నిజానికిది మా దగ్గరున్న మూలగ్రంథంలోనిది. మాదృష్టిలో ఇది మహోన్నతమైనది, వివేచనాపూరితమైనది. (1-4)
మీరు హద్దుమీరిన వారైనంత మాత్రాన మేము విసుగుచెంది ఈ హితోపదేశాన్ని మీ దగ్గరకు పంపడం మానేస్తామనుకుంటున్నారా? గతజాతులలో కూడా మేము దైవ ప్రవక్తల్ని ప్రభవింపజేశాం. దైవప్రవక్త వారి దగ్గరకు రావడం, వారతడ్ని హేళన చేయక పోవడం అంటూ ఎన్నడూ జరగలేదు. వీరికంటే ఎంతో శక్తిమంతులైన వారిని మేము సర్వనాశనం చేశాం. గతజాతుల పతనగాధలే ఇందుకు తార్కాణాలు. (5-8)
భూమ్యాకాశాల్ని ఎవరు సృష్టించారని నీవు అడిగితే మహాశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుడే అని వారు తప్పకుండా అంటారు. మరి ఆయనే కదా మీకోసం ఈ భూమిని ఊయలగా చేసి, మీరు మీ గమ్యాలకు చేరుకోవడానికి అందులో దారులు ఏర్పరచినవాడు! ఆయనే ఒక నిర్ణీత పరిమాణంలో ఆకాశం నుండి వర్షం కురిపించి తద్వారా మృతభూమిని బ్రతికిస్తున్నాడు. అదేవిధంగా ఓరోజు మిమ్మల్ని కూడా బ్రతికించి భూమి నుండి బయటికి తీయడం జరుగుతుంది. (9-11)
ఆయనే యావత్తు (స్త్రీపురుష) జంటలను పుట్టించాడు. ఆయనే మీ ప్రయాణ సౌలభ్యం కోసం ఓడలు, జంతువులను సృజించాడు. కనుక వాటిని ఎక్కేటప్పుడు మీ ప్రభువు చేసినమేళ్ళను గుర్తుచేసుకుంటూ “మాకోసం వీటిని అదుపులో ఉంచిన దేవుడు ఎంతో పవిత్రుడు. మేము వీటిని అదుపులో పెట్టగల శక్తిమంతులం కాము. ఒకరోజు మేము మా ప్రభువు దగ్గరికి మరలిపోవలసి ఉంది” అని పలకండి. (12-14)
వీరు దేవుని దాసులలో కొందరిని ఆయనకు సంతానం అంటగట్టారు. మానవుడు నిజంగా పరమ కృతఘ్నుడు. దేవుడు తన సృష్టితాలలో కొందరిని తనకు కూతుళ్ళుగా ఎంచుకొని, మీకు మాత్రం కోరి కొడుకుల్ని ప్రసాదించాడా? (ఎంతఅపచారం?) అయితే వారు కరుణామయుడైన దేవునికి ఏ ఆడసంతానం అంటగట్టారో ఆ సంతానం గురిం చిన శుభవార్తే వారిలో ఎవరికైనా విన్పిస్తే అతను ముఖంమాడ్చుకొని పుట్టెడు దుఃఖంతో క్రుంగిపోతాడు. ఆభరణాలలో అల్లారుముద్దుగా పెరుగుతూ, వాదనలో తన అభిప్రా యాన్ని కూడా సరిగా వివరించలేని ఆడపిల్ల దేవుని వాటాలోకి వచ్చిందా? (15-18)
వీరు కరుణామయుని దాసులయిన దైవదూతల్ని స్త్రీలుగా పరిగణించారు. వారి శరీరాకృతి చూశారా వీరు? వీరి సాక్ష్యాన్ని మేము నమోదుచేస్తున్నాం. దాన్ని గురించి వీరు (మాముందు) సమాధానం ఇచ్చుకోవలసి ఉంటుంది. (19)
“దేవుడు తలచివుంటే మేము ఎన్నడూ వారిని పూజించేవారం కాదు” అంటారు వారు. ఈ వ్యవహారంలో వాస్తవం ఏమిటో వారికి బొత్తిగా తెలియదు. కేవలం ఊహాగా నాలు చేస్తున్నారు. గతంలో వారికి మేమేదైనా గ్రంథం ప్రసాదించామా? ఆ గ్రంథానికి సంబంధించి వారి దగ్గర ఏదైనా ప్రమాణం ఉందా? ఎంతమాత్రం లేదు. (ప్రమాణం లేకపోయినా) “మా తాతముత్తాతలు ఒక సంప్రదాయం పాటిస్తూఉండగా చూశాం గనక, మేము వారి అడుగుజాడల్లోనే నడచుకుంటున్నాం” అంటారు వారు. (20-22)
అలాగే నీకు పూర్వం మేము ఏ పట్టణానికి బోధకుడ్ని పంపినా అక్కడుండే ధనికులు తమ తాతముత్తాతలు ఒక సంప్రదాయం పాటిస్తుండగా చూశాంగనక, తాము వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటున్నామని చెప్పేవారు. అప్పుడు ప్రతి దైవప్రవక్తా “మీరు మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా చూసిన మార్గం కన్నా మెరుగైన మార్గం నేను చూపిస్తున్నా మీరు అదే దారిన నడుస్తారా?” అని అడిగేవాడు. దానికి వారు “నీవు తెచ్చిన ధర్మాన్ని మేము తిరస్కరిస్తున్నాం”అని చెప్పేవారు. చివరికి మేము వారి భరతం పట్టాము. చూడండి, తిరస్కారులకు ఎలాంటి దుర్గతి పట్టిందో! (23-25)
ఇబ్రాహీం వృత్తాంతం జ్ఞాపకం తెచ్చుకో. అతను తన తండ్రితో, తన జాతిప్రజలతో “మీరు పూజిస్తున్న వాటితో నాకెలాంటి సంబంధం లేదు. నాసంబంధం నన్ను సృష్టించిన దేవునితో మాత్రమే ఉంది. ఆయనే నాకు దారి చూపుతాడు” అన్నాడు. ఈ విషయాన్నే అతను తన సంతానంలో వదలివెళ్ళాడు, వారు దానివైపు మరలేందుకు. (26-28)
(ఇంత చెప్పినా వారు విగ్రహారాధన, సృష్టిపూజ మాననప్పటికీ నేను వారిని నాశనం చేయలేదు.) పైగా వారికి, వారి తాతముత్తాతలకు జీవన సామగ్రి ప్రసాదిస్తు న్నాను. చివరికి వారి వద్దకు సత్యం వచ్చింది. దాన్ని విడమరచి బోధించే దైవప్రవక్త కూడా వచ్చాడు. కాని వారి వద్దకు సత్యం వచ్చినప్పుడు “ఇదో మంత్రజాలం, మేము దీన్ని నమ్మం”అన్నారు వారు. “ఈ ఖుర్‌ఆన్‌ (మన దేశంలోని) రెండు నగరాలలో ఉన్న పెద్దమనుషుల్లో ఒకరిపై ఎందుకు అవతరించలేదు?” అంటారు వారు. నీ ప్రభువు కారుణ్యాన్ని వీరు పంచుతున్నారా? (వారికా అధికారం ఉందా?) ఐహికజీవితంలో కావలసిన ఒనరుల్ని నేనే వారికి పంచిపెట్టాను. కాకపోతే పరస్పరం సేవాసహకారాలకై వారిలో కొందరికి కొందరిపై ఆధిక్యత ఇచ్చాను. అయితే నీ ప్రభువు కారుణ్యం వారి ధనికులు కూడబెడ్తున్నదాని కంటే ఎంతో విలువయినది. (29-32)
మానవులంతా ఒకే ఉరవడిలో కొట్టుకుపోతారన్న భయంలేకుంటే మేము కరుణామయుడైన దేవుడ్ని తిరస్కరించేవారి ఇండ్ల కప్పులను, వారు మేడలపైకి ఎక్కే మెట్లను, వారి తలుపుల్ని, వారు దిండ్లకానుకొని కూర్చునే పీఠాలను, అన్నిటినీ వెండి బంగారాలతో చేసేసేవారం. కాని ఇది (మూన్నాళ్ళ ముచ్చటైన) ఇహలోక జీవితసంపద మాత్రమే. (పరలోక సంపద ఇంతకంటే ఎంతో శ్రేష్ఠమైనది, శాశ్యతమైనది.) నీ ప్రభువు దగ్గర భయభక్తులు కలవారికే పరలోక సంపద ప్రాప్తమవుతుంది. (33-35)
కరుణామయుని బోధ పట్ల ఏమరుపాటు వహించినవాడిపై మేము ఒక పిశాచ శక్తిని రుద్దుతాం; అది అతనికి సహచరి అయిపోతుంది. అలాంటి వారిని ఈ పిశాచ శక్తులు సన్మార్గంలోకి రాకుండా నిరోధిస్తుంటాయి. వారు తాము చేస్తున్న పని సముచిత మైనదేనని భావిస్తారు.
ఈవిధంగా చివరికా వ్యక్తి మా వద్దకు చేరుకుంటాడు. అప్పుడతను తన పిశాచ సహచరునితో “అయ్యయ్యో! నీకూ నాకూ మధ్య తూర్పుపడమరలంత దూరం ఉంటే బాగుండేది!! నువ్వు నాకు అతిచెడ్డ స్నేహితుడిగా దొరికావు” అనంటాడు. అప్పుడు వారితో (దైవదూతలు) “మీరు దుర్మార్గుపుపనులు చేశారు గనక, ఈరోజు మీకెలాంటి సహాయం లభించదు. మీరంతా శిక్షలో సమానులే” అంటారు. (36-39)
మరి నీవిప్పుడు బధిరులకు విన్పించగలవా? లేక అంధులకు, దారి తప్పినవారికి దారి చూపగలవా? మేము (ముందే) నిన్ను ప్రపంచం నుండి (మాదగ్గరకు) రప్పించు కున్నా, లేక మేము వాగ్దానం చేసినదాన్ని నీ కళ్ళెదుటే వారికి చవిచూపినా మొత్తంమీద వారిని మేము శిక్షించి తీరుతాం. వారి మీద మాకు పూర్తి అదుపు ఉంది. ఏమైనప్పటికీ నీవు మటుకు దివ్యావిష్కృతి ద్వారా నీ దగ్గరకు పంపబడిన ఈ గ్రంథాన్ని దృఢంగా పట్టుకో. నిస్సందేహంగా నీవు సన్మార్గంలో ఉన్నావు.
ఈగ్రంథం నీకు, నీజాతి ప్రజలకు గొప్ప హితకారిణి. త్వరలోనే మీరంతా దీని విషయమై (దేవునికి) సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. మేము కరుణామయుణ్ణే గాక ఇతరుల్ని కూడా దేవుళ్ళుగా నిర్ణయించామా మీరు వారిని ఆరాధించడానికి? (కావాలంటే) ఇంతకు పూర్వం మేము పంపిన ప్రవక్తలను అడిగి చూడండి. (40-45)
మేము మూసాకు మా నిదర్శనాలిచ్చి ఫిరౌన్‌ దగ్గరకు, అతని అధికారుల దగ్గరకు పంపాము. అతను వెళ్ళి “నేను విశ్వప్రభువు పంపిన దైవప్రవక్తను” అన్నాడు. తర్వాత అతను వారిముందు మా నిదర్శనాలు ప్రదర్శించినప్పుడు వారు హేళనచేశారు. మేము ఒకదాన్ని మించిన మరొకటి అనేక నిదర్శనాలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా పంపాము. ఇలా మేము నానాయాతనలు పెట్టి వారిని పట్టుకున్నాం, అప్పుడైనా వారు తమ వైఖరి మార్చుకుంటారేమోనని. కాని వారు మా శిక్ష వచ్చినప్పుడల్లా “మాంత్రికుడా! నీ ప్రభువు నుండి నీకు లభించిన పదవీహోదాల ఆధారంగా మా కోసం ఆయన్ని ప్రార్థించు; మేము తప్పకుండా సన్మార్గం అవలంబిస్తాం” అని చెప్పేవారు. కాని మేము వారి నుండి శిక్ష తొలగించగానే వారు మాట తప్పేవారు. (46-50)
ఒకరోజు ఫిరౌన్‌ చాటింపు వేయించి తన జాతిప్రజలతో ఇలా అన్నాడు: “ప్రజలారా! ఈజిప్టు సామ్రాజ్యం నాదికాదా? (నైలునది నుండి చీలిన) ఈ సెలయేరులు నా(మేడల) క్రింద ప్రవహించడం లేదా? ఇవన్నీ మీకు కన్పించడం లేదా? నేను శ్రేష్ఠుణ్ణా లేక సరిగ్గా మాట్లాడటమే రాని ఈ నీచుడు శ్రేష్ఠుడా? (అతనేదో గొప్పవాడైతే) అతని (దౌత్యపదవి గుర్తింపు) కోసం స్వర్ణకంకణం ఎందుకు అవతరించలేదు? లేక అతని హోదాదర్పం కోసం దైవదూతల దళమొకటి అతనివెంట ఎందుకు రాలేదు?” (51-53)
అతను తన జాతిప్రజల్ని అల్పులని భావించాడు. వారతనికి విధేయులైపోయారు. వారసలు స్వతహాగానే దుర్జనులు. చివరికి వారు మాకెంతో ఆగ్రహం తెప్పించారు. దాంతో మేము వారిని (నడిసముద్రంలో) ముంచి ప్రతీకారం తీర్చుకున్నాం. ఈవిధంగా మేము వారి పర్యవసానాన్ని రాబోవు తరాలకు గుణపాఠంగా చేశాం. (54-56)
మర్యం కుమారుడి గాధను తార్కాణంగా పేర్కొన్నప్పుడు నీ జాతిప్రజలు పెద్ద రభస చేస్తూ “మా దేవుళ్ళు గొప్పా, అతను గొప్పా?” అన్నారు. వారీ మాటను నీతో వితండవాదం చేయడానికి మాత్రమే పేర్కొన్నారు. వీరసలు స్వతహాగానే కలహకారులు. ఈసా మా అనుగ్రహం పొందిన దాసుడు తప్ప మరేమీకాదు. మేమతడ్ని ఇస్రాయీల్‌ సంతతి (కనువిప్పు) కోసం మా శక్తికి ఒక నిదర్శనంగా చేశాము. మేము తలచుకుంటే మీలో కొందరిని దైవదూతలుగా చేయగలము; వారు ప్రపంచంలో మీకు వారసులవు తారు. అతనసలు ప్రళయదినానికి ఒక సూచనలాంటివాడు. కనుక మీరు దాన్ని గురించి సందేహంలో పడకండి. నామాట వినండి. ఇదే రుజుమార్గం. షైతాన్‌ మీకు బహిరంగ శత్రువు. ఆ విషయం నుండి వాడు మిమ్మల్ని నిరోధించకూడదు. (57-62)
ఈసా స్పష్టమైన నిదర్శనాలతో వచ్చి (ప్రజలకు) ఇలా బోధించాడు: “నేను మీ దగ్గరకు వివేకం తెచ్చాను. మీరు విభేదించుకుంటున్న కొన్ని విషయాల్లోని నిజానిజాలు ఏమిటో మీముందు వెల్లడించడానికే మీ దగ్గరికొచ్చాను. కనుక మీరు దేవునికి భయ పడండి. నాకు విధేయత చూపండి. నిజానికి దేవుడే నా ప్రభువు, మీ ప్రభువు కూడా. ఆయన్నే మీరు ఆరాధించండి. ఇదే సన్మార్గం.” (63-64)
అయితే వారు పరస్పరం విభేదించుకొని విభిన్న వర్గాలుగా చీలిపోయారు. కనుక అన్యాయం, అధర్మాలకు వడిగట్టిన ఆ దుర్మార్గులకు వినాశం (రాసిపెట్టి) ఉంది. ఒక భయానక దినం నాటి యాతనలో చిక్కుకొని వారు నాశనమైపోతారు. (65)
ఇప్పుడు వీరు కూడా ఏమరుపాటులో ఉన్నప్పుడు తమపై హఠాత్తుగా ప్రళయం విరుచుకుపడాలని ఎదురుచూస్తున్నారా? ఆరోజు వచ్చినప్పుడు దైవభీతిపరులు తప్ప మిగిలిన మిత్రులంతా పరస్పరం శత్రువులై పోతారు. సత్యాన్ని విశ్వసించి విధేయులై పోయినవారికి ఆరోజు ధైర్యంకలిగిస్తూ ఇలా చెప్పబడుతుంది: “నా దాసులారా! ఈరోజు మీకెలాంటి భయం లేదు, దుఃఖం కూడా ఉండదు. ఇక మీరు, మీ భార్యాపిల్లలు స్వర్గంలో ప్రవేశించండి, మిమ్మల్ని ఆనందింపజేయడం జరుగుతుంది.” (66-70)
వారి ముందు బంగారంతో చేయబడిన కంచాలు, గిన్నెలు కదులాడుతుంటాయి. వారి హృదయాలకు, కళ్ళకు ఆనందాన్నిచ్చే ప్రతి వస్తువూ అక్కడ లభిస్తుంది. “ఇప్పుడు మీరిక్కడ కలకాలం (సుఖంగా) ఉంటారు. మీరు ప్రపంచంలో చేసుకున్న సత్కార్యాల కారణంగానే ఈ స్వర్గసీమకు వారసులయ్యారు. ఇక్కడ మీరు తినడానికి కావలసినన్ని పండ్లు ఫలాలు ఉన్నాయి” అని వారికి చెబుతారు (దైవదూతలు). (71-73)
ఇక పాపాత్ములు- వారు శాశ్వతంగా నరక యాతనల్లో చిక్కుకొని ఉంటారు. వారి శిక్ష ఎన్నటికీ తగ్గించబడదు. వారందులో నిరాశా నిస్పృహలతో పడిఉంటారు. వారికి మేము అన్యాయం చేయలేదు. వారే ఆత్మవంచనకు పాల్పడ్డారు.
వారు (నరకయాత నలు భరించలేక) “నరకపాలకుడా! నీ ప్రభువు మా కథను ముగించివేస్తే బాగుండు” అని అరుస్తారు. దానికి దైవదూత “మీరు అలాగే పడి వుండండి. మేము మీ దగ్గరకు సత్యాన్ని తెస్తే, మీలో చాలామందికి సత్యం గిట్టలేదు” అని జవాబిస్తాడు. (74-78)
(నీకు వ్యతిరేకంగా) వీరేదైనా చర్య తీసుకోవడానికి నిర్ణయించుకున్నారా? సరే, మేము కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. మేము తమ రహస్య విషయాల్ని, గుసగుసల్ని వినలేమని భావిస్తున్నారా వారు? మేము అన్నీ వింటున్నాము. వాటిని మా దూతలు వారి దగ్గరే నిలబడి నమోదు చేస్తున్నారు. (79-80)
వారికిలా చెప్పు: “కరుణామయునికి నిజంగా సంతానం ఉంటే (ఆ సంతానాన్ని) అందరికంటే ముందు నేనే ఆరాధించేవాడ్ని.” భూమ్యాకాశాల ప్రభువు, మహోన్నత సింహాసనాధిపతి అయిన దేవుడు వారి కల్పితాలకు అతీతుడైన పరమ పవిత్రుడు#
సరే, వారు (ఎటూ) తమకు వాగ్దానం చేయబడుతున్న (ప్రళయ) దినాన్ని (కళ్ళారా) చూసుకుంటారు. అప్పటిదాకా వారిని అలాగే తమ దుష్ట ఊహాలోకంలో విహరిస్తూ, ఆటపాటల్లోనే మునిగి ఉండనివ్వు. (81-83)
యావత్తు భూమ్యాకాశాల్లో ఆయనే ఆరాధ్యుడు. ఆయన ఎంతో వివేకవంతుడు, జ్ఞానసంపన్నుడు. ఆయనే సర్వోన్నతుడు, శుభదాయకుడు. భూమ్యాకాశాల్లో, వాటిమధ్య ఉన్న సమస్త రాజ్యాధికారం ఆయన చేతిలోనే ఉంది. ప్రళయం వచ్చే సమయం ఆయకే తెలుసు. ఆయన దగ్గరికే మీరంతా మరలిపోవలసి ఉంది. (84-85)
ఆయన్ను వదలి వీరు ప్రార్థిస్తున్న దైవేతరులకు ఎలాంటి సిఫారసు చేసే అధికారం లేదు. కాకపోతే వీరేదయినా విషయపరిజ్ఞానం ఆధారంగా సత్యానుగుణమైన సాక్ష్యమిస్తే అందుకు అనుమతి లభిస్తుంది. (86)
ఒకవేళ నీవు “మిమ్మల్ని ఎవరు సృష్టించార”ని అడిగితే, “దేవుడే” అని వారు తప్ప కుండా చెబుతారు. మరి వీరు ఎలా మోసపోతున్నారు? ‘ప్రభూ! వీరు (ఎంత నచ్చ జెప్పినా) విశ్వసించేవారు కాదు’ అని పలికిన ప్రవక్త పలుకుల సాక్షి! (వారిక ఏమాత్రం విశ్వసించరు.) కనుక ప్రవక్తా! వారికో సలాం చేసి వారి మానాన వారిని వదలిపెట్టు. (తిరస్కార పర్యవసానం ఏమిటో) వారికి త్వరలోనే తెలుస్తుంది. (87-89)